గాడిచర్ల హరిసర్వోత్తమ రావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
 
 
ఆ తరువాత ఆయన పత్రికా రంగంలోకి అడుగు పెట్టాడు. '''స్వరాజ్య''' అనే తెలుగు పత్రికను ప్రారంభించి, బ్రిటిషు పాలనపై విమర్శలు ప్రచురించేవాడు. [[1908]] లో తిరునెల్వేలి లో పోలీసు కాల్పుల్లో ముగ్గురు మరణించినపుడు ''విపరీతక్రూరమైన బుద్ధివిదేశీ పులి'' (Cruel Foreign Tiger) అనే పేరుతో ఆయన రాసిన సంపాదకీయంపై ప్రభుత్వం కోపించి, ఆయనకు మూడేళ్ళ ఖైదు విధించింది. ఆ విధంగా ఆయన ఆంధ్రులలో ప్రప్రథమ రాజకీయ ఖైదీ అయ్యాడు.<ref name="ap online histroy">{{cite web|title=Modern Period|url=http://www.aponline.gov.in/quick%20links/hist-cult/history_modern.html|website=AP Online|accessdate=1 March 2015}}</ref> వెల్లూరు జైలులో, బందిపోట్లు, గజదొంగలూ ఉండే గదిలో ఆయనను బంధించి, అమానుషంగా వ్యవహరించింది, బ్రిటిషు ప్రభుత్వం. జైలు నుండి విడుదల అయ్యాక కూడా ఆయనపై ప్రభుత్వ నిఘా ఉండేది. ప్రజలు ఆయనతో మాట్లాడటానికి కూడా భయపడేవారు.