వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016: కూర్పుల మధ్య తేడాలు

→‎ప్రణాళికపై నా వ్యాఖ్యలు: మీరు చొరవ తీసుకోవడం చాలా అనందంగా ఉంది
పంక్తి 34:
ఈ ప్రణాళికపై చర్చిస్తున్న అందరికీ ధన్యవాదాలు. మిగిలిన సభ్యులందరు కూడా పాల్గొనాలని నా మనవి. ఇదివరకు ఇటువంటి ప్రణాళికపై నేను చర్చించకపోవటానికి కారణం, అనాసక్తితో పట్టించుకోకపోవటం లేదా ప్రాముఖ్యత గుర్తించకపోవటం మాత్రమే కానీ నిరసత్వం కానే కాదు. నేను సి.ఐ.ఎస్ కార్యక్రమాలలో ప్రత్యక్షంగా పాల్గొనలేదు కావున వాటి గురించి నాకు పెద్దగా ఏమీ అభిప్రాయాలు లేవు. పుష్కరోత్సవం ప్రణాళిక మరియు పనులు మాత్రం కాస్త ముందుగా మెదలుపెడితే బాగుంటుంది. ప్రాజెక్టులు చాలా ప్రతిపాదనలో ఉన్నట్టున్నాయి. ఇవి ప్రస్తుత వికీ స్థాయికి చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి. జాబితా తగ్గించకపోయినా, ఒక సంవత్సరం ప్రస్తుతం ఉన్నవాటితో పాటు, ఈ ప్రతిపాదిత ప్రాజెక్టులపై పనిచేస్తే బాగుంటుంది. వచ్చే ఏడాది దాకా కొత్త ప్రాజెక్టలు ప్రారంభించకపోతే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి మూడు రోజులకొకసారి మనం ఒక కొత్త ప్రాజెక్టు వైపు పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది. ఈ ప్రణాళిక విజయవంతం చేయటానికి నా వంతు సహాయసహాకారాలు అందించగలను --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 23:02, 2 ఏప్రిల్ 2015 (UTC)
* వ్యాసాల సంఖ్య అనే లక్ష్యాన్ని తీసెయ్యాలి. కొన్ని కొత్త వ్యాసాలు చేరటం ఎలాగూ జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని లక్ష్యంగా పెట్టుకోవటం అనవసరం పరిణామాలకు దారితీస్తుంది. దాని బదులుగా, చేర్చబడిన సమాచార పరిమాణమో, లేక విశేషవ్యాసాలో లక్ష్యంగా పెట్టుకుంటే మంచిది. దీనిపై మరికొంత వివరణ ఇక్కడ ([[వికీపీడియా:రచ్చబండ#ఇప్పటి వరకు(అనగా 30-3-2015 నాటికి) తెవికి లో ఎన్ని వ్యాసాలున్నాయి?]]) నా వ్యాఖ్యల్లో --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 03:31, 5 ఏప్రిల్ 2015 (UTC)
::[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] గారు మీరు ప్రణాళిక ప్రాముఖ్యతను గుర్తించి మీ సూచనలు, సహాయసహకారాలు అందిస్తాననడం ముదావహం. మీరు ప్రణాళిక విజయానికి చేయందిస్తాననడం మన ఈ ప్రణాళికకు మొదటి విజయం. --[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]]) 03:43, 5 ఏప్రిల్ 2015 (UTC)
Return to the project page "వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016".