మహారాష్ట్ర: కూర్పుల మధ్య తేడాలు

తాజాకరణ
చి clean up, replaced: express → ఎక్స్‌ప్రెస్ using AWB
పంక్తి 123:
 
మహారాష్ట్ర గురించి క్రీ.పూ. 3వ శతాబ్దం నుండే లిఖితపూర్వకమైన ఆధారాలు లభించాయి. అప్పుడు ''మహారాష్ట్రి'' అనే భాషగురించి ప్రస్తావన జరిగింది. ఒకప్పుడు ఈ ప్రాంతం "దండకారణ్యం" అనబడింది. తరువాత [[అశోకుడు]] పాలించిన [[మగధ సామ్రాజ్యం]]లో మహారాష్ట్ర ఒక భాగమైంది. ఇప్పటి [[ముంబాయి]] నగరానికి ఉత్తరాన ఉన్న [[సోపార]] రేవు పట్టణంనుండి [[కొచ్చి]] ([[భారతదేశం]]) తోను, తూర్పు [[ఆఫ్రికా]], [[ఇరాక్|మెసపొటేమియా]] లతోను వర్తక సంబంధాలుండేవి.
 
 
[[మౌర్యసామ్రాజ్యం]] పతనానంతరం క్రీ.పూ. 230 - క్రీ.శ.225 మధ్య మహారాష్ట్ర ప్రాంతం [[శాతవాహనసామ్రాజ్యం]]లో భాగమయ్యింది. ఈ కాలంలో ఇక్కడి సంస్కృతి, [[మరాఠీ భాష]] బాగా వృద్దిచెందాయి. క్రీ.శ. 78 ప్రాంతంలో పాలించిన [[గౌతమీపుత్ర శాతకర్ణి]] పేరు మీద [[శాలివాహన శకం]] ఆరంభమయ్యింది. క్రీ.శ. 3వ శతాబ్ది సమయంలో శాతవాహన సామ్రాజ్యం క్రమంగా క్షీణించింది.
 
 
క్రీ.శ. 250-525లో [[వాకాటకులు]] [[విదర్భ]] ప్రాంతాన్ని పాలించారు. వారి కాలంలో కళలు, సాంకేతిక పరిజ్ఞానము, నాగరికత బాగా వృద్ధిచెందాయి. 6వ శతాబ్దానికల్లా మహారాష్ట్ర ప్రాంతమును [[బాదామి చాళుక్యులు]] పాలించారు. 753వ సంవత్సరంలో [[రాష్ట్రకూటులు]] మహారాష్ట్రపాలకులయ్యారు. వారి సామ్రాజ్యం దాదాపు దక్కన్ అంతా విస్తరించింది. మరలా రాష్ట్రకూటులను ఓడించి బాదామి చాళుక్యులు 973-1189మధ్య మహారాష్ట్రలో కొంతభాగాన్ని పాలించారు. 1189 తరువాత [[దేవగిరి యాదవులు]] ఇక్కడి రాజులయ్యారు.
Line 134 ⟶ 132:
=== మరాఠాలు, పేష్వాలు ===
 
[[దస్త్రం:Shivaji_the_GreatShivaji the Great.jpg|thumb|right|శివాజీ మహారాజు చిత్రం]]
17వ శతాబ్దారంభంలో స్థానికులైన మరాఠాల నాయకత్వంలో [[మరాఠా సామ్రాజ్యం]] వ్రేళ్ళూనుకొనసాగింది. 1674లో [[ఛత్రపతి శివాజీ|శివాజీ భోన్సలే]] రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. [[ఛత్రపతి శివాజీ|శివాజీ మహారాజు]]గా ప్రసిద్ధుడైన ఈ నాయకుడు అప్పటి ముఘల్ ‌చక్రవర్తి [[ఔరంగజేబు]] సైన్యంతోను, బిజాపూర్ నవాబు [[ఆదిల్ షా]] సైన్యంతోను పలుయుద్ధాలు సాగించాడు. అప్పుడే మహారాష్ట్రలో తమఅధిపత్యాన్ని విస్తరిస్తున్న బ్రిటిష్‌వారితో కూడా కొన్ని చిన్న యుద్ధాలు చేశాడు. మహారాష్ట్ర చరిత్రలో అత్యంత ప్రసిద్ధుడైన, జనప్రియుడైన, పరిపాలనా దక్షతగల రాజుగా శివాజీని పేర్కొనవచ్చును.
 
Line 142 ⟶ 140:
 
[[బాలాజీ విశ్వనాధ్]], అతని కొడుకు [[బాజీరావు పేష్వా]]‌లు వారిపాలనలో ఉన్న ప్రాంతంలో రెవిన్యూ విధానాన్ని, పరిపాలనా విధానాన్ని క్రమబద్ధీకరించారు. ఇందుకు వారు ముఘల్ చక్రవర్తుల విధానాలను తమ స్వంత విధానాలతో జోడించారు. [[పేష్వా]]ల కాలంలో [[వర్తకం]], [[బ్యాంకింగ్]] వ్యవస్థలు పటిష్టంగా అభివృద్ధిచెందాయి. [[వ్యవసాయం]] మరిన్ని ప్రాంతాలకు విస్తరించింది. పేష్వాలు పశ్చిమతీరంలో నౌకాభద్రతను అభివృద్ధిచేయసాగారు. అందుకై కొలాబాలో నౌకాదళాన్ని ఏర్పాటు చేశారు. నౌకాబలంమీద, సముద్ర వర్తకంమీద ఆధారపడిన పాశ్చాత్యదేశాల స్థావరాల అధిపత్యానికి ఇది కలవరపాటు కలిగించింది.
 
 
అదేసమయంలో మరాఠా ప్రాంతాలుకాని చోట్ల అధిపత్యం సామంతులకు కట్టబెట్టారు. అలా గ్వాలియర్‌లో సింథియాలు, ఇండోర్‌లో హోల్కర్‌లు, బరోడాలో గైక్వాడ్‌లు, ధార్‌లో పవార్‌లు స్థానిక రాజులయ్యారు.
Line 157 ⟶ 154:
=== స్వాతంత్ర్యం తరువాత ===
 
1947లో స్వాతంత్ర్యం తరువాత బొంబాయి ప్రెసిడెన్సీలో మహారాష్ట్ర ప్రాంతం, విదర్భ, నాగపూర్, వాటితో మరికొన్ని రాజ సంస్థానాలు విలీనం చేసి 1950లో బొంబాయి రాష్ట్రం ఏర్పాటు చేశారు. 1960 మే 1న బొంబాయి రాష్ట్రాన్ని విభజించి [[మహారాష్ట్ర]], [[గుజరాత్]] రాష్ట్రాలను ఏర్పాటు చేశారు.
 
== భౌగోళికం ==
Line 164 ⟶ 161:
మహారాష్ట్ర వైశాల్యం 308,000 చ.కి.మీ. [[రాజస్థాన్]], [[మధ్యప్రదేశ్]]‌ల తరువాత ఇది పెద్ద రాష్ట్రం.
 
తీర ప్రాంతానికి సమాంతరంగా ఉన్న [[పడమటి కనుమలు]] సగటు ఎత్తు 1,200 [[మీటర్లు]]. వాటికి పశ్చిమాన [[కొంకణ్]] తీరభూమి మైదానం ఉంది. పడమటి కనుమలకు తూర్పున [[దక్కన్ పీఠభూమి]] ఉంది. తమ్హిని ఘాట్, వరంధ ఘాట్, సవంత్‌వాడి ఘాట్ - ఇవి పడమటి కనుమలలో విభాగాల పేర్లు. పడమటి కనుమలు భారతదేశంలో మూడు watershed ప్రాంతాలలో ఒకటి. దక్షిణబారతదేశపు ముఖ్యమైన నదులు చాలా పడమటికనుమలలో పుడుతున్నాయి. వాటిలో ముఖ్యమైనవి [[గోదావరి]], [[కృష్ణా నది|కృష్ణ]] - ఇవి తూర్పువైపుకు ప్రవహించి [[బంగాళా ఖాతం]]లో కలుస్తయి. మహారాష్ట్ర మధ్య, తూర్పు ప్రాంతాలకు ఇవి ప్రధాన నీటి వనరులు. ఇంకా పడమటి కనుమలలో చాలా చిన్న నదులు పడమటివైపుకు ప్రవహించి [[అరేబియా సముద్రం]]లో కలుస్తాయు.
 
మహారాష్ట్రకు ఉత్తరాన, మధ్యప్రదేశ్ సరిహద్దులలో [[సాత్పూరా]] పర్వతశ్రేణులున్నాయి.
Line 209 ⟶ 206:
 
మహారాష్ట్ర ప్రభుత్వపు పన్ను ఆదాయం (కేంద్రం నుండి వచ్చే వాటాను మినహాయించి) క్రింద చూపబడ్డాయి.
<ref name="Twelfth Finance Commission">{{cite web
|url=http://fincomindia.nic.in/
|title=Twelfth Finance Commission
Line 225 ⟶ 222:
 
పన్నుల ద్వారా కాకుండా , కేంద్రం నుండి వచ్చే వాటఅను మినహాయించి, వచ్చే ఆదాయ వివరాలు
|title<ref name="Twelfth Finance Commission"/>
<ref>{{cite web
|url=http://fincomindia.nic.in/
|title=Twelfth Finance Commission
|publisher=Finance Commission of India
|accessdate=2006-09-19
}}</ref>
{| class="wikitable"
|-
Line 241 ⟶ 233:
 
=== పరిశ్రమలు ===
1970దశకంలో అవలంబించిన ఆర్ధిక విధానాల ఫలితంగా భారతదేశంలో పారిశ్రామికంగా మహారాష్ట్ర బాగా అభివృద్ధి చెందింది. [[గుజరాత్]] తరువాత మహారాష్ట్ర దేశంలో అత్యధిక పారిశ్రామిక రాష్ట్రం. ముంబాయి నగరంతో సహా, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతం బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం. ఆ ప్రాంతంవారు అన్ని అవకాశాలను చేజిక్కించుకొంటున్నారన్న అభిప్రాయం విదర్భ, మరాఠ్వాడా, కొంకణ్ ప్రాంతంలో ప్రబలంగా ఉన్నది. విదర్భ ప్రాంతాన్ని వేరుచేసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలనే ఉద్యమం కూడా ఉన్నది.
 
మొత్తం దేశంలో పారిశ్రామిక ఉత్పత్తులలో 13% మహారాష్ట్రనుంచే వస్తున్నాయి. రాష్ట్రంలో 64% ప్రజలు వ్యవసాయ, సంబంధిత వృత్తులపై ఆధారపడి ఉన్నారు. కాని స్థూల రాష్ట్రాదాయంలో 46% పరిశ్రమలనుండే వస్తున్నది.
Line 283 ⟶ 275:
 
భారతదేశానికి ఆర్ధిక రాజధాని, సినిమా రాజధాని ముంబాయి నగరమేనని అంటారు.
దాదాపు అన్ని పెద్ద బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు, భీమా సంస్థలు, వాణిజ్య సంస్థల ప్రధాన కార్యాలయాలు ముంబాయ నగరంలో ఉన్నాయి. ముంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ దేశంలో షేర్ మార్కెట్ లావాదేవీల కేంద్రం. ఇది [[ఆసియా]]లో అత్యంత పురాతనమైనది.
 
ముంబాయిలో సినిమా పరిశ్రమను [[బాలీవుడ్]] అని చమత్కరిస్తుంటారు. ([[అమెరికా]]లోని [[హాలీవుడ్]]ను పురస్కరించికొని). హిందీ సినిమాలకు, టెలివిజన్ పరిశ్రమకు ఇది ప్రధాన కేంద్రం.
Line 290 ⟶ 282:
 
బొగ్గు ఆధారంగా ఉత్పత్తి చేసే విద్యుత్తు (దేశంలో 13%), అణు విద్యుత్తు (దేశంలో 17%) - ఈ రెండింటిలోనూ మహారాష్ట్రదే దేశంలో అగ్రస్థానం.
 
 
ఇటీవల [[జత్రోపా]] వ్యవసాయం మహారాష్ట్రలో విస్తరిస్తున్నది.
Line 298 ⟶ 289:
|publisher=University of Pune
|accessdate=2006-11-15
}}</ref>
 
[[రాలెగావ్ సిద్ధి]] అనే వూరు [[అహమ్మద్ నగర్]] జిల్లాలో ఉన్నది. పర్యావరణ సంరక్షణ ఈ వూరు ఒక ఆదర్శప్రాయంగా ఉన్నది.
Line 317 ⟶ 308:
 
మహారాష్ట్ర శాసనసభలో [[విధాన సభ]] ([[అసెంబ్లీ]]), [[విధాన పరిషత్]] ([[కౌన్సిల్]]) అనె రెండు సభలున్నాయి. మహహారాష్ట్రకు [[లోక్‌సభ]]లో 48 స్థానాలు, [[రాజ్యసభ]]లో 19 స్థానాలు ఉన్నాయి.
 
 
స్వాతంత్ర్యం తరువాత మహారాష్ట్ర రాజకీయాలలో [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్ పార్టీ]] ప్రధానమైన పాత్రను చేజిక్కించుకొంటూ వచ్చింది. 1995వరకూ వారికి బలమైన ప్రత్యర్ధులు లేరు. ఈ కాలంలో [[వై.బి.చవాన్]] ప్రముఖ కాంగ్రెసు నాయకుడు. 1995లో [[బాల్ థాకరే]] అధ్వర్యంలోని [[శివసేన]], [[భారతీయ జనతా పార్టీ]]ల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తరువాత [[శరద్ పవార్]] ప్రారంభించిన [[నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ]] మరొక ప్రధాన రాజకీయ శక్తిగా అవతరించింది. 2004 ఎన్నికలలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
Line 354 ⟶ 344:
 
మహారాష్ట్ర స్థానికులను '''మహారాష్ట్రియన్''' అంటారు. 2001 జనాభా లెక్కల ప్రకారం మహారాష్ట్ర జనాభా 96,752,247. ఇందులో [[మరాఠీ]] మాతృభాషగా ఉన్నవారు 62,481,681. రాష్ట్రం జనసాంద్రత చ.కి.మీ.కు 322.5. రాష్ట్రజనాభాలో పురుషులు 5.03 కోట్లు, స్త్రీలు 4.64 కోట్లు. ఆడ, మగ నిష్పత్తి 922/1000. పట్టణ జనాభా 42.4 %. అక్షరాస్యులు 77.27%. స్రీలలో అక్షరాస్యత 67.5%, పురుషులలో 86.2%. 1991-2001 మధ్య జనాభా వృద్ధిరేటు 22.57%.
 
 
అధికార భాష మరాఠీ. పెద్ద నగరమైన ముంబాయిలో మరాఠీతో బాటు [[హిందీ]], [[గుజరాతీ]], [[ఇంగ్లీషు]] భాషలు విస్తారంగా మాట్లాడుతారు. రాష్ట్ర వాయువ్యప్రాంతంలో [[అహిరాణి]] అనే మాండలికం కొద్దిమంది మాట్లాడుతారు. దక్షిణ కొంకణ ప్రాంతంలో [[మాల్వాణి]] అని పిలువబడే [[కొంకణి భాష]]మాండలికం మాట్లాడుతారు. దీనిని మరాఠీ భాష మాండలికం అనికూడా అనవచ్చు. దక్కన్ అంతర్భాగంలో [[దేశ భాషి]] అనబడే మరాఠీ మాండలికం మాట్లాడుతారు. విదర్భ ప్రాంతంలో [[వర్హాది]]అనబడే మరాఠీ మాండలికం మాట్లాడుతారు.
 
 
మతపరంగా [[హిందువులు]] 80.2%, [[ముస్లిములు]]10.6%, [[బౌద్ధులు]] 6%, [[జైనులు]] 1.3%, [[క్రైస్తవులు]] 1% ఉన్నారు. భారతదేశంలో అత్యధిక జైన, [[జోరాస్ట్రియన్]] ([[పార్సీ]]), [[యూదు]] జనాభా మహారాష్ట్రలోనే ఉన్నారు.
Line 382 ⟶ 370:
 
== రవాణా వ్యవస్థ ==
[[దస్త్రం:Mumbai_Pune_expresswayMumbai Pune ఎక్స్‌ప్రెస్way.jpg|thumb|250px| ముంబయి-పూణె ఎక్స్‌ప్రెస్ రహదారి]]
 
మహారాష్ట్రలో అధికభాగంలో [[భారతీయ రైల్వే]] వారి రవాణా సదుపాయం విస్తరించి ఉన్నది. రైలు ప్రయాణం బాగా సామాన్యం. ముంబాయి కేంద్రంగా [[సెంట్రల్ రైల్వే]] ఎక్కువ భాగంలో ఉండగా, దక్షిణతీర ప్రాంతంలో [[కొకంణ్ రైల్వే]] ఉన్నది. [[మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్]] (MSRTC) వారి బస్సు రవాణా దాదాపు అన్ని పట్టణాలకు, గ్రామాలకు విస్తరించి ఉన్నది. ఇంకా ప్రైవేటు రవాణా వ్యవస్థ కూడా దూరప్రయాణాలకు వాడుతుంటారు.
Line 393 ⟶ 381:
== సంస్కృతి ==
 
మహారాష్ట్ర సంస్కృతి అన్ని మతాల, వర్గాల జీవనశైలికి కలయికగా రూపు దిద్దుకొంది. అత్యధిక సంఖ్యాక జనులు హిందువులైనందున మహారాష్ట్ర సంస్కృతిలో ఆ ప్రభావం కనిపిస్తుంది.
 
 
మహారాష్ట్రలో చాలా పురాతనమైన మందిరాలున్నాయి. ఇక్కడి మందిరాలలో ఉత్తర, దక్షిణ భారతాల నిర్మాణశైలుల కలయిక ప్రతిబింబిస్తుంది. ఇంకా హిందూ, బౌద్ధ, జైన సంప్రదాయాల మేళవింపు మందిరాల్లోనూ, ఆచారాల్లోనూ చూడవచ్చును. మహారాష్ట్రలోని మందిరాలలో [[పండరిపూర్]]‌లోని [[విఠలుడు|విఠలుని]] ఆలయం బాగా ప్రసిద్ధి చెందింది. [[అజంతా గుహలు|అజంతా]] చిత్రాలు,[[ఎల్లోరా గుహలు|ఎల్లోరా]]శిల్పాలు, [[ఔరంగాబాదు]] మసీదు ప్రసిద్ధ పర్యాటక స్థలాలు. ఇంకా [[రాయగఢ్]], [[ప్రతాప్‌గఢ్]], [[సింధుదుర్గ్]] వంటి కోటలు కూడా చూడదగినవి.
 
గోంధల్, లవని, భరుద్, పొవడా వంటివి మహారాష్ట్ర జానపదసంగీత విధానాలు.
 
[[ధ్యానేశ్వరుడు]] రచించిన "భావార్ధ దీపిక" (ధ్యానేశ్వరి) మరాఠీ సాహిత్యంలో మొదటి రచనలలో ఒకటి. ధ్యానేశ్వరుడు, [[తుకారామ్]], [[నామదేవ్]] వంటి భక్తుల భజన, భక్తి గీతాలు జనప్రియమైనవి. ఆధునిక మరాఠీ రచయితలలో కొఒందరు ప్రముఖులు - [[పి.యల్.దేశ్‌పాండే]], [[కుససుమగ్‌రాజ్]], [[ప్రహ్లాద్ కేశవ్ ఆత్రే]], [[వ్యాకంతేష్ మద్‌గుల్కర్]].
 
నాటక రంగం, సినిమా పరిశ్రమ, టెలివిజన్ పరిశ్రమ - మూడూ బొంబాయి నగరంలో కేంద్రీకృతమైనాయి. నటీనటులు, సాంకేతికనిపుణులు, కళాకారులు ఈ మూడు రంగాలలో ఒకదానినుండి మరొకదానికి మారడం సర్వసాధారణం.
Line 424 ⟶ 410:
* [[లతా మంగేష్కర్]] - ప్రముఖ నేపథ్యగాయని
 
మహారాష్ట్ర వంటకాలు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. కొకణతీరంలో వరిఅన్నం, చేపలు ప్రధాన ఆహారపదార్ధాలు. తూర్పు మహారాష్ట్రలో గోధుమ,జొన్న, సజ్జలతో చేసిన పదార్ధాలు ఎక్కువ తింటారు. పప్పులు, ఉల్లి, టొమాటో, బంగాళదుంప, అల్లం, వెల్లుల్లి వంటివి అన్నిచోట్లా వాడుతారు. కోడి, మేక మాంసాల వాడకం కూడా బాగా ఎక్కువ.
 
సాంప్రదాయికంగా ఆడువారు 9 అడుగుల చీర ధరిస్తారు. మగవారు ధోతీ, పైజమా ధరిస్తారు. ఇప్పుడు ఆడువారికి సల్వార్-కమీజ్, మగవారికి ప్యాంటు-షర్టు సాధారణ దుస్తులు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో.
Line 430 ⟶ 416:
భారతదేశమంతటిలాగానే క్రికెట్ అత్యంత జనప్రియమైన ఆట.
గ్రామీణ ఆటలలో కబడ్డి, విట్టి-దండు, గిల్లి-దండా, పకడా-పకడీ ఆటలు సామాన్యం.
 
 
మహారాష్ట్రలో ముఖ్యమైన పండుగలు: గుడి-పాడ్వా, దీపావళి, రంగపంచమి, గోకులాష్టమి, వినాయక చవితి (గణేషోత్సవం) - గణేషోత్సవం పెద్ద ఎత్తున జరుపుతారు. ఈ ఊరేగింపులు దేశంలో అన్ని ప్రాంతాలకూ విస్తరించాయి. ఆషాఢమాసంలో పండరీపూర్‌కు వందలాది కిలోమీటర్లు పాదయాత్రలు చేయడం ఒక సంప్రదాయం.
Line 438 ⟶ 423:
 
== ఇవికూడా చూడండి ==
 
 
 
== బయటి లింకులు ==
Line 458 ⟶ 441:
* {{wikivoyage|Maharashtra}}
* http://www.maharashtra.gov.in/english/Districts%20List.php
<br />
<br />
 
 
{{భారతదేశం}}
<!--interwiki -->
 
[[వర్గం:భారతదేశ రాష్ట్రములు మరియు ప్రాంతములు]]
 
{{Link FA|mr}}
<!--interwiki -->
"https://te.wikipedia.org/wiki/మహారాష్ట్ర" నుండి వెలికితీశారు