నేదునూరి గంగాధరం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
వీరు 4 జూలై, 1904 సంవత్సరంలో [[రాజమండ్రి]]లో జన్మించారు. చదివిన కొద్దిపాటి చదువుతో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. చిన్ననాటి నుండి జానపద వాజ్మయ సేకరణ ఒక మహత్కార్యంగా భావించారు. దానిని ఎంతో ప్రయాసకోర్చి గ్రామగ్రామాలు తిరిగి జానపద గేయాలు, కథా గేయాలు, వీరగాథలు, జమిలి పదాలు, నోముల కథలు, పండుగ పాటలు, ఆటపాటలు, ప్రార్థన గేయాలు, వినోద గేయాలు, ఎక్కిరింత పాటలు, జంటపదాలు, జాతీయాలు, సామెతలు, కిటుకు మాటలు - లక్షల సంఖ్యలో సేకరించారు. వీనిలో కొన్ని 1953లో సంభవించిన గోదావరి వరదలలో కొట్టుకొనిపోయాయి. మిగిలినవాటినుండి మొదటగా సెలయేరు - జానపద గేయ సంకలనాన్ని 1955లొ దేశోద్ధారక గ్రంథమాల వారు ప్రచురించారు. తర్వాత వ్యవసాయ సామెతలను 1956లో ప్రచురించారు. సుమారు 5,000 తెలుగు సామెతలు, జాతీయలు కలిగిన వీరి "పసిడి పలుకులు" గ్రంథం ఒక అపూర్వమైన సంకలనం. ఆ తర్వాత మేలుకొలుపు పాటలు, మంగళ హారతులు, మిన్నేరు, మున్నీరు, స్త్రీల వ్రత కథలు, జానపద గేయ వాజ్మయ వ్యాసావళి మొదలైన గ్రంథాలు ప్రచురించారు.
 
వీరు జవహర్ లాల్ నెహ్రూ సమగ్ర చరిత్ర ను 1966 లో సంకలనం చేశారు.<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=nehruu%20samagra%20charitra&author1=shrii%20leidunuuri%20gan%27gaadharan%27&subject1=GENERALITIES&year=1966%20&language1=telugu&pages=829&barcode=2990100051726&author2=&identifier1=&publisher1=Kondapalli%20Veeravenkayia%20And%20Sons%20Rajamandri&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=SNL,%20Vetapalem&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-01-12&numberedpages1=&unnumberedpages1=&rights1=&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data/upload/0051/731 భారత డిజిటల్ లైబ్రరీ లో పుస్తక ప్రతి.]</ref>
 
వీరు 11 మార్చి, 1970 తేదీన పరమపదించారు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
* గంగాధరం, నేదునూరి, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీ: 130.
 
"https://te.wikipedia.org/wiki/నేదునూరి_గంగాధరం" నుండి వెలికితీశారు