సి.హెచ్. నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 58:
'దేవత' (1941)లో భావకవిగా చిన్న పాత్ర పోషించారు. అందాల నటుడిగా పేరు తెచ్చుకొని, 'చెంచులక్ష్మి' (1944)లో సవతుల పోట్లాటలో చిక్కిన కథానాయకుడిగా, 'తాసిల్దార్‌' (1944)లో పాశ్చాత్య జీవనశైలీ వ్యామోహంలో పడే తాసిల్దార్‌గా, 'స్వర్గసీమ' (1946)లో నెగటివ్‌ ఛాయలున్న పాత్రలో - అందరినీ ఆకట్టుకున్నారు. ఓ పక్క హీరోగా చేస్తూనే మరో పక్క కీలకమైన పాత్ర అయితే, చిన్నదైనా సరే నటించడానికి ఆయన వెనుకాడకపోవడం విశేషం.
==ప్రముఖులతో అనుబంధాలు==
కృష్ణవేణి, కమలా కోట్నీస్‌, [[ఋష్యేంద్రమణి]], [[భానుమతి]], రుక్మిణి, [[జి. వరలక్ష్మి]], [[శాంతకుమారి]], [[షావుకారు జానకి|'షావుకారు' జానకి]], [[కృష్ణకుమారి]] లాంటి అప్పటి తరం నాయికల సరసన ఈ అందాల నటుడు అభినయించారు. అప్పట్లో నారాయణరావుకు బోలెడంతమంది అభిమానులు ఉండేవారు. తెలుగులో సినిమా హీరోలకు అభిమాన సంఘాలు ఏర్పడడం ఆయనతోనే మొదలైందని చెబుతారు. అలాంటి పాపులారిటీ వల్ల 1949లో విజయ వాడలో ఆకాశవాణి కేంద్రం ప్రారంభోత్సవానికి కూడా ఆయన ప్రత్యేక ఆహ్వానితులయ్యారు. ఇక, 1951 ప్రాంతంలో ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆయనను సత్కరించడం విశేషం. [[వి.వి. గిరి]], [[ప్రకాశం పంతులు]], [[పి.వి. రాజమన్నార్‌]], [[బెజవాడ గోపాలరెడ్డి]], మాడభూషి వెంకటాచారి లాంటి అప్పటి రాజకీయ నాయకులతో ఆయనకు అనుబంధాలు ఉండేవి.
 
==అభిప్రాయాలు==
ఆంగ్ల చిత్రాలు, ఆ స్థాయి, ఆ నటనా మనకీ రావాలని, మనది బాగా ఓవర్‌ యాక్టింగ్‌లా కనిపిస్తుందనీ నారాయణరావు చెప్పేవారు. ‘ఆ చిత్రాల్లోని నటులు ఎక్కువగా హావభావాలు చూపించరు. మామూలుగా, మాట్లాడుతున్నట్టుగా నటిస్తారు. సజీవమైన పాత్రలు అంటే అలాగే ఉంటాయి. నటించాలి కాబట్టి, మనం రెండాకులు ఎక్కువగా తగిలిస్తాం. పూర్వం రోజుల్లో నాటక నటన అయితే మరీ ఓవర్‌గా ఉండేది. మామూలుగా మనం ఎలా మాట్లాడతామో, ఎలా ప్రదర్శిస్తామో అలా... జీవితానికి దగ్గరగానే నటనా ఉండాలని నా ఉద్దేశం. ఎంతమంది నాతో ఏకీభవిస్తారో నాకు తెలియదు. అయితే చిత్రాల్లో నటిస్తున్నప్పుడు నేనోక్కడినే అలా నటిస్తే అతకదు. పైగా ఆ విధానాన్ని మన దర్శకులు అంగీకరించే స్తాయిలో లేరు. చిత్రంలోని పాత్రలన్నీ ఒకే రీతిలో నటించ గలగాలి’ అని నారాయణరవు చెప్పేవారు. అందుకే ఆయన నటనలో చేతులు ఎక్కువగా తిప్పడమూ, గట్టిగా అరవడమూ, కళ్ళూ కనుబొమలూ ఎగరవేయడమూ కనిపించేది కాదు. ఆయనదొక స్టడీ.
"https://te.wikipedia.org/wiki/సి.హెచ్._నారాయణరావు" నుండి వెలికితీశారు