షా అలీ పహిల్వాన్ దర్గా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
→‎గుల్బర్గాతో సంబంధం: అక్షర దోష మరియు లింకు సవరణ
పంక్తి 5:
ప్రతి సంవత్సరం ఇక్కడ నాలుగు రోజుల పాటు [[ఉర్సు]] ఉత్సవాలు జరుగుతాయి. మొదటి రోజు గంధోత్సవం, రెండో రోజు చిన్న కిస్తీ, మూడో రోజు పెద్ద కిస్తీ, చివరి రోజు మహిళా ఉర్సు పేరుతో ఉత్సవాలను జరుపుతారు. షా అలీ పహిల్వాన్‌కు కుస్తీ (మల్ల యుద్దం) పోటీలంటే ఇష్టం కాబట్టి ఈ ఉత్సవాల సందర్భంగా సరదాగా కుస్తీ పోటీలను నిర్వహిస్తారు. ఆ కుస్తీనే కిస్తీగా మారిపోయింది. కిస్తీల సందర్భంగా దర్గాలో ఉన్న ఒక వెడల్పాటి రాతి దోణెలో [[పులావ్]], వండిన ఇతర మాంసాహార పదార్థాలను నింపుతారు. కిస్తీలో గెలిచినవారికి పదార్థాలు దక్కుతాయి. చిన్న కిస్తీ పిల్లల కొరకు, పెద్ద కిస్తీ పెద్దల కొరకు ఏర్పాటు చేసిన కార్యక్రమాలు. ఈ ఉత్సవాలకు సమీపంలోని చాలా గ్రామాల నుండి మతాలకతీతంగా ప్రజలు తరలివస్తారు. .ఇక్కడ ఈ ఉత్సవాలు సుమారు 750 సంవత్సరాల నుండి జరుగుతున్నట్లు తెలుస్తుంది. అలంపూర్‌లో ఘనంగా జరిగే ఉత్సవాలలో [[శివరాత్రి]] ఒకటైతే, మరొకటి షా అలీ పహిల్వాన్ ఉర్సు..
== గుల్బర్గాతో సంబంధం ==
[[కర్ణాటక]] రాష్ట్రంలోని [[గుల్బర్గా]]లో నిర్వహించే [[ఖ్వాజా బందా నవాజ్|బందేనవాజ్]] ఉర్సుకు [[ఆలంపూర్|అలంపూర్]]లో నిర్వహించే షా అలీ పహిల్వాన్ ఉర్సుకు సంబంధం ఉంది. బందే నవాజ్, షా అలీలది మామా అల్లుళ్ళ బంధమని అంటారు<ref> సూర్య దినపత్రిక, ప్రథమ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక, మహబూబ్ నగర్ జిల్లా, అక్టోబర్, 2008, పుట - 76</ref>. ప్రతి సంవత్సరం గుల్బర్గాలో ఉర్సు ముగిసిన ఏడు రోజులకు అలంపూర్‌లో ఉర్సు ప్రారంభమవుతుంది. గుల్బర్గా ఉర్సు నుంచి గంధాన్ని ఇక్కడికి తీసుకవచ్చి వంశపారంపర్య ఉర్సు నిర్వాహకుల ఇంటిలో ఉంచుతారు. అక్కడి నుండి ప్రభుత్వ [[తాహశిల్ధార్తహశీల్దార్]] కార్యాలయానికి తీసుకవెళ్తారు. గంధోత్సవం రోజు ప్రభత్వ అధికారిక లాంఛనాలతో, మేళతాళాలతో పెద్ద దర్గాకు, చిన్న దర్గాకు తీసుకవెళ్తారు.
 
== ఇటీవలి ఉత్సవాలు ==
తేది: 17.09.2014 నుండి షా అలీ పహిల్వాన్ 764 వ ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉర్సు నిర్వాహకులు అహ్మద్ ఓవైసీ, [[ఆలంపూర్|అలంపూర్]] మండల తాహశిల్ధార్ చాణక్య, అలంపూర్ వలయరక్షణాధికారి(సి.ఐ.) వెంకటేశ్వర్లు సంయుక్తంగా ఉత్సవాలను ప్రారంభించారు. తేది 19.09.2014 రోజు పెద్ద కిస్తీ సందర్భంగా అలంపూర్ శాసన సభ్యుడు సంపత్ కుమార్, జడ్పీటీసి సభ్యుడు సూర్యబాబు గౌడు హాజరై దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు<ref> ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ప్రత్యేకం,పేజి-7, తేది.20.09.2014</ref>.