శ్రీ కృష్ణదేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
పంక్తి 2:
[[బొమ్మ:SrIkRshNadEvaraayalu text.jpg|thumb|right|200px]]
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
'''శ్రీ కృష్ణదేవ రాయలు''' (పా.[[1509]]-[[1529]]) అత్యంత ప్రసిద్ధ [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్య]] చక్రవర్తి. సాళువ నరసనాయకుడి వద్ద మహాదండనాయకుడుగా పనిచేసిన తుళువ నరసనాయకుని మూడవ కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు. నరసనాయకుడు పెనుకొండలో ఉండగా, రెండవ భార్య నాగలాంబకు జన్మించాడు కృష్ణదేవరాయలు. ఈయన పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను [[తెలుగు]] మరియు [[కన్నడ]] ప్రజలు [[భారతదేశం|భారతదేశాన్ని]] పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన [[ఆంధ్ర భోజుడు]] గా మరియు [[కన్నడ రాజ్య రమారమణ]] గా కీర్తించబడినాడు. ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు [[డొమింగో పేస్]] మరియు [[న్యూనిజ్]]‌ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి [[తిమ్మరుసు]]. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి "అప్పాజీ" (తండ్రిగారు) అని పిలిచేవాడు.రాయలు, [[తుళువ నరస నాయకుడు|తుళువ నరస నాయకుని]] రెండవ భార్య అయిన నాగలాంబ (తెలుగు ఆడపడుచు) కుమారుడు.<ref name="parents">Prof K.A.N. Sastri, ''History of South India, From Prehistoric times to fall of Vijayanagar'', 1955, pp 250,258</ref> ఇతను ఇరవై సంవత్సరాల వయసులో [[ఫిబ్రవరి 4]], [[1509]]న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డురానున్న [[అచ్యుత రాయలు]] నూ, [[వీర నరసింహ రాయలు]] నూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించినాడు. రాయలు తల్లి నాగలాంబ [[గండికోట]] ను పాలించిన [[పెమ్మసాని నాయకులు]] ఆడపడచు<ref>రాయలవారి వంశము: http://www.eenadu.net/opiniondisplay.asp?myqry=opini2%2Ehtm&opid=2&reccount=2</ref>. 240 కోట్ల వార్షికాదాయము కలదు. రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్ధిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగు సుగుణాలు కలవాడు. ఇతను దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించినాడు.
 
==సాహిత్య పోషణ==
పంక్తి 8:
 
==భక్తునిగా==
[[బొమ్మ:SRI_KRISHNA_DEVARAYALUSRI KRISHNA DEVARAYALU.jpg|right||[[తిరుమల]]వెంకన్న ఆలయంలో సతీసమేతుడైన కృష్ణదేవ రాయలు]]
కృష్ణదేవ రాయలు తక్కిన విజయనగర రాజులలాగే వైష్ణవుడు. కానీ పరమతసహనశీలుడు. అనేక వైష్ణవాలయాలతో పాటు శివాలయాలను నిర్మించినాడు. అంతేకాక ధూర్జటి, నంది తిమ్మన వంటి పరమశైవులకు కూడా తన సభలో స్థానం కల్పించాడు.<ref>[http://books.google.com/books?id=zB4n3MVozbUC&pg=PA1009&lpg=PA1009#v=onepage&q&f=false Encyclopaedia of Indian Literature: devraj to jyoti, Volume 2 By Amaresh Datta]</ref><ref>[http://books.google.com/books?id=KnPoYxrRfc0C&pg=PA4356&lpg=PA4356&dq=krishnadevaraya#v=onepage&q=krishnadevaraya&f=false The Encyclopaedia Of Indian Literature (Volume Five (Sasay To Zorgot), Volume 5 By Mohan Lal]</ref> అనేక దాన ధర్మాలు చేసినాడు. ముఖ్యంగా [[తిరుమల]] శ్రీనివాసులకు పరమ భక్తుడు, సుమారుగా ఆరు పర్యాయములు ఆ దేవదేవుని దర్శించి, అనేక దానధర్మాలు చేశాడు. ఇతను తన కుమారునికి [[తిరుమల దేవ రాయలు]] అని, కుమార్తెకు [[తిరుమలాంబ]] అని పేర్లు పెట్టుకున్నాడు.
 
పంక్తి 15:
 
==కుటుంబము==
కృష్ణదేవ రాయలుకు [[తిరుమల దేవి]], [[చిన్నాదేవి]] ఇద్దరు భార్యలని లోక విదితము. కానీ, ఆముక్తమాల్యద ప్రకారం ఈయనకు ముగ్గురు భార్యలు (తిరుమలాదేవి, అన్నపూర్ణ మరియు కమల).<ref name=voices1>[http://books.google.com/books?id=PxvDNBc4qwUC&pg=PA118&lpg=PA118&dq=krishnadevaraya#v=onepage&q=krishnadevaraya&f=false Vijayanagara Voices: Exploring South Indian History and Hindu Literature By William Joseph Jackson]</ref> కృష్ణదేవరాయలు విజయనగర సామంతుడైన శ్రీరంగపట్నం రాజు కుమార వీరయ్య కూతురు తిరుమలాదేవిని 1498లో వివాహం చేసుకున్నాడు.<ref>[http://books.google.com/books?id=WS9uAAAAMAAJ&q=nagalamba Krishnadeva Raya: the great poet-emperor of Vijayanagara - G. Surya Prakash Rao]</ref> పట్టాభిషిక్తుడైన తర్వాత రాజనర్తకి అయిన చిన్నాదేవిని వివాహమాడాడని న్యూనిజ్ వ్రాశాడు. [[ప్రతాపరుద్ర గజపతి]] ని ఓడించి, ఆయన కూతురైన [[తుక్కా దేవి]] ని మూడవ భార్యగా స్వీకరించాడటనటానికి చారిత్రకాధారాలున్నాయి. ఈమెనే కొందరు లక్ష్మీదేవి అని, జగన్మోహిని అని కూడా వ్యవహరించారు.<ref>[http://books.google.com/books?id=QaIRAQAAMAAJ&q=krishnadevaraya+wives&dq=krishnadevaraya+wives Encyclopaedia of Indian Literature: K to Navalram - Amaresh Datta, Sahitya Akademi]</ref> చాగంటి శేషయ్య, కృష్ణరాయలకు అన్నపూర్ణమ్మ అనే నాలుగవ భార్య ఉందని భావించాడు. కానీ, చిన్నాదేవే అన్నపూర్ణమ్మ అని కొందరి అభిప్రాయం. డొమింగో పేస్ ప్రకారం కృష్ణరాయలకు పన్నెండు మంది భార్యలు.<ref name=voices1/><ref>[http://books.google.com/books?id=1N5Hgos5mScC&pg=PA48&lpg=PA48&dq=krishnadevaraya+wives#v=onepage&q=krishnadevaraya%20wives&f=false Courts of Pre-Colonial South India By Jennifer Howes]</ref> కానీ అందులో తిరుమలాదేవి, చిన్నాదేవి, జగన్మోహిని ప్రధాన రాణులని చెప్పవచ్చు. అయితే శాసనాల్లో ఎక్కువగా ప్రస్తావించబడిన తిరుమలాదేవి పట్టపురాణి అయిఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం<ref>[http://books.google.com/books?id=5OQdAAAAMAAJ&q=tirumaladevi&dq=tirumaladevi Readings in South Indian history - T. V. Mahalingam]</ref> ఇద్దరు కుమార్తెలు, వారిలో పెద్ద కూతురు తిరుమలాంబను ఆరవీడు రామ రాయలకు, చిన్న కూతురును రామ రాయలు సోదరుడైన తిరుమల రాయలుకు ఇచ్చి వివాహం చేసాడు. ఒక్కడే కొడుకు, తిరుమల దేవరాయలు. ఇతనికి చిన్న తనంలోనే పట్టాభిషేకం చేసి, తానే ప్రధానిగా ఉండి రాజ్యవ్యవహారాలు చూసుకునేవాడు. కాని దురదృష్టవశాత్తూ తిరుమల దేవ రాయలు [[1524]] లో మరణించినాడు. ఈ విషయంపై కృష్ణ దేవ రాయలు [[తిమ్మరుసు]] ను అనుమానించి, అతనిని గ్రుడ్డివానిగా చేసాడు. తానూ అదే దిగులుతో మరణించినాడని ఓ అభిప్రాయము. మరణానికి ముందు [[చంద్రగిరి]] దుర్గమునందున్న సోదరుడు, [[అచ్యుత రాయలు]] ను వారసునిగా చేసాడు.
 
==కులము==
శ్రీ కృష్ణదేవ రాయలు ఏ కులానికి చెందిన వాడన్న విషయంపై ఇతర కులాలవారి మధ్య అనేక వాదోపవాదాలున్నాయి. ఈయన కాపు, బలిజ, గొల్ల, బోయ <ref>[http://books.google.com/books?id=r-ffeWmj2JUC&pg=PA88&dq=krishnadevaraya+balija#v=onepage&q=krishnadevaraya%20balija&f=false Social Change Among Balijas: Majority Community of Andhra Pradesh By A. Vijaya Kumari]</ref>,<ref>[http://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2010/aug/13/edit/13edit4&more=2010/aug/13/edit/editpagemain1&date=8/13/2010 రాయలు బోయ వాడే! - గుంతలగారి శ్రీ నివాసులు, ఆంధ్ర జ్యోతి తెలుగు దినపత్రిక, ఆగస్టు13, 2010]</ref> కులాలకి చెందిన వాడని ఆయా కులాల వారు చెప్పుకుంటారు. ఇతని తండ్రియైన తుళువ నరస నాయకుడు చంద్ర వంశపు క్షత్రియుడు<ref>సర్దేశాయి తిరుమలరావు-ది హిందూ ఆంగ్ల దినపత్రిక</ref> <ref>యాదవాభ్యుదయ వాఖ్య - అప్పయ్య దీక్షిత</ref><ref>నరసభూపాలియము - భట్టు మూర్తి</ref><ref>అచ్యుతరాయాభ్యుదయము - రాజనాథ కవి</ref><ref>వరదాంబిక పరిణయం - తిరుమలాంబ</ref><ref>స్వరమేధకళానిధి - రామయామాత్య తొదరమల్ల</ref><ref>బాలభాగవతం - కోనేరునాథ కవి</ref><ref>వసుచరితము - భట్టు మూర్తి</ref><ref>విజయనగర సామ్రాజ్య మూలములు - యస్. కృష్ణస్వామి అయ్యంగార్ - మద్రాసు విశ్వవిద్యాలయము, 1919 </ref> అని పలు కవులు వ్రాసిన పద్యములు నిరూపించుచున్నవి. ఇప్పటికీ వీరి మూలాలు దక్షిణ భారతదేశమంతటా ఉన్నాయి.
 
==సమకాలీన సంస్కృతిలో==
పంక్తి 27:
*లెటర్ టు ద ఎడిటర్, డా.సర్దేశాయి తిరుమలరావు, ద హిందూ ఆంగ్ల దినపత్రిక
*హంపి నుండి హరప్పా దాకా -ఆచార్య తిరుమల రామచంద్ర,2013,జాతీయ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత
*"శ్రీ కృష్ణదేవరాయలు"-గుత్తి చంద్రశేఖర్ రెడ్డి, బళ్ళారి తెలుగు సంఘము, తెలుగు మహాసభల సంచిక
 
{{విజయ నగర రాజులు}}
పంక్తి 38:
==లంకెలు==
*http://shettyprasad.blogspot.in/2010/07/history-of-bunts.html
 
{{రాయల యుగం}}
 
{{టాంకు బండ పై విగ్రహాలు}}
 
<!-- categories -->
[[వర్గం:భారతదేశ చరిత్ర]]
[[వర్గం: ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర ]]
[[వర్గం:విజయ నగర రాజులు]]
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
 
{{రాయల యుగం}}
 
{{టాంకు బండ పై విగ్రహాలు}}
 
<!-- interwiki links -->