వ్యాసుడు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధము → గ్రంథము using AWB
పంక్తి 1:
 
[[File:The sage Vyasa with disciples observes his son Sukya approaching them like a ball of fire.jpg|thumb|ఆకాశమార్గమున నిప్పు వలె వస్తున్న శుకుని చూస్తున్న వ్యాసాదులు]]
[[వేదాలు|వేదాలను]] నాలుగు భాగాలు గా విభజించి హైందవ సాంప్రదాయంలో కృష్ణద్వైపాయుడు గా పిలువబడే వాడు '''వ్యాసుడు'''. వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు [[మహాభారతం|మహాభారతం]], [[మహాభాగవతం|మహాభాగవత]] తో పాటు [[పురాణములు|అష్టాదశపురాణాలు]] రచించాడు వ్యాసుడు. వ్యాసుడు [[సప్త చిరంజీవులు|సప్తచిరంజీవుల]]లో ఒకడు.
 
==జన్మ వృత్తాంతం==
వేదవ్యాసుడు జన్మ వృత్తాంతం [[పురాణములు|అష్టాదశ పురాణాలలొ]] పెక్కు మార్పు మార్లు చెప్పబడింది. ఈ దిగువ నున్న వృత్తాంతం మహాభారతము [[ఆది పర్వం]] తృతీయా ఆశ్వాసము నండి గ్రహించబడింది.
 
పూర్వకాలములో చేది రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలన చేస్తుండేవాడు, ఒకరోజు వేటకు అడవికి వెళ్ళిన రాజు ఆ అడవి లో మునులు తపస్సు చేయడము చూసి తాను తపస్సు చేయడం ఆరంభించాడు. అప్పుడు [[ఇంద్రుడు]] అది గ్రహించి ఆ మహారాజు వద్దకు వెళ్ళి దైవత్వము ప్రసాదిస్తున్నాని చెప్పి ఒక విమానాన్ని ఇచ్చి, భూలోకములో రాజ్యం చేస్తూ, అప్పుడప్పుడు స్వర్గానికి రమ్మని చెబుతాడు. ఇంద్రుడు '''వేణుదుస్టి''' అనే అతి పరాక్రమ వంతమైన ఆయుధాన్ని కుడా ప్రసాదిస్తాడు. వసువు నివసిస్తున్న నగరానికి ప్రక్కగా శుక్తిమతి అనే నది ఉన్నది. శుక్తిమతి అనే నది ప్రక్కన ఉన్న కోలహలుడు అనే పర్వతము శుక్తిమతి మీద మోజుపడి ఆ నదిలో పడతాడు. అప్పుడు ఆ నది మార్గములో వెళ్తున్న వసువు తన ఆయుధంతో కోలహలుడిని ప్రక్కన పాడేస్తాడు. శుక్తిమతికి మరియు కోలహలుడికి మధ్య జరిగిన సంపర్కము వలన గిరిక అనే కుమార్తె వసుపదుడు అనే కుమారుడు జన్మిస్తారు. శుక్తిమతి వారివురిని వసువు కి కానుక గా ఇస్తుంది. వసువు గిరికని వివాహం చేసుకొంటాడు. వసువు వసుపదుడు ని సైన్యాధిపతిగా చేస్తాడు. ఒకరోజు వసువు వేటకు వెళ్తాడు అప్పుడు తన భార్య గిరిక గుర్తు రావడం తో [[రేతస్సు]] పడుతుంది. ఆ పడిన [[రేతస్సు]]ని ఒక దొన్నెలో చేర్చి , ఆ దొన్నెని డేగకి ఇచ్చి తన భార్యకి ఇవ్వమంటాడు. ఆ డేగ ఆ దొన్నెను తీసుకొని పోవుతుండగా మరో డేగ చూసి అది ఏదో తినే పదార్థం అని ఆలోచించి, ఆ డేగతో పోట్లాడూతుంది అప్పుడూ ఆ రేతస్సు యమునా నదిలో పడుతుంది. ఆ యమునా నదిలో ఉన్న ఒక చేప ఆ [[రేతస్సు]] అని భక్షిస్తుంది ఆ భక్షించడం వల్ల అది అండంతో కూడి పిండం గా మారుతుంది. ఒకరోజు బెస్తవారు చేపలు పట్టు తుండగా ఈ చేప చిక్కుతుంది. ఆ చేపను బెస్తవారు వారి రాజైన దాశరాజు వద్దకు తీసుకొని పోతారు.
 
దాశరాజు ఆ చేపని చీల్చి చూడగా ఆ చేపలొ ఒక మగ శిశువు మరియు మరో ఆడ శిశువు ఉంటారు. బ్రహ్మ శాపం వల్ల ఒక అద్రిక అనే అప్సరస చేప క్రింద మారి యమునా నదిలో ఉంది. చేపని చీల్చిన వేంటనే అ చేప అక్కడ నుండి అంతర్థానమై పోయింది. ఆ మగ బిడ్డ పెద్దవాడై ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఆ బాలిక మత్స్యగంధి పేరుతో పెద్దదయ్యింది. మత్స్యగంధి తండ్రి లేనప్పుడు యమునా నది పై నావ నడుపుతుండేది. ఇలా జరుగుతుండగా ఒక రోజు [[వశిష్ట మహర్షి]] మనమడు, శక్తి మహర్షి కుమారుడాయిన [[పరాశరుడు]] ఆ నది దాటడానికి అక్కడ కు వస్తాడు.
 
అక్కడ కనిపించిన మత్స్యగంధిని చూసి మోహించే రతి సుఖాన్ని ఇవ్వమంటాడు, అప్పుడు మత్స్యగంధి తన శరీరం అంతా చేపల వాసనతో ఉంటుందని, కన్యత్వం చెడిన తాను తన తండ్రికి ఏవిధంగా మొగము చూపగలని ప్రశ్నిస్తుంది. అప్పుడు పరాశరుడు మత్స్యగంధి వసువు వీర్యానికి అద్రిక నే అప్సరసకి జన్మించినది అనిజన్మ వృత్తాంతం చెబుతాడు. చేపల వాసన పోయేటట్లుగా ఒక యోజన దూరము వరకు సుగంధం వెదజల్లేటట్లు వరాన్ని ఇస్తాడు. అప్పటి నుండి యోజన గంధిగా పేరు పొందింది. అప్పటి రతి జరపడానికి సంకోచిస్తున్న మత్స్యగంధి తో పరాశరుడు ఆమె కన్యత్వం చెడకుండా ఉండే వరాన్ని ఇస్తాడు. పగటి పూట రతి సలపడం అనే విషయం వ్యక్తపరిస్తే , అక్కడా ఉన్న ప్రదేశాన్ని మేఘాలతో కప్పేస్తాడు. ఆ విధంగా రతి జరపగా ఒక తేజోవంతుడైన శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లికి తండ్రికి నమస్కరించి తపస్సుకి వెళ్ళి పోతాడు. తల్లికి ఎప్పుడైన మననం చేసుకొంటే ప్రత్యక్షమయ్యే వరాన్ని ఇస్తాడు.
Line 32 ⟶ 31:
* [http://www.sacred-texts.com/hin/maha/index.htm The Mahabharata గంగూలి భారతాన్ని ఆంగ్లం లొకి అనువదించిన మూలం అందిస్తున్న వెబ్ సైటు]
* [http://www.shankaracharya.org వేదాంత సూత్రాలకు శంకర భాష్యం]
* [http://www.akshamala.org Akshamala: మాగంటి కోనేటి రావు కూర్చిన వేదాంత పరిభాషా వివరణ గ్రంధముగ్రంథము(1905-1996)]
* [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=10071%20saanan%27doo%20paakhyaanamu&author1=&subject1=RELIGION.%20THEOLOGY&year=1914%20&language1=Telugu&pages=88&barcode=2020050019166&author2=&identifier1=RMSC-IIITH&publisher1=man%27guven%27kat%27aran%27ganaadharaavu&contributor1=FAO&vendor1=par&scanningcentre1=rmsc,%20iiith&slocation1=IIITH&sourcelib1=NONE&scannerno1=&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-02-12&numberedpages1=278&unnumberedpages1=22&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=Gorge%20Allen%20And%20Unwin%20Ltd&copyrightexpirydate1=0000-00-00&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data6/upload/0160/724 సానందోపాఖ్యానం ప్రతి డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా లంకె]
* [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Maha%20Bharatam%20Mooksha%20Dharma%20Parvam%20-%20Part%20-%20I&author1=Dr.Kanala%20Chakravarti&subject1=&year=1996%20&language1=telugu&pages=169&barcode=2990100030378&author2=&identifier1=Librarian,SVCLRC&publisher1=T.T.D,Tirupati&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=SVCLRC&scannerno1=&digitalrepublisher1=UDL,T.T.D,Tirupati&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data/upload/0030/383 మహాభారతంలోని మోక్షధర్మ పర్వానికి కానాల నలచక్రవర్తి చేసిన అనువాదం]
Line 38 ⟶ 37:
{{మహాభారతం}}
{{భారతీయ తత్వశాస్త్రం}}
 
{{హిందూ మతము పురాణ ఋషులు}}
 
[[వర్గం:మహాభారతం]]
Line 44 ⟶ 45:
[[వర్గం:పురాణ పాత్రలు]]
[[వర్గం:ప్రాచీన ఋషులు]]
{{హిందూ మతము పురాణ ఋషులు}}
[[వర్గం:హిందూ ఋషులు]]
"https://te.wikipedia.org/wiki/వ్యాసుడు" నుండి వెలికితీశారు