ఔరంగజేబు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 62:
* గోల్కొండ రాజైన తానాషా శిస్తులు వసూలుచేసి ఢిల్లీ పాదుషాకు అప్పగించకుండా కోట్లాది రూపాయలను భూమిలో పాతిపెట్టి దానిమీద జామా మసీదును కట్టించినప్పుడు ఔరంగజేబు ఆ మసీదును పడగొట్టి నిధులను వెలికితీయించి ప్రజోపయోగ కార్యక్రమాలకు వెచ్చించాడు !
== ఇతర విశేషాలు ==
ఔరంగజేబుకు చిన్నతనంలో పారశీకాది భాషలలో విద్యను అభ్యసింపజేసిన గురువుకు రాసిన ఉత్తరం తెలుగు సాహిత్యం ప్రఖ్యాతిపొందింది. తనకు చిన్నతనంలో మతవిద్య, తత్త్వవిద్య, పారశీక భాష వంటివి నేర్పినందుకు ఆయనను ఉత్తరంలో తీవ్రంగా గర్హించారు. పైగా ప్రపంచంలోని ముఖ్యమైన సామ్రాజ్యానికి భావిసామ్రాట్టుకు భూగోళం, ఇతర రాజ్యాల స్థితిగతులు, రాజనీతి, ఆర్థిక విషయాలు వంటివి బోధించకుండా జీవితంపై వైరాగ్యం పొంది సన్యసించవలసిన దశలో నేర్వాల్సిన విషయాలు బోధించారని ఆరోపించారు. ఆయన వల్ల, ఆయన విద్యావిధానం వల్ల తన జీవితంలో అత్యంత ముఖ్యమై వ్యక్తిత్వాన్ని సంతరించుకునే బాల్యదశ, యువత అంతా వ్యర్థమైన విషయాల్లో గడచిపోయిందని వ్రాశారు. విద్యను అభ్యసించేందుకు బాలలకు మాతృభాషే సరైనదని, అలాకాక వేరే భాషను మాధ్యమంగా స్వీకరించి విద్య నేర్పితే ఆ భాష నేర్చుకుని, ఆపైన ఆ భాషలో విద్య నేర్చుకునేందుకు చాలా శ్రమపడతారని వ్రాశారు. తనకు మాతృభాషలోనూ, రాజ్యంలోని వాడుకలో ఉన్న భాషల్లో కాక విదేశీభాషలో విద్య నేర్పినందుకూ గర్హించారు. ఔరంగజేబు కొలువులో సర్దారుగా నియమించాలని గురువు చేసిన విన్నపాన్ని కొట్టివేస్తూ సికిందర్ ([[అలెగ్జాండర్]])కు ఆయన గురువు [[అరిస్టాటిల్]] బోధించినట్లు జీవితానికి ఉపకరించే విద్యను, వికాసాన్ని కలిగించే పద్ధతిలోనూ నేర్పివుంటే సర్దారుగానే కాక అంతకు వేయిరెట్లు గౌరవాన్ని ఇచ్చేవాడినని, ఇప్పటికి మాత్రం ఆయన తన గురువన్న విషయం తన కొలువులోని మరెవరికైనా తెలియడం కూడా ఇష్టంలేదని తిరిగి ఊరు చేరుకొమ్మని ఆదేశించారు.<ref name="ఔరంగజేబు గురువుకు వ్రాసిన ఉత్తరం">{{cite journal|last1=లక్ష్మణరావు|first1=కొమర్రాజు|title=ఔరంగజేబు తన గురువునకు వ్రాసిన యుత్తరము|journal=ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక|date=1910|page=57|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Aandhrapatrika_sanvatsaraadi_sanchika_1910.pdf/56|accessdate=6 March 2015}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఔరంగజేబు" నుండి వెలికితీశారు