క్షీరారామం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
 
పంచారామ క్షేత్రాలలో ఒకటైన క్షీరారామం పార్వతీ సమేతుడై 'శ్రీ రామలింగేశ్వరుడు' వెలసిన పరమ పావనమైన పుణ్య క్షేత్రం. ఇక్కడి శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తుంటుంది. శ్రీ మహావిష్ణువుచే శివలింగం ప్రతిష్టించబడిన ఈ పుణ్య క్షేత్రానికి విష్ణుమూర్తే క్షేత్రపాలకుడు. ఆదిశంకరాచార్యులవారు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీ చక్రం ప్రతిష్ఠించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ క్షేత్రాన్ని క్షీరపురి పాలకొలను, ఉపమన్యుపురం, అనే పేర్లతో కూడా పిలుస్తూ వుంటారు. శివలింగం పైభాగం మొనదేలి ఉండటం వలన ఇక్కడి స్వామివారిని 'కొప్పు రామలింగేశ్వరుడు' అని కూడా పిలుస్తారు. ఇది కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగపు పైభాగమని విశ్వసిస్తున్నారు. స్వామివారికి ఎదురుగా ఉన్న ప్రాకార మంటపంలో పార్వతీ దేవి కొలువై వుంటుంది. ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ... రుణహర గణపతి ఆలయాలు కనిపిస్తాయి. ఈ రుణహర గణపతిని దర్శించడం వలన అప్పుల బాధల నుంచి బయటపడటం జరుగుతుందని భక్తులు భావిస్తుంటారు. ఇక్కడి రాజగోపురం 9 అంతస్తులను కలిగి 120 అడుగుల ఎత్తులో అద్భుతమైన శిల్ప కళతో అలరారుతూ వుంటుంది. ఈ పుణ్య క్షేత్రానికి దశలవారీగా అభివృద్ధి పనులు జరిగాయనడానికి చాళుక్యులు ... రెడ్డి రాజులు ... కాకతీయులు వేసిన శాసనాలు ఆధారాలుగా కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడ పర్వ దినాల సమయంలో విశేషమైన పూజలు, ఉత్సవాలు వైభవంగా జరుగుతుంటాయి. వీటిని తిలకించడానికి భక్తులు విశేషమైన సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చి స్వామివారినీ, అమ్మవారిని దర్శించుకుంటారు.
=== ఆలయ ప్రశస్తి ===
శివలింగం పైభాగం మొనదేలి ఉండటం వలన ఇక్కడి స్వామివారిని కొప్పు రామలింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో పరమశివునితో పార్వతిదేవి పూజలందుకుంటుంది.ఇది కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగపు పైభాగమని తలచి పూజిస్తారు. స్వామివారికి ఎదురుగా ఉన్న ప్రాకార మంటపంలో పార్వతీ దేవి కొలువై ఉంటుంది. ఆ ప్రక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఋణహర గణపతి ఆలయాలు కనిపిస్తాయి. ఈ ఋణహర గణపతిని దర్శించడం వలన అప్పుల బాధల నుంచి బయటపడటం జరుగుతుందని భక్తులు భావిస్తుంటారు.
== చరిత్ర ==
 
=== స్థలపురాణం ===
"https://te.wikipedia.org/wiki/క్షీరారామం" నుండి వెలికితీశారు