ఉప్పలపు శ్రీనివాస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
అతి పిన్న వయసులోనే మాండలిన్‌ శ్రీనివాస్‌ను (1998లో) పద్మశ్రీ అవార్డు అందుకున్నాడు. 2010లో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నాడు.1983లోనే బెర్లిన్‌లో జరిగిన బజ్‌ ఫెస్టివల్‌లో శ్రీనివాస్‌ మాండలిన్‌ వాదన ఆహూతుల్ని అలరించింది. అత్యంత గౌరవప్రదమైన సంగీత రత్న అవార్డును శ్రీనివాస్‌ గెలుచుకున్నాడు. 15 ఏళ్ల వయసులోనే తమిళనాడు రాష్ట్ర ఆస్థాన విద్వాంసుడుగా పదవి నలంకరించాడు. సనాతన సంగీత పురస్కార్‌, రాజాలక్ష్మి ఫౌండేషన్‌ అవార్డు, నేషనల్‌ సిటిజన్‌ అవార్డు, రాజీవ్‌గాంధీ నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ అవార్డు వంటి పలు అవార్డులు శ్రీనివాస్‌కు అలంకారం అయ్యాయి. శ్రీనివాస్‌ పలు కర్నాటక సంగీత ఆల్బమ్‌లు రూపొందించాడు.
==మరణం==
ఉప్పలపు శ్రీనివాస్‌(45) (మాండలిన్) శుక్రవారం చెన్నైలో కన్నుమూసాడు. చెన్నై అపొలో హాస్పిటల్ లో లివర్ మార్పిడి శస్త్ర చికిత్స అనంతరం [[సెప్టెంబర్ 19.9.]], [[2014]] మరణించారు.<ref>http://www.thehindu.com/news/national/tamil-nadu/obituary-mandolin-u-shrinivas/article6426381.ece</ref>కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాండలిన్‌ శ్రీనివాస్‌ ఈనెల మూడవ తారీఖున చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈయనకు కాలేయం చెడిపోవడంతో వైద్యులు కాలేయ మార్పిడి చికిత్స అందించినప్పటికీ, అది ఫలించకపోవడంతో శుక్రవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో మాండలిన్‌ శ్రీనివాస్‌ తుదిశ్వాస విడిచాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఉప్పలపు_శ్రీనివాస్" నుండి వెలికితీశారు