అధికారి హితోపదేశము: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎పూర్తి పుస్తకం: clean up, replaced: ప్రార్ధన → ప్రార్థన using AWB
పంక్తి 43:
01 .10. 1953 ఇట్లు
కన్నాపురం వడ్డూరి అచ్యుతరామా రావు
కృతికర్త
 
 
అధికారిహితోపదేశం
ఇష్టదేవతా ప్రార్ధనప్రార్థన
క. శ్రీ కరమగు భారతావని
నీ కరుణావీక్షణముల నిరతరవృద్ధిన్
పంక్తి 56:
యేవిఘ్నము గల్గకుండ నీకృతి నీవే
గావుము మది నిన్నెప్పుడు
సేవింతును విఘ్ననాశ!శ్రీ గణనాధా ! (2)
 
క. శ్రీ శారదాంబ ! యీకృతి
నేశబ్దార్ధముల దోషమెలమి గలుగకే
ధీశక్తి గూడసేయవే
యాశాంత విశాలకీర్తి యలరగ తల్లీ ! (3)
 
క. తల్లీ!దండ్రి! యోగురు
తల్లజ!మీరెల్ల నన్ను దయజూచి కృతిన్
యెల్లజనులాదరింపగ
నెల్లపు డాశీర్వదింపరే వినుతింతున్ ! (4)
 
క. శ్రీ మద్భారతజననీ
ప్రేమంబున గావుమమ్మ బిడ్డలమగు మా
సేమంబుగోరి నీకెద
నేము బ్రణామములోనర్తు మెప్పుడు తల్లీ ! (5)
 
క. ఓ కవి తల్లజులారా !
మీకన్నిట చిన్నవాడ మీ శిష్యునిగా
జేకొని గృతి దీవింపుడు
మీకు నమస్కృతులోన ర్తుమిక్కిలి భక్తిన్ ! (6)
 
వ. అని యిష్ట దేవతా వందనంబును మాతా పితృ గురు నమస్కారంబును సుకవి స్తుతియుం గావించి .
పంక్తి 85:
గౌరవములు నాదు కవితగల దోషంబుల్ ! (7)
వ. అని యాత్మీయ కవితా దోషంబులు క్షంతవ్యంబులుగా భావించు నస్మద్వంశక్రమంబెట్టిదనిన.
 
క. ఇల గోదావరి జిల్లాలో
పంక్తి 95:
పుత్రుండను సోమకవికి భువి శేషమకున్
ఛాత్రుడను సకల బుధులకు
పాత్రత నచ్యుతుడటండ్రు భవ్యులు నన్నున్ ! (9)
 
క. అన్నలు మువ్వురు నాకును
జిన్నలు తమ్ముడును చిన్న చెల్లెండ్రును నా
కున్నారలిర్వు రేడ్వుర
మెన్నగ నున్నారమెలమి నిష్ట సుఖములన్ ! (10)
 
క. అల విష్ణువర్ధనస గో
పంక్తి 110:
కడు దొడ్డ పురంబు గలదు కడిమిని దానన్
బొడముచు కీర్తి వెలుంగుట
నడ రెడు వడ్డూరి వారటందురు మమ్మున్ ! (12)
 
క. మాతల్లి శేషమాంబకు
నేతల్లియు సాటిరాదు నెయ్యంబున వి
ఖ్యాతముగ నన్నదానము
సేతకు,పతిభక్తి యందు శీలము చేతన్ ! (13)
 
క. మాతండ్రి సోమరాట్కవి
పూతచరిత్రుండు సర్వభూతహితుండున్
నీతియు నియమముగల వి
ఖ్యాతుడు నిరతంబు భగవదారాధకుడున్ ! (14)
 
వ. అని నాయాత్మ చరిత్రంబును కులశీల నామంబుల వివరించుచు
పంక్తి 126:
నూతనాంద్ర రాష్ట్రావతరణ శుభ సమారంభ సంరంభమున
నవ్యాంద్ర ప్రభుత్వమునకు
సమర్పించు కుతూహలంబున మిత్రులచే కోరంబడిన వాడనై యోచించి.
 
క. నాగరికతగా నెంచి, య
ధోగతి పాలగుచు వివిధ దుర్గుణమతులై
త్యాగము, శీలము విడచి య
నాగారకతనున్న యీ జనంబుల గనుచున్ ! (15)
 
క. అవినీతియు దుశ్సీలము
పంక్తి 141:
విధినడచిన బ్రజకు శాంతి వృద్ధులు గలుగున్
అధికారి నీతిదప్పిన
బృధివియు సంక్షుభితమగుచు పీడింపబడున్ ! (17)
 
వ. అని నిశ్చయించి దేశ శ్రేయోభిలాషి నై
 
క. అధికారి నీతిశతకము
నధికంబగు భక్తి దైవమాజ్ఞాపింపన్
బ్రధితముగ వ్రాసినాడను
బుధులార!యనుగ్రహించి బ్రోవుడు దీనిన్ ! (18)
 
క. వినివారికోరకె జెప్పెద
వినగోరని వారికొరకు వివరింపను నే
జనహితము నెంచి చేసితి
మనుజోత్తములార!చదివి మంచిన్ గొనుడీ ! (19)
 
వ. అనుచు నాంధ్రరాస్ట్రాధినేత నుద్దేశించుచు ,
పంక్తి 160:
వరుడన్నిట యోగ్యయైన వధువును ధరణీ
వరు డుత్తమానుచరులను
గర మన్వేషింపవలయుగద రాష్ట్రపతీ ! (20)
 
వ. అట్ల యగుటంజేసి,
పంక్తి 167:
మాయాంధ్ర వసుంధరకును మహరాజవు నీ
కీయధికారి హితంబును
నేయంకిత మిచ్చుచుంటి నిదెగైకొనుమా ! (21)
 
క. ఆంధ్రలక్ష్మితోడ నధికారి కృతికన్య
శ్రీయు భూమి నాగ జెలగి ప్రేమ
నిన్నుగోరి చేరే నీవు శ్రీధరు పోల్కే
నాదరించి యేలు మాంధ్రసింహ ! (22)
 
క. అందంబులు రసవన్మా
కందంబులు వికచపద్మ గంధమరందా
నందంబులు రసబంధుర
కందశతంబులను ప్రేమ గైకొనుమధిపా ! (23)
 
క. కందముల సరులబోలుచు
పంక్తి 190:
వ. దేవా యవధరింపుము నీ యధికార వర్గంబునకు నా యోనరించు నట్టి హితోపదేశం బెట్టిదనిన .,
 
అధికారిహితోపదేశము
 
క. శ్రీపావన భరతావని
దీపించి దిగంతరముల తేజంబలరన్
వ్యాపించుకీర్తి గూర్చుట
నీపై నుండెను గ్రహింపు మిదియధికారీ! (1)
 
క. ధర్మార్ధ మోక్ష సాధన
కర్మక్షితి యైన భరత ఖండంబున నీ
ధర్మము పరోపకారము
మర్మము విడనాడి సేయుమా యధికారీ! (2)
 
క. నీతికి నిలయంబనగా
జాతీయత పుట్టువునకు జన్మస్థలినా
ఖ్యాతిని గాంచిన భారత
జాతికి నీనడతయే యశంబధికారీ! (3)
 
క. పేదలయెడ నీవెప్పుడు
పంక్తి 215:
బధిరము గర్వాంధములును బ్రాప్తించును నా
ప్రధ గలదు సుమ్ము సద్గుణ
నిధివై సత్కీర్తి గనుము నీ వధికారీ! (5)
 
క. ఈ ధన మీయధికారము
పంక్తి 230:
కాపురమును జక్కబెట్టగావలెను జుమీ
యే పుణ్య కార్యమైనను
నేవున నొనరింప దరుణమిదె యధికారీ! (8)
 
క. ఆతత సమస్త ధర్మ
వ్రాతంబులలో నహింస బహుముఖ్యంబౌ
నేతద్వ్రతమును విడువక
జాతికి సేమంబు గూర్పజను నధికారీ! (9)
 
క. హింసయన జంతుబలియును
మాంసంబునకై వధించు మాత్రంబునకే
హింసయనరుత్తముల మది
హింసించుట గూడ హింసయే యధికారీ! (10)
 
క. ధనికులని పేదలనియును
పంక్తి 250:
బేలలదుర్భుద్ధివగుచు పీడించుటయున్
శీలంబు విడచి నడచుట
పోలదు సన్మార్గమునను బొమ్మధికారీ! (12)
 
క. పలుకాడి తప్పజూచుట
ఖలులను దరిజేర్చి బుధుల గారించుటయున్
ఇలవేల్పు మఱచియుండుట
నెలమి నపఖ్యాతి గూర్చు నీకథికారీ! (13)
 
క. రాజనగ దైవమట్టుల
భూజనులను ప్రేమతోడ బుత్రులరీతిన్
యీ జగతినింటియట్టుల
సౌజన్యముతో తలంచి చనుమధికారీ! (14)
 
క. గృహమేధి తలచు కార్యము
గృహిణియు దాసహకరింప గీర్తి ప్రదమై
యహరహము మేలోసంగును
గృహిణి విరోధింప దానగీడధికారీ! (15)
 
క. ఇల్లును జూచిన పిమ్మట
పంక్తి 275:
నాశనమగుటరయ నీ గుణంబున గలవా
యాశకులోబడి చెఱపక
దేశ హితంబునను జనగదే యధికారీ! (17)
 
క. నీనడవడి యొరవడియగు
పంక్తి 290:
కలిమి విహీనులను నొక్కగతి జూడకుమీ
ఇలనెల్ల జనుల బిడ్డల
వలెజూడుము కన్నతల్లివై యధికారీ! (20)
 
క. ఇచ్చకములాడి లంచము
లిచ్చుచు బరవస్తుధనములెల్ల హరింపన్
గుచ్చితబుద్ధిని వత్తురు
మచ్చిక సేరంగనీకుమా యధికారీ! (21)
 
క. నీ యందభిమానముతో
నీయరు సుమ్మొరులు ధనము లీవేరుగుము నీ
వాయుద్యోగము సేయుట
చేయిత్తురు స్వార్ధ బుద్ధిచే నధికారీ! (22)
 
క. పరిమితమగు నధికారము
బరహితమును బెంపు దేశ భాగ్యోదయమున్
జిరతర యశంబు గోరుచు
ధర వినియోగించుటే ముదంబధికారీ! (23)
 
క. ఎలమిని బరహితమనగా
గలవారికి సేవజేయగా బోదుసుమీ
యిలలో బహుజన సేమము
దలపోసి జరింప బరహితంబధికారీ ! (24)
 
క. నిను నమ్మి నీదు సలహా
పంక్తి 320:
కరము మదాంధుండవైన గౌరవమడగున్
సిరిదా దొలగును దుర్యశ
మరుదెంచునుగాన తెలియుమాయధికారీ ! (26)
 
క. సహకార భావముండుట
సహనంబును గలిగియుంట శాంతంబున నీ
యహమును వీడి మెలంగుట
లహరహమును నుండవలె సుమా యధికారీ! (27)
 
క. నమ్ముటయుగాదు దెలియక
పంక్తి 335:
మాటయె ప్రేమంబు గూర్చి మరులుగొలుపగా
మాటయె వరములొసంగగ
మాటయె నరులకును మూట మహినధికారీ! (29)
 
క. తొందరపాటును కూడదు
మందత్వము నుండరాదు మహి శీఘ్రగతిన్
పొందుగ కార్యము చందము
సందర్భము నెరిగిసేయ జను నధికారీ! (30)
 
క. అలుకయు నర్ఢాపేక్షయు
కలవరమాతురత మరియు కామేచ్చయు దా
గలిగిన మనుజునకిలలో
గలుగదు శాంతియు సుఖంబు గనుమధికారీ! (31)
 
క. ఆర్తుల గాపడుటయును
వర్తనము మంచిగలిగి వసుధార్కముగా
గీర్తిని సంపాదించుట
కర్తవ్యము నీకు తెలియగా నధికారీ! (32)
 
క. జననియు జన్మస్ఠలమును
ఘనముసుమీ మనుజునకు జగంబున స్వర్గం
బునుమించి గాన భారత
జననీ సంసేవసేయ జనునధికారీ! (33)
 
క. రాజరికంబున బ్రభువులు
యేజీతము నీకు నిర్ణయించిరో దానిన్
నీజీవితంబు నడపుచు
పోజెల్లు దురాశ జెందబోకథికారీ! (34)
 
క. ఆజీతంబును దొరుకక
నీ జగమున నెంతమంది నిస్ప్రుహను జనం
బీ జీవితంబు రోయుచు
రోజుచు తపియించెనో యెరుగుమధికారీ! (35)
 
క. ప్రాప్తించు దానివలననె
ద్రుప్తింబడీ నీవు నీ యధీన జనాళిన్
ఆప్తుండవగుచు బ్రోవుము
బ్రాప్తించును దాన సౌఖ్యపద మధికారీ! (36)
 
క. శీలము కీర్తికి మూలము
శీలమె పరలోకసౌఖ్యసిద్ధికిమూలం
బాలంబమెల్లసుక్రుతికి
వాలాయము శీలముడుగవ దధికారీ! (37)
 
క. నీతియె గుణగణరాజము
నీతియె బుధలోకమాననీయ గుణంబున్
నీతియె కీర్తికరంబిల
పూతమతీ! నీతి విడువబోకథికారీ! (38)
 
క. నీతిగలవానికెందును
బాతకములు జేరరావు బ్రబకంబౌ వి
ఖ్యాతి సమకూరు సుజన
వ్రాతంబులుమెత్తురిదియె వరమధికారీ ! (39)
 
క. అధికారి నీతి దప్పిన
బ్రుధివికి సేమంబులేదు;పేదలకెలమిన్
వ్యధగల్గు, శాసనంబులు
వృధయౌ, రాజ్యంబె చెడును వినిమధికారీ ! (40)
 
క. నీతిని దప్పిన వానిన్
పంక్తి 400:
బృధివీజనసేవనంబు.బీదలయెడలన్
కృధలేకయుంట,నీతి సు
పధమున నడచుటయు నుండవలె నధికారీ ! (42)
 
క. పూతమగు నీతి గల్గుట
భూతదయాళుత్వమునను బొల్పొందుటయున్
పాతక బుధ్ధిని వీడుట
ఖ్యాతి సమార్జించుటయును ఘనమధికారీ ! (43)
 
క. మధురముగ మాటలాడుట
పంక్తి 415:
త్యంతంబు శుభప్రదంబు,నార్యహితంబున్
సంతోషకరము నీకు ని
తాంతంబుగనుండవలయు దగనధికారీ (45)
 
క. జారుల చోరుల కొండెపు
వారల లంచంబు లిచ్చువారల దరికిన్
జేరగ నీకుము చేర్చిన
గౌరవము యశంబు బోవుగదె యధికారీ ! (46)
 
క. కొంచెపు బుద్ధిని గూడకు
వంచింపకు నీ ప్రభుత్వ వర్గంబు నెదన్
లంచము లాసింపకుమీ
మంచి గుణంబులను విడవకుమా యధికారీ ! (47)
 
క. వినుమధికారి యధర్మము
ననువర్తించినను వినయనయ భయభక్తుల్
జనులమది వదలిపోవును
గనగ నరాజరిక మౌనుగద యధికారీ ! (48)
 
క. అవినీతి బాపశక్యం
పంక్తి 445:
వినుమాతనికే ఘటించు విపరీతంబుల్
గనగ నధికారి దప్పిన
ననయము బ్రజకెల్లహానియౌ నధికారీ ! (51)
 
క. వినుమెవ్వరేది సెప్పిన
పంక్తి 455:
లనుపమ భోగంబులే ఫలంబులు భువిలో
గననధికారమునకు ఫల
మనయంబు పరోపకారమగు నధికారీ ! (53)
 
క. వసుధను బరోపకారం
బసమానంబైన ధర్మమనిరి మహాత్ముల్
బొసగ బరహింస సేయుట
లసమానం బౌనధర్మమని రధికారీ ! (54)
 
క. కలవారు లేనివారని
కలవిలలో రెండు తెగలు,కలికాలమునన్
గలవారన బలవంతులు
బలహీనుల కెలమినీవే బలమధికారీ ! (55)
 
క. బలవంతులు దుర్బలులను
చలమునహంకారమునను సాధించుటయే
కలికాలమందు సాగెడి
నిలలో ధర్మంబు నిలువుమీ యధికారీ ! (56)
 
క. కలవారితోడ గలియుచు
బలహీనుల నీవుగూడ బాధించినచో
కలిమియు నధికారంబును
గలిసిన నిక ధర్మమెందు గలదధికారీ ! (57)
 
క. కలిమియు, కులమధికారము,
తెలియమియును, నొక్కటోకటే దెచ్చు ననర్ధం
బిలరెండుమూడు నాలుగు
గలసిన నికనేమి చెప్పగలదధికారీ! (58)
 
క. వెసనధికారము గల్గుట
బస ధర్మమునిల్పి ప్రజల బాలించుటకే
మసగొని కసవును మెసవుచు
గసరుచు బుసబుసలు గొట్టగాదధికారీ ! (59)
 
క. పోషింపు జనుల, బరుషము
భాషింపకు దురధికార పదగర్వమునన్
ద్వేషింపకు సుజనుల న
న్వేషింపుము ఖలుల నడపవెస నధికారీ! (60)
 
క. సత్యంబును సజ్జన సాం
గత్యంబును గల్గియుండగావలెనుజుమీ
సత్యంబునగీర్తియు సాం
గత్యంబున శీలమబ్బుగద యధికారీ! (61)
 
క. సత్యంబునె వచియింపుము
సత్యంబైనను వచింప జనదప్రియమున్
సత్యంబగుహితవొసగుము
నిత్యంబప్రియమునైన నీవధికారీ ! (62)
 
క. సత్యము శాంతమహింసయు
పంక్తి 570:
పురుషుండై పుట్టుటధిక పుణ్యము మరియున్
గరమును పుణ్యము బ్రజలకు
నరయగ ధర్మాధికారి యౌటధికారీ ! (76)
 
క. అరయ నధికారముండుట
పంక్తి 646:
ధర్మ హితంబైన సౌఖ్యదంబగుచును స
త్కర్మము నాబడు గావున
నిర్మల కామంబు తగును నీ కథికారీ ! (91)
 
క. నీ వధికారివె యౌటను
పంక్తి 699:
శ్రీ శ్రీ శ్రీ
శ్రీ శ్రీ
శ్రీ
 
కృతి సమర్పణ
పంక్తి 717:
దెలియన్ బల్కుదురెల్లవారలు ధరిత్రిన్ సార్ధకాభిఖ్య నీ
విలసత్కాంతి వినూత నాంధ్ర వసుధన్ వెల్గొందగా జేసి ని
శ్చల మంత్రిత్వముతోడ దేశము బ్రకాశంబందపాలింపుమా.
 
సీ . అల గోదావరి పొంగి ముంచె నొకచో, నాంధ్ర ప్రజావాహినుల్
పంక్తి 730:
తెలుగు వెలుంగునాగ నిల ద్రిమ్మరుసో యన రాజనీతితో
మెలగి తెలుంగు జాతికిని మేలోనగూర్పు త్రిలింగ సింగమా !
జై ఆంధ్ర
 
 
 
 
 
 
</poem>
 
 
 
 
 
 
 
</poem>
 
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
"https://te.wikipedia.org/wiki/అధికారి_హితోపదేశము" నుండి వెలికితీశారు