వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016

మేకింగ్ డీఎల్ఐ యాక్సెసిబుల్

మార్చు

మేకింగ్ డీఎల్ఐ యాక్సెసిబుల్ ప్రాజెక్టు గురించి ఈ పేజీలో ప్రస్తావించడం జరిగింది. ఈ ప్రాజెక్టు మీ ప్రణాళికలో భాగమైనందున ప్రాజెక్టుకు మీ వంతుగా మరింత సహకారాన్ని ఆశించవచ్చని భావిస్తున్నాను. ఈ క్రమంలో డీఎల్ఐ జాబితా పేజీలు చూసేవుంటారు. ఈ పేజీల్లో వేలాది పుస్తకాలు జాబితావేశాము. కానీ కొన్నింటిలో డిస్క్రిప్షన్ భాగం చేర్చలేదు. ప్రాజెక్టులో విశేషంగా కృషిచేసిన మీనాగాయత్రి వంటి వాలంటీర్లు పుస్తకాలను జాబితా వేయడంలో తప్ప దాని డిస్క్రిప్షన్ ఫిల్ చేయడంలో ఆసక్తి చూపకపోవడం కారణం. కానీ ఇంతటి అనితర సాధ్యమైన కృషి చేసిన వాలంటీరుకు అదనపు బాధ్యతలు నెత్తికెత్తుకోమని కోరడం కన్నా వేరెవరినైనా అడగడం ఉత్తమమని భావించాను. మీరు ప్రస్తుతం లయోలా ఆంధ్రా కళాశాల విద్యార్థులను ఎంగేజ్ చేస్తున్న విషయమూ తెలిసిందే. గతంలో వీరేశలింగం సమగ్ర సాహిత్యాన్ని డిజిటైజ్ చేసినట్టుగా ఈసారి ఏదైనా థీం తీసుకుందామన్న ఆలోచన ఉంటే ఎలానూ మీ సక్సెస్ మెజర్లలో ఈ ప్రాజెక్టును ప్రస్తావించారు కనుక దీనిలోని కొంత భాగాన్ని స్వీకరించి పనిచేయిస్తే బావుంటుంది.--పవన్ సంతోష్ (చర్చ) 10:02, 29 మార్చి 2015 (UTC)Reply

పవన్ సంతోష్ గారు ఈ సూచనను తప్పకుండా పరిగణలోకీ తీసుకుందాము. ఇలాంటి పనిని ఆటోమేట్ చేసే విధంగా కన్నడ వికీపీడియనులు ఒక సరికొత్త ఇంటర్ఫేస్ తయారు చేస్తున్నారు. డీ.ఎల్.ఐ కి సరిపోయే విధంగా ఉంది అనుకుంటే ఆ ఇంటర్ఫేస్ గురించి కూడా ఆలోచిద్దాం. వైజాసత్య గారు కూడా మొత్తం డి.ఎల్.ఐ. తెలుగు పుస్తకాల జాబితా తేవడానికి ప్రయత్నిస్తానన్నారు, వారి సహకారం కూడా తీసుకుని ముందుకు వెళదాం. --విష్ణు (చర్చ) 03:20, 5 ఏప్రిల్ 2015 (UTC)Reply

లోతైన విశ్లేషణతో మరియు ప్రాధాన్యతలతో ప్రణాళికని బలోపేతం చేయాలి

మార్చు

2013,2014లో తెవికీ సవరణలు పరంగా మరియు పేజీ వీక్షణల పరంగా అభివృద్ధి జరిగింది. దీనికి రకరకాల ప్రాజెక్టులు, సభ్యుల సదస్సులు, శిక్షణ శిబిరాలు, సాంవత్సరీక వుత్సవాలు తోడ్పడివుంటాయి కనుక వీటికి, సిఐఎస్, వికీమీడియా ఫౌండేషన్ తోడ్పాటుని నా బ్లాగ్ లో ప్రస్తావించడం జరిగింది. సిఐఎస్ తోడ్పాటుకి ,కృషికి అభివందనాలు. అయితే కొత్త సంవత్సరానికి ప్రణాళిక చేసేటప్పుడు, ఇటువంటి పై స్థాయి విశ్లేషణ మరియు మొత్తం ప్రాజెక్టు సాధారణ గణాంకాలనే ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకోవడం సరిపోదు. ఇలాచేస్తే సిఐఎస్ బాధ్యత వహిస్తున్న విషయాలకి మరియు వాటివిలువకి స్పష్టత చేకూరదు. కొన్ని చర్చలలో ప్రస్తావించినట్లు, సిఐఎస్ అంటే తెవికీ , తెవికీ అంటే సిఐఎస్ అనే అనుమానం బలపడుతుంది.వ్యాస గణాంకాలనే లక్ష్యంగా పెట్టుకుంటే మొలక వ్యాసాలు పెరిగిపోవటం దానితో నాణ్యత దెబ్బతినటం జరుగుతుంది. అనుభవమున్న సభ్యులు వికీలో జరుగుతున్న లోటుపాట్లుని రచ్చబండలో తెలియచేస్తున్నారు.

ఉదాహరణలు
గతంలో స్వచ్ఛంద సభ్యులు చేసిన విశ్లేషణలు, లక్ష్యాలు

వనరులు, సామర్ధ్యం గల సిఐఎస్ పై సూచనలను మరియు స్వచ్ఛందంగా సభ్యులు చేసిన గత కృషిని పట్టించుకున్నట్లు లేదు. సమావేశాలలో కలిసిన సభ్యుల వ్యక్తిగత లక్ష్యాలకి తోడ్పాటు అవసరమున్నా లేకపోయినా ప్రధానంగా చేసుకోవడం సరియైన పద్ధతి కాదు. సిఐఎస్ తోడ్పాటు శాశ్వతం కాదు కాబట్టి, తెవికీ బలో పేతానికి ప్రాధాన్యతల వారీగా లక్ష్యం మరియు , దాని ప్రస్తుత స్థాయిని నిర్ణయించడం, వాటిలో వ్యక్తిగతంగా సభ్యులు చేయలేనివాటిని గుర్తించడం , వికీలో చర్చల ద్వారా వాటిగురించి ఉత్ప్రేరకంగా పనిచేయడం మంచిది.దీనికొరకు సిఐఎస్ తనవంతు తోడ్పాటుగా ప్రణాళికని పటిష్టం చేయవలసివుంది. కనుక ప్రణాళికని ఆ దిశగా అలోచించి తగిన మార్పులు చేయవలసినదిగా కోరుచున్నాను. --అర్జున (చర్చ) 06:25, 31 మార్చి 2015 (UTC)Reply

అర్జున గారు నమస్కారం. మీరు మొదటి నుండీ ప్రణాళికలను పరిశీలించి సూచలు ఇవ్వాడంలో కృషి చేస్తున్నారు. ఇది చాలా అనందించదగిన విషయం. మిగతా సభ్యులు కూడా ఇలాగే చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాను. మీరు ఇచ్చిన సూచనలపై మరి కొన్ని వివరణలు త్వరలోనే ఇక్కడ పొందుపరచగలను. ఈ ఆలస్యానికి క్షంతవ్యుడను.--విష్ణు (చర్చ) 03:30, 5 ఏప్రిల్ 2015 (UTC)Reply
అర్జున గారు మీరు ఇచ్చిన సూచన మళ్ళీ మళ్ళీ చదివిన తరువాత కూడా ప్రస్పుటంగా అర్ధమవలేదు. కనుక అర్ధమయినంతలో వివరణలు ఈ క్రింద పొందు పరుస్తున్నాను. మీరు ఇచ్చిన సూచనలో ఇంకా ఏ అంశాన్నైనా పరిగణలోకి తీసుకోని పక్షంలో మీరు దయచేసి మళ్ళీ ప్రస్తావించగలరు.
  • విశ్లేషణ-గణాంకాలు: ప్రణాళికలో పొందుపరచిన విశ్లేషణ తెవికీ మొత్తానికి సంబందించింది. గత సంవత్సర ప్రగతిలో మనందరి సమిష్టి కృషి ఉంది. సీ.ఐ.ఎస్-ఏ.2.కె కేవలం ఒక కాటలిస్ట్ ప్రోగ్రాం మాత్రమే అని మనందరం దృష్టిలో ఉంచుకోవలసిన విషయం. ఉదాహరణకి తెలుగు ప్రణాళిక లాగే, సీ.ఐ.ఎస్-ఏ.2.కె కన్నడ, ఒడియా ప్రణాళికల ద్వారా ఆయా వికీ సముదాయాలతో వికీ ప్రగతికై కృషి చేసింది. అలా అని ప్రతీ భాషా ప్రణాళికల వలన ఒకే విధమైన ప్రభావం కనిపించలేదు. ఆయా వికీ సముదాయాల బలాలు, బలహీనతలు, అవసరాలు; ఆ భాషా, ప్రాంత, సాంకేతిక స్థితిగతులు; ఇవన్నీ కూడా సీ.ఐ.ఎస్-ఏ.2.కె ద్వారా వచ్చిన వనరుల, కార్యక్రమాల వినియోగాన్ని వాటి ద్వారా వికీకి చేకూరే ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ఇక సీ.ఐ.ఎస్-ఏ.2.కె పూర్తి స్థాయిలో చేపట్టిన కార్యక్రమాల ఫలితాలు ఆయా ప్రాజెక్టు పేజిల ద్వారా తెలుపుతూనే ఉన్నాము. మచ్చుకు ఆంధ్ర లయోల కళాశాలలో మొదలు పెట్టిన ఒక ప్రాజెక్టు చూడండి. ఇక గణాంకాల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా వికీమీడియా ఫౌండేషన్ వారి సూచన మేరకు అనేక వికీ చాప్టర్లు, సమూహాలు పాటించే గ్లోబల్ మెట్రిక్స్ మనం కూడా వాడాము. అలాగే ప్రణాళికలో ప్రతి కార్యక్రమానికి లక్ష్యాలను ఈ గ్లోబల్ మెట్రిక్స్ కి అనుగుణంగా సూచించడం జరిగింది.
  • //కొన్ని చర్చలలో ప్రస్తావించినట్లు, సిఐఎస్ అంటే తెవికీ , తెవికీ అంటే సిఐఎస్ అనే అనుమానం బలపడుతుంది// ఇలాంటి చర్చల లంకెలను జతపరచండి. ఒక వేళ ఎవరైన కొత్త వికీపీడియనులు అలా అనుకుంటే వారికి వివరణ ఇస్తే సరిపోతుంది.
  • లక్ష్యాలు: మీరు బహుశా ప్రణాళిక మొత్తం చదివినట్టు లేదు. ప్రణాళిక లక్ష్యం తెవికి ని వాసి పరంగా రాశి పరంగా పెంపొందించడమే. కేవలం వ్యాసాలే లక్ష్యంగా పెట్టుకొని ఉంటే మనమీపాటికి 10 లక్షల వ్యాసాలు సునాయాసంగా దాటి ఉండేవాళ్ళం. తెవికీలో మొలక వ్యాసాలు ఎంత తగ్గాయో వైజాసత్యగారు విశ్లేషిస్తూ రచ్చబండలో కూడా పెట్టారు. తెవికీని నాణ్యతా పరంగా అభివృధ్ధి ఇంకా చేయాల్సి ఉంది దీనికి ఈ ప్రణాళిక కూడా కట్టుబడి ఉంది అందుకు గాను కొన్ని కార్యక్రమాలను అనుకున్నాం. ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో వాటిని ఎలా ఆచరణలో పెట్టాలో మీరు తెలియజేస్తే బాగుంటుంది.
  • తెవికీ లోటుపాట్లు: కొత్త సభ్యులు రావడం, వారికి తెవికీ పాలసీలు అర్థమవడంలో సమయం పట్టడం కొంత నాణ్యత దెబ్బతినడం, వాటిని మనం సరిచేసుకుంటూ వారికి నియమాలు తెలియజేస్తూ ముందుకుపోవడం ప్రతీ వికీ ప్రాజెక్టు ప్రగతికి సర్వసాధారణం. నాణ్యత దెబ్బతింటుందని కార్యక్రమాలు చేయకుండా, కొత్త సభ్యులు రాకుండా ఏ వికీ కూడా ప్రగతి సాధించలేదు కదా. అలా అని నాణ్యతపై ఈ ప్రణాళిక శ్రధ్ధ తగ్గించలేదు.
  • గతంలోని సభ్యులు సూచించిన లక్ష్యాలు: మీరు ఇచ్చిన లంకెలోని లక్ష్యాలు, ఇతర సభ్యుల సూచనలు చాలా వరకు గత సంవత్సర ప్రణాళికలనే కాకుండా ఈ ప్రస్తుత ప్రణాళికను రూపొందించడంలో ఎంతో దోహదపడ్డాయి. వీలైనంతవరకు ఆచరణ సాధ్యమైన ఆంశాలు ప్రణాళికలో ఉంచడం జరిగింది. ఇంకా ఏవైనా చేర్చాలి అంటే మీరు సూటిగా తెలుపగలరు. మీ, ఇతర సభ్యుల సూచనల ఆధారంగా ప్రణాళికను తప్పకుండా మరింత మెరుగు పరచి తెవికీని ముందుకు తీసుకువెళదాం.
  • ఈ ప్రణాళికను ఒక వేళ అమలు పరిస్తే, ప్రతీ మూడు నలెలకి ఒకసారి, జరిగే ప్రగతిని మీరు విశ్లేషిస్తే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. నా ఈ అభ్యర్థనను మన్నిస్తారని ఆశిస్తున్నాను. --విష్ణు (చర్చ) 10:28, 10 ఏప్రిల్ 2015 (UTC)Reply
  1. CIS-A2K కృషి ప్రారంభించి రెండేళ్ల తరువాత కూడా సభ్యులు ప్రణాళికా చర్చలలో ఎక్కువగా పాల్గొనడం లేదంటే అది ఒకలోటుగా మీకనిపించడం లేదా? దానికి కారణాలు విశ్లేషించితే బాగుంటుంది.
  2. నా స్పందన ఉదాహరణలతో ఇచ్చినందున, అర్థం చేసుకోవటం అంత కష్టంకాదు అనుకుంటాను.
  3. శైశవంలో వున్న ప్రాజెక్టులకి మొత్త గణాంకాలను ఉదహరించితే పెద్ద ఇబ్బంది వుండదు. కాని కొంతవరకు క్రియాశీలంగా వున్న తెలుగు వికీ ప్రాజెక్టులకు, మొత్తం గణాంకాలను మీ ప్రణాళిక కృషికి ప్రత్యక్ష గణాంకాలుగా వాడడం సరికాదు. దీనివలన స్వచ్ఛందంగా కృషి చేస్తున్న వికీ వాడుకరుల కృషి మరుగున పడే అవకాశముంది. దీనికి ఉదాహరణగా వికీసోర్స్ ప్రణాళిక చర్చ విభాగము చూడండి. ఇక వికీపీడియా లో CIS-A2K కార్యక్రమాల గురించి మరింత తెలుసుకోటానికి మరల మరల ప్రయత్నించి సమగ్రమైన పేజీలు కనబడక నేనే ఒక సమగ్రపేజీ ప్రారంభిం చాను. దానిని విస్తరించండి. ఇక మీరు మచ్చుకి చూపించిన గణాంకాలు కూడా ఒక పట్టికలాగా వుండి పెద్ద ఉపయోగపడేదిగాలేదు. CIS-A2K సారధ్యంలో నడిచిన ప్రాజెక్టులు ఎన్ని, ఏవి బాగా నడిచినవి, ఏవి నడవలేదు.లోటుపాట్లు ఏమిటి అనే తెలిపే వివరమైన సమాచారం తెలిపితే ప్రణాళికని సమీక్షించడం సులువుఅవుతుంది.
  4. // ఇలాంటి చర్చల లంకెలను జతపరచండి. ఒక వేళ ఎవరైన కొత్త వికీపీడియనులు అలా అనుకుంటే వారికి వివరణ ఇస్తే సరిపోతుంది.//వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_39#ఎందుకు జరిగింది లో సభ్యులు వ్యక్తంచేసిన అభిప్రాయాలు చూడండి. వీటిని సరిదిద్దడానికి వివరణ సరిపోదు, సిఐఎస్-ఎ2కె ప్రణాళికలో మరియు అమలులో చాలా మార్పు కావాలి.
  5. వ్యాసాల వాసి పరంగా ఏ విధంగా తెవికీ అభివృద్ధి చెందిందో తెలియలేదు. మొలకలు తగ్గించడమే, వ్యాసాల సంఖ్యను పెంచడాన్ని నాణ్యతను పెంచడం అనుకుంటే, ఆ తగ్గించిన విధానం సరిగా లేకపోవడాన్ని సభ్యులు ఎత్తిచూపడం తద్వారా వైజాసత్య గారు మరల గ్రామ వ్యాసాలగురించి, మరియు వ్యాసాల సంఖ్య లక్ష్యం గురించిచూడండి.
  6. నేను పైన తెలిపిన మూడు సూచనలకి ప్రాధాన్యత నివ్వకుండానే సభ్యుల సూచనలు ఆధారంగా ప్రణాళికని మెరుగుపరచి తెవికీని ముందుకి తీసుకెళదాం అనడం దాటవేసేటట్లుగా వున్నది.
  7. "సమావేశాలలో కలిసిన సభ్యుల వ్యక్తిగత లక్ష్యాలకి తోడ్పాటు అవసరమున్నా లేకపోయినా ప్రధానంగా చేసుకోవడం సరియైన పద్ధతి కాదు."అన్న వ్యాఖ్యని మరింత వివరంగా తెలియచేసిన పవన్ వ్యాఖ్యలకు ఇంతవరకు స్పందనకూడా లేదు. అయినా గతసంవత్సరాల ప్రణాళికలు అమలుగురించి కొన్ని వ్యాఖ్యలు వేరే విభాగాలలో చేరుస్తాను. వాటి గురించి ఆలోచించండి.
  8. సంవత్సరాంత విశ్లేషణ వివరాలే సరిగా లేనప్పుడు, ప్రతిమూడు నెలలకు ప్రగతిని విశ్లేషించమని కోరడం వింతగా వుంది.--అర్జున (చర్చ) 10:59, 16 ఏప్రిల్ 2015 (UTC)Reply
అర్జునగారు కొన్ని వివరణలు మీరడిగిన క్రమంలో పొందుపరుస్తున్నాను
  1. ప్రణాళికా చర్చలలో తెవికీ సభ్యులు మిగతా వికీమీడియా సముదాయాలతో పోల్చితే చురుకుగానే పాల్గొంటున్నారని నా అభిప్రాయం. ఇది గత రెండు సంవత్సరాలలో నేను చూసినంతలో మెరుగవుతూనే ఉంది. వార్షికోత్సవాల చర్చల ఆధారంగా ఈ ముసాయిదా ప్రణాళికలోకి కార్యక్రమాలు చేర్చడం జరిగింది.ఆ సమావేశానికి హాజరైన సభ్యులందరూ దాదాపు చర్చలలో పాల్గొన్నారు. ఇక పోతే ఇక్కడ ఆన్-వికీ చర్చలో పాల్గొనలేకపోవటానికి బహుశా ఈ కారణాలనుకుంటున్నాను. సూక్ష్మ స్థాయిలో ప్రణాళికలోకి వెళ్ళి విశ్లేషణ చేసే సమయం వెచ్చించలేకపోవచ్చు, ఇతరత్రా సూచనలు లేకపోవచ్చు, ఉత్సుకత లేకపోవచ్చు, ప్రణాళికలపై ఆసక్తి తక్కువ కావచ్చు, ప్రణాళిక ఫరవాలేదని ఉండవచ్చు, వారికి ఈ చర్చలు ప్రాముఖ్యం కాకపోవచ్చు. ఇవి కేవలం తెవికీకే కాదు ప్రతీ వికీ సముదాయినికి వర్తిస్థాయి. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షలమంది ఆంగ్ల వికీపీడియనులు ఉన్నారు వారిలో 30 వేలకు పైనే, కాని proportionate గా చూస్తే చాలా తక్కువమంది పాలసీ చర్చలలో, గ్రాంటు చర్చలలో, ప్రణాళికా చర్చలలో పాల్గొంటున్నారు.
  2. ఈ వ్యాఖ్యకు తగు నేపధ్యం మీరివ్వలేదు. అలానే గణాంకాల విషయంలో మీరు చెప్పిన విషయాలు, సూచనలు చేసినట్టు చేసిన విషయాలు, ఆచరణా పరంగా ఏం చేస్తే బావుంటుందన్న విషయాలు స్పష్టంగా లేవు. ఇది బాగా లేదు అంటున్నారే తప్ప, ఏది బాగాలేదు, దానిని ఎలా మెరుగుపరచాలి, అందుకు సమూహం నేపధ్యం ఏమిటి, సీ.ఐ.ఎస్-ఏ.2.కే ఏం చేయగలదు అన్న విషయాలలో స్పష్టత ఇస్తే మనం తప్పకుండా వాటి అమలుకు ప్రయత్నించవచ్చు.
  3. సమగ్ర పేజి మొదలు పెట్టినందులకు ధన్యవాదాలు. ఏ.2.కె సంబంధిత కార్యకలాపాలన్నీ మెటాలో నిక్షిప్తం చేస్తూనే ఉన్నాం. మెటాలో ఏ.2.కె పేజికి వెళ్లగానే అన్ని ముఖ్యమైన పేజీలకు గాను లంకెలు కనపడతాయి. గత సంవత్సరంలో ఏ.2.కె కార్యకలాపాలకు సంబందించి మేటాలో డాక్యుమెంటేషను గణనీయంగా విస్తృతించడం జరిగింది. ఏ.2.కె. కార్యకలాపాలకు సంబందించి ముఖ్యంగా ఈ రిపోర్టు పేజి, ఈవెంట్స్ పేజి, రిక్వెస్ట్ పేజి లు చూడండి. వీటి మెరుగుకై సూచనలు తెలియజేయగలరు. తెలుగుకి సంబందించిన కార్యకలాపాలు తెవికీలో పెట్టటానికి కృషి చేస్తూనే ఉన్నాం. కాకపోతే మెటాలో ఉన్నంత సమగ్రంగా తెలుగులో ఏ.2.కె సమాచారం పొందుపరచడం జరగలేదు.
  4. ఆ వ్యాఖ్యలో ఏ.2.కె ఉద్యోగులపై తెలిపిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది.అంతర్గతంగా చర్చ చేయడం జరిగింది, ఆ పాఠాలనుండి మెరుగు చేసుకోవడానికి ఏ.2.కె ఉద్యోగులు కృషి చేస్తారు.
  5. తెవికీ లో సముదాయ నిర్ణయం ప్రకారం గ్రామ్య వ్యాసాలు మొలకల కింద లెక్కచెయ్యకూడదని చర్చ జరిగిన విషయం మీకు తెలిసిందే. ఇక వాసి పరంగా మొలకల శాతం తగ్గించడానికి ప్రస్తుతం వాడుతున్న నెలవారీ ఎవరి మొలకల బాధ్యత వారిది అన్న కృషి మిశ్రమ ఫలితాలనిచ్చింది. దానిని ఇంకా మెరుగు పరచుకోవాలి. అలాగే ఎ.2.కె నిర్వహించిన శిక్షణా శిబిరాలలో కొత్తవాడుకరులకు నాణ్యతపై ఎక్కువ అవగాహన ఇవ్వడానికి ప్రయత్నం చేసాం.ఒక మోడల్ వ్యాసంలో ఉండాల్సిన నిడివి, కనీసం రెండు మూలాలు, దస్త్రాలు ఉంచడం, పరిశోధన-రిసోర్సెస్ ఆవశ్యకత ఇవన్నీ కూడా ఎ.2.కె ఇచ్చే శిక్షణలో కొత్త వాడుకరులకు తెలియజేయటం జరుగుతుంది. అలాగే తెవికీ లో వున్న భౌతిక శాస్త్రం, సాంఖ్యాశాస్త్రము, వృక్ష శాస్త్రాలలో ఉన్న వ్యాసాల నాణ్యతను బేరీజు వేసే విధంగా ఆంధ్రా లయోలా కళాశాల విద్యార్థులతో ఒక స్టడీని రూపొందించాము. వాటి ఫలితాలను త్వరలోనె తెవికీలో ఉంచి వాటి నాణ్యతను పెంచే దిశగా పనిచేయడానికి అందిరి సూచనలతో ముందుకు వెళ్దాం. ఇక గ్రామ వ్యాసాల నాణ్యతాపరమైన అభివృద్ధికి కూడా ప్రభుత్వం వారి వద్దనున్న డేటా ద్వారా నాణ్యతా పరంగా అభివృద్ధికి ఈ ప్రణాళిక కృషిచేస్తుంది. మరిన్ని సూచనలు ఉంటే ఇవ్వగలరు.
  6. లేదండీ, అలా దాటవేయలనే విధంగా ఏ.2.కె ఎప్పుడూ పని చేయలేదు. It's not our work ethics. Please assume good faith that everyone in the A2K team has a serious and committed intent to serve and contribute to the Wikimedia movement. Just because we are paid professionals you cannot question our work ethics. పైన మీరిచ్చిన ఇచ్చిన మూడు సూచనలకు దయచేసి ఆచరణాత్మకంగా ఏం చేయాలో తెలుపగలరు. ఈ విధంగా ఒక కార్యక్రమం/ప్రాజెక్టు చేపడదాం, దానికి ఇలా పని చేద్దాం, సముదాయ సభ్యులు ఎలాంటి కృషి చేయాలి, ఏ.2.కె నుండి ఎలాంటి సహకారం కావాలి, ఇతర అవసరాలు ఉంటే వాటిని ఎలా చేపట్టాలి అని స్పష్టంగా తెలియజేస్తే, వాటిని ప్రణాళికలో చేర్చవచ్చు.
  7. క్రింద పవన్ వ్యాఖ్యలకు విపులంగా వివరణ ఇవ్వడం జరిగింది.
  8. క్రింద పవన్ కి ఇచ్చిన వివరణలో దీనిపై స్పందించడం జరిగింది. ఇప్పుడిచ్చిన విశ్లేషణ వివరాలు ఏ విధంగా సరిగా లేవో తెలుపగలరు. ఫలానా వివరాలు లేవు, ఫలానా వివరాలు తప్పుగా ఉన్నాయి అని తెలియపరిస్తే స్పష్టత వస్తుంది.--విష్ణు (చర్చ) 07:28, 18 ఏప్రిల్ 2015 (UTC)Reply

చర్చలలో క్రియాశీలత

మార్చు

నా దృష్టిలో మీ అభిప్రాయం వ్యక్తిగతమైనదిగా వుంది.ఇక కారణాలకి మీరు చెప్పినది ఊహగానాలే కాని ఆధారమైన మూడవ వ్యక్తి/వ్యక్తుల నుండి సేకరించిన సర్వే కాని నిష్పాక్షికమైన గణాంకాల విశ్లేషణ గాని లేవు. చర్చలలో క్రియాశీలత చాలా వాటివై ఆధారపడుతుందని అంగీకరించినా, ప్రాజెక్టుని బట్టి ఉన్న క్రియాశీలత సరియైన స్థితిలో వున్నదా అనిపరిశీలిస్తే నా 5 సంవత్సరాల అనుభవంలో లేదని తెలుస్తుంది. ఇదే విషయం ఇటీవలి రచ్చబండ చర్చలలో వికీ సంబంధిత విషయాలకి, నిర్ణయాలకి ఆఫ్లైన్ సమావేశాలు ప్రధానం కావటాన్ని పలువురు ఆంగీకరించడం మరియు దానిని దిద్దడానికి ప్రయత్నాలు సహసభ్యులు ప్రారంభించడం చూశారనుకుంటాను.ఇటువంటి చర్యలకు సిఐఎస్-ఎ2కె సహకరిస్తే బాగుంటుంది.--అర్జున (చర్చ) 23:46, 25 ఏప్రిల్ 2015 (UTC)Reply

విశ్లేషణ, గణాంకాలు

మార్చు

ఇక గత సంవత్సరం ప్రగతి , లోటుపాట్లు గురించి విశ్లేషణకు స్పష్టత లేదంటున్నారు. కాని మీరు పవన్ సంతోష్ చర్చాంశానికి ఇచ్చిన 2012లో నా విశ్లేషణకు స్పందన చూస్తే విశ్లేషణ దిశగా ఆలోచించారనిపిస్తుంది.అయితే ఒకపక్క, సిఐఎస్-ఎ2కె వికీపీడియా సముదాయాన్ని వేరుగా భావించలేదన్నారు కాబట్టి మొత్తం వికీపీడియాలో కృషిని నాలాగా విశ్లేషించాలి కదా. అలాచేయకపోగా , మీ ప్రణా‌ళికా కృషివిశ్లేషణకూడా సరిగా లేదే? మరింత లోతైన విశ్లేషణ ఎలా చేయాలో అర్ధమవటానికి వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీ_శిక్షణ_శిబిరాలు ప్రారంభించి వివరాలు చేర్చమని కోరితే, సిఐఎస్-ఎ2కె నుండి లింకులు ఇవ్వడం తప్ప చేర్చడం జరగలేదు. దీనిని బట్టి చూస్తే మీకు ఇది ప్రాధాన్యత విషయం కాదనిపిస్తున్నది. --అర్జున (చర్చ) 23:55, 25 ఏప్రిల్ 2015 (UTC)Reply

సర్వే గురించి మరింత వివరం

మార్చు

ఇప్పటివరకు జరిగిన స్వచ్ఛంద కార్యక్రమాలు మరియు సిఐఎస్-ఎ2కె, అందుబాటులో గల తెవికీ సంపాదకుల ఆలోచనలు అధారంగా రూపొందించబడ్డాయి. సంపాదకులు వందలలో లెక్కించవచ్చు కాని చదువరులు లక్షలలో వుంటారు. వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి అనే నా అభిప్రాయం కోరిన వారికి ఎప్పడినుండో తెలుపుచున్నాను. ఈ దిశగా వికీమీడియా ఫౌండేషన్ సర్వే చేసిందని నా దృష్టికి వచ్చిన తరువాత తెలుగు వికీకి ఉపయోగమైన అంశాలేమైనా వుంటాయేమోనని ప్రయత్నించాను. అయితే సర్వే రూపొందించడం మరియు అమలు చేయడంలో లోపాలు కారణంగా పెద్దగా ఉపయోగమైన సమాచారం కనబడలేదు. తెలుగు ముఖ్యంశాంగా పనిచేస్తున్న సిఐఎస్-ఎ2కె ఈ సర్వేని ఫలవంతం చేయడానికి కృషి ఎందుకు కృషి చేయలేదో అర్ధం కాలేదు.ఇకముందైనా ఇటువంటి చర్య మీ ప్రణాళికలో భాగం చేస్తారా?--అర్జున (చర్చ) 00:09, 26 ఏప్రిల్ 2015 (UTC)Reply

తెలుగులో సిఐఎస్-ఎ2కె ప్రణాళికా ప్రతిపాదనలు,నివేదికలు

మార్చు

సిఐఎస్-ఎ2కె ప్రణాళికా ప్రతిపాదనలు,నివేదికలు తెవికీలో తెలుగులో సమగ్రంగా లేవని అంగీకరించినందులకు ధన్యవాదాలు. సిఐఎస్-ఎ2కె తెలుగు వికీకొరకై పనిచేస్తున్నప్పుడు ఇకనైనా తెలుగు వికీలో లో సమగ్రంగా సమాచారం వుంచడానికి కట్టుబడి వుంటుందని హామీ ఇస్తే బాగుంటుంది.--అర్జున (చర్చ) 00:15, 26 ఏప్రిల్ 2015 (UTC)Reply

గ్రామ వ్యాసాలు, మొలకలశాతం

మార్చు

గ్రామ వ్యాసాలలో మొలక అన్న మూస పెట్టకూడదనే నియమం పాటిస్తున్నా మొలకలశాతం గణాంకాలలో అవి పరిగణించబడతాయి. ఎవరి మొలకల అభివృద్ధి వారిదే సూత్రం మిశ్రమ ఫలితాలనిచ్చింది అంటున్నారు. మరింత విశ్లేషించి తెలపండి. సమిష్టి కృషి, సహకారం మూల స్తంభాలు గల వికీపీడియాలో ఇటువంటి మార్గదర్శకాన్ని వాడకుండావుంటేనే సభ్యులకి వికీవిలువలు తెలుస్తాయని నా నమ్మకం.ఇక ఆంధ్రలయోల కళాశాల కృషి గురించి వేరేగా రాస్తాను. --అర్జున (చర్చ) 00:44, 26 ఏప్రిల్ 2015 (UTC)Reply

సూచనలను దాటవేయడం, మంచి విశ్వాసం

మార్చు

నేను సిఐఎస్-ఎ2కె ప్రారంభంనుండి మీతో వ్యవహరించిన తీరుని ప్రశంసించిన మీరే మంచి విశ్వాసం (WP:AGF) ని వాడడం విచిత్రంగా వుంది.రెండున్నర సంవత్సరాల అనుభవం వున్న మీరు నా సూచనలని, పైన ఇచ్చిన మరింత వివరాన్ని ఇకనైనా సరిగా అర్థం చేసుకుంటారని ప్రయత్నిస్తారనుకుంటాను. సంస్థాగతంగా పనిచేస్తున్న సభ్యులు సూచనలను ముందుకు తీసుకువెళ్లటానికి మరింత కృషి చేయకుండా సూచనలు ఇచ్చినవారినే మరింత వివరణలను అరటిపండు వలిచి చేతిలోపెట్టమన్నట్టుగా కోరటం సంస్థకు ప్రతిష్ట చేకూర్చదు. అటువంటప్పుడు సంస్థాగత కృషి విలువనీయదు. --అర్జున (చర్చ) 00:56, 26 ఏప్రిల్ 2015 (UTC)Reply

ప్రతిపాదనల స్పష్టత కావాలి. పూర్వానుభవాల పాఠాలు వాడాలి

మార్చు
  • వికీలో ప్రస్తుతం జరుగుతున్న, జరగబోతున్న(ముందుగా కమ్యూనిటీ చర్చల్లో భాగంగా ప్రణాళిక వేసుకోగా తెలిసినవి) ప్రాజెక్టులను ప్రణాళికలో నేరుగా చేర్చి చివరకు తెవికీలో జరుగుతున్న ప్రతి స్వచ్ఛందమైన అభివృద్ధినీ, కృషినీ సీఐఎస్ చేసిన కృషిగా చూపడం అంత సమర్థనీయంగా తోచట్లేదు. ఇలా చేయకూడదని ఎక్కడా లేకపోయినా ఇది మీ నిజమైన కృషిని అంచనా కట్టేప్పుడు ఇబ్బంది కలుగుతుంది. అంతగా ఉపకరించదు. ఉదాహరణకు అన్నమయ్య గ్రంథాలయం ఇన్స్టిట్యూషనల్ పార్ట్నర్షిప్ లో భాగంగా దాని కాటలాగును అందజేసిందని వ్రాశారు. ఇది సిఐఎస్-ఎ2కె కృషిలో భాగంగా రావడం ఆశ్చర్యకరం. ఎందుకంటే అందుకు వికీమీడియా ఫౌండేషన్ నుంచి నేరుగా తీసుకున్న గ్రాంటు పనుల్లో భాగంగా ట్రావెల్ వంటి ఖర్చులు వినియోగించుకుని విశ్వనాధ్.బి.కె. శ్రమించి తీసుకువచ్చారని ఇక్కడ చర్చల్లో తెలుస్తోంది. పైగా విశ్వనాధ్ గారిని ఆ గ్రంథాలయం ఎంచుకోమని చెప్పినదీ, కొన్ని పరిచయాలను ఆయనకి ఇచ్చింది కూడా నేను కావడంతో అది ఇక్కడ నేరుగా చోటుచేసుకోవడం విస్మయాన్నే కలిగించిందని చెప్పాలి.
  • ముఘల్ చక్రవర్తుల ప్రాజెక్టుకు సీఐఎస్-ఎ2కె వారు ఏ విషయంలో సహకరిస్తారో సుస్పష్టంగా చెప్పలేదు. షార్ప్ ప్రతిపాదనగా కాక అది చాలా వేగ్ ప్రతిపాదనగా ఉంది. Create articles on Mughal empire and most famous mughal emperors and Make the articles available to Telugu Wikipedians who can further develop these and create articles on Telugu Wikipedia అంటే తెవికీలో కాక ఎక్కడైనా వీటిపై వ్యాసాలు రాసి వాటిని మూలాలుగా ఇస్తారా? Develop a basic article structure/template అన్న పని కొందరు తెవికీపీడియన్లు చాలా సమర్థంగా చేస్తూన్నారు. ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే రాజశేఖర్, సుజాత గార్లు నాతో మాట్లాడారు. ఎవల్యూషన్ ఫ్రేంవర్క్ ఇప్పటికే మాస్థాయిలో మేము కొన్ని ప్రాజెక్టులకు ప్రారంభించాము. వాటికి అర్జునరావు గారి వంటి అనుభవశాలి ఐన వికీపీడియన్ తనవంతుగా ఆ ప్రయత్నాన్ని సమీక్షించి సూచనలు కూడా చేశారు. ఈ ప్రాజెక్టుకు అవి అలానే సముదాయం స్వచ్ఛంద కృషిలో భాగంగా వికీపద్ధతిలో అభివృద్ధి చేసుకుంటుంది. ఈమాత్రానికి సీఐఎస్-ఎ2కె వారి విలువైన వనరులు, పనిగంటలు వినియోగించనవసరం లేదు. కథానిలయం ప్రాజెక్టు, లంబాడీ-బంజారా ప్రాజెక్టు, సినిమాల ప్రాజెక్టు, తెలుగు గ్రామాల ప్రాజెక్టుల విషయంలోనే కొంత స్పష్టమైన ప్రతిపాదనలు ఉన్నాయి. ఐతే వాటిలోనూ కొన్నింట్లో ఆర్టికల్ స్ట్రక్చర్, టెంప్లేట్ మరియు ఎవల్యూషన్ ఫ్రేం వర్క్ అంటూ మళ్లీ పైన ఇచ్చిన పనులను కూడా జోడించారు. వికీపీడియన్లకు ఆర్టికల్ స్ట్రక్చర్ రాకపోవడం అన్న సమస్యే ఎదురుకాదు. పైగా ప్రాజెక్టులను నడుపుతామని ముందుకువచ్చిన వారు నేను(సినిమాల ప్రాజెక్ట్), సుజాత గారు(మొఘల్ చక్రవర్తుల ప్రాజెక్టు) ఈ విషయంలో మంచి కృషి చేసినవారమే. ఇప్పటికే కొన్ని సినిమాల విషయంలో విస్తారంగా నేను ప్రయోగాలు చేస్తూ సినిమాల వ్యాసాల స్ట్రక్చర్ పై నా స్థాయిలొ అవగాహన మంచిగా సాధించుకున్నాను.
  • తెవికీ పుష్కరోత్సవం సంగతి చూస్తే తెలుగు వికీపీడియా కమ్యూనిటీ తప్పనిసరిగా నిర్వహిస్తుంది. ఈసారి గతంలో తగిలిన ఎదురుదెబ్బలు నేర్పిన పాఠాలతో మరింత చక్కగా నిర్వహించుకుంటుంది. కాకుంటే దానిని సీఐఎస్-ఎ2కె ప్లానులో భాగంగా చేర్చడంలోని ఔచిత్యం నాకు తెలియడం లేదు. తెవికీ 11వ వార్షికోత్సవం ఆఖరి నిమిషంలో జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల అప్పటికప్పుడు సీఐఎస్-ఎ2కె వారి సహకారాన్ని అభ్యర్థించడం జరిగిందన్నది వాస్తవం. కార్యక్రమ నిర్వహణకు మౌలికావసరాల్లో ఒకటైన గ్రాంట్ అందించినందుకు, నిర్వహణలో తన పూర్తి సహకారం అందించినందుకు విష్ణు గారికి, కార్యక్రమానికి హాజరై విష్ణు గారికి సహకారంగా నిలిచిన తన్వీర్ కు ఇందుకు ధన్యవాదాలు. కాకుంటే మళ్లీ పుష్కరోత్సవాలకు ఇదే జరిగే అవకాశం లేదు. ఇలా జరిగినందుకు గల వివాదాస్పదమైన కారణాలూ నేను ఉద్ఘాటించబోవట్లేదు కానీ ఇది పునరావృతమవ్వాలన్నట్టుగా మీ ప్రణాళికలోనే దాన్ని చేర్చుకోవడం నాకు అర్థంకాలేదు.
  • ఇక వాడుకరులకు ప్రత్యేకమైన శిక్షణలు వికీ మీట్-అప్ లలో భాగంగా ఇస్తామని ప్రకటించారు. వికీ మీట్-అప్ ల విషయానికి వస్తే గత నెల వికీ మీట్-అప్ విషయం ప్రస్తావనార్హం. సీఐఎస్-ఎ2కె సమావేశానికి రెగ్యులర్ గా హాజరయ్యే వారిలో కొందరి అభిప్రాయాలు పట్టించుకోకుండా కార్యక్రమానికి వికీపీడియన్లపై గత వార్షికోత్సవాల సమయం నుంచి కొంత ఉద్వేగపూరితంగా ఉన్న ఒక ఉద్యోగిని పంపడం జరిగింది. తద్ఫలితంగా చివరకు ఏం జరిగిందన్నది విదితమే. నాకు అవగాహన ఉన్నంతవరకూ ఈ కార్యక్రమాలు కూడా ముగిసేది అలాగే. గతంలో నిర్వహించిన హాకథాన్ విషయంలో ఇటువంటి ఉద్రిక్తతలు ఏమీ లేకపోయినా చివరకు ఆశించిన ప్రయోజనాలేవీ నెరవేరక నిరాశతో వెనుదిరిగిన సభ్యుల్లో నేనూ ఉన్నాను. ప్రతి ప్రయత్నాలు ఫలప్రదమైపోవాలన్న ప్యూరిస్టునేమీ కాను నేను. కాకుంటే వైఫల్యాలను అంగీకరించాల్సిన అవసరాన్ని మాత్రం గట్టిగా నొక్కి చెప్తాను. వైఫల్యం అంగీకరించి దానిలోటుపాట్లు చర్చించి కొత్త వాటికి పునాదిగా వేసుకోవాలి. ఇక్కడ గుర్తించాల్సిన విషయం - ప్రత్యేకించి సీఐఎస్ ఒక నిపుణుడైన ఉద్యోగిని పంపుతున్నా పదే పదే ఇటువంటివే పునరావృతం కావడాన్ని అర్థం చేసుకోవాల్సివుంది. అందుకు నేను ఈ ప్రయత్నం ఫలప్రదం కావడంపై సందేహం వ్యక్తం చేస్తున్నాను. ఇంతకన్నా వైజాసత్య గారి వంటి వాలంటీర్లు తోటి వాలంటీర్ల అభ్యర్థనల మేరకు చేస్తున్న స్కైప్ సమావేశాలు సత్ఫలితాలిస్తున్నాయి. నేను మీ సమావేశాలు, ఆయన సమావేశాలూ కూడా చూశాను. సమయాన్ని ఏమాత్రమూ వృధా చేయకుండా అసందర్భమైన విషయాలు వదిలి సూటిగా విషయాన్ని మాత్రమే ప్రస్తావించే ఆయన శైలి నూటికి తొంభైపాళ్లు ఆ సమావేశాల సక్సెస్ కి కారణం.
  • తెవికీ సముదాయ సమావేశాల విషయంలోనూ పై సమస్యే నాకు కనిపిస్తోంది. సముదాయం సమావేశం నిర్వహించుకుంటూంటే ఏ సమస్యా తలెత్తట్లేదు. సీఐఎస్ నుంచి వృత్తిగతంగా ప్రోగ్రాం ఆఫీసర్ హాజరైనప్పుడే వివాదాలు రేకెత్తడమో, సమావేశం లక్ష్యాన్ని పక్కన పెట్టి వేరేవో మాట్లాడుకోవడమో జరుగుతోంది. దీనివల్ల పనిగంటలు, వనరులు వృధా అవ్వడం ఒక కోణమైతే కొన్నాళ్ళ దాకా పెట్టీన మంచి ప్రతిపాదనలకు కూడా సభ్యుల నుంచి చర్చలు కొరవడడం అత్యంత తీవ్రమైన విషయం. ఒక్కో సమావేశం దాదాపు తెవికీలో నెలలు నెలల పాటు అభివృద్ధి చేసుకుంటూ వస్తున్న సమతౌల్యాన్ని దెబ్బతీసేయడం, దాన్ని మళ్లీ నిర్మించుకోవడానికి చర్చలు సామాన్యం కావడానికి ఎన్నాళ్ళో పట్టడం గమనించాల్సిన విషయం. మార్చి 20 నుంచి దాదాపుగా వారంపైగా చర్చలు తగ్గుముఖం పట్టడమే కాక సముదాయంలో మంచి విషయాలనే నేను రెండు మార్లు చర్చకుపెట్టాలని చూసినా చర్చ సరిగా జరగకపోవడం, ఒకవిధమైన స్తబ్దత నెలకొనడం గమనించండి. పైగా ఇందుకు సముదాయానికి కెటలిస్ట్ గా సహకరించేందుకు ఉద్దేశించిన ప్రోగ్రాంకు సంబంధించిన వ్యక్తి ముఖ్య కారణం కావడం దుస్సహం. ఇదీ పూర్వానుభవాల నుంచి నేర్చుకోవాల్సిన పాఠమే. ఈ ప్రయత్నానికి అందుకే నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. వికీడేటా సెషన్ విషయంలోనూ దాన్ని ఏదో కమ్యూనిటీ మీట్-అప్స్ లో భాగంగా చేస్తామని వ్రాశారు. కమ్యూనిటీ మీట్ అప్స్ లో మేం చేస్తున్నదదే. గతంలో ఆసక్తి వున్నవారికి వీవెన్ అవగాహన కల్పించారు. భవిష్యత్తులోనూ కల్పిస్తారు. దీనికి మళ్ళీ బెంగళూరు నుంచి కొందరు శిక్షకులు రావాలా? రావాలంటే మంచిదేగా ముందు మౌలికమైన అవగాహనను మేం కలిగివున్నాకా ప్రత్యేకమైన శిక్షణ కావాలంటే పిలుస్తాము. కమ్యూనిటీ మీరనుకున్నంత అశక్తంగా లేదనే తలుస్తాను.
  • సాహిత్యం ప్రాజెక్టు తీర్చిదిద్ది, ప్రస్తుతం పత్రికల ప్రాజెక్టులో నావంతు కృషిచేస్తున్నవాడిగానూ, గత ఎనిమిది నెలలు వేలకొద్దీ పుస్తకాల్లో ఈదులాడినవాడిగానూ నాకు సాహిత్యం పోర్టల్ విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. కాకుంటే ఇప్పటికీ ఎన్సైక్లోపిడిక్ వాల్యూ ఉన్న పుస్తకాలూ, రచయితలు తెలుగు వికీపీడియాలో ప్రస్తావనకు సైతం నోచుకోలేదన్నారు. దీనికి ఎక్కడైనా ప్రాతిపదికను సుస్పష్టంగా నిరూపించారా? లేక సాధారణమైన జనరలైజేషన్ వాక్యమా? ఈ దిశగా సీఐఎస్ పెద్ద ఎత్తున ఎక్కడైనా ఓ సర్వేనో మరేదైనానో చేసివుంటే చెప్పండి నాకు ఉపకరిస్తుంది. సీఐఎస్ ప్రొవైడ్స్ రీసోర్సెస్ అంటే ఏమిటి? ఏ రీసోర్సెస్? ఒకవేళ కథానిలయం నుంచి వచ్చే సమాచారమేనా ఏమిటి? బ్లాగులు, ఫేస్ బుక్ ద్వారా పబ్లిసైజ్ చేసే పని సీఐఎస్ మాత్రమే అక్కర్లేదు నావంటివాడో, లేక విశ్వనాథ్ లాంటివారో చేసెయ్యొచ్చు. ఈ పనిలో సీఐఎస్ వనరులు, పనిగంటలు వినియోగించి ఏదైనా చేయాలనుకుంటే జాతీయ మీడియాలోకి తీసుకురావడం చేయవచ్చు. అందుకు సరిఅనుకుంటే ప్రతిపాదనలో బ్లాగులు, సోషల్ మీడియా వంటివి తీసేసి ఆ మాట వ్రాయండి.
  • పాలసీ స్థాయి పనులు చాలా బావున్నాయి. ఏదోకటి ఫలించినా పెద్దస్థాయిలో ఫలితం రావచ్చు. ఈసారి రాజకీయ అనిశ్చితి లేదు కనుక సమస్య ఉండదు.
  • దయచేసి నేను పెట్టిన పై ప్రతిపాదనల్లో కొందరి వ్యక్తిగతమైన, వృత్తిగతమైన ప్రవర్తనపై గట్టి విమర్శలు ఉంటే అవి సబ్జెక్టివ్ గా తీసుకొమ్మని మనవి. ఇప్పటికి జరిగినది చాలు. మళ్ళీ వ్యక్తిగతమైన దాడులు, మీరంటే మీరు అనుకోవడాలు వద్దు. ఏదైనా మరోలా అనిపించినా పవన్ సంతోష్ సదుద్దేశంతోనే అన్నాడనుకుని చదువుకోవడం వికీలో మూలసూత్రమన్నది పదే పదే గుర్తుచేయనక్కర్లేదు కదా?

--పవన్ సంతోష్ (చర్చ) 10:29, 31 మార్చి 2015 (UTC)Reply

పవన్ సంతోష్ గారు, కొద్దికాలంలోనే ఎంతో కార్యదీక్ష, దక్షత మరియు పరిపాలనా అనుభవములు అందిపుచ్చుకున్నందుకు ముందుగా మీకు ధన్యవాదములు, అభినందనలు తెలియజేస్తున్నాను. మీ మనసులోని మాటలు చెప్పారు అందులో తప్పులేదనుకుంటాను. ఎవరూ చింతపడ వలసిన అవసరము అంతగా లేదు. సద్భావనతో సమస్య ఏదైనా ఉన్న, దానిని అలాగే అదే ఆలోచనతో తీసుకుంటే అన్నింటికీ పరిష్కారములు తప్పకుండా దొరుకుతాయి. అందరి వికీ (సీఐఎస్ మరియు ఎ టు కె) లకు విజయోస్తు, శుభమస్తు. JVRKPRASAD (చర్చ) 12:25, 31 మార్చి 2015 (UTC)Reply
పవన్ సంతోష్ గారు మీరు పైన కొన్ని అంశాలను ప్రస్తావించారు. వాటికి విపులంగా సమాధానాలు కొన్ని వివరణలు త్వరలోనే ఇక్కడ పొందుపరచగలను. ఈ ఆలస్యానికి క్షంతవ్యుడను.--విష్ణు (చర్చ) 03:35, 5 ఏప్రిల్ 2015 (UTC)Reply

పవన్ గారు కొన్ని అనివార్య కారణాల వలన ఆలస్యంగా స్పందిస్తున్నాను. అదీ కాకుండా మీరు ప్రస్తావించిన అంశాలపై విపులంగా వివరణలు వ్రాయలనుకొన్నాను, కొంత సమయం పట్టింది. ఇక వివరణలో వెళ్లెముందు కొన్ని macro issues గురించి ముందు ప్రస్తుతించదలిచాను. ఇవి మీరడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటానికే కాకుండా భవిషత్తులో మనం తెవికీ ప్రగతికి కృషి చేయడానికి ఒక framework ని కూడా ఇస్తుందనే నమ్మకంతో ఈ ప్రయత్నం.

  • తెవికీ లక్ష్యాలు సీ.ఐ.ఎస్-ఏ.2.కె లక్ష్యాలు వేరు కాదు: సెంటర్ ఫర్ ఇంటర్నెట్ ఆండ్ సొసైటీ (సీ.ఐ.ఎస్) ఒక స్వఛ్ఛంద సంస్థ దానిలో అంతర్గతంగా ఉన్న ఒక ప్రధాన అంగం ఆక్సెస్ టు నాలెడ్జ్ (ఏ.2.కె). సీ.ఐ.ఎస్. కి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి అందులో free and open knowledge ఒక ముఖ్యమైన లక్ష్యం. వికీమీడియా ఫౌండేషన్ వారు భారత దేశంలో వికీమీడియా సముదాయాన్ని భారతీయ భాషా వికీ ప్రాజెక్టుల అభివృధ్ధి కొరకు ప్రత్యేకంగా కృషి జరపాలని ఒక కార్యక్రమాన్ని రూపొందించి కొందరిని ఈ కార్యక్రమాన్ని నడపటానికిగాను ఉద్యోగులుగా నియమించింది. కాకపోతే అది విఫలం అవడంతో తన స్ట్రాటజీని మారుస్తూ ఇక్కడే ఉన్న ఒక స్వఛ్ఛంద సంస్థ భాగస్వామ్యంతో భారతీయ భాషా వికీ ప్రాజెక్టుల, ఆయా సముదాయాల పెంపుకు దోహదపడాలనుకుంది. అందులో భాగంగా వికీమీడియా ఫౌండేషన్ వారు ఎన్నో సంస్థలను పరిశీలించిన మీదట సీ.ఐ.ఎస్. ని ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి సంప్రదించారు. ఈ కార్యక్రమం వలన ఇంకా మెరుగ్గా free and open knowledge అనే లక్ష్యాని దోహదపడగలమనే ఆలోచనతో సీ.ఐ.ఎస్. తన ఏ.2.కె ప్రోగ్రాం ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టదలచింది. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే వికీమీడియా ఫౌండేషన్ సీ.ఐ.ఎస్. ని సంప్రదించింది (ఇంకో విషయం సీ.ఐ.ఎస్. 2008 నాటి నుండే స్వఛ్ఛందంగా భారత దేశంలో జరిగే వికీమీడియా కార్యక్రమాలకు తనవంతుగా సహాయం అందిస్తూ వచ్చింది). తరువాత వికీమీడియా ఫౌండేషను వారు సెప్టెంబరు 2012 లో ఇచ్చిన గ్రాంటు ఆధారంగా భారతీయ భాషా వికీ ప్రాజెక్టుల, సముదాయాల ప్రగతి ఈ ఏ.2.కె ప్రోగ్రాం లక్ష్యాలుగా మారాయి. అంటే సీ.ఐ.ఎస్- ఏ.2.కె. లక్ష్యాలు వికీపీడియాలు లక్ష్యాలు ఒకటయ్యాయీ, కాబట్టి మనందరం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే సీ.ఐ.ఎస్-ఏ.2.కె ఉన్నదే భారతీయ భాష వికీ ప్రాజెక్టుల, సముదాయాల పరిపుష్టత కొరకు.
  • సీ.ఐ.ఎస్.-ఏ.2.కె కి గ్రాంటు: సెప్టెంబరు 2012 లో ఇచ్చిన గ్రాంటు కాని తదనంతరం వచ్చిన FDC గ్రాంటు వల్ల కాని సీ.ఐ.ఎస్ కి ప్రత్యక్షంగా (డబ్బు రూపేణా) లాభించింది ఏమి లేదు. అప్పటివరకు సీ.ఐ.ఎస్.లో ఉన్న ఏ ఉద్యోగికి కూడా ఈ ప్రోగ్రాం ద్వారా జీతభత్యాలు ఇవ్వలేదు. ఈ ప్రోగ్రాంకి గాను వికీమీడియా భారతదేశం, వికీమీడియా ఫౌండేషను, భారత వికీమీడియా సముదాయన్ని ఎక్కువగా సంప్రదిస్తూ వికీపీడియా లక్ష్యాలు సాధించడానికి గాను ఉద్యోగులను తీసుకుంది. అందులో భాగంగా నన్ను ఫిబ్రవరి 2013లో ప్రోగ్రాం డైరెక్టరుగా తీసుకొవడం జరిగింది (అంతకు ముందు వరకు సీ.ఐ.ఎస్. కి నాకు ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు). అలాగే వికీమీడియా ఫౌండేషను వారు తాము ఇండియా ప్రోగ్రాంకొరకు తీసుకున్న ఉద్యోగులు ఏ.2.కె. ప్రోగ్రాం లోకి తరలించబడ్డారు. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే సీ.ఐ.ఎస్. తాను స్వఛ్ఛందంగా వికీమీడియా ప్రగతికై తన ఇతర గ్రాంటు వనరులనుండి ఎంతో డబ్బు ఖర్చు చేసింది. ఉదాహరణకు ఏ.2.కె ప్రోగ్రాం డైరెక్టరుకు (అంటే నాకు) పోయిన సంవత్సరకాలంలో ఇచ్చిన జీతంలో Rs. 6,80,000/- వరకు సీ.ఐ.ఎస్. తన ఇతర వనరుల నుండి ఇచ్చింది, వచ్చే సంవత్సరంలో కూడా ఇవ్వటానికి కమిట్ అయ్యింది. ఇంకా ఈ ప్రోగ్రాం విజయానికి గాను ఎన్నో indirect expenses భరించింది. నేను చెప్పదలచుకున్నదేంటంటే… ఇప్పుడుంచిన తెవికీ ప్రణాళిక కానివ్వండీ మరే ఇతర ఏ.2.కె. ప్రోగ్రాం ప్రణాళిక కానివ్వండీ లేదా ప్రస్తుత FDC గ్రాంటు అప్లికేషను కానివ్వండీ… వీటివల్ల భారతీయ భాషా వికీ ప్రాజెక్టులు సముదాయలు లాభపొందుతాయి కాని సీ.ఐ.ఎస్ కాదు. ఒక వేళ ఈ సారి FDC గ్రాంటు రాలేదనుకోండి…నాకు తెలిసినంతలో సీ.ఐ.ఎస్.కి ఒరిగే నష్టమంటూ ఏమీలేదు. కాబట్టీ ఈ ప్రణాళిక, FDC గ్రాంటు, ownership మనందరిదీ (అంటే వికీపీడియనులది, ఏ.2.కె ప్రోగ్రాం టీంది) అని మనం గమనించవలసిన అవసరం ఉంది.
  • నా-మా-మీ-మేము-మీరు-మనం ఏ.2.కె పనితీరు, కృషి: నేను ఏ.2.కె కి ప్రోగ్రాం డైరెక్టరుగా పని చేపట్టిన తదనంతరం ఫిబ్రవరి నుండి ఏప్రిల్ 2013 వరకు అనేకమంది (తె)వికీపీడియనులను వ్యక్తిగంతంగా కలిసాను. ఒక సీనియర్ వికీపీడియను ఇలా అన్నారు నేను గత మూడేండ్లుగా తెవికీలో చాలా చేసానండీ కాని నాకు ఏమంత ఫలితాలు కనిపించలేదు….. తెవికీలో మీరు పెద్దగా చేయదగింది ఏమీ లేదూ. నేను వారికి చెప్పింది ఫరవాలేదు సార్, మనం మళ్ళీ ప్రయత్నిద్దాం. మీకు వీలున్నంతలో సలహాలు సూచనలు ఇస్తూ ఉండండి. ఒక మెంటర్ గా మీరు తోడవండీ. అలానే ఇంకో సీనియర్ వికీపీడియను కలిసినపుడు విష్ణుగారు చెప్పండి తెవికీ ప్రగతికి మనం ఏం చేద్దాం, ఎలా చేద్దాం… నేను ఏ విధంగా సహాయపడగలను, నేను వీలున్నంతవరకు సహకారం అందిస్తానూ. నేను వారికి చెప్పింది థాంక్యూ సార్… మీలాంటి వారి సహకారం ఉందంటే మనం తప్పకుండా వచ్చే రెండు సంవత్సరాలలో తెవికీ ప్రగతి ఇంకా కృషి చేయగలం. ఇక్కడ నేను ప్రస్తుతించదలచినది, ఒక వాలంటరీ సముదాయం నడుపుతున్న వీకీ ప్రాజెక్టులో ఏ.2.కె ప్రోగ్రాం కి ఎలాంటి స్పందన లభించింది, ఏ.2.కె ప్రోగ్రాం తన పనితీరుని ఏ విధంగా మలచుకుంది. ఒకరు, మీరు చేయండి అన్నారు. ఇంకొకరు నెను ఏ విధంగా సహాయపడగలను అన్నారు. ఏ.2.కె. ప్రోగ్రాం ఇద్దరితోను మనం చేద్దాం అని అంది. ఎందుకంటే తెవికీ సముదాయంలో ఎవరు ముందుకు వచ్చినా రాకున్నా తెవికీ సముదాయమంతటితో కలిసి కృషి చేయడమన్న ఫిలాసఫీతో ఏ.2.కె. ప్రోగ్రాంని రూపుదిద్దడం జరిగింది. ఏ.2.కె కూడా (వికీమీడియా ఫౌండేషను వారి ఇండియా ప్రోగ్రాం లా) సముదాయాన్ని పక్కన పెట్టి తనకు తోచిన కార్యక్రమాలు తోచిన విధంగా చేసుకుంటూ పోవచ్చును కూడా. అలా చేసి మేం చేసాం అని చెప్పుకోనూవచ్చు. మా ఎడిటర్లు, ఎడిట్లు, ప్రాజెక్టులు, వ్యాసాలు అంటూ రిపోర్టులు గణాంకాలు పెట్టుకోనూ వచ్చు. కాని ఆ పనితీరుని మనం ఎంచుకోలేదు. ఎందుకంటే ఏ.2.కె ప్రోగ్రాం ఫిలాసఫీ సముదాయం ముందు… అందులో భాగంగా ఏ.2.కె ఒక కాటలిస్ట్ గా మాత్రమే తన పనితీరుని రూపొందించుకొంది. నా దృష్టిలో the magic is to get a fine balance and good mix of volunteer effort and voluntary sector professional time. To achieve this both the volunteers and voluntary sector professionals need to put effort with the sight on the vision of furthering free and open knowledge, with mutual respect, transparency and appreciative inquiry. మిగతా భాషా ప్రణాళికల్లో కన్నా ఈ మ్యాజిక్ తెవికీలో మనం కొంత మెరుగ్గా సాధించగలిగాం అని నా నమ్మకం,దానికి ముఖ్య కారణం మన సముదాయ సభ్యుల సహకారం. ఈ విషయాన్ని ట్రెయిన్-ద-ట్రెయినర్ 2015 కార్యక్రమంలో ఒక ఉదహరణగా కూడా నేను ప్రస్తుతించాను. 2013 నుండి ఇప్పటి వరకు ఏ.2.కె. ప్రోగ్రాం ప్రయత్నమంతా కూడా మనం అనేమాటతో తెవికీ ప్రగతికై కృషి చేయడమే తప్ప మేము అనే ధోరణిలో ఎప్పూడు వెళ్ళలేదు. దీనికై ఒక ఉదాహరణ మీరు చేపట్టిన డి.ఎల్.ఐ. ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు చేయవచ్చుననే ఆలోచన మీముందుంచింది, దానిని ఒక ఐ.ఇ.జీ ప్రపోజల్ గా మలవటానికి కొంత సహకారం అందించింది ఏ.2.కె. ఉద్యోగులే కదా. బహుశా మీరు చూసే ఉంటారు డి.ఎల్.ఐ. లో ఉన్న పుస్తాకాల జాబితాని తెలుగులో యూనీకోడికరించడం ద్వారా తెవికీకే కాకుండా అంతర్జాలంలో తెలుగు ప్రగతికి బాటలు వేయవచ్చుననే ఆలోచనను 2013 తెలుగు ప్రణాళికలోనే ప్రస్తుతించడం జరిగింది. ఏ.2.కె. నే నేరుగా గ్రాంటు డబ్బులతో ఈ పనిని 2013 లోనే చేసి ఉండవచ్చు కదా. కాని ఆ ప్రాజెక్టు మనంగా చేయలనుకున్నాం, నాకు తెలిసి అలాగే చేసాం. అలాగే విశ్వనాథ్ గారు చేపట్టిన ప్రాజెక్టుకు వీలున్నంతవరకు సహకారం అందించడం జరిగింది. ఇవి చేయడం ద్వారా మన తెవికీ పురోగతి చెందుతుంది అనే ఉద్దేశ్యమే తప్ప మరేదీ లేదు అని మీరు గ్రహిస్తారనుకుంటున్నాను. నాకు తెలిసి డి.ఎల్.ఐ. ప్రాజెక్టుకు సహకారం అందించడానికి ముందుకు వచ్చిన సభ్యులు కూడా మనం అని ఆలోచించారు కాని ఇది నా ప్రాజెక్టు కాదు అని ఆలోచించరు కదా. ఈ మనం అనే ఫిలాసఫీ వికీకి ఒక మూలస్థంభం. దాన్ని ఏ.2.కె. (ఒక పెయిడ్ ప్రోఫెషనల్స్ టీంగా) భంగ పరచదలచుకోలేదు. ఏ.2.కె ఎంచుకున్న పనితీరు అంత తేలికైన విషయం కాదు. ఈ విధంగా ఒక వాలంటరీ మూవ్మెంటులో పని చేయడం కత్తిమీద సాములాంటిది. ఎన్నో ఒడిదుడుకులు ఎదురుకున్నాం. ఏ.2.కె. సభ్యులు కూడా ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు, నేర్చుకుంటున్నారు. ఒక పెయిడ్ ప్రోఫెషనల్స్ టీంతో ఏ.2.కె తో ఎలా కలిసి పని చేయాలనేది కూడా తెవికీ సముదాయం కొంత నేర్చుకుందని అనుకుంటున్నాను. ఈ పనితీరు వలన ఎప్పటికైనా ఎవరో ఒకరు ఏ.2.కె (నిజమైన కృషి)గా మీరు చేసిన ప్రగతి చూపండీ అంటే ప్రస్పుటంగా చూపలేమనే విషయం ఈ స్ట్రాటజీ structural weakness. బహుశా కొందరి దృష్టిలో ఏ.2.కె తీసుకున్న స్ట్రాటజీ సరైంది కాదేమో. కాని ఏనాడు తనకంటూ ఏ.2.కె. ప్రత్యేకంగా క్రెడిట్ తీసుకోవాలనే ఉద్దేశంతో తన పనితీరుని రూపొందించుకోలేదు. ఏం చేసుకుంటాం ఆ క్రెడిట్ తో (నిజమైన కృషి) చెప్పండీ! గత రెండేళ్ళ తెవికీ ప్రగతిలో ఏ.2.కె. నిజమైన కృషి మాటేమోకాని, గుండెలమీద చేయి వేసుకొని అసలు నిజంగా కృషి చేయలేదని అనుకుంటే అందరూ ఇక్కడే చెప్పండీ, ఇప్పుడే మానేద్దాం ఈ తెలుగు ప్రణాళికని.
  • కృషికి తగ్గ ఫలితాలు ఎలా చూస్తున్నాం: ఏ.2.కె ఫలితాలను ఎప్పుడూ తెవికీ సముదాయ కృషి ఫలితాలుగానే చూపించింది, చూపిస్తుంది. ఇది ప్రణాళికలో ప్రస్పుటంగా విన్నవించడం జరిగింది. ఏ.2.కె ప్రత్యేకంగా చేపట్టిన ఆంధ్రలయోలా కాళాశాల వంటి ప్రాజెక్టులకు ప్రత్యేకంగా పేజిలు వికీలో ఉంచడం జరిగింది. మరి తెవికీ ప్రగతి అంతా ఏ.2.కె చేసిన ప్రగతే అనుకుంటే అనే ప్రశ్న ఉత్పన్నం కావచ్చునని అనుమానం వ్యక్తపరిచారు. కొంత పరిణతి ఉన్న ఏ వికీపీడియనైనా, ఏ.2.కె ఒక సగం కన్నా తక్కువ ఉద్యోగితో తెవిలో ప్రగతినంతా సాధించిందంటే నమ్మరు. మరింత లోతైన విశ్లేషణలు చేసి తెవికీ ప్రగతిలో ఏ.2.కె నిజమైన కృషిని తెలుసుకోవాలనుకునే వారికి కొన్ని ప్రశ్నలు. ఏ.2.కె నిర్వహించిన శిక్షణా శిబిరాల ద్వారా కొందరు తెవికీ ప్రాజెక్టులలో కృషి చేసారు. వారి కృషి అంతా ఏ.2.కె కృషిగా జమకట్టవలసిందేనా. వారు మిగతా వాలంటీయరు సభ్యుల లాంటి వారే కదా? ఉదాహరణకు, పవన్ గారినే తీసుకుందాం. వారికి తెవికీని పరిచయం చేసి కొంత ప్రావిణ్యం కల్పించింది ఏ.2.కె ఉద్యోగులే. వారికి సీనియర్ వికీపీడియనైన రాజశేఖర్ గారికి పరిచయం కూడా చేయించి వారికొక మెంటర్షిప్ లా కూడా చేయడానికి ప్రయత్నం జరిగింది. మరి పవన్ గారు తెవికీలో చేసిన కృషి అంతా ఏ.2.కె కృషిగా చూపించాలా? ఎన్నేళ్ళ వరకు ఇలా చూపించుకోవచ్చు? రాజశేఖర్ గారు వారికి అందించిన సహకారాన్ని ఎలా చూపించాలి. నా దృష్టిలో ఇది వికీ వాలంటియర్ స్ఫూర్తికే వ్యతిరేకం. అలాగే ఇంకో ఉదాహరణ, ట్రెయిన్-ద-ట్రెయినర్ లో విశ్వనాధ్ గారిని పాల్గొనే విధంగా పోత్సహించి, విజయవాడ, గుంటూరు మొదలైన చోట్లలో నిర్వహించిన వికీ శిక్షణా శిబిరాలలో వారిని పాల్గొనే విధంగా చూసి ఒక subtle mirrored learning process ని అవలంబిస్తూ వారు మరిన్ని తెవికీ శిక్షణా శిబిరాలు చేసే విధంగా ప్రోత్సహించిన తరువాత రేపు వారు తెవికీ ప్రగతికై చేసే కార్యక్రమాలలో ఏ.2.కె. కృషిని ఎలా ఎంత వరకూ చూపించాలి. ఎవరైనా ఈ విధంగా లోతైన విశ్లేషణలు చేయాలనుకుంటే ఏ.2.కె నుండి వీలైనంత తప్పక సహకారం అందిస్తాం. ప్రస్తుతం తెలుగుపై పనిచేసే ఒక సగం ఉద్యోగితో ఈ లోతైన విశ్లేషణలు చేయడానికి ప్రాధాన్యం ఇవ్వదలచుకోలేదు. ఇప్పటికే ఏ.2.కె ఉద్యోగులు సగటున రోజుకు 12 గంటలపైనే పని చేస్తున్నారు అని గమనించ ప్రార్ధన. ఇప్పటికే మాసిక న్యూస్-లెటర్స్, త్రైమాసిక రిపోర్టులంటూ ఏ.2.కె ఉద్యోగుల సమయం తెవికీ ప్రగతికి కీలకమైన కార్యక్రమాల ఇంప్లిమెంటేషన్ తో పోలిస్తే చాలా సమయం డాక్యుమెంటేషన్ లో పోతుంది . కేవలం రిపోర్టులే ప్రగతిని సాధించలేవుకదా. అలాగని కృషికి తగిన ఫలితం చూడవద్దని ఇక్కడ ఉద్దేశ్యం కాదు. గ్లోబల్ మెట్ర్కిక్స్ ని అనుసరించి తెవికీలో ఈ సంవత్సర ప్రగతిని నిరుటి ప్రగతితో పోల్చిచూపడం జరిగింది. ఇక ఏ.2.కె సముదాయంతో కలిసిపని చేయటానికి పూర్వపు ప్రగతితో చూసుకుంటే గత రెండు సంవత్సరాల ప్రగతి చాలా కోణాల నుంచి మెరుగ్గా ఉంది. ఉదాహరణకి 2012 చివరినాటివరకు తెవికీ ప్రగతికి, వైఫల్యాలకు సంబందించిన కొన్ని అంశాలను అర్జునగారు పొందుపరిచారు. ఈ దిగువ పట్టిక ఏ ఏ అంశాలలో మనం మెరుగయ్యామో చూపిస్తుంది. మరొక్కసారి నొక్కి చెప్పడం ఏంటంటే ఇది మనం సాధించిన ప్రగతి.
అంశం 2012 లో స్థితి (2012 విశ్లేషణ ప్రదర్శన లో అర్జున గారు తెలిపిన విధంగా) 2014 నాటికి స్థితి ! వ్యాఖ్య
ఈ వారం విశేష కృషి నిష్ఫలం ఈ వారం కృషిగా కాకుండా ప్రాజెక్టు స్థాయిలో విశేష కృషి - విశేషమైన ఫలితాలు వారం వారం కృషికి అందరూ సభ్యులు అందుబాటులో ఉండకపోవచ్చు. ప్రాధాన్యతలు మారొచ్చు. అదే ప్రాజెక్టు పరంగా కృషి మరింత ప్రభావాన్ని చూపుతుంది.
వెబ్ ఛాట్ మొదటి దఫా తరువాత జరగలేదు ఎప్పటికప్పుడు స్కైప్, ఫేస్బుక్ చాట్, గూగుల్ హ్యాంగౌట్ ద్వారా వికీసభ్యుల చర్చలు తెవికీ సభ్యుల సంభాషణోపకరణాల వాడుక హెచ్చు అయింది
ప్రాజెక్టు కృషి కేవలం ఒకటి - జిల్లాల ప్రాజెక్టు విజయవంతమైనట్టు తెలపడం జరిగింది. ఎన్నో ప్రాజెక్టులు చేపట్టడం విజయవంతం చేయడం జరిగింది తెవికీ సభ్యుల సమిష్టి కృషి బాగా పని చేస్తోంది. వీటికి ముఖా ముఖి సమావేశాలు దోహదపడ్డాయి. దీనిని ఇంకా మెరుగు పరచుకోవాలి.
నగరాలు పట్టణాలలో వికీ శిక్షణ 2 హైదరాబాద్, బెంగుళూరు, గుంటూరు, పెద్దకాకాని, విజయవాడ, తాడేపల్లిగూడెం, తిరువూరు, రాజమండ్రి, పిఠాపురం ఇంకా మరిన్ని వికీ శిక్షణతో పాటు ఆయా నగరాలలో వికీ సమూహాలు ఏర్పాటు చెయ్యాలి. ఆ దిశగా ఈ సంవత్సర ప్రణాళిక కృషిచేయనుంది.
వికీ టేక్స్ టౌన్స్ చేపట్టలేదు పెద్ద ఎత్తున విడిగా కాకుండా చిన్న స్థాయిలో తిరుపతి, గుంటూరు, విజయవాడలలో చేపట్టబడింది. హైదరాబాద్ గురించిన విశేషాలతో ఒక కొత్త సభ్యుడు పని చేస్తున్నాడు వనరులు, వికీ సభ్యుల అందుబాటుతో ఇంకా కృషి చేయాలి
సభ్యుల కృషి గుర్తింపు అర్జున గారు కొందరు సభ్యులకు 25, 100 మార్పుల స్థాయి దాటినపుడు శుభాకాంక్షలు తెలపడం, 500 ఎడిట్లు దాటినపుడు మెడల్ ఇవ్వటం చేసారు, దాదాపు ఒక నెల పాటూ కొనసాగించారు కొ.ల.రా.వి.పు, ప్రస్తుతం ప్రాజెక్టు స్థాయిలో జరుగుతున్నా పెద్దగా అమలులో లేదు దీనిని ఇంకా క్రియాశీలకంగా చేయాల్సిన అవసరం ఉంది.
సమాచార బట్వాడా జట్టు లేదు ప్రత్యేకించి లేనప్పటికీ కొందరు సభ్యులు పాఠ్యీకరణ, ఫేస్బుక్ ద్వారా, బ్లాగుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలలో తెవికీ మీడియా కవరేజి పెరిగింది. ఇంకా మెరుగు పరచుకోవాలి.
ఫేస్బుక్ వాడకం పేజీ అంతగా రాణించలేదు ఫేస్బుక్ పేజీ, సమూహం రెండూ సమర్ధవంతంగా సభ్యుల ద్వారా నడపబడి మంచి పురోగతిని సాధించాయి. కొత్త సభ్యులను వికీకి అందించడంలో దోహద పడ్డాయి మరింత ప్రభావవంతంగా వాడవచ్చు
రాష్ట్రస్థాయి సమావేశాలు జరగలేదు 3 రాష్ట్ర స్థాయిని మించిన సమావేశాలు సమావేశాల ప్రభావాన్ని బేరీజు వేస్తూ ఇంకా మెరుగ్గా చేయాలి.
  • పవన్ గారు ఇక మీరడిగిన కొన్ని విషయాలకు అదేక్రమంలో క్రింద వివరణలు చూడండి.
    • అన్నమయ్య గ్రంధాలయానికి విశ్వనాధ్ గారితో ఏ.2.కె ఉద్యోగులు విజయవాడనుండి కలిసి వెళ్ళింది అక్కడ ఓ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ విషయాన్ని విశ్వనాధ్ గారు వివరిస్తారనుకున్నాను. బహుశా వారికి వీలుకాకపోవచ్చు. అంతే కాకుండా ఈ కార్యక్రమం జరగటానికి చాల నెలల క్రితం నుండే అన్నమయ్య గ్రంధాలయ కార్యనిర్వాహక వర్గం సభ్యులు ఏ.2.కె ఉద్యోగులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పైగా వారిలో ఒకరు బెంగళూరు వచ్చి దాదాపు ఐదు రోజులు సీ.ఐ.ఎస్-ఏ.2.కె.లో గడిపారు. ఇక వారు యూనీకోడీకరించిన గ్రంధాలయ పుస్తక జాబితా ఏ.2.కె ఉద్యోగుల అభ్యర్ధనమేరకు విశ్వనధ్ గారి ద్వారా తెవికీకి అందించారు. మునుముందు అక్కడ తెవికీ శిక్షణా కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా గుంటూరులో తెవికీకి ఒక స్వచ్ఛంద శిక్షణ కేంద్రంగా చేయడానికి ఇతర వనరుల ద్వారా ఒక లాబ్ ఏర్పాటు చేయడానికి ఏ.2.కె ఇప్పటికే ప్రయత్నిస్తోంది. మీరు కూడా ఈ గ్రంధాలయాన్ని సూచించడం ముదావహం.
    • ట్రయిన్-ద-టెయినర్ కార్యక్రమంలో సుజాత గారు ఇతర తెవికీపీడియనులతో చర్చలమేరకు ప్రణాళికలో ఈ ప్రాజెక్టు చేర్చడం. మీరన్నట్టుగా దీనిపై ఇంకా స్పష్టత తీసుకురావలసిన అవసరం ఉన్నది. ప్రతిపాదన మెరుగుకై సూచనలు సలహాలు ఇవ్వండి.
    • తెవికీ సముదాయం పుష్కరోత్సవాలను జరుపూకోడానికి కృషి చేసే ప్రయత్నంలో, గతంలో ఉగాది పుష్కరోత్సవాలకు, దశాబ్దికి, పదకొండవ వార్షికొత్సవాలకు ఇచ్చిన సహకారం లాగానే సముదాయం అభ్యర్ధించినమేరకు ఏ.2.కె సహాయ సహకారాలని అందిస్తుంది. పదకొండవ వార్షికొత్సవాలకు ఇచ్చిన సహాకారంలో లోటుపాట్లు సరిచేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. దానిని పరిగణనలోనికి తీసుకుని ముందుకు పోదాం.
    • అలాగే తప్పకుండా. మీ సూచనమేరకు ఇంకా మెరుగు పరచుకుందాం.
    • హైదరాబాదులో మాసిక వికీ మీటప్ లు మొదలవటానికి సముదాయ సభ్యులకు 2013 లో ఏ.2.కె సహాయ సహకారాలని అందించింది. కొత్తలో ఏ.2.కె ఉద్యోగులు చాలా సమావేశాలకి వెళ్ళినా ఇది సముదాయ సభ్యులైన రాజశేఖర, ప్రణయ్ గార్ల ఆధ్వర్యంలో ముందుకు వెళుతుంది. ఏ.2.కె అవసరమున్నంతలో సహాయ సహకారాలు అందిస్తుంది. ఉదాహరణకు, తెవికీ సమావేశాలకు హాజరయ్యే సభులకు ఉపయుక్తంగా ఉంటుందని యూనివర్సిటీ ద్వారా వై.ఫై. సౌకర్యం ఏర్పరచబడింది. ఇక పోతే ఈ సంవత్సరం మిగతా చిన్న నగారాలు పట్టణాలలో తెవికీ సమూహాల ప్రక్రియ చేపట్టి క్రియాశీలంగా జరిగేటట్లు ఏ.2.కె ఉద్యోగులు సహకారాన్ని అందిస్తారు.
    • అక్కడ తెలిపిన శిక్షణ తెవికీ సభ్యులం మనలో మనకి ఒకరికొకరం ఇచ్చుకునేది. ఒక సమూహంలో శిక్షణకు, వ్యక్తిగతంగా స్కైపులో శిక్షణకు చాలా తేడా ఉంది. సమూహానికి శిక్షణ ఇచ్చేప్పుడు సభ్యులలో అతి మేధావులూ ఉంటారు, చర్చ జరుగుతున్న విషయానికి సంబంధించిన ఎలాంటి జ్ఞానం లేని వ్యక్తులూ ఉంటారు. అటు అజ్ఞానికీ ఇటు మహాజ్ఞానికీ కాకుండా మధ్యస్థంగా ఏదయినా నేర్పవలసి ఉంటుంది. ఇది లోకవిదితమే. అలాంటి శిక్షణలకు హాజరైన ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత లాభం-జ్ఞానం చేకూరుతుంది. ఎంతో కొంత వెలితి-సమయం వృథా అయింది అన్న అనుభవం మేధావులకూ మిగులుతుంది. అయితే ముఖా ముఖీ ఒక్కొక్కరితో శిక్షణ జరిగేప్పుడు అది ఎల్లపుడూ ఎదుటి వ్యక్తి స్థాయిలోనే జరుగుతుంది, అందువలన ఎక్కువ ఫలప్రదమవుతుంది, ఎదుటి వ్యక్తి మేధావైనా అజ్ఞానైనా. ఇంకొక విషయం ఒక కార్యక్రమం ద్వారా మీకు లబ్ది చేకూరనంతమాత్రాన మిగతా వికీపీడియనులకి అది ఉపకరించలేదనుకోలేము. ఇక ఈ సమస్యకు పరిష్కారం, సమూహ సభ్యులు తామంతట తాముగా వచ్చి అభ్యర్థన చేసే వరకూ ఏ.2.కె ఉద్యోగి ప్రమేయం ఉండబోదు. సమూహం నుండి అభ్యర్థన వచ్చే వరకూ ఏ.2.కె. ఉద్యోగులు శిక్షణలు చేపట్టలేదు, చేపట్టరు. వికీడేటాకు సంబందించిన కార్యక్రమం వీవెన్ గారి సూచనమేరకే ప్రణాళికలో చేర్చడం జరిగింది. వారే దీనికి సారధ్యం వహిస్తానన్నారు.
    • ఇక తెలుగు సాహిత్యం సమగ్రంగా ఒకే వేదిక మీద ఇప్పటి వరకూ తెచ్చే ప్రయత్నం అంతర్జాలంలో లేదా బయటా జరగలేదన్న విషయం వాస్తవమే. తెవికీలో వ్యాసాలుగా ఎంత సమగ్రంగా ఉన్నా ఒక వేదిక గా లేవు. అదే ఆ వాక్యం భావం. ఒక వేదికగా తెలుగు సాహిత్యాన్ని తెవికీలో అభివృద్ధి చెయ్యాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యం. తద్వారా ఒకరో ఇద్దరో కాకుండా సముదాయ సమిష్టి కృషి అందులో పనికొస్తుంది. ఇది అలాంటి ప్రయత్నానికి తొలి అడుగు. ఇక సోషల్ మీడియా గ్రూపును ఏ.2.కె మొదలు పెట్టినా ముందుకు తీసుకుపోతోంది మన తెవికీ సముదాయ సభ్యులే.
    • తప్పకుండా ప్రయత్నిద్దాం.
    • అలాగే :)

--విష్ణు (చర్చ) 07:31, 17 ఏప్రిల్ 2015 (UTC)Reply

విష్ణుగారికి మీ వివరణలో - అన్నమయ్య గ్రంధాలయానికి విశ్వనాధ్ గారితో ఏ.2.కె ఉద్యోగులు విజయవాడనుండి కలిసి వెళ్ళింది అక్కడ ఓ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది.అంతే కాకుండా ఈ కార్యక్రమం జరగటానికి చాల నెలల క్రితం నుండే అన్నమయ్య గ్రంధాలయ కార్యనిర్వాహక వర్గం సభ్యులు ఏ.2.కె ఉద్యోగులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పైగా వారిలో ఒకరు బెంగళూరు వచ్చి దాదాపు ఐదు రోజులు సీ.ఐ.ఎస్-ఏ.2.కె.లో గడిపారు. ఇక వారు యూనీకోడీకరించిన గ్రంధాలయ పుస్తక జాబితా ఏ.2.కె ఉద్యోగుల అభ్యర్ధనమేరకు విశ్వనధ్ గారి ద్వారా తెవికీకి అందించారు. మునుముందు అక్కడ తెవికీ శిక్షణా కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా గుంటూరులో తెవికీకి ఒక స్వచ్ఛంద శిక్షణ కేంద్రంగా చేయడానికి ఇతర వనరుల ద్వారా ఒక లాబ్ ఏర్పాటు చేయడానికి ఏ.2.కె ఇప్పటికే ప్రయత్నిస్తోంది. మీరు కూడా ఈ గ్రంధాలయాన్ని సూచించడం ముదావహం అని రాసారు
    • విష్ణు గారు మీ ద్వారా జరిగే కృషికి పేరు పెట్టలేం, కాని కొన్ని సంధర్భాలలో ఏ2కె అలోచనా విధానం కొంత భిన్నంగా అనిపిస్తుంది. మీతో కలసి అన్నమయ్య గ్రంథాలయానికి వెళ్ళక మునుపే Rajasekhar1961 గారు, పవన్ సంతోష్ దీని గురించి మాట్లాడారు. పవన్‌కు మోదుగుల రవికృష్ణ, కౌటిల్య తెలిసి ఉన్నారని వారి ద్వారా వెళ్ళి కలవాలని మీరు చెప్పక మునుపే వాళ్ళు నేను అనుకోవడం జరిగింది. ఇక యూనీకోడీకరించిన గ్రంధాలయ పుస్తక జాబితా ఏ.2.కె ఉద్యోగుల అభ్యర్ధనమేరకు ఇచ్చారు అన్నారు. అది ఇంకా అసంపూర్తిగానే ఉంది. ఇంకా కృషి జరగవలసి ఉంది అయినా దానిపై నేను రాయక మునుపే రహమాన్ గారు బ్లాగ్ పోస్టులో CIS ద్వారా జాబితా వికీకి ఇచ్చినట్టుగా రాసేసారు. ఇక నేనే రాయడానికి మిగిలేదేం లేదక్కడ. మీతో కలసి వెళ్ళిన తరువాత మరు రెండు దపాలు నేను అన్నమయ్య గ్రంథాలయానికి వెళ్ళి వారి ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. అక్కడి ప్రముఖులు, లైబ్రరీ గురించిన సర్వ సమాచారం తీసుకుంటూ ఉండం జరుగుతున్నది. ఒకసారి రహమాన్‌తో కలసి రెండు రోజులు అక్కడే ఉండి, పలు విషయాలపై అవగాహన కల్పించడం జరిగింది. కేవలం నేనే కాక కల్లూరి శ్రీనివాస్ గారిని కూడా తీసుకువెళ్ళాను, తీసుకు వచ్చాను. ఇప్పటికీ ఫోన్ ద్వారా సూచనలు సలహాలు అందిస్తున్నాను. నా వైపుగా అన్నమయ్య గ్రంథాలయాన్ని తెలుగు వికీకి ఒక కేంద్రంగా మలచడానికి ప్రయత్నిస్తున్నను. కేవలం ఇక్కడికే కాక నేను వెళ్ళే అన్ని చోట్లా అక్కడ కల వికీ మిత్రులను కలుపుకొంటూ(అప్పడపుడూ వికీపీడియన్లు కానివారిని కూడా, ఉదా: రాజశేఖర్ గారి మావయ్య గారిని, అన్నయ్య గారిని) వెళుతున్నాను. అక్కడ కేవలం ప్రాజెక్టు పనిగానే కాక భవిష్యత్‌లో అవి వికీపీడియా కేంద్రాలుగా పనిచేసే విదంగానే ఆలోచనలు, కార్యక్రమాలు చేస్తున్నాం. నా అనుభవం ద్వారా అభర్ధనల ద్వారా తెవికీకి ఏదో సాధించేకంటే తెవికీలో ఆ గ్రంథాలయ జాబితా ఉండటం ద్వారా గ్రంథాలయానికి - తద్వారా తెలుగుపుస్తకాలకు కు జరిగే మేళ్ళు ఏమిటో తెలియచెప్పటం ద్వారా ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని తెలిసింది. అలా అయితే వాళ్ళు పూర్తిగా సహకారం అందించడానికి అవకాసం ఉంటుంది. అలానే నేను వెళుతున్నాను. ఇలా తెలుగు వికీ సముదాయాన్ని కలుపుకొంటూ అందరి ద్వారా జరుగుతున్న ప్రగతేదైనా అది CIS ప్రగతిగా చూపించడం నాకు ఎంతమాత్రం భావ్యంగా అనిపించడం లేదు. ప్రాజెక్టు అయిపోవచ్చుగాని దాని ద్వారా ఏర్పడే భాగస్వామ్యాల ద్వారా భవిష్యత్ వికీకి జరిగే మేలు ఊహించలేనిదిగా ఉండబోతున్నది...--విశ్వనాధ్ (చర్చ) 13:30, 17 ఏప్రిల్ 2015 (UTC)Reply
విశ్వనాధ్ గారు క్షమించాలి, మీరిచ్చిన వివరణ సరిగ్గా అనిపించటంలేదు. ఈ విషయంపై మరింత స్పష్టతకై ఈ ప్రయత్నం.
మొదటగా, అన్నమయ్య గ్రంధాలయానికి మనం విజయవాడ నుండి కలిసి వెళ్ళన మాట వాస్తవం కదా. అలాగే మీరు అన్నమయ్య గ్రంధాలయానికి రావాలని ఏ.2.కె సూచించడం జరిగింది కదా. మీతో ఫోనులో సంప్రదించినప్పుడు కాని మనం విజయవాడ నుండి కలిసి ప్రయాణం చేసినప్పుడు కాని ...మీరు రాజశేఖర గారు, పవన్ సంతోష్ గారి తో దీని గురించి మాట్లాడిన విషయం ప్రస్తావనకు తేలేదు. ఇక్కడ చర్చలో పవన్ గారు దానిని ప్రస్తుతించేవరకు మీరు వారితో దీని గురించి మాట్లాడారు అనే విషయం నాకు మిగతా ఎ.2.కె సభ్యులకు తెలియదు.
ఇక అన్నమయ్య గ్రంధాలయంలో మనం వెళ్ళినప్పుడు ముఖ్యంగా కలిసింది సూర్యనారాయణ మరియు సాంబశివరావు గార్లను. వారు మనతో మధ్యాహ్నం నుండి రాత్రి బయలుదేరేవరకు వెంటనే ఉన్నారు. వీరు ఆ గ్రంధాలయంలో ముఖ్య సభ్యులు. కాదంటారా చెప్పండి? అలాగే ఆ గ్రంధాలయ పుస్తకాల జాబితా యూనికోడికరణ కార్యక్రమం సాంబశివరావుగారి పూర్తి ఆధ్వర్యంలో జరుగుతుంది.వారే ఎ.2.కె అభ్యర్థన మేరకు దాదాపు 35 వేల పైచిలుగు పుస్తకాల జాబితా మీకందజేసారు. ఇంకా దాదాపు 20 వేల పుస్తకాల జాబితా మనకు అందజేయడానికి తయారు చేయిస్తున్నారు. నేనీ విషయాన్ని ఫోనులోనూ వారితో దృవికరించుకున్నాను. బెంగుళూరులో ఏ.2.కె ఆఫీసులో 4 రోజులు ఉన్నది వారే. ఇక రవికృష్ణ గారు ఆ రోజు కొంత సమయం కలిసినా ఎక్కువ వారితో చర్చజరగలేదు. ఇక కౌటిల్య ఈ గ్రంధాలయానికి పుస్తకాల జాబితా యూనికోడికరణ కార్యక్రమంలో ఏ విధంగా సంబంద బాందవ్యాలు కలవాడో ఈ పుస్తకాల జాబితా మనకు రావడంలో ఏ విధంగా సహాయపడ్డారో తెలియజేస్తే వారి కృషికి విలువ దక్కించినవారమౌతాము కదా. ఈ పుస్తకజాబితా చేయిస్తున్న సాంబశివరావుగారికి మాత్రం కౌటిల్యగారు తెలియదట అని నాతో ఫోనులో సంభాషించినప్పుడు చెప్పారు.
అన్నమయ్య గ్రంధాలయాన్ని తెలుగు వికీపీడియాకు గుంటూరులో ఒక కేంద్రం గా మలచాలని ఆ రోజు సాంబశివరావు గారు మరియు సూర్యనారాయణగారితో చర్చించడం జరిగింది. అది మీ ప్రర్యవేక్షణలో జరగాలని అనుకున్నదే కదా. దానికోసం మలి విడత రహమాన్‌ మీతో కలిసి వచ్చారు అనేది మీరే చెపారు. దాని ఉద్దేశ్యం ఏమిటి. మిమ్మళ్ని తెవికీ ఒక మంచి ట్రెయినర్ గా మలచాలనే ఉద్దేశ్యం.దీని కోసం ఇంతకు ముందు మనం చేసిన శిక్షణ శిబిరాలలో మీరూ పాల్గొనేటట్టుగా ప్రోత్సహించడం జరిగింది. మీరు మిగతా గ్రంధాలయాలలో/సంస్థలలో కూడా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందకరం.
ఇకపోతే తెవికీ ప్రగతి ముఖ్యంగా తెవికీపీడియనులదేనని పదే పదే చెప్పడం జరిగింది. ఏ.2.కె ఒక కాటలిస్ట్ ప్రోగ్రాం మాత్రమే అని తెలియజేయడం జరిగింది. ఇది ప్రతి త్రైమాసిక రిపోర్టులోను ఈ ప్రస్తుత ప్రణాళికలోను వెళ్ళడించడం జరిగింది. ఇంత చెప్పినా సి.ఐ.ఎస్.- ఏ.2.కె. తెవికీ ప్రగతిని తమ ప్రగతిగా చూపిస్తుందని అంటే మనం చేయగలిగిందేమీ లేదు.
సంస్థాగత భాగస్వామ్యాలు తప్పకుండా తెవికీ పురోగతికి భవిష్యత్తులో ఎంతో తోడ్పాటు చేయగలవనే నమ్మకం నాకుంది. అందుకే ఎ.2.కె ప్రణాళికలలో ఇదొక కీలకాశం. వికీ కోసం సంస్థగత భాగస్వామ్యాలు చేయడం అనేది మొదలు పెట్టిందే ఏ.2.కె. ఇప్పటి వరకు 10 కంటే ఎక్కువ భాగస్వామ్యాలు చేసాము కూడా. కాకపోతే ఈ భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడంలోనూ వాటిని పెంపొందిచడంలోను చాలా సమయం కృషి పడుతుంది. చాలా ఓపిక కావలసి ఉంటుంది. అలాగే తొందరపడి భాగస్వామ్యాలు చేయలేము కూడా. ఈ సంస్థాగత భాగస్వామ్యాలలో సముదాయ సభ్యులను కూడా involve చేయాలనే లక్ష్యంతోనే మీతో పాటుగా అన్నమయ్య గ్రంధాలయానికి వెళ్ళడం జరిగింది అని మీరు గ్రహిస్తారని ఆశిస్తున్నాను.--విష్ణు (చర్చ) 07:37, 30 ఏప్రిల్ 2015 (UTC)Reply


విష్ణుగారికి మీ వివరణలో - అన్నమయ్య గ్రంధాలయానికి విశ్వనాధ్ గారితో ఏ.2.కె ఉద్యోగులు విజయవాడనుండి కలిసి వెళ్ళింది అక్కడ ఓ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది.అంతే కాకుండా ఈ కార్యక్రమం జరగటానికి చాల నెలల క్రితం నుండే అన్నమయ్య గ్రంధాలయ కార్యనిర్వాహక వర్గం సభ్యులు ఏ.2.కె ఉద్యోగులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పైగా వారిలో ఒకరు బెంగళూరు వచ్చి దాదాపు ఐదు రోజులు సీ.ఐ.ఎస్-ఏ.2.కె.లో గడిపారు. ఇక వారు యూనీకోడీకరించిన గ్రంధాలయ పుస్తక జాబితా ఏ.2.కె ఉద్యోగుల అభ్యర్ధనమేరకు విశ్వనధ్ గారి ద్వారా తెవికీకి అందించారు. మునుముందు అక్కడ తెవికీ శిక్షణా కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా గుంటూరులో తెవికీకి ఒక స్వచ్ఛంద శిక్షణ కేంద్రంగా చేయడానికి ఇతర వనరుల ద్వారా ఒక లాబ్ ఏర్పాటు చేయడానికి ఏ.2.కె ఇప్పటికే ప్రయత్నిస్తోంది. మీరు కూడా ఈ గ్రంధాలయాన్ని సూచించడం ముదావహం అని రాసారు
    • విష్ణు గారు మీ ద్వారా జరిగే కృషికి పేరు పెట్టలేం, కాని కొన్ని సంధర్భాలలో ఏ2కె అలోచనా విధానం కొంత భిన్నంగా అనిపిస్తుంది. మీతో కలసి అన్నమయ్య గ్రంథాలయానికి వెళ్ళక మునుపే Rajasekhar1961 గారు, పవన్ సంతోష్ దీని గురించి మాట్లాడారు. పవన్‌కు మోదుగుల రవికృష్ణ, కౌటిల్య తెలిసి ఉన్నారని వారి ద్వారా వెళ్ళి కలవాలని మీరు చెప్పక మునుపే వాళ్ళు నేను అనుకోవడం జరిగింది. ఇక యూనీకోడీకరించిన గ్రంధాలయ పుస్తక జాబితా ఏ.2.కె ఉద్యోగుల అభ్యర్ధనమేరకు ఇచ్చారు అన్నారు. అది ఇంకా అసంపూర్తిగానే ఉంది. ఇంకా కృషి జరగవలసి ఉంది అయినా దానిపై నేను రాయక మునుపే రహమాన్ గారు బ్లాగ్ పోస్టులో CIS ద్వారా జాబితా వికీకి ఇచ్చినట్టుగా రాసేసారు. ఇక నేనే రాయడానికి మిగిలేదేం లేదక్కడ. మీతో కలసి వెళ్ళిన తరువాత మరు రెండు దపాలు నేను అన్నమయ్య గ్రంథాలయానికి వెళ్ళి వారి ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. అక్కడి ప్రముఖులు, లైబ్రరీ గురించిన సర్వ సమాచారం తీసుకుంటూ ఉండం జరుగుతున్నది. ఒకసారి రహమాన్‌తో కలసి రెండు రోజులు అక్కడే ఉండి, పలు విషయాలపై అవగాహన కల్పించడం జరిగింది. కేవలం నేనే కాక కల్లూరి శ్రీనివాస్ గారిని కూడా తీసుకువెళ్ళాను, తీసుకు వచ్చాను. ఇప్పటికీ ఫోన్ ద్వారా సూచనలు సలహాలు అందిస్తున్నాను. నా వైపుగా అన్నమయ్య గ్రంథాలయాన్ని తెలుగు వికీకి ఒక కేంద్రంగా మలచడానికి ప్రయత్నిస్తున్నను. కేవలం ఇక్కడికే కాక నేను వెళ్ళే అన్ని చోట్లా అక్కడ కల వికీ మిత్రులను కలుపుకొంటూ(అప్పడపుడూ వికీపీడియన్లు కానివారిని కూడా, ఉదా: రాజశేఖర్ గారి మావయ్య గారిని, అన్నయ్య గారిని) వెళుతున్నాను. అక్కడ కేవలం ప్రాజెక్టు పనిగానే కాక భవిష్యత్‌లో అవి వికీపీడియా కేంద్రాలుగా పనిచేసే విదంగానే ఆలోచనలు, కార్యక్రమాలు చేస్తున్నాం. నా అనుభవం ద్వారా అభర్ధనల ద్వారా తెవికీకి ఏదో సాధించేకంటే తెవికీలో ఆ గ్రంథాలయ జాబితా ఉండటం ద్వారా గ్రంథాలయానికి - తద్వారా తెలుగుపుస్తకాలకు కు జరిగే మేళ్ళు ఏమిటో తెలియచెప్పటం ద్వారా ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని తెలిసింది. అలా అయితే వాళ్ళు పూర్తిగా సహకారం అందించడానికి అవకాసం ఉంటుంది. అలానే నేను వెళుతున్నాను. ఇలా తెలుగు వికీ సముదాయాన్ని కలుపుకొంటూ అందరి ద్వారా జరుగుతున్న ప్రగతేదైనా అది CIS ప్రగతిగా చూపించడం నాకు ఎంతమాత్రం భావ్యంగా అనిపించడం లేదు. ప్రాజెక్టు అయిపోవచ్చుగాని దాని ద్వారా ఏర్పడే భాగస్వామ్యాల ద్వారా భవిష్యత్ వికీకి జరిగే మేలు ఊహించలేనిదిగా ఉండబోతున్నది...--విశ్వనాధ్ (చర్చ) 13:30, 17 ఏప్రిల్ 2015 (UTC)Reply
విశ్వనాధ్ గారు క్షమించాలి, మీరిచ్చిన వివరణ సరిగ్గా అనిపించటంలేదు. ఈ విషయంపై మరింత స్పష్టతకై ఈ ప్రయత్నం.
మొదటగా, అన్నమయ్య గ్రంధాలయానికి మనం విజయవాడ నుండి కలిసి వెళ్ళన మాట వాస్తవం కదా. అలాగే మీరు అన్నమయ్య గ్రంధాలయానికి రావాలని ఏ.2.కె సూచించడం జరిగింది కదా. మీతో ఫోనులో సంప్రదించినప్పుడు కాని మనం విజయవాడ నుండి కలిసి ప్రయాణం చేసినప్పుడు కాని ...మీరు రాజశేఖర గారు, పవన్ సంతోష్ గారి తో దీని గురించి మాట్లాడిన విషయం ప్రస్తావనకు తేలేదు. ఇక్కడ చర్చలో పవన్ గారు దానిని ప్రస్తుతించేవరకు మీరు వారితో దీని గురించి మాట్లాడారు అనే విషయం నాకు మిగతా ఎ.2.కె సభ్యులకు తెలియదు.
ఇక అన్నమయ్య గ్రంధాలయంలో మనం వెళ్ళినప్పుడు ముఖ్యంగా కలిసింది సూర్యనారాయణ మరియు సాంబశివరావు గార్లను. వారు మనతో మధ్యాహ్నం నుండి రాత్రి బయలుదేరేవరకు వెంటనే ఉన్నారు. వీరు ఆ గ్రంధాలయంలో ముఖ్య సభ్యులు. కాదంటారా చెప్పండి? అలాగే ఆ గ్రంధాలయ పుస్తకాల జాబితా యూనికోడికరణ కార్యక్రమం సాంబశివరావుగారి పూర్తి ఆధ్వర్యంలో జరుగుతుంది.వారే ఎ.2.కె అభ్యర్థన మేరకు దాదాపు 35 వేల పైచిలుగు పుస్తకాల జాబితా మీకందజేసారు. ఇంకా దాదాపు 20 వేల పుస్తకాల జాబితా మనకు అందజేయడానికి తయారు చేయిస్తున్నారు. నేనీ విషయాన్ని ఫోనులోనూ వారితో దృవికరించుకున్నాను. బెంగుళూరులో ఏ.2.కె ఆఫీసులో 4 రోజులు ఉన్నది వారే. ఇక రవికృష్ణ గారు ఆ రోజు కొంత సమయం కలిసినా ఎక్కువ వారితో చర్చజరగలేదు. ఇక కౌటిల్య ఈ గ్రంధాలయానికి పుస్తకాల జాబితా యూనికోడికరణ కార్యక్రమంలో ఏ విధంగా సంబంద బాందవ్యాలు కలవాడో ఈ పుస్తకాల జాబితా మనకు రావడంలో ఏ విధంగా సహాయపడ్డారో తెలియజేస్తే వారి కృషికి విలువ దక్కించినవారమౌతాము కదా. ఈ పుస్తకజాబితా చేయిస్తున్న సాంబశివరావుగారికి మాత్రం కౌటిల్యగారు తెలియదట అని నాతో ఫోనులో సంభాషించినప్పుడు చెప్పారు.
అన్నమయ్య గ్రంధాలయాన్ని తెలుగు వికీపీడియాకు గుంటూరులో ఒక కేంద్రం గా మలచాలని ఆ రోజు సాంబశివరావు గారు మరియు సూర్యనారాయణగారితో చర్చించడం జరిగింది. అది మీ ప్రర్యవేక్షణలో జరగాలని అనుకున్నదే కదా. దానికోసం మలి విడత రహమాన్‌ మీతో కలిసి వచ్చారు అనేది మీరే చెపారు. దాని ఉద్దేశ్యం ఏమిటి. మిమ్మళ్ని తెవికీ ఒక మంచి ట్రెయినర్ గా మలచాలనే ఉద్దేశ్యం.దీని కోసం ఇంతకు ముందు మనం చేసిన శిక్షణ శిబిరాలలో మీరూ పాల్గొనేటట్టుగా ప్రోత్సహించడం జరిగింది. మీరు మిగతా గ్రంధాలయాలలో/సంస్థలలో కూడా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందకరం.
ఇకపోతే తెవికీ ప్రగతి ముఖ్యంగా తెవికీపీడియనులదేనని పదే పదే చెప్పడం జరిగింది. ఏ.2.కె ఒక కాటలిస్ట్ ప్రోగ్రాం మాత్రమే అని తెలియజేయడం జరిగింది. ఇది ప్రతి త్రైమాసిక రిపోర్టులోను ఈ ప్రస్తుత ప్రణాళికలోను వెళ్ళడించడం జరిగింది. ఇంత చెప్పినా సి.ఐ.ఎస్.- ఏ.2.కె. తెవికీ ప్రగతిని తమ ప్రగతిగా చూపిస్తుందని అంటే మనం చేయగలిగిందేమీ లేదు.
సంస్థాగత భాగస్వామ్యాలు తప్పకుండా తెవికీ పురోగతికి భవిష్యత్తులో ఎంతో తోడ్పాటు చేయగలవనే నమ్మకం నాకుంది. అందుకే ఎ.2.కె ప్రణాళికలలో ఇదొక కీలకాశం. వికీ కోసం సంస్థగత భాగస్వామ్యాలు చేయడం అనేది మొదలు పెట్టిందే ఏ.2.కె. ఇప్పటి వరకు 10 కంటే ఎక్కువ భాగస్వామ్యాలు చేసాము కూడా. కాకపోతే ఈ భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడంలోనూ వాటిని పెంపొందిచడంలోను చాలా సమయం కృషి పడుతుంది. చాలా ఓపిక కావలసి ఉంటుంది. అలాగే తొందరపడి భాగస్వామ్యాలు చేయలేము కూడా. ఈ సంస్థాగత భాగస్వామ్యాలలో సముదాయ సభ్యులను కూడా involve చేయాలనే లక్ష్యంతోనే మీతో పాటుగా అన్నమయ్య గ్రంధాలయానికి వెళ్ళడం జరిగింది అని మీరు గ్రహిస్తారని ఆశిస్తున్నాను.--విష్ణు (చర్చ) 07:37, 30 ఏప్రిల్ 2015 (UTC)Reply
  • విష్ణుగారు - ఎలా చెప్పినా ఆయన ప్రస్తుతం CISలో లేరు కాని జవాబు మాత్రం వికీ మిత్రులందరికీ అవసరమే అందుకే -

ఎవరి వలన పని జరిగింది అనేదానిని పట్టుకోవడం ఏమిటో నాకు అర్ధం కాలేదు. మనకు ఒక పని జరగడం కావలసి వస్తే ఆ పని జరగడానికి ఎవరిని కలవాలో వారిని మనం ముందే ఎరిగి ఉండం కాబట్టి, ఎవరో మన పరిచయస్తూల యొక్క పరిచయస్తుల యొక్క పరిచయస్తుల ద్వారా లింక్ కలుపుకొంటూ ముందుకు వెళతాం, అలా అని అది కేవలం ఆ మొదట పరిచయస్తుల ద్వారానే పని జరిగినది అనుకోవడంలో ఎంత వరకూ బ్రమ అనుకోవచ్చో, ఆ రెండో, మూడో, లేక నాల్గో పరిచయస్తుల ద్వారా పని జరిగింది అనుకోవడం అంటే అంతే బ్రమ అనుకోవాలి.

పని జరగటం అనేది కొందరి కలయికతో, వారి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఇది మీకు నేను చెప్పక్కరలేదు. మీరు ఉన్న రంగం అటువంటిది కనుక. ఇక నా వైపుగా అయితే నేను తిరిగిన, చూసిన ప్రపంచం చాలా పెద్దది. (చదువులో కొంత ఎక్కువ కాలం గడిపిన మీ లాంటి వారి కాలాన్ని కూడా కలుపుకొని) 1994 లో మీరు ఎక్కడ ఏం చేస్తున్నారో తెలీదు, అప్పుడు నేను కన్నడ సినిమా రంగంలో పోస్టర్ డిజైనర్‌గా ప్రవేశించాను, తదుపరి తమిళం, తదుపరి తెలుగులో అనేక రంగాలలో చిన్న చిన్న ఉద్యోగాలు అనేకం చేసాను. పోస్టర్ పబ్లిసిటీ సొంతంగా పెట్టడానికి డబ్బు ఎక్కువ కావాలి కాబట్టి దుబాయ్ వెళ్ళాను, అక్కడ కూడా టూరిజం, షాపింగ్ మాల్స్, 5 నక్షత్రాల హొటల్స్ - మొదలుకొని పోర్ట్‌, లాజిస్టిక్ ఆఫీసుల వరకూ అనేక రంగాలలో 6 సంవత్సరాలు పని చేసిన నాకు పని జరిపించుకోవడంలో తగినంత అనుభవమే ఉండి ఉంటుంది అనే అనుకుంటాను ఎప్పుడూ..

ఇక నేను చేపట్టిన ప్రాజెక్టులో తొలి అడుగు అన్నమయ్య గ్రంథాలయం వైపుగా వేయాలనుకోవడం అయితే, దానికి విష్ణు గారి పిలుపు మేరకు ఎలాగూ అన్నమయ్య గ్రంథాలయం చేయాలనుకున్నాం కాబట్టి వాళ్ళు వెళుతున్నారు కూడా వెళ్ళి చూదాం అనుకోవడం. అక్కడ అంతా వాళ్ళు అనుకొన్నట్టు CIS మయమే అయితే..... మరి నేను స్వంతంగా వెళ్ళిన ప్రతి గ్రంథాలయం వాళ్ళు 100 శాతం నాకు సపోర్ట్ చేయడం వెనుక కూడా CIS హస్తం ఉందా ?. బహుశా నాకు తెలియకుండా వాళ్ళు ముందుగా వెళ్ళి ఆయా గ్రంథాలయాలలో నాకు అనుకూలంగా పరిస్థితులను మార్చి ఉంటారా ? ఏమో ఉండచ్చునేమో, అలా రేపో మాపో ఇక్కడా రాసుకోవచ్చునేమో ? ఎవరికి తెలుసు A2K సర్వాంతర్యామిలా అంతటా తానై అన్ని పనులూ జరిపించే అద్భుత సంస్థ అని..... తెలుగు వికీ సోదరులారా, !..... పెద్దలారా!.... ఇకపై మీరు ఏపని చేయాలన్నా మీకంటే ముందుగా ఆపని నిర్వర్తించే వారున్నారు, భయం వద్దు, మీరు పైపై చూసుకొంటూ ఉంటే చాలును. ఆఖరులో మీ నెత్తిన పాలో, నీళ్ళో, బండరాళ్ళో పోయకపోరు -

PS - (అంతా మీరే చేస్తారు, మాకై మేము ఏదో చేయాలనుకుంటాం, కాని చేయనీయరు, కాని అన్నీ మీరే చేసేస్తుంటే మాకు ఒక్కోసారి అనిపిస్తుంది, మేము ఏమీ చేయలేమా అని..చాలు ప్లీజ్ చాలు, ఇప్పటిదాకా మీరు చేసింది చాలు. మేము ఏదో చేద్దామనుకుంటాము, కాని మీరు అది ముందే చేసేసామని చెప్పేస్తారు, ఎలా చేయాలా ని ప్లాన్లు వేస్తుంటే ఇలా చేసేసామని చెప్పి మమ్మల్ని నీరు గార్చేస్తారు. మేము పేపర్లో ప్లాన్లు గీస్తుంటే మీరు గాల్లో అవి పూర్తిచేసి చూపిస్తుంటే మాకు కడూపులో దేవేస్తుంది. వాంతి అయిపోతున్నట్టుంటుంది. కాని వాంతి అవదు. ఎవరికి చెప్పాలి ఈ బాధ. ఒక్కసారి ఆలోచించండి యువరానర్ ఒక్కసారి ఆలోచించండి)


పవన్ సంతోష్ పరిప్రశ్న

మార్చు

పైన విష్ణు గారు వ్రాసిన సుదీర్ఘమైన సమాధానానికి ఇది పరిప్రశ్న, ప్రశ్నలు-సమాధానాలు-ప్రశ్నలు పెరిగి పెరిగి ఎవరే విషయంపై వ్రాస్తున్నారో అర్థంకాని స్థితి వచ్చింది. అందుకే ఈ శీర్షికలు పెట్టి రాస్తున్నాను. స్పందించదలిచినవారు ఏ శీర్షిక వద్ద ఆ శీర్షక గురించి విడివిడిగా సంతకాలు చేసి స్పందించగలరు.

సముదాయం అవసరాల విశ్లేషణ

మార్చు

ఇక మొదటి పాయింటుగా మీరు వ్రాసిన తెవికీ లక్ష్యాలే సీఐఎస్ లక్ష్యాలు అన్న వివరణ మాత్రం సమయోచితమైన వివరణే. కాకుంటే ఇక్కడ పలువురు సభ్యులు మౌలికమైన లక్ష్యాల గురించి మాట్లాడడం లేదు, లోతైన విధానాల గురించే మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలకు మూలం మారుతున్న తెవికీపీడియన్ల ప్రాధాన్యతలే. అంటే పూర్వంలా కేవలం వ్యాసాల సంఖ్య పెంపు మీద మాత్రమే కాక వాటి నాణ్యతపైన కూడా తెవికీ సముదాయం దృష్టిపెడుతోంది. ఉదాహరణకు ఈ సంవత్సరం రచ్చబండలో బొమ్మలు కావాలి అన్న మూస ద్వారా తెవికీలోని బొమ్మలు లేని వ్యాసాలను వర్గీకరించాలని, తర్వాత వాటిలో బొమ్మలు చేర్పించి అభివృద్ధి చేయాలని చేసిన చర్చ చూడండి. కేవలం చర్చ మాత్రమే కాక దాని ఫలితంగా వైజాసత్య గారు బొమ్మలు లేని వ్యాసాలను యాంత్రికంగా బాట్ నడిపి వర్గీకరిస్తున్నారు. తెవికీ11 దాటాక కొన్నినాళ్ళకే ఈ చర్చ జరిగింది. ఆ తర్వాత జరిగిన టిటిటి-2015 నాటి చర్చల ఫలితంగా ఎన్నో ప్రాజెక్టులను చేర్చుకున్నామంటున్నారే కనీసం ఈ విషయాన్ని గుర్తించనైనా లేదు. అలానే తెవికీ రచ్చబండలో జరిగే అనేకమైన చర్చల్లో సముదాయం చేద్దామనుకుని చేయలేకపోయిన విషయాలున్నాయి. వాటిని చేసేందుకు సపోర్ట్ చేస్తాననైనా ముందుకురావట్లేదు కదా. అందుకే వేర్వేరని పలువురు వ్యాఖ్యానిస్తున్నారనుకుంటా.--పవన్ సంతోష్ (చర్చ) 20:53, 24 ఏప్రిల్ 2015 (UTC)Reply

కృషిని నివేదించడం

మార్చు

మీరు ఈ విషయంలో చాలానే వ్రాశారు. నేను మీ ద్వారానే వచ్చాను కాబట్టి నాకృషిని ఎలా నివేదించాలనీ అడిగారు, మనం అనుకున్నారు కనుకనే మేం నడిపిన కృషిలో వికీమీడియన్లు పాలుపంచుకున్నారనీ ఇలా విడదీయరాని విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. సీఐఎస్ ఎ2కె కృషిని మొత్తంగా ఎలా విడదీసి చూపగలం అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న నన్ను సూచించమని అడిగినట్టుగా అనుకుని సమాధానం చెప్తున్నాను.(ఈ విషయం వివరించేప్పుడు, నాలాంటి ఇటీవల ఉదయించిన వికీపీడియన్ చెప్తున్నాడనో, మరోటో అనిపిస్తే క్షమించండి) ప్రశ్నించినప్పుడు నా ఆలోచన, మీరు అర్థం చేసుకున్నది వేర్వేరుగా ఉన్నాయి. సీఐఎస్ ఎ2కె ప్రణాళికలు ఉన్నాయి కదా. వాటిని ఏ మేరకు సాధించామన్నది విశ్లేషణలతో ఇవ్వండి. అది సరిపోతుంది. ఉదాహరణకు డీఎల్ఐ ప్రాజెక్టుకు ముందు సాహిత్య వ్యాసాలు అభివృద్ధి చేసేందుకు మూలాల కొరత ఉండేది.(నేనే అనుభవించాను చాలావరకూ) తర్వాత అది మెరుగైంది. అలానే ఇన్లైన్ రిఫరెన్సులు ఇచ్చుకునేందుకు ఇదివరకు సభ్యులకు హాండీగా ఉండేది కాదు, ఇప్పుడు ఉంది. అలాగని నివేదిక వ్రాసేప్పుడు 2014 జూన్ నుంచి ఏర్పరిచిన ప్రతీ రిఫరెన్సునూ అంకెల్లో లెక్కవేసి, ప్రతీ సాహిత్య వ్యాసాన్ని చూపించి ఇవన్నీ ప్రాజెక్టు వల్లనే వచ్చాయి అంటే బాగోదు కదా. నివేదిక చదివేవారికి సూచన ప్రాయంగా ఆ విషయం తెలియపరిస్తే సరిపోతుంది. సూటిగా సుత్తిలేకుండా చెప్పాలంటే కార్యప్రణాళిక ఏమాత్రం విజయవంతమైంది? ఎక్కడెక్కడ ఫెయిలైంది? దాని గణాంకాలేమిటి? వంటివి వివరిస్తూ నివేదికలు రాయాలని సూచన. తెవికీలో సీఐఎస్ వారు ప్రత్యక్షంగా పరోక్షంగా చేసే అన్ని పనులూ, వాటి ఫలితాలూ రాయకున్నా ఫర్వాలేదు. కాకుంటే గత ప్రణాళికల గురించి మాత్రం నివేదించినా చాలు. క్రెడిట్ల గురించి కాదు మాట్లాడుతున్నది ప్రణాళికల విజయాపజయాల గురించి మాత్రమే.--పవన్ సంతోష్ (చర్చ) 20:53, 24 ఏప్రిల్ 2015 (UTC)Reply

సీఐఎస్‌కు లాభించడం లాభించకపోవడం

మార్చు

దీన్ని గురించి మీ వ్యాఖ్యల్లో చాలా వివరాలు ఇచ్చుకుంటూవెళ్ళారు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే సూచన ప్రాయంగా కూడా నా ప్రశ్నల్లో కానీ, వ్యాఖ్యల్లో కానీ సీఐఎస్‌కి ఎ2కె కార్యకలాపాల వల్ల ఏమి లాభిస్తోంది అన్న అంశం లేది. నిజానికి అది నా కోణం నుంచి అనవసరం కూడాను. నా వరకూ నేను ఎంచుకుని వ్యాఖ్యలు, ప్రశ్నలు వేసిన అంశాలు ప్రస్తుత ప్రణాళిక, భవిష్యత్తులో వికీపై దాని ప్రభావం, గత ప్రణాళిక-దాని సాఫల్య వైఫల్యాలు(అది కూడా భవిష్యత్ ప్రణాళిక ఎలా అమలుచేస్తారన్న కోణంలోనే తప్ప గతాన్ని తవ్విపోసే ఉద్దేశంతో కాదు). అంతే. మీరిచ్చిన వివరాలు చూశాను. నేను చెప్పిన కోణానికి అవి ఏమాత్రం ఉపకరించనందున, ఊరుకుంటున్నాను. ఇక మరో విషయం ఒక వేళ ఈ సారి FDC గ్రాంటు రాలేదనుకోండి…నాకు తెలిసినంతలో సీ.ఐ.ఎస్.కి ఒరిగే నష్టమంటూ ఏమీలేదు. కాబట్టీ ఈ ప్రణాళిక, FDC గ్రాంటు, ownership మనందరిదీ (అంటే వికీపీడియనులది, ఏ.2.కె ప్రోగ్రాం టీంది) అని మనం గమనించవలసిన అవసరం ఉంది. అని విష్ణు గారు వ్రాశారు పైన. కాకుంటే సీఐఎస్ కి ఏం ఒరుగుతుందో నా పరిధికి బయటి అంశం. దానిపై వ్యాఖ్యానించదలుచుకోలేదు. కానీ ఈ ప్రణాళికపై ownership అన్న విషయం మాత్రం నాకు తెలుసు. ఆ బాధ్యతను ఫీలయ్యాను కాబట్టే దీని మెరుగు చేసేందుకు వ్యాఖ్యానిస్తున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 20:53, 24 ఏప్రిల్ 2015 (UTC)Reply

2013నాటి స్థితితో పోల్చడం

మార్చు

ఇప్పటికే పైన చెప్పాను, మరోమారు చెప్తున్నాను. తెవికీ ప్రగతిలో సీఐఎస్ ఎ2కె వెనుకనుండి కెటలైజ్ చేసిందిగాన తెవికీ ప్రగతిని విశ్లేషించి చూడాలి తప్ప సీఐఎస్ చేసినది అని విడిగా రాయబడ్తే అది వాలంటరీ స్ఫూర్తికి వ్యతిరేకమన్నారు. ఆ క్రమంలోనే కాబోలు గతంలో తెవికీ స్థితి అన్న విషయంపై అర్జున గారు రాసిన నివేదికలో కొన్ని అంశాలు స్వీకరించి ప్రస్తుతం ఏ స్థితికి చేరిందో వ్రాసినారు. మళ్ళీ చెప్పేదేమంటే ప్రణాళిక సాఫ్యలవైఫ్యల్యాలు వ్రాస్తే మనం ప్రణాళికాబద్ధంగా చేసే కృషి తెలుస్తుంది. అలానే మెటా పేజీలో తెవికీ సభ్యుల ప్రతిపాదనల్లో ఎన్నిటికి ఏయే సహకారాలు చేశారో, ఎన్నిటి చేయలేకపోయారో వ్రాస్తే మీ సహకారం తెలుస్తుంది. ఇక వీటికి ఆవల కూడా మీరు కృషిచేశారు-దాన్నీ కొంతవరకూ ప్రస్తావించండి. కానీ వచ్చే ఏడాది ప్రణాళిక విజయవంతమైందో లేదో తెలియాలంటే గత ప్రణాళిక ఫలితాలు తెలిస్తేనే కదా సాధ్యం? అలానే చూడండి కథానిలయం ప్రాజెక్టు గురించి ఎప్పటినుంచో ప్రస్తావనలు చేస్తున్నారు.. మరి దానిని ఇప్పటివరకూ చేయలేకపోవడానికి కారణాలేమిటి? ఈ ఏడూ ప్రస్తావించారు, మీరేం చేద్దామనుకుంటున్నారు అదనంగా, గతంలో జరగని ప్రాజెక్టు ఈ ఏడాది విజయం సాధించేందుకు? సాహిత్యం వేదిక గురించి గత ఏడాది ప్రణాళికలో ఉన్న విషయాలనే ఈ ప్రణాళికలోనూ పెట్టేశారు. మరి గతంలో ప్రణాళిక వేసుకున్నామనీ, జరగలేదని, దానికి కారణాలు ఫలానా అనీ, ఇప్పుడు ఈ విధంగా అధిగమించనున్నామని ఉండాలి కదా?--పవన్ సంతోష్ (చర్చ) 20:53, 24 ఏప్రిల్ 2015 (UTC)Reply

అన్నమయ్య గ్రంథాలయం విషయం

మార్చు

దాన్ని గురించి విశ్వనాధ్ గారు పైన స్పందించారు. చూడండి.--పవన్ సంతోష్ (చర్చ) 20:53, 24 ఏప్రిల్ 2015 (UTC)Reply

ప్రాజెక్టుల గురించి

మార్చు

ట్రయిన్-ద-టెయినర్ కార్యక్రమంలో సుజాత గారు ఇతర తెవికీపీడియనులతో చర్చలమేరకు ప్రణాళికలో ఈ ప్రాజెక్టు చేర్చడం. మీరన్నట్టుగా దీనిపై ఇంకా స్పష్టత తీసుకురావలసిన అవసరం ఉన్నది. ప్రతిపాదన మెరుగుకై సూచనలు సలహాలు ఇవ్వండి. అన్నారు.
తెవికీపీడియన్లు ప్రాజెక్టులు నిర్వహించేవారైతే వారికి ఆర్టికల్ స్ట్రక్చర్ గురించిన మౌలిక అవగాహన, దానిపై ప్రత్యేకమైన అభిరుచి చాలావరకూ ఉంటుంది. ఆ విషయాన్ని ప్రతీ ప్రాజెక్టు గురించి చేసే పనుల్లోనూ సీఐఎస్ చేసిపెడుతుందనో, సహకరిస్తుందనో వ్రాశారు. ఇది వృధాయాసం. ఎవరికైనా తెలియకున్నా సహాయం మూస వాడి అడగవచ్చు, సముదాయమే స్పందిస్తుంది. మూసలు తయారుచేయడం విషయంలో ఇప్పటికే నాకూ అవగాహన వుంది, అలానే వెంకటరమణ గారికి లోతైన ఆసక్తి వుంది. ఆయనో నేనో చేసిపెట్టవచ్చు. ఇలా సముదాయం స్వయంగా చేసుకోదగ్గవి, చేసుకునేవి చేర్చారు. దానికి ఏమిటి అర్థం. గత సంవత్సర ప్రణాళికలోనూ ఈ ప్రోటోటైప్ ఇలాగే వుంది. పైన ప్రస్తావించినట్టు గతంలో ప్రణాళికలో చేర్చి చేయని అంశాలు-కథానిలయం, సాహిత్యం వేదిక వంటివి మళ్లీ దీనిలోనూ చేర్చారు-దాదాపు ఏమార్పూ లేకుండా. మరి గతేడాది ఎందుకు చేయలేదో తెలిపి, ప్రణాళిక ఎలా మలుచుకున్నట్టు ఆ పాఠంతో అన్నది వ్రాసుకోవాలి కదా? ఒక్కమాటలో చెప్పాలంటే ఇలాంటి పాయింట్లు, ప్రాజెక్టులు తీసివేస్తే ప్రణాళిక సాంద్రమవుతుంది.--పవన్ సంతోష్ (చర్చ) 20:53, 24 ఏప్రిల్ 2015 (UTC)Reply

తెవికీ పుష్కరోత్సవం గురించి

మార్చు

తెవికీపీడియన్లు నిర్వహించుకునే పుష్కరోత్సవానికి వారి కోరికమేరకు, ఆశించినంతమేరకు సీఐఎస్ ఎ2కె సహకరిస్తుందని వ్రాశారు. అయితే అటువంటి పుష్కరోత్సవం జరిగేది తెవికీపీడియన్ల చొరవ, కృషితోనే కాకుంటే సీఐఎస్ ఎ2కె ఇక్కడ చెప్పిన కార్యకలాపాలను అలాంటి ఓ వేదిక దొరకడంతో వినియోగించి ప్రణాళికలో ఆ విభాగంలో సూచించిన పనులను ముందుకుతీసుకువెళ్తుందన్నమాట. నాకు మొత్తానికి ఇలా అర్థమౌతోంది.--పవన్ సంతోష్ (చర్చ) 20:53, 24 ఏప్రిల్ 2015 (UTC)Reply

చిన్న నగరాల్లో సముదాయ కార్యకలాపాలు

మార్చు

హైదరాబాదులో మాసిక వికీ మీటప్ లు మొదలవటానికి సముదాయ సభ్యులకు 2013 లో ఏ.2.కె సహాయ సహకారాలని అందించింది. కొత్తలో ఏ.2.కె ఉద్యోగులు చాలా సమావేశాలకి వెళ్ళినా ఇది సముదాయ సభ్యులైన రాజశేఖర, ప్రణయ్ గార్ల ఆధ్వర్యంలో ముందుకు వెళుతుంది. ఏ.2.కె అవసరమున్నంతలో సహాయ సహకారాలు అందిస్తుంది. ఉదాహరణకు, తెవికీ సమావేశాలకు హాజరయ్యే సభులకు ఉపయుక్తంగా ఉంటుందని యూనివర్సిటీ ద్వారా వై.ఫై. సౌకర్యం ఏర్పరచబడింది. ఇక పోతే ఈ సంవత్సరం మిగతా చిన్న నగారాలు పట్టణాలలో తెవికీ సమూహాల ప్రక్రియ చేపట్టి క్రియాశీలంగా జరిగేటట్లు ఏ.2.కె ఉద్యోగులు సహకారాన్ని అందిస్తారు. అన్నారు మీరు. సరే బానేవుంది.--పవన్ సంతోష్ (చర్చ) 20:53, 24 ఏప్రిల్ 2015 (UTC)Reply

తెవికీ శిక్షణల గురించి

మార్చు

అక్కడ తెలిపిన శిక్షణ తెవికీ సభ్యులం మనలో మనకి ఒకరికొకరం ఇచ్చుకునేది. ఒక సమూహంలో శిక్షణకు, వ్యక్తిగతంగా స్కైపులో శిక్షణకు చాలా తేడా ఉంది. సమూహానికి శిక్షణ ఇచ్చేప్పుడు సభ్యులలో అతి మేధావులూ ఉంటారు, చర్చ జరుగుతున్న విషయానికి సంబంధించిన ఎలాంటి జ్ఞానం లేని వ్యక్తులూ ఉంటారు. అటు అజ్ఞానికీ ఇటు మహాజ్ఞానికీ కాకుండా మధ్యస్థంగా ఏదయినా నేర్పవలసి ఉంటుంది. ఇది లోకవిదితమే. అలాంటి శిక్షణలకు హాజరైన ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత లాభం-జ్ఞానం చేకూరుతుంది. ఎంతో కొంత వెలితి-సమయం వృథా అయింది అన్న అనుభవం మేధావులకూ మిగులుతుంది. అన్నారు విష్ణు గారు. కాకుంటే హాకథాన్ సమయంలో అందుకు విరుద్ధంగా సమావేశానికి వచ్చిన ప్రతివారూ అసంతృప్తితో వెళ్ళడం సమావేశానికి హాజరైన నాకు తెలియని విషయం కాదు. సముదాయం నేర్చుకుందామన్న ఉద్దేశంతో కలిసినప్పుడు ముందస్తుగా ఏయే విషయాల్లో శిక్షణ ఇవ్వనున్నారో వివరించి, అందుకనుగుణంగా ప్రణాళిక వేసుకుని అవి వివరించాకా, మిగిలిన వారి కోరకమేరకు, మన వ్యక్తిగతమైన ఆసక్తుల మేరకూ వేరే విషయాలూ ప్రస్తావించవచ్చు. అటు తెవకీలో అనుభవం ఉన్నవారికి తెలిసినవి, తెవికీలో సభ్యత్వం కూడా లేనివారికి అర్థంకానివి వివరిస్తూ మందుకు సాగినప్పుడు నేనూ, కశ్యప్ ఆ క్రమాన్ని అడ్డుకుని కొంతవరకూ సరిజేసే ప్రయత్నం చేశాం.
ఒక కార్యక్రమం ద్వారా మీకు లబ్ది చేకూరనంతమాత్రాన మిగతా వికీపీడియనులకి అది ఉపకరించలేదనుకోలేము. అన్నారు. కార్యక్రమం లోటుపాట్లను అంగీకరించగలగడం రానున్న కార్యకలాపాల విజయానికి తొలిమెట్టు అని నేను నమ్ముతాను. ఇలా చెప్పినా సరే మీకు పనికిరాకున్నా ఎవరో ఒకరికి పనికివచ్చివుంటుంది అంటూ కొనసాగితే అటువంటివే పునరావృతమవుతాయి. సరే, అంతగా విజయం సాధించివుంటే ఆ కార్యక్రమంలో వివరించిన ఉపకరణాలు ఫలానా ఫలానా సభ్యులు వాడడం తర్వాతి నుంచి మెరుగయ్యింది అన్న ప్రత్యక్ష ప్రమాణం ఏదైనా ఉందా? నేను నిందించేందుకు కాక మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నాను అని మీరు అర్థంచేసుకోగలిగితే ఇలాంటి వ్యాఖ్యలు రావు. ఇక వైజాసత్య గారి స్కైప్ కాల్ గురించి ముఖా ముఖీ ఒక్కొక్కరితో శిక్షణ జరిగేప్పుడు అది ఎల్లపుడూ ఎదుటి వ్యక్తి స్థాయిలోనే జరుగుతుంది, అందువలన ఎక్కువ ఫలప్రదమవుతుంది, అన్నారు. నిజానికి ఆ స్కైప్ సమావేశాలకు, వ్యక్తిగతంగా హాజరై సభ్యులను ముఖాముఖీ చూస్తూ చేసే శిక్షణ శిబిరాలకు ఏ పొంతనాలేదు. కేవలం స్క్రీన్ షేర్ చేసి, నలుగురైదుగురు వికీపీడియన్లను ముఖాముఖీ చూడకుండా(వీడియో కాలింగ్ డిసేబుల్ చేశాం) చేసిన శిక్షణ అది. అందుకని నిజానికి అది విఫలం కావాలి లెక్క ప్రకారం. కానీ తద్విరుద్ధంగా అదే విజయవంతమైంది. సర్లెండి ఈ వాదన వల్ల ప్రయోజనం లేదు.--పవన్ సంతోష్ (చర్చ) 20:53, 24 ఏప్రిల్ 2015 (UTC)Reply

ప్రణాళిక అక్కరలేదా అన్న వ్యాఖ్యలకు

మార్చు

కొంత ఉద్వేగపూరితంగా ప్రణాళిక వద్దంటే చెప్పండి అంటూ వ్యాఖ్యానించారు. సీఐఎస్ ఎ2కె ఏ పనీ చేయలేదా? అన్నారు. మిమ్మల్నొకటి అడగదలిచాను-ప్రణాళికను అభివృద్ధి చేసేందుకు మొర్రో అంటూంటే మీకు అలా వ్యాఖ్యానించాలని ఎలా అనిపించింది. పైగా వికీసోర్సులో నేను ఈ ప్రణాళికల అభివృద్ధిపై జరిగిన చర్చను అనుసరించి ఓ ఇనీషియేటివ్ తీసుకున్నాను కూడాను. ఇలాంటి వ్యాఖ్యలు చర్చను శంకరగిరి మాన్యాల బాట పట్టించవూ?--పవన్ సంతోష్ (చర్చ) 20:53, 24 ఏప్రిల్ 2015 (UTC)Reply

ఈ చర్చల outcomes

మార్చు

ఈ చర్చల ఫలితంగా మీరు కొన్ని విషయాల్లో తప్పకుండా చేద్దామనీ, ప్రతిపాదనల మెరుగుకై సూచనల ఇవ్వమనీ వ్రాశారు. ఇంతకీ ఇవన్నీ జరిగాకా ఈ ప్రణాళిక మెరుగనేది ఎప్పుడు జరుగుతుంది. ఈ నెల 30వ తేదీ ఈ సముదాయ చర్చలకు గడువని తెవికీలో ప్రదర్శించిన బానర్లలో చూశాను. ఇంతకీ ఎప్పుడు ఆ చేర్పులు జరుగుతాయి?--పవన్ సంతోష్ (చర్చ) 20:53, 24 ఏప్రిల్ 2015 (UTC)Reply

పవన్ సంతోష్ గారు FDC timeline చూడండీ. కేవలం ప్రపోజల్ పై April 30 వరకు సముదాయ సభ్యుల నుండి చర్చ జరుగుతుంది. ఈ చర్చ జరుగుతున్న సమయంలో ప్రణాళికలో మార్పులు చేయటం అనైతికం. ఇక ఇక్కడ జరిగిన చర్చల ఆధారంగా జూన్ -జులైలో ప్రణాళికలో మార్పులు చేర్పులు చేసి ముందుకు వెళ్ళవచ్చు.--విష్ణు (చర్చ) 18:31, 30 ఏప్రిల్ 2015 (UTC)Reply

ప్రణాళికపై నా వ్యాఖ్యలు

మార్చు

ఈ ప్రణాళికపై చర్చిస్తున్న అందరికీ ధన్యవాదాలు. మిగిలిన సభ్యులందరు కూడా పాల్గొనాలని నా మనవి. ఇదివరకు ఇటువంటి ప్రణాళికపై నేను చర్చించకపోవటానికి కారణం, అనాసక్తితో పట్టించుకోకపోవటం లేదా ప్రాముఖ్యత గుర్తించకపోవటం మాత్రమే కానీ నిరసత్వం కానే కాదు. నేను సి.ఐ.ఎస్ కార్యక్రమాలలో ప్రత్యక్షంగా పాల్గొనలేదు కావున వాటి గురించి నాకు పెద్దగా ఏమీ అభిప్రాయాలు లేవు. పుష్కరోత్సవం ప్రణాళిక మరియు పనులు మాత్రం కాస్త ముందుగా మెదలుపెడితే బాగుంటుంది. ప్రాజెక్టులు చాలా ప్రతిపాదనలో ఉన్నట్టున్నాయి. ఇవి ప్రస్తుత వికీ స్థాయికి చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి. జాబితా తగ్గించకపోయినా, ఒక సంవత్సరం ప్రస్తుతం ఉన్నవాటితో పాటు, ఈ ప్రతిపాదిత ప్రాజెక్టులపై పనిచేస్తే బాగుంటుంది. వచ్చే ఏడాది దాకా కొత్త ప్రాజెక్టలు ప్రారంభించకపోతే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి మూడు రోజులకొకసారి మనం ఒక కొత్త ప్రాజెక్టు వైపు పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది. ఈ ప్రణాళిక విజయవంతం చేయటానికి నా వంతు సహాయసహాకారాలు అందించగలను --వైజాసత్య (చర్చ) 23:02, 2 ఏప్రిల్ 2015 (UTC)Reply

వైజాసత్య గారు మీరు ప్రణాళిక ప్రాముఖ్యతను గుర్తించి మీ సూచనలు, సహాయసహకారాలు అందిస్తాననడం ముదావహం. మీరు ప్రణాళిక విజయానికి చేయందిస్తాననడం మన ఈ ప్రణాళికకు మొదటి విజయం. --విష్ణు (చర్చ) 03:43, 5 ఏప్రిల్ 2015 (UTC)Reply
వైజాసత్యగారు లక్ష్యాల గురించి మీరు చేసిన సూచన గురించి గత వారం రోజులుగా ఆలోచిస్తున్నానండి. మనం గ్లోబల్ మెట్రిక్స్ ప్రకారంగా లక్ష్యాలను పెట్టాం. ప్రపంచ వ్యాప్తంగా మన ప్రణాళికను చూసి దానితో ఏ వికీపీడియనైనా engage చేయాలి అంటే ఈ మెట్రిక్స్ దోహదపడతాయి అని నా కనిపిస్తుంది. మిగతా భారతీయ భాషా వికీపీడియనులతో నేను చేసిన చర్చలలో నా స్వానుభవం కూడా. మీరు ఇచ్చిన సూచనలు బాగున్నాయి, వాటి ఆధారంగా కూడా లక్ష్యాలు నిర్ణయించడానికి ప్రణాళికను రివైజ్ చేసి ఫైనలైజు చేసేటప్పుడు (జులైలో) ప్రయత్నిద్దాం.--విష్ణు (చర్చ) 08:17, 17 ఏప్రిల్ 2015 (UTC)Reply
విష్ణు గారూ, మెట్రిక్స్ చూసాను. అందరూ కొన్ని కొలబద్దలపై తమ ప్రగతిని నివేదించడానికి ఇవి రూపొందించారు. ఇవి నివేదించడానికి పనిచేస్తాయి. కానీ ఇవే లక్ష్యాలు కానవసరం లేదు (Goals vs Metrics/ Quantitative reportable outcomes) --వైజాసత్య (చర్చ) 02:15, 29 ఏప్రిల్ 2015 (UTC)Reply

తెవికీ బస్సు ప్రతిపాదన ఏమైంది?

మార్చు

గత సంవత్సరపు తెవికీ బస్సు ప్రతిపాదన ఏమైంది. గతంలో అమలు కాకున్నా కొత్త ప్రణాళికలో ఎందుకు చోటుచేసుకోలేదు?--అర్జున (చర్చ) 11:08, 16 ఏప్రిల్ 2015 (UTC)Reply

meta:India_Access_To_Knowledge/Work_plan_July_2014_-_June_2015#Stand-alone_Wikimedia_Projects విభాగంలో Plans under suspension లో ఈ ప్రాజెక్టును గమనించగలరు. మానవ వనరుల లేమి, బడ్జెట్ లో గల కోత కారణంగా ఈ ప్రాజెక్టు చేపట్టడం లేదని తెలపటం జరిగింది. ఈ విషయమై తెవికీ సముదాయానికి తెవికీలో తెలపకపోవడం తప్పిదమే. అందుకుగాను క్షమాపణలు కోరుతున్నాను. ఇక సీ.ఐ.ఎస్-ఏ.2.కె ప్రోగ్రాం లీడర్ షిప్లో మార్పు జరగబోతున్న సంగతి మీకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలాంటి కొత్త, భారీ కార్యక్రమం చేపట్టటం సరియైనది కాదని ప్రణాళికలో పెట్టలేదు.--విష్ణు (చర్చ) 07:37, 18 ఏప్రిల్ 2015 (UTC)Reply
స్పందనకు ధన్యవాదాలు. తెవికీ బస్సుకి 83.5 శాతం (రూ970000/రూ1156000)వికీమీడియా ఫౌండేషన్ కాని వనరుల నుండి సేకరించుతామన్నప్పుడు ఈ ప్రాజెక్టుని నిలపవలసింది కాదే. దాని నాకర్ధమవుతున్నదేమంటే ఈ ప్రణాళిక లో పెద్దగా సాహసం చేసే అంశాలు, సృజనాత్మకతగల అంశాలు లేవనిపిస్తుంది.అలాంటప్పుడుఈ ప్రణాళిక తెలుగువికీఅభివృద్ధికి పెద్దగా దోహదపడదు.--అర్జున (చర్చ) 02:35, 26 ఏప్రిల్ 2015 (UTC)Reply

సంస్థాగత భాగస్వామ్యాల స్థితి.

మార్చు

2013ప్రణాళిక లో 9 ఉన్నతవిద్యాసంస్థలతో సంప్రదించి భాగస్వామ్యం చేయడం, తెలుగు వికీని బోధనాంశంగా చేయడం ప్రతిపాదన వుంది. 2014-15ప్రణాళికలో కూడా 8 సంస్థలను గుర్తించడం జరిగింది.ఈ సంవత్సరం ప్రణాళికలో రెండు సంస్థలతో MOU జరిగిందని తెలిపారు. MOU వివరాలు తెలియచేయండి. --అర్జున (చర్చ) 11:24, 16 ఏప్రిల్ 2015 (UTC)Reply

ఆంధ్ర లొయోల కళాశాలతో జరిగిన సంస్థాగత భాగస్వామ్యం గురించిన బ్లాగు టపా ఇక్కడ చూడగలరు. ఈ విషయం హిందూ పత్రికలో వార్తగా కూడా వచ్చింది. ఈ భాగస్వామ్యం ద్వారా జరిగే విషయాలు ఆంఢ్ర లొయోల కళాశాల ప్రాజెక్టు పేజీలో చూడగలరు.--విష్ణు (చర్చ) 08:00, 18 ఏప్రిల్ 2015 (UTC)Reply
స్పందనకు ధన్యవాదాలు. #వికీప్రాజెక్టు ఆంధ్ర లొయోల కళాశాల విశ్లేషణ లో కొన్ని అంశాలు చర్చకు పెట్టాను. స్పందించండి. ఇక TISS, Hyderabad తో MOU వివరం తెలియచేయండి. --అర్జున (చర్చ) 02:40, 26 ఏప్రిల్ 2015 (UTC)Reply

కెబిన్ కళాశాల స్థితి

మార్చు

2014 దశాబ్ది ఉత్సవాలకు ఆతిథ్యమిచ్చిన కెబిఎన్ కళాశాల వికీపీడియాని ప్రోత్సహించడానికి విద్యార్థులకు ప్రతి సంవత్సరం పోటీలు ఏర్పాటుచేసి,బహుమతులు ఇస్తానని వాగ్ధానం చేసింది. అది అమలయ్యిందా? ఈ సంవత్సరం జాబితాలో ఆ సంస్థ పేరు ఎందుకు లేదు?--అర్జున (చర్చ) 11:24, 16 ఏప్రిల్ 2015 (UTC)Reply

కెబిఎన్ కళాశాల యాజమాన్యంలో మార్పులు, ఉపాధ్యాయులు (జాన్సన్ తప్ప) ఆసక్తి చూపకపోవడం వలన నిరుడు వారన్న పనులు జరుగలేదు . కళాశాల యాజమాన్యం ఆసక్తి లేమి వలన ఈ సంవత్సరం జాబితాలో ఆ సంస్థ పేరు పెట్టలేదు.--విష్ణు (చర్చ) 08:00, 18 ఏప్రిల్ 2015 (UTC)Reply
స్పందనకు ధన్యవాదాలు. ఈ పరిమాణం ఆశా భంగమే. కాకపోతే దీనిని విశ్లేషించి, పాఠాలునేర్చుకొని కొత్త భాగస్వామ్యాలలో ఇలా జరగకుండ జాగ్రత్తపడాలి.ఆ దిశగా ఏమైనా తెలిపితే మంచిది. రెండున్నర సంవత్సరాలపైగా కృషి చేస్తున్నా సిఐఎస్-ఎ2కె తోడ్పాటు లేకున్నా తెలుగు వికీకి భౌతిక తోడ్పాటు తప్పించి సంస్థాగతంగా కొనసాగుతాయన్న భాగస్వామ్యాలు లేకపోవడం పెద్దలోటుగా నేను భావిస్తున్నాను. --అర్జున (చర్చ) 02:45, 26 ఏప్రిల్ 2015 (UTC)Reply

అర్జున గారు ఇప్పటికే ఏ.2.కె పనిచేస్తున్న ప్రతీ భాషలోను సంస్థగత భాగస్వామ్యాలు చేయడం జరిగింది. ఇవన్నీ కలిపితే 10కి పైగే ఉంటాయి. అయితే తెలుగు మనం గత రెండు సంవత్సరాలనుండి చాలా కృషి చేస్తునా అంతగా సఫలీకృతమవలేకపోవడానికి రాజకీయ అనిశ్చితి తరువాత ప్రస్తుత పరిపాలనా అనిశ్చితి. ఒక సారి తెలుగు పేపర్లు లేక తెలుగు ప్రాంతంలో వచ్చే ఆంగ్ల పేపర్లు తిరగేస్తే విషయం విదితమవుతుంది. ఉదాహరణకు, తెలుగు విశ్వవిద్యాలం నుండి వారు ప్రచురించిన అనేక విజ్ఞాన సర్వస్యాలు ఇత్యాది పుస్తకాలు క్రియేటివ్ కామన్స్ లైసెన్సులో తేవడానికి అనేక చర్చలు మీటింగులు జరిగాయి. వాటికి సంబంధిత అధికారులు వాక్కురూపేణా ఒప్పుకోవడం జరిగింది. కాకపోతే పరిపాలనా పరంగా ఎంతో అనిశ్చితి ఉంది. ఒక డెసిషన్ తీసుకోడానికి ముందుకురాని పరిస్థితి. ఇంకో ఉదాహరణ, మీరు కుప్పంలో ఉన్న ద్రావిడ విశ్వవిద్యాలంలో 2012 వికీ శిక్షణా శిబిరం నిర్వహించారని దానితో భాగస్వామ్యం చేస్తే బాగుంటుందని సూచన చేసారు. అందుకని అనేక మార్లు వారికి ఫోన్లే కాకుండా, విశ్వవిద్యాలయానికి (సొంత ఖర్చులపై) నేను వెళ్ళడం జరిగింది. అక్కడి అధికారులు ఇచ్చిన స్పందన చూస్తే ఇంకోసారి ఆ విశ్వవిద్యాలయానికే వెళ్ళలేము. అలాగే 2013 సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లో శిక్షణ శిబిరం తరవాత ఎన్నో మార్లు ప్రయత్నించడం జరిగింది, కాని అసలు రెస్పాన్స్ ఉంటేగా. చెప్పొచ్చేదేంటంటే చాలా ప్రయత్నాలు జరిగాయి అనేక కారణాల వలన సఫలం కాలేదంటే. అలా అని ప్రయత్నాలని విరమించలేదు. ఈ సంవత్సరం లో తప్పక కొన్ని మంచి వార్తలు వినే సూచన ఉంది.
ఇక మీరు ప్రశ్నలు అడిగారని కాదు కాని, మీరు అడిగీ అడగముందే ఎ.2.కే ఏమి చేయలేదని నిర్ధారణకు (conclusion) వచ్చేస్తున్నారు. మీ చర్చంతా కూడా ఎ.2.కె విఫలత మీద ఎక్కువగా మన తెవికీ సఫలత మీద తక్కువగా అనిపిస్తుంది. --విష్ణు (చర్చ) 11:02, 30 ఏప్రిల్ 2015 (UTC)Reply

మన తెలుగు వికీ అవసర పునర్విశ్లేషణ గురించి

మార్చు

అ‌వసరాల స్థితి లో పేర్కొన్నదానిని నిర్ధారించడానికి మరిన్ని వివరాలు, గణాంకాలు ఈక్రింది విభాగాలలో తెలియచేయండి.

ఉత్సవాలు

మార్చు

పెద్ద ప్రచార ఉద్యమాలు చేసేటప్పుడు, మొదటలో తప్పటడుగులు వేసినా కనీసం మూడవ సారి చేసేసరికి బాగా నైపుణ్యంతో చేయగలగాలి. మరియు ఇటీవలి జరిగిన ఉత్సవాలు ఇంతకు ముందు జరిగిన వాటికన్నా బలహీనంగా వున్నవని చర్చలలో స్పష్టమైంది.ఇలా ఎందుకు జరిగింది? మరల వచ్చేసంవత్సరం ఇలా జరగకుండా మౌలికమైన మార్పులు ఏమి చేపట్టబోతున్నారు?--అర్జున (చర్చ) 11:47, 16 ఏప్రిల్ 2015 (UTC)Reply

దశాబ్ది ఉత్సవాలకన్నా ఈ సారి వార్షికోత్సవాలలో తెవికీ సముదాయ సభ్యులు సమావేశ నిర్వహణలో ఎక్కువ క్రియాశీలకంగా చేయాలి అని అనికున్నాం. అయితే కొన్ని ఒడిదుడుకులు ఎదురుకొనడం జరిగింది. అయితే కొందరు కార్యవర్గ సభ్యులు సమావేశం ఇంకా బాగా చేస్తే బాగుండేది అని అభిప్రాయపడిన మాట వాస్తవమే. కాని రెండు రోజుల వార్షికోత్సవం సుసంపన్నంగా జరిగిందని మిగతా కొందరు సభ్యులు అభిప్రాయపడ్డారు. ఇక ఇప్పటికే సముదాయంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించగలిగే అనుభవం చాలా మందిలో వచ్చింది. ఏ.2.కె వారికి అభ్యర్థించిన విధంగా సహాయసహకారాలు అందిస్తే సరిపోతుంది. ఇక మునుముందు చేసే వార్షికోత్సవాలలో మనం దృష్టిలో ఉంచుకోవలసిన సూచనలు. కార్యక్రమ పనులు ఆఖరి నిముషం వరకు ఆగకుండా కొంత ముందే మొదలు పెట్టుకోవటం, కార్యవర్గ సభ్యులు ఆన్-లైన్ చర్చలకు నిర్ణీత సమయం కేటాయించుకొని సమయపాలన చేయటం, ప్రాధాన్యతలను ఏర్పరచుకొని చర్చలను చేయటం, ప్రతీ చర్చా సారాంశాలను ఇంకా మెరుగ్గా తెవికీ సముదాయంతో పంచుకొనడం, సభ్యుల అందరూ తాము ఒక పనిని చేస్తామని అన్నప్పుడు దానిని నిబద్దతగా చేయడం, కార్యవర్గ సభ్యుల మధ్య communication gap లేకుండా చూసుకోవడం.--విష్ణు (చర్చ) 08:19, 18 ఏప్రిల్ 2015 (UTC)Reply
స్పందనకు ధన్యవాదాలు. రెండు కార్యక్రమాలకు ప్రత్యక్షంగా తోడ్పడడం, పాల్గొనడం చేసిన వ్యక్తిగా ఇవేమీ కొత్తగా నేర్చుకున్నవిగా కనబడలేదు. వికీలోపనిచేసేవారికి ప్రాజెక్టు నిర్వహణ నైపుణ్యాలుండాల్సిన అవసరంలేదు. ఇలాంటి లోటుని సిఐఎస్-ఎ2కె పూడ్చగలదని అనుకుంటే సిఐఎస్ కేవలం ధనవితరణ చేస్తే సరిపోతుందన్న అభిప్రాయంతో నేను ఏకీభవించలేను. --అర్జున (చర్చ) 02:15, 26 ఏప్రిల్ 2015 (UTC)Reply
"సిఐఎస్ కేవలం ధనవితరణ చేస్తే సరిపోతుందన్న అభిప్రాయంతో నేను ఏకీభవించలేను" ఎక్కడ ఎవరు ఈ అభిప్రాయాన్ని ఇచ్చారు?
ప్రతీ సారి కొత్తగా నేర్చుకోవలసిన విషయాలు ఉండాల్సిన అవసరంలేదు. చాలా సార్లు తెలిసిన విషయాలైనా మనం చేయలేకపోతాం. తెవికీలోనూ, కార్యక్రమాల నిర్వహణలోను ఇవి వర్తిస్తాయి.
రెండు కార్యక్రమాలలొ మీరు పాల్గొన్నారు కాని ప్రత్యక్షంగా తోడ్పడింది కొంత మేరకే. భవిష్యత్తులో మీరు ఇలాంటి కార్యక్రమాల నిర్వహణలో ఇంకా ఉత్తేజకరంగా తోడ్పాటు అందజేస్తారని ఆశిస్తున్నాను.--విష్ణు (చర్చ) 09:41, 30 ఏప్రిల్ 2015 (UTC)Reply

నెలవారీ సమావేశాలు

మార్చు

నెలవారీ సమావేశాలు కేవలం హైద్రాబాదుకే ఎందుకు పరిమితమయ్యాయి? సిఐఎస్ ప్రధాన కార్యాలయమైన బెంగుళూరులో ఎందుకు పుంజుకోలేదు? ఉద్యమం బలపడాలంటే కనీసం ఎన్ని చోట్ల ఇలాంటి సమావేశాలు జరగాలి? --అర్జున (చర్చ) 11:47, 16 ఏప్రిల్ 2015 (UTC)Reply

బెంగుళూరులో భౌగోళికంగా తెవికీ సభ్యులు దూరభారాల వలన రాలేకున్నారు. చురుకుగా ఉన్న సభ్యులు వ్యస్తమవడం, వీరశశిధర్ లాంటి వారు కర్నూల్ కు స్థానాంతరం చెందడం వలన సమావేశాలు జరగలేదు. సమూహ సభ్యులు చొరవ తీసుకుంటే సీఐఎస్ ప్రధాన కార్యాలయం ఎప్పుడూ స్వాగతిస్తుంది. బెంగుళూరులో మీరు చొరవ తీసుకొని నెలవారీ సమావేశాలు మొదలుపెట్టగలరు. ఇన్ని అని లేదు. ఎన్ని ఎక్కువ చోట్ల ఈ సమావేశాలు జరిగితే అంత మేలు. అందుకే చిన్న నగరాలు, పట్టణాలలో మొదలుపెట్టడానికే మన ప్రణాళికలో ఒక ప్రాజెక్టు చేర్చాం. రాజశేఖర, ప్రణయ్ గార్లు ఎలా అయితే ఒక పట్టుదలతో హైదరాబాదులో సమవేశాలు చేస్తున్నారో ఆలాంటి పట్టుదలతో సభ్యులు ఎక్కడైనా ఈ సమావేశాల నిర్వహణకి బాధ్యత తీసుకోవచ్చు. ఏ.2.కె తప్పక సహాకరం అందిస్తుంది. --విష్ణు (చర్చ) 08:29, 18 ఏప్రిల్ 2015 (UTC)Reply
దూరభారాల వలన రాకుంటే స్కైప్ అనుసంధానంతో చేయవచ్చును కదా. బెంగుళూరు సమావేశాల దిశగా ప్రయత్నించి వీరశశిధర్ గారిని ప్రేరేపించిన వ్యక్తిగా (చూడండి వికీపీడియా:సమావేశం/బెంగుళూరు/2 జూన్ 2013), ఈ సమావేశాలను కొనసాగించడానికి సిఐఎస్-ఎ2కె ప్రాధాన్యత చూపకపోవడం నిరాశ కలిగించింది. సమావేశాలకి కేవలం కార్యాలయమే అవసరమైతే అటువంటి కార్యాలయాలు చాలా సంస్థలనుండి పొందవచ్చు. సిఐఎస్-ఎ2కె ఉత్ప్రేరకంగా పనిచేస్తున్నదనటానికి, సముదాయం బలహీనంగా వున్న చోట్ల బలపడేటట్లు చేయగలగాలి. తొలిదశలో నాయకత్వం తీసుకోవాలి. స్వచ్ఛంధ సభ్యులు ముందుకు రావటాన్ని ప్రేరేపించగలగాలి. ప్రస్తుత అనుభవాన్ని బట్టి చూస్తే చిన్న నగరాలు, పట్టణాలలో సమావేశాలు ప్రణాళికలో చేర్చటం జరగవచ్చు కాని అది సఫలమవుతుందన్న ఆశ కనబడడం లేదు. --అర్జున (చర్చ) 02:24, 26 ఏప్రిల్ 2015 (UTC)Reply
హైదరాబాదులో సమావేశాలు నెలవారీ జరిగేలా మొదట్లో చొరవ తీసుకున్నది సీ.ఐ.ఎస్-ఏ.2.కె సభ్యులన్నది నిస్సందేహం. బెంగుళూరులో మీరు ఎన్నో ఏళ్ళుగా ఉన్నా జూన్ 2013 నాటికే ఎందుకు ప్రేరేపించగలిగారు?
ఔత్సాహికుల అందుబాటుని అనుసరించి మీరు చెప్పిన విధంగా స్కైప్ అనుసంధానం ద్వారా చేయటానికి ప్రయత్నించవచ్చు. అలా ఇప్పటికే హైదరాబాదు సమావేశాలలో మనవాళ్ళు పాల్గొనటం చేస్తూవున్నారు. అందుకోసం గోల్డెన్ త్రెషోల్డ్లో వ్యవస్థ చేయడానికి కృషి చేయడం జరిగింది.
మీరు తెలుగు వికీపీడియనులతో స్కైపులో/ఆఫ్ వికీ మాధ్యామలలో (ముఖ్యంగా వైజాసత్య గారు, రాజశేఖర గారు, సుజాత గారితో) తెవికీ గురించి చర్చించేవారు అన్నారు. వాటి అనుభవం ఎలా ఉందో తెలియజేయండి. దానిని బట్టీ ఇంకా మెరుగు పరచుకుందాం --విష్ణు (చర్చ) 09:48, 30 ఏప్రిల్ 2015 (UTC)Reply

శిక్షణాశిబిరాలు

మార్చు

శిక్షణాశిబిరాలు ఒక పెద్ద అ‌వసరంగా మొదటి ప్రణాళిక నుండి వుంది. దానికి సంబంధించిన సమాచారం విశ్లేషించుదామని ప్రయత్నిస్తే ప్రాథమిక సమాచారం తెలపగల పట్టిక కనబడలేదు. కనుక వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీ శిక్షణ శిబిరాలు ప్రారంభించాను. దానిలో వివరాలు చేర్చి,శిక్షణాశిబిరాలు మెరుగుపరచడానికి తీసుకున్న చర్యలేమిటి, ముందు ఏ విధంగా చేయదలచారు. ఇప్పటికే TTT ద్వారా శిక్షణ పొందిన వారు ఎంతవరకు , ఈ శిక్షణను కొనసాగించే అవకాశం వుంది తెలియచేయండి. --అర్జున (చర్చ) 11:47, 16 ఏప్రిల్ 2015 (UTC)Reply

ఇప్పటికే వికీపీడియా:శిక్షణ_శిబిరం వద్ద చాలా మటుకు సమాచారం అందుబాటులో ఉంది. ఇక టీటీటీ ద్వారా శిక్షణ పొందిన సమూహ సభ్యులైన విశ్వనాథ్, ప్రణయ్ తమ వంతుగా వారు చేస్తున్న శిక్షణ శిబిరాలను పొందుపరుస్తున్నారు.అయితే భవిష్యత్తులో వికీ శిక్షణ శిబిరాలు అనేకం జరగటానికి మనం బీజం మాత్రమే వేసాము. ఇంకా పెంపొందించుకోవాల్సిన అవసరం మనందరి బాద్యత.--విష్ణు (చర్చ) 09:55, 30 ఏప్రిల్ 2015 (UTC)Reply

వికీపీడియన్లకి గుర్తింపు

మార్చు

వికీపీడియన్లకి గుర్తింపు సంబంధించి విజయవంతంగా చేశామని తెలిపారు? దానికి సిఐఎస్ చేసిన కృషి ఏమిటి? గత సంవత్సరం వాడిన పద్ధతిని ఈ సంవత్సరం అదే విధంగా వాడినట్లు కూడా వికీపీడియా చర్చలు, పేజీలలో కనిపించలేదు? కొత్త విధానాలు అన్వేషిస్తామని తెలిపారు? వాటి గురించి చూచాయగా వివరిస్తారా?--అర్జున (చర్చ) 13:07, 16 ఏప్రిల్ 2015 (UTC)Reply

ఓపెన్ సోర్స్ సంస్కృతి

మార్చు

ఓపెన్ సోర్స్ సంస్కృతి లక్ష్యం సాధించలేకపోయామని తెలిపారు. ఈ దిశగా ఎదుర్కొన్న ఇబ్బందులేమిట? రెండేళ్లుగా సాధించలేకపోయినదానిని సాధించడానికి కొత్తగా చేయబోయేదేమిటి?--అర్జున (చర్చ) 11:47, 16 ఏప్రిల్ 2015 (UTC)Reply

ఏమీ సాధించలేదని చెప్పలేదు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సీడీలు పంచిపెట్టినా వాటి వాడుక జరుగలేదు. లొయోల కళాశాలలో ఒక ౩౦ కంప్యూటర్లు స్వేచ్ఛా సాఫ్టువేర్ తో స్థాపించబడ్డాయి. స్వేచ్ఛా సాఫ్టువేర్ వారి వివిధ కార్యశాలల్లో మీడియావికీ విషయాన్ని చేర్చే దిశగా పనులు జరుగుతాయి. మన సభ్యులలో కొందరికి ఓపెన్ సోర్స్ సంస్కృతిపై అవగాహన పెంపొదించేందుకు కృషి జరుగుతూనే వుంది. దీనిని ఇంకా బలీయం చేయాలి.--విష్ణు (చర్చ) 09:57, 30 ఏప్రిల్ 2015 (UTC)Reply

సాంకేతిక సహాయం

మార్చు

సాంకేతిక సహాయం కూడా గత రెండేళ్లుగా ప్రధానమైన అ‌వసరంగా వుంది. గత సంవత్సరంలో తెలుగు వికీలకు సంబంధించి ఎన్ని అవసరాలు ఏర్పడ్డాయి? వాటి వివరాలు? ఎంతవరకు పరిష్కారమయ్యాయి? సభ్యులకు అవగాహన ఎంతవరకు పెరిగింది అంటే ఎంతమంది కొత్తగా సభ్యులు బగ్ నమోదుచేయగలిగే స్థితికి చేరారు? --అర్జున (చర్చ) 11:47, 16 ఏప్రిల్ 2015 (UTC)Reply

ఈ వివరాలు సమగ్రంగా సీ.ఐ.ఎస్-ఏ.2.కె అభ్యర్థన పేజీ దాని చర్చా పేజీలలో చూడగలరు.--విష్ణు (చర్చ) 10:00, 30 ఏప్రిల్ 2015 (UTC)Reply

బడ్జెట్ మరియు ఖర్చులు

మార్చు

బడ్జెట్ లో ఇతరుల నుండి పొందే సహాయం 46.37% (290,800/627,048) గా చూపారు. గత సంవత్సరం ఎంతశాతంగా వుంది. నగదు రూపంలో చేరినదెంత మరియు ఇతరత్రా విలువకట్టిన దెంత?--అర్జున (చర్చ) 11:59, 16 ఏప్రిల్ 2015 (UTC)Reply

వివరాలు బడ్జెట్ చర్చలో గత సంవత్సరపు ప్రొపోజల్ చర్చా పేజీలో చూడగలరు. సీ.ఐ.ఎస్ కి చేరినది ఏమి లేదు. నగదు రూపకంగా సీ.ఐ.ఎస్. తన ఇతర గ్రాంటులనుండి తెలుగుకి గాను ఖర్చు చేసింది 60,000 వేల పైచిలుకు ఉంటుంది. ఇతర వనరులనుండి దాదాపు ఇప్పటీకే చూచాయగా 2,50,000 లక్షలవరకు మనం మొబిలైజ్ చేయగలిగాము. వీటికి సంబందించి వివరాలు ప్రాజెక్టు చివర చేసే రిపోర్టులో ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. ప్రస్తుతానికి ఇంత కంటే ఎక్కువ వివరాలు ఇవ్వడానికి సమయం వెచ్చించలేనందుకు చింతిస్తున్నాము.--విష్ణు (చర్చ) 10:10, 30 ఏప్రిల్ 2015 (UTC)Reply

కరపత్రాలు, పుస్తకాల ముద్రణ

మార్చు

గతసంవత్సరంలో తయారైన కరపత్రాలు, పుస్తకాల లింకులు వాటి మూలాలు తెలపండి. ప్రత్యేక ప్రాజెక్టులో ఉదాహరణగా చూపెట్టబడిన వికీపీడియాలో రచనలు చేయుట పుస్తకం అచ్చు వేశారా? వాటిని ఇంకొంత అభివృద్ధి చేయాలంటే వాటి మూలరూపాలు ఎక్కడ? వాటికై కృషి చేసినవారికి తగిన గుర్తింపులు పుస్తకపు సమాచారం దగ్గర ఇచ్చారా?--అర్జున (చర్చ) 13:03, 16 ఏప్రిల్ 2015 (UTC)Reply

తెలుగులో ఎలాంటి కరపత్రాలూ, పుస్తకాలు కొత్తగా ముద్రించలేదు. --విష్ణు (చర్చ) 10:11, 30 ఏప్రిల్ 2015 (UTC)Reply

వికీవిధానాల రూపకల్పన మరియు మెరుగు

మార్చు

వికీవిధానాల రూపకల్పన మరియు అమలు చేయడంలో తెలుగు వికీ వెనుకబడింది అని రెండు సంవత్సరాల క్రిందే గుర్తించారు? పాక్షికంగా విజయం సాధించామని తెలిపారు. ఆ దిశగా సిఐఎస్ ఏమి ప్రయత్నాలు చేసింది.దానినుండి నేర్చుకున్నదేమిటి. ప్రస్తుతంఒక రకంగా పాత పరిస్థితే కొనసాగుతున్నదని రచ్చబండలో చర్చలు చూస్తే తెలుస్తున్నది. --అర్జున (చర్చ) 13:22, 16 ఏప్రిల్ 2015 (UTC)Reply

రచ్చబండలోని కొన్ని చర్చల ద్వారా కొందరు సీనియర్ సభ్యులకి కూడా వికీ మూలస్తంభాల మీద అవగాహన లేదని గుర్తించాము. ఇది ఊహించని విషయం. కరపత్రాలు రూపొందించి ఇలాంటి విషయాల మీద మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. అలానే వికీపీడియాకు సంబంధించిన ఇలాంటి మౌలిక విషయాలు తెలిపే వీడియోల రూపకల్పన కోసం ఇప్పటికే సమూహంతో వీడియో స్క్రిప్ట్ దస్త్రాలు పంచుకోవడం జరిగింది. ఆ విషయమై సముదాయ సభ్యుల నుండి మరింత స్పందన ఆశిస్తున్నాము. --విష్ణు (చర్చ) 10:13, 30 ఏప్రిల్ 2015 (UTC)Reply

సమిష్టి కృషికి పథకాలు?

మార్చు

నాణ్యత పెరగాలంటే సమిష్టి కృషి జరగాలి.ఆ దిశగా జరిగిన వివరాలు, విశ్లేషణ తెలపండి? దానిని ఇంకా అభివృద్ధి చేయడానికి ఏం చేయబోతున్నారు --అర్జున (చర్చ) 13:25, 16 ఏప్రిల్ 2015 (UTC)Reply

పూర్తి బడ్జెట్ అందకపోతే ప్రాధాన్యతలేంటి?

మార్చు

గతంలో పూర్తి బడ్జెట్ అందలేదు కావున, ఈ సంవత్సరం కూడా అలా జరిగితే మీ ప్రణాళికలో మొదటి మూడు ప్రాధాన్యతల వివరాలు తెలపండి? --అర్జున (చర్చ) 13:27, 16 ఏప్రిల్ 2015 (UTC)Reply

భాషా ప్రాజెక్టులే మొదటి ప్రాధాన్యతలు. ఇవి అత్యంత కఠినమైన పనులే అయినా, ఎ.2.కే వీటికి కట్టుబడి ఉంది.--విష్ణు (చర్చ) 10:17, 30 ఏప్రిల్ 2015 (UTC)Reply

విష్ణుగారి సుదీర్ఘ లేఖ

మార్చు

విష్ణుగారి సుదీర్ఘ ప్రత్యుత్తర లేఖను చూసిన పిదప ఒక పాఠకుడిగా, ఎవరికీ చెందని వ్యక్తిగా మనసులోని మాటలు వ్రాయాలని ఉంది. అది ఒక విధంగా ఎవరి వైపు మొగ్గు చూపించినట్లు ఉండదు. చివరికి పాఠకుడిగా పొందు పరచిన పిదప ఒక వాడుకరిగా రెండింటికీ చెడ్డ రేవడిలా కావచ్చునేమో అని అనుమానం.JVRKPRASAD (చర్చ) 01:09, 18 ఏప్రిల్ 2015 (UTC)Reply

జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారు సూచనలు ఎల్లప్పుడూ స్వాగతించదగినవే. మనం చర్చ చేస్తున్నది తెవికీ మెరుగుకోసమే కదా. మీరు తప్పకుండా మీ సూచనలు తెలియజేయండి. --విష్ణు (చర్చ) 08:34, 18 ఏప్రిల్ 2015 (UTC)Reply

వికీప్రాజెక్టు ఆంధ్ర లొయోల కళాశాల విశ్లేషణ

మార్చు

వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర_లొయోల_కళాశాల గత సంవత్సరంలో ప్రారంభించిన ప్రధాన ప్రాజెక్టుగా ప్రణాళికలో మరియు చర్చలలో తెలపబడింది. దీనిగురించి మరి కొంత తెలుసుకొనే ప్రయత్నం చేసితెలిసినవి పొందుపరుస్తున్నాను. దీనిపై సిఐఎస్-ఎ2కె సభ్యులు , సహసభ్యులు స్పందించింతే ఈ ప్రాజెక్టుని మరింత ఉపయోగకరంగా చేయటం వీలవుతుంది.

మీరు ఈ ప్రాజెక్టుపై ఇప్పటికైనా చొరవ తీసుకుని సూచనలు అందజేయడానికి ప్రయత్నించినందులకు ధన్యవాదాలు. వీటిని ఆ ప్రాజెక్టు చర్చా పేజిలో చేరిస్తే మునుముందు ప్రాజెక్టులు చేయాలనుకున్నవారికి వీలుగా ఉంటుంది. --విష్ణు (చర్చ) 10:37, 30 ఏప్రిల్ 2015 (UTC)Reply

ఒప్పందం

మార్చు

వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర లొయోల కళాశాల చూడండి. దీనికై వికీపీడియా సభ్యులతో చర్చించినట్లు తెలియలేదు. కేవలం రచ్చబండలో వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_34#ఆంధ్ర లయోలా కాలేజీతో సీఐఎస్-ఏ2కే సంస్థాగత భాగస్వామ్యం, వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_36#విజయవాడ ఆంధ్ర లొయోల కళాశాలలో వికీపీడియా చర్చలు మాత్రమే కనబడ్డాయి. ప్రాజెక్టు కి సహసభ్యుల సహకారం ముఖ్యమైతే MOU ప్రతిపాదన చిత్తుప్రతిని సభ్యులతో చర్చించి వుండాలి కదా. --అర్జున (చర్చ) 02:09, 26 ఏప్రిల్ 2015 (UTC)Reply

ఏ.2.కె చేసే సంస్థగత భాగస్వామాలు అన్నీ ఒక generic MoU లు మాత్రమే. పోయిన సంవత్సరం ఏ.2.కె FDC Proposal చర్చలో ఈ MoU ప్రతిని global Wikimedians తో పంచుకోవడం జరిగింది. ఒక FDC member గా మీరు ఆ ప్రతిని, చర్చను చూసే ఉంటారు అని అనుకుంటున్నాను. ఇక ఆ ప్రతిని చూడని తెవికీపీడియనుల కోసం మళ్ళీ ఆ లంకెను చేరుస్తున్నాను. --విష్ణు (చర్చ) 10:37, 30 ఏప్రిల్ 2015 (UTC)Reply

గడువు

మార్చు

గడువు తెలియలేదు.--అర్జున (చర్చ) 02:09, 26 ఏప్రిల్ 2015 (UTC)Reply

మూడు సంవత్సరాలు. ఒక నెల నోటీసుతో ఏ సంస్థ అయినా MoU నుండి విరమించుకోవచ్చు.

పాఠ్యాంశంగా వికీపీడియా

మార్చు

దీనికై కృషి చేసిన వారు చాలావరకు డిగ్రీ విద్యార్ధులుగా ఆంగ్ల మాధ్యమంగా చదువుతున్నట్లు తెలుస్తుంది (చూడండి ఎఎల్సి వెబ్ పేజీ (డిగ్రీ కోర్సులు),ఎఎల్సి వెబ్ పేజీ (ఇంటర్మీడియట్ కోర్సులు)) . తెలుగు విద్యావిషయంగా గలవారిని వేరుచేస్తే మిగిలిన వారితో తెలుగు వికీపీడియా అభివృద్ధి ఎలా అవుతుందో అర్ధమగుటలేదు. వికీఎడ్యుకేషన్ ఫౌండేషన్ చేసిన కృషిలాగా తెలుగు వికీఅభివృద్ధికి వాడుకోవాలని ప్రయత్నించిన అవగాహన కలవానిగా ఈ ప్రాజెక్టు యే విధంగా సత్ఫలితాలనివ్వకలుగుతుందో అర్ధమవుటలేదు. ఈ కళాశాలను ఎంపిక క్రియ ఎలా జరిగింది, MOU కొరకు సభ్యుల స్పందనలేమైనా కోరినట్లు కూడా కనబడలేదు. --అర్జున (చర్చ) 02:09, 26 ఏప్రిల్ 2015 (UTC) ఫలితాలు తెలియలేదు.--అర్జున (చర్చ) 02:09, 26 ఏప్రిల్ 2015 (UTC)Reply

తెవికీలోని సభ్యులందరూ కూడా ప్రస్తుతం తెలుగు మాధ్యమం డిగ్రీ స్థాయిలో చదివినవారేనా? (మీతో సహా)
భారతదేశపు సందర్భంలో వికీఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఎలా పని చేస్తుందో స్పష్టంగా తెలుపగలరు. --విష్ణు (చర్చ) 10:37, 30 ఏప్రిల్ 2015 (UTC)Reply

పుస్తకాల పునరావిష్కరణ

మార్చు

ఈ అంశం పై కృషి చేసినందులకు సిఐఎస్-ఎ2కె సభ్యులకు ధన్యవాదాలు. ఈ ప్రాజెక్టు కృషి గురించి మరింత విశ్లేషణకు s: వికీసోర్స్_చర్చ:తెవికీసోర్స్-సీఐఎస్_వార్షిక_ప్రణాళిక_జులై_2015_-_జూన్_2016#పటం గురించి సందేహం చూడండి.--అర్జున (చర్చ) 02:09, 26 ఏప్రిల్ 2015 (UTC)Reply

అక్కడ మీరిచ్చిన జవాబు సంతృప్తికరంగా లేదు. తప్పుడు క్వెరీతో అంచనాలు వేయటం తప్ప. దానికి ఒకసారి సమాధానం ఇవ్వడం జరిగింది, గమనించగలరు. --విష్ణు (చర్చ) 10:37, 30 ఏప్రిల్ 2015 (UTC)Reply

స్వేచ్ఛా సాఫ్టవేరుకు మార్పిడి

మార్చు

వికీపీడియాకు స్వేచ్ఛా సాఫ్టువేరు సిద్ధాంతాలకు దగ్గరి సంబంధమున్నా, స్వేచ్ఛాసాఫ్టువేరుకు మార్పిడికై వికీమీడియా ఫౌండేషన్ వనరులని వాడడం సమర్ధనీయంకాదు. --అర్జున (చర్చ) 02:09, 26 ఏప్రిల్ 2015 (UTC)Reply

ఇది మీరు సూచిస్తున్నారా? ఆజ్ఞాపిస్తున్నారా? లేక ఇలాంటి నియమం ఏదయినా ఉన్నదా? దయచేసి తెలుపగలరు. సూచన అయితే పరిగణించవచ్చు. కానీ మీరు చెప్పిన విధానం అలా లేదు. మీ ప్రకారం ఇది తప్పిదమయితే అలాంటి ప్రకటన ఒకటి వివరంగా చేయగలరు. ఆ చర్చలో అందరూ పాల్గొనవచ్చు.--విష్ణు (చర్చ) 10:37, 30 ఏప్రిల్ 2015 (UTC)Reply

తెలుగు వికీలో తెలుగేతర విషయవ్యాసాలు (ఉదా:భౌతిక శాస్త్రం)

మార్చు

వ్యాసాలు కొన్ని చూశాను (ఉదా:చర్చ:తరంగ_దైర్ఘ్యం)). చాలా వ్యాసాలు డిగ్రీ స్థాయి విద్యార్ధులు నేర్చుకొనే అంశాలువ్యాసాలు గా వున్నాయి. యాంత్రిక అనువాద ఉపకరణాలు ఉపయోగించి చేసినట్లుగా వున్నవి కావున {{ALC యాంత్రిక అనువాదం}} చేర్చాను. వాటికొరకై వర్గం:శుద్ధిచేయని_ALC_యాంత్రిక_అనువాద_వ్యాసాలు చూడండి. చాలా వ్యాసాలకు ఎక్కడ నుండి అనువాదం చేశారో కూడా వివరంగా తెలియలేదు. ఇటువంటప్పుడు, వీటిని మెరుగుచేయటానికి సహసభ్యులు తోడ్పడలేరు. కనుక విద్యార్ధులచే మూలాలు మరియు ఆంగ్ల వికీలింకులు చేర్పించితే బాగుంటుంది. ఇప్పటికే చేరిన వ్యాసాలను సగటు తెలుగు వికీపీడియా చదువరికి ఉపయోగపడేలా శుద్ది చేయటం ఎలాగో సిఐఎస్-ఎ2కె సభ్యులు తెలిపమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 02:09, 26 ఏప్రిల్ 2015 (UTC)Reply

తెవికీలో వ్యాసం వ్రాయటం మొదలుపెట్టిన మరుక్షణం ఎవరయినా సముదాయ సభ్యులవుతారు, వారిని పూర్తి స్థాయి వికీపీడియనులుగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యత, ఈ విషయమై వైజాసత్య గారు నెలవారీ సమావేశంలో తెలిపిన విధంగానే మనం కొత్త వికీపీడియనుల శ్రమను గుర్తించాలి వారిని క్రీయాశిలక వికీపీడియనులుగా మలచుకోవటానికి ప్రయత్నించాలు. ఒక వ్యాసం యాంత్రిక అనువాదామా కాదా అన్నది మీరెలా నిర్ధారిస్తారు? ఈ విషయం తెలుపగలరు. అన్నీ యాంత్రిక అనువాదాలు అంటున్నారు. అది మాత్రం కాదు. --విష్ణు (చర్చ) 10:37, 30 ఏప్రిల్ 2015 (UTC)Reply

చివరికి ఏమనిపించిందంటే

మార్చు

ఇటీవల నేను వివిధ విషయాలపై లోతుగా చేసిన అధ్యయనం, వివిధ చర్చలు చదివిన తర్వాత ఏమనిపించిందంటే సీఐఎస్-ఎ2కె కృషి వళ్ళ తెలుగు వికీపీడియాలో కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు కనిపించాయి. నికరంగా పెద్ద లాభం ఉన్నట్టు కనిపించలేదు. విష్ణుగారు ఒక విషయానికి స్పందిస్తూ సముదాయం చీలిపోతుందండి అన్నారు. అల్రెడీ చీలిపోయింది. చాలా మంది సభ్యులు సీఐఎస్-ఎ2కె అంటేనే అనుమానపు చూపులు చూసే స్థితికి వచ్చింది. గుండెమీద చెయ్యేసుకొని లాభం జరిగిందా లేదా చెప్పమన్నారు. కొంత లాభం చేకూరింది. కానీ సముదాయం చాలా పెద్ద మూల్యమే చెల్లించిందని చెప్పక తప్పటం లేదు. --వైజాసత్య (చర్చ) 02:47, 29 ఏప్రిల్ 2015 (UTC)Reply

నా వంతుకు చెప్పాలంటే ఒకరి స్వచ్ఛంద కృషిని మరొకరు (లేదా సంస్థ) తమ ఖాతాలో వేసుకోవడానికి నేను అస్సలు ఇష్టపడను. తత్కారణంగానే నేను ఎంతో కృషిచేయాలనుకున్న తెలంగాణ ప్రాజెక్టును చాలా రోజుల నుంచి తాత్కాలికంగా ప్రక్కకు పెట్టాను. సభ్యులను బకరాలుగా భావించి వారిని ఉత్తేజపర్చినట్లు చేసి వారి కృషితో లాభం పొందాలనుకోవడం సమంజసమైన విషయం కాదు. దీనివల్ల తెవికీకి చాలా నష్టం జరిగింది. ఇప్పట్లో దీన్ని పూడ్చడం జరిగేపని కూడా కాదు. సీఐఎస్-ఎ2కె వల్ల జరిగిన మహాగొప్ప లాభం ఏమిటంటే దిద్దుబాట్లు (గణాంకాలు) మాత్రమే. ఈ అనవసర దిద్దుబాట్లు తెవికీకి ఎంతగా ఇబ్బందిపెట్టాయంటే వాటినన్నీ మళ్ళీ తొలగించే పరిస్థితి రావడం తెలిసిందే. "తెవికీలో జరుగుతున్న ప్రతి స్వచ్ఛందమైన అభివృద్ధినీ, కృషినీ సీఐఎస్ చేసిన కృషిగా చూపడం అంత సమర్థనీయంగా తోచట్లేదు" అనే పవన్ సంతోష్ గారి వ్యాఖ్యకు సరైన సమాధానం ఎలాగూ లేదు. స్వచ్ఛందంగా తెవికీ కొరకు పనిచేసే నాలాంటి వారిపై సీఐఎస్ వల్ల చురుకుదనం తగ్గి తెవికీపై దుష్పరిణామాలుంటాయన్న వాదనకు సమాధానం ఏమిటి? ప్రాజెక్టులు ప్రారంభించడం, నామమాత్రంగా పూర్తిచేయడం, ఆ గణాంకాలు చూపడమే సీఐఎస్ పనా? పాఠకులను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన వ్యాసాలను అందించడం సాధ్యంకాదా? అసలు సీఐఎస్‌కు సంబంధం లేని వికీపీడియన్లు చేసిన కృషి కూడా సీఐఎస్‌లో ఎందుకు చేర్చాలి? అలా విడిగా చూపడం సాధ్యం కాదు అనుకుంటే స్వచ్ఛందంగా చేసేవారి కృషిని హేళనపర్చడం కాదా? తెవికీకి లాభం చేకూర్చాలి, కాని దాన్నుంచి ప్రయోజనం పొందాలనుకోవడం ఫక్తు వ్యాపారాత్మక ధోరణి తప్ప మరేమి కాదు. సముదాయం ఆల్రెడీ చీలిపోయిందన్న వైజాసత్యగారి వ్యాఖ్య చూస్తే ఇన్ని సంవత్సరాల నుంచి అహోరాత్రులు కృషిచేసింది ఇలాంటి ఫలితం కోసమా అనిపిస్తోంది. గత ఐదారేళ్ళ క్రితం నాటి పరిస్థితి చూస్తే తెవికీ సభ్యుల మధ్యన పెద్దగా ఎలాంటి సంబంధాలు కూడా లేవు. కేవలం తెలుగు సమాజానికి సేవలందించాలనే ఏకైక దృక్పథంతో స్వచ్ఛందంగా కృషిచేస్తూ వచ్చాము. క్రమంగా జరుగుతున్న పరిస్థితులన్నీ గమనిస్తూ చురుకైన సభ్యుల సంఖ్య అధికంగా లేనందున సభలు, సమావేశాలు, గ్రూపులకై ఈ దశలో అంతగా ప్రాధాన్యత ఇవ్వరాదని సూచించిననూ అప్పట్లో ఎవరూ వినలేరు. చివరికి సమావేశాలు రసాభసాగా జరుగుతున్నాయని అందరూ గమనిస్తున్న విషయమే. ఇలాంటి పరిస్థితి ఏనాటికైనా వస్తుందని తెవికీని బాగా గమనించే వారు ఎప్పుడో పసిగట్టిన విషయమే. గ్రామవ్యాసాలలో అనవసర దిద్దుబాట్లు చేస్తున్నప్పుడే ఇది ఉద్దేశ్యపూర్వకంగా గణాంకాలు పెంచుకోవాలనే దిద్దుబాట్లుగా నేను భావించినది సరైనదేనని ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటున్నారు. సీఐఎస్ ఎ2కె వల్ల తెవికీలో సమిష్టికృషి నాశనమై తెవికీ లక్ష్యాలకోసం కాకుండా స్వప్రయోజనాలకై వెంపర్లాడే పరిస్థితి రావడం శోచనీయమైన విషయం. సి. చంద్ర కాంత రావు- చర్చ 04:51, 29 ఏప్రిల్ 2015 (UTC)Reply
లక్ష్యాలు ఎలా నిర్ణయించబడుతున్నాయో, సోదాహరణంగా ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తాను చూడండి. రచ్చబండలో భాస్కరనాయుడు గారు తిరుపతిలో సమావేశం కల్లా 66666 వ్యాసాలు లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రతిపాదించారు. దాన్ని వద్దంటూ ఇక్కడ వ్రాశాను. దానికి సమాధానం ఎవ్వరూ ఇవ్వలేదు. తిరుపతిలో సముదాయం 66666 వ్యాసాలు 2015 లక్ష్యంగా నిర్ణయించుకుందని భాస్కరనాయుడు గారన్నారు. అదే చర్చలో (వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 40#ఇప్పటి వరకు(అనగా 30-3-2015 నాటికి) తెవికి లో ఎన్ని వ్యాసాలున్నాయి?)లో పవన్ సంతోష్ గారు అలాంటి నిర్ణయమేదీ సముదాయం తీసుకున్నట్టు గుర్తులేదని చెప్పారు. అదే చర్చలో "ఇక 66666 అన్నది సమూహ నిర్ణయం, సీఐఎస్ నుండి వచ్చిన నిర్ణయం కాదు." అని దాన్ని రహమానుద్దీన్ గారు సమర్ధించారు. అలా. వికీలో చర్చించని, తిరుపతి సమావేశంలో చర్చించని సముదాయం ఎక్కడుందో నాకర్ధం కాలేదు. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. సి.ఎస్.ఎస్ సులువుగా సాధించగల లక్ష్యాలను ఎంచుకొని, వాటిని సముదాయపు లక్ష్యాలుగా చెలామణీ చేయటం. లేదా లక్ష్యాలు సాధించేందుకు "దోహదం" చేయటం చేస్తున్నది ("మన తెవికీలో ఇప్పుడు మొలకల శాతం 22% వరకూ ఉంది. ఒక ప్రత్యేక మూస ద్వారా గ్రామ వ్యాసాల అభివృద్ధి చేసి దాదాపు 40% ఉన్న మొలకలను తగ్గించుకున్నాం") --వైజాసత్య (చర్చ) 05:49, 29 ఏప్రిల్ 2015 (UTC)Reply

దశాబ్ధి ఉత్సవాలకు ముందుగా 55555 లక్ష్యంగా పని చేయాలని అనుకోవడం మాత్రమే జరిగింది. అది వికీ సభ్యుల ఏకైక తీర్మానం కాదు. సభ్యులను ఉత్సాహపరచడానికి విష్ణువర్ధన్ గారు చెప్పిన మాట. అందుకొరకు పనిచేయకపోయినా భారతీయ జిల్లాల వ్యాసాల సృష్టి (అది నా స్వంత లక్ష్యం మాత్రమే), లీలావతి కూతుళ్ళు ప్రణాళిక (అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా మొదలు పెట్టి నవి) వంటి ప్రజెక్టులు కొరకు వ్యాసాల సృష్టి మరియు సభ్యులు ఉత్సాహంగా సృష్టించిన మరి కొన్ని వ్యాసాల కారణంగా అప్పటికి ఆసంఖ్యంకు సమీపంగా వ్యాసాలు ఉన్నందున సులువుగా లక్ష్యాన్ని చేరుకున్నాం. అదే స్పూర్తితో ఏకదశ ఉత్సవాల సమయంలో భామ్స్కరనాయుడు గారు మాత్రం మే 66666 అన్నారు. అయినా అది సాధ్యం కాదని నాకు అనిపించింది. సంఖ్య అభివృద్ధి కొరకు వ్యాసాలు సృష్టించడం వికీపీడియా నాణ్యతను తగ్గింస్తుంది. అదీ కాక రెండూ సంఖ్యల మధ్య 11111 వ్యత్యాసం ఉంది కనుక పోను పోనూ ఈ వ్యత్యాసం మరింత పెరిగి పోతుంది కనుక ఆ మాటను ఎవరూ కనీసం అమోదించను కూడా లేదు. అది సభ్యుల మద్య చర్చకు వస్తే ఆ విషయం వివరించాలని కూడా అనుకున్నాను. చర్చకు రాలేదు కనుక ఏమీ చెప్పడానికి అవకాశం రాలేదు. ఇలాంటి సంఖ్యాపరమైన లక్ష్యాలు వికీ నాణ్యతను దెబ్బతీస్తాయి అంతే కాక ఆచరణకు సాధ్యపడని లక్ష్యాలు హాస్యాస్పదం ఔతాయి. ఇది చర్చకు రాలేదు కనుక ఇది ఒక సభ్యుని అత్యుత్సాహపూరితమైన ఆ మాట అంతటితో ఆగిపోయింది. ఉత్సాహంగా చెప్పిన మాటకు భాస్కరనాయుడు గారిని తప్పు పట్టలేము. ఆయనకు తెవికీ మీద ఉన్న అభిమానం అలా అనిపించింది కాని ఇది తెవికీ సముదాయం సమావేశంలో నిర్ణయించింది కాదు. అలా జరిగి ఉంటే అది తెవికీలో సభ్యులందరి ముందు ఉంచి చర్చకు పెట్టి ఉండాలి. చర్చ జరగలేదు కనుక ఆమాటను అక్కడే వదిలాము. ఇది సహసభ్యులు గమనించగలరని భావిస్తున్నాను. --t.sujatha (చర్చ) 12:49, 29 ఏప్రిల్ 2015 (UTC)Reply

సుజాత గారూ విషయం స్పష్టీకరించినందుకు ధన్యవాదాలు. రచ్చబండలో భాస్కరనాయుడు గారు 66666 వ్యాసాలకు తెవికీ గణాంకాలు చేర్చాలన్న లక్ష్యం తెవికీ 11లో నిర్దేశించుకోవడం అందరికీ తెలిసిందే అన్నారు. నిర్ణయం జరిగిపోయినట్టుగా, అది అందరికీ తెలసిందేనన్నట్టుగా ఆయన అనడంతో నేను ఇదేమిటని ఆలోచించి, అక్కడ గుర్తుచేయమని సహసభ్యులందరినీ కోరాను. ఆ తర్వాత చర్చలో నాకు సమాధానంగా కాకుండా రహ్మానుద్దీన్ గారు ఇది సమూహ నిర్ణయమని వ్రాసేశారు. వికీలో అలాంటి నిర్ణయం కనిపించదు, తెవికీ 11కి నేను వెళ్ళాను-ఆయన రాలేదు. ఇక సమూహ నిర్ణయమని ఆయనెలా నిర్ధారించారన్న సందేహం అలానే ఉండిపోయినా సర్లెమ్మని కిమ్మనలేకపోయాను. నియమాలకు అనుగుణంగా సాధించే వ్యక్తిగత లక్ష్యాలతో ఇబ్బంది ఏమీ లేదు, కానీ సమిష్టి నిర్ణయం అనడంతో అక్కడ నేను గుర్తుచేయమన్నాను. కానీ నా వ్యాఖ్య తరవాత ఎన్నెన్నో చర్చించిన సభ్యులు నా కోరికను మన్నించలేదు. ఏదేమైనా మీరు ఇప్పుడిలా స్పందించడంతో నాకు స్పష్టత దొరికింది.--పవన్ సంతోష్ (చర్చ) 18:08, 29 ఏప్రిల్ 2015 (UTC)Reply
పవన్ సంతోష్ గారూ ! మీ మేధాశక్తి, మీ చురుకుదనం, సమర్ధత, సమ్యమనం అద్భుతం. తెవికీలో అతి త్వరలో మిమ్మల్ని మీరు నిరూపించుకుని మీ కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. రచ్చ బండలో చర్చలలో నిర్ణయాత్మకంగా పాల్గొంటున్నారు. సీనియర్ వికీపీడియన్ల మన్ననలను అందుకుంటున్నరు. నిర్మాణాత్మకమైన చర్చలలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు. నిజానికి నేనది సమర్ధవంతంగా చేయలేక పోతున్నాను. ఒక్కో సారి స్పందించవలసిన సమయాలలో స్పందించలేక పోతున్నాను. ఇంటి బాధ్యతలతో తలమునకలై ఉండడమే అందుకు ప్రధాన కారణం. ఇలాంటి చర్చలలో వ్రాయడానికి మరింత సమయం హెచ్చరిక అవసరం కనుక ప్రశాంతమైన వేళలోనే చర్చలో పాల్గొనగలుగుతున్నాను. అన్యధా భావించవద్దు. --t.sujatha (చర్చ) 18:34, 29 ఏప్రిల్ 2015 (UTC)Reply
  • సుజాత గారూ నిజానికి నా సందేహాన్ని తీర్చినవారు మీరే. అందుకే మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీరు వందలాది వ్యాసాల అభివృద్ధిలో పాల్గొంటూన్నవారు, ఆయా వ్యాసాలను తుదకంటా అభివృద్ధి చేస్తున్నారు. మీకు సమయం విషయంలో ఉన్న ఒత్తిడి సాధారణమైనదేమీ కాదు. ఇన్ని ఉన్నా మీరొచ్చి సమాధానం వ్రాశారు, మరోలా భావించేదేమీ లేదండీ. --పవన్ సంతోష్ (చర్చ) 19:09, 29 ఏప్రిల్ 2015 (UTC)Reply
సుజాత గారూ మీరు సమయం చూసుకుని "66666 వ్యాసాల లక్ష్యం" అనే విషయంపై వివరణ ఇచ్చినందులకు ధన్యవాదాలు. వైజాసత్య గారు ఇకపోతే రహమానుద్దీన్ " ఇక 66666 అన్నది సమూహ నిర్ణయం, సీఐఎస్ నుండి వచ్చిన నిర్ణయం కాదు."అని వివరించింది ఏ.2.కె కాదు అని స్పష్టత ఇవ్వడానికే. రహమానుద్దీన్ 11వ వార్షికోత్సవాలకు రాలేదు కనుకబహుశా సమూహ నిర్ణయం అని అనుకుని ఉంటారు, గమనించగలరు.--విష్ణు (చర్చ) 08:08, 30 ఏప్రిల్ 2015 (UTC)Reply

Final comments/ముగింపు వ్యాఖ్యలు

మార్చు

ఉప విభాగాలలో తెలుగులో వ్యాఖ్య చేర్చిన తరువాత వీలైతే దాని ఆంగ్లానువాదం చేర్చి, ఆంగ్లానువాదాన్ని మెటా లో నకలు చేయండి.--అర్జున (చర్చ) 10:45, 29 ఏప్రిల్ 2015 (UTC)Reply

User:Arjunaraoc/‌వాడుకరి:అర్జున

మార్చు

In Telugu/తెలుగులో

మార్చు

వికీపీడియా లో గత ఐదు సంవత్సరాల పైగా కృషి చేస్తున్న వ్యక్తిగా, సిఐఎస్ కృషికి తోడ్పడమే కాకుండా వారి కృషిని దగ్గరగా పరిశీలించడం, లోతుగా విశ్లేషించడం మరియు సిఐఎస్ చేయబోయే కృషిని చర్చించిన వ్యక్తిగా నా ముగింపు వ్యాఖ్యలు క్రింద ఇస్తున్నాను.

  1. రెండున్నర సంవత్సరాల క్రిందట గుర్తించిన అవసరాలు మరియు వాటి ప్రస్తుత స్థితి చూస్తే , సిఐఎస్-ఎ2కె ప్రధానంగా భౌతిక మరియు ఎలెక్ట్రానిక్ ప్రచార కార్యక్రమాలు,శిక్షణశిబిరాలు, సంస్థాగత భాగస్వామ్యాల పై కృషి చేసింది.వీటివలన అంతకుముందు కంటే తెవికీ ప్రచారమెక్కువవటం ఒక మంచి పరిణామం. అయితే వీటిని విజయవంతంగా చేశామని చెప్పుకుంటున్నా, సర్వేలు, లోతైన గణాంకాలు, లోటుపాట్ల విశ్లేషణల, సుస్థిరం చేయకలిగిన అంశాల ఆధారాలు లేవు.సహసభ్యుల రచ్చబండ మరియు ప్రణాళికా చర్చలలో లోటుపాట్లు బహిర్గతమయ్యాయి.ముఖ్యంగా ఆఫ్లైన్ చర్చలు ప్రముఖ మై ఆన్లైన్ చర్చలు వెనుకబడ్డాయి.భౌతిక చర్చలను సరిగా మరియు సత్వరంగా నివేదించకపోవటంతో సముదాయం బలహీనపడింది. విధానాల రూపకల్పన, ఓపెన్ సోర్స్ సంస్కృతి,సాంకేతికసహాయం అంశాలు పెద్దగా మెరుగవలేదు.
  2. సభ్యులలో అవగాహన కొంతవరకు పెరిగి, భౌతిక సమావేశాలు,TTT శిక్షణసమావేశాలు లో తెవికీ సభ్యులు పాల్గొనటం , ఇద్దరు సభ్యులు IEG గ్రాంటులు పొందటం ఒక మంచి పరిణామం. దీనికి సిఐఎస్-ఎ2కె చేసిన కృషి మరియు అందించిన తోడ్పాటు అభినందించదగినిది.
  3. సంస్థాగత భాగస్వామ్యాలు సమర్ధవంతంగా నిర్వహించకపోవటంతో ఇప్పటికీ సుస్థిరతపొందిన ఒక భాగస్వామ్యంకూడా లేదు.అంతే కాక సంస్థల ఎంపిక, చేయవలసిన పనిపై అవగాహన పత్రం లోని లోపాలు మరియు వాటి అమలు కొంతవరకు వికీపీడియాలో మరియు వికీసోర్స్ లో నాణ్యత ని దెబ్బతీశాయి.ఇంకా జరగపోయే పనిలో వనరులను వికీపీడియేతర లక్ష్యాలకు వాడే అవకాశాలున్నాయి.
  4. సాంవత్సరీక సమావేశాల నిర్వహణ , మూడుసార్లు జరిగినా బలం పుంజుకోలేదు.
  5. మొత్తం ప్రాజెక్టు వ్యాసాలు, ఎడిటర్ల సంఖ్య లాంటి గణాంకాలనే లక్ష్యంగా తీసుకోవటం వలన జరిగిన కృషి తెవికీ నాణ్యతను దెబ్బతీసింది. ఇది పరిమాణంలో చిన్నదైన సముదాయం పై నాణ్యతా లోపాలను సవరించే భారాన్ని ఎక్కువ చేసింది.
  6. సిఐఎస్-ఎ2కె వికీపీడియాలో జరిగిన కృషి ని లోతుగా విశ్లేషించక, మొత్తం కృషిని తన ప్రణాళికలో చూపటంతో, స్వచ్ఛంద సభ్యుల కృషికి సరియైన గుర్తింపు దొరకుటలేదు.అందువలన సముదాయంలో అటువంటి కొందరు సభ్యులు కృషిని తగ్గించుకున్నారు. దీనివలన సముదాయం బలహీనపడింది.
  7. ప్రాజెక్టుల ను రూపొందించడం మరియు అమలు చేయడం సమర్ధవంతంగా చేయలేదు. ప్రాజెక్టులు నిర్వహించడానికిఅంతకు ముందు స్వచ్ఛంద సభ్యులు నిర్వహించిన ప్రాజెక్టు మంచి సంప్రదాయాలు కూడా తమ ప్రాజెక్టులలో వాడలేదు. సముదాయంతో సంప్రదింపులు, గణాంకాలతో కూడిన నివేదికలు, లోటుపాట్లు విశ్లేషణకు ,సముదాయంతో సహకారమునకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు.
  8. ప్రణాళికలో ఇతరులనుండి పొందే సహాయాన్ని వేరుగా చూపించినా, నివేదికలలో ప్రాజెక్టు స్థాయిలో నిజంగా అందిన అటువంటి సమాచారం ఇవ్వకపోవడం ప్రణాళిక బలంగా లేకపోవటాన్ని సూచిస్తుంది. బడ్జెట్ తగ్గితే ప్రాధాన్యతలని ఏకపక్షంగా నిర్ణయించడం జరిగింది.
  9. కొత్త ప్రణాళికలో చాలా వరకు వ్యక్తిగతంగా సభ్యులు చేయగలిగిన ప్రాజెక్టులనే చూపించారు. సాహసోపేతమైన, సృజనాత్మకమైన పనులు లేవు.
  10. మొత్తంగా, సిఐఎస్-ఎ2కె కృషి వలన తెవికీ ప్రచారం మరియు సభ్యులలో అవగాహన కొంతవరకు మెరుగైనా వికీపీడియా , వికీసోర్స్ నాణ్యతపై మరియు మొత్తము సముదాయంపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. లోటుపాట్లు గుర్తించలేకపోవటం,కొత్త ప్రణాళికకూడా క్రిందటి ప్రణాళికల మూసలోనే వున్నందున ఇది ఇకపై తెలుగు వికీపీడియాకి పెద్దగా ఉపయోగపడదు. కావున ఈ ప్రతిపాదనని వ్యతిరేకిస్తున్నాను.--అర్జున (చర్చ) 10:10, 29 ఏప్రిల్ 2015 (UTC)Reply

In English/ఆంగ్లములో

మార్చు

As a contributor to Wikipedia for more than 5 years and as a person who supported, observed and analysed CIS-A2K work and their proposal closely , I give my final comments below.

  1. If one observes the needs identified two and half years back and their present status , CIS-A2K has worked primarily on physical meetings, Wiki Academies and partnerships. Due to this, Telugu wikipedia awareness has improved, which is a positive development. Though these are claimed as successful, this is not based on surveys,statistical analysis,detailed reports of shortcomings and how they are addressed, and plans for sustaining the same. The shortcomings have been surfaced on Village pump and proposal discussion pages. Offline meeting s have become dominant over online discussions. As offline meetings are not well documented and timely communicated, community has weakened. There has not been much work on policy definition and deployment support, open source culture and technical help.
  2. Due to better awareness among wikipedians, Telugu wikipedians have attended physical meetings, TTT programs. Two wikipedians have receieved IEG grants. I congratulate CIS-A2K for their work and support extended.
  3. As institutional partnerships were not handled well, there is not even one sustainable partnership. Selection of institutions, gaps in work identied in MOU and their implementation has impacted the Wikipedia and Wikisource quality. There is a possibility of using resources for work not connected with Wikipedia in future.
  4. Annual Wikipedia meets management has not gained strength despite attempting for third time.
  5. As the focus is on total articles and total editors of wikipedia, the work done has impacted Telugu wikipedia adversely from a quality perspective.This has increased the workload on the small community to fix the quality issues.
  6. Volunteer wikipedians are not being appropriately credited for their work, as CIS-A2K is using the overall project level metrics and is not providing detailed analysis of the project. Therefore, some wikipedian s are reducing their contributions thereby weakening the community.
  7. Project management is inefficient. Even the best practices followed by volunteer Wikipedians have not been used by CIS-A2K for its projects. Discussions, reports with detailed analysis of statistics and shortcomings and cooperation with community were not given the necessary importance.
  8. CIS-A2K provides break up of funds from WMF/FDC and others in their detailed plans, but its unwillingness to share the same level of detail for actuals may indicate the poor quality of proposal.If there is a cut in budget, the priorities are decided with out consultation.
  9. The new proposal contains projects which can be done individually by Wikipedians, without much need for institutional help. There are no risky and creative initiatives.
  10. Overall, though there has been increase in Telugu wiki awarenes, adverse impact on the quality of Wikipedia and Wikisource and also on community has been felt. As the new proposal does not address the shortcomings and is similar to the past proposals, this will no longer be beneficial to Wikipedia, I oppose the proposal. --అర్జున (చర్చ) 10:10, 29 ఏప్రిల్ 2015 (UTC)Reply

Based on the on-wiki discussions and my observations of various activities going on in Telugu Wikipedia, I am summerizing my comments about CIS-A2K plan for Telugu Wikipedia.

  1. There has been some progress in off-wiki interaction of Wikipedia community due to the efforts of CIS-A2K
  2. CIS-A2K helped increased the awareness of Telugu Wikipedia due to institutional partnerships. But it could not fully capitalize such partnerships
  3. Training seemed to be effective only in the area of organizing events and identifying funding opportunities and securing funds for such events (Ex: Anniversary events and IEG grants). Conversely wiki training has been poor because after two and half years of training activities, most of the users did not realize the need for verifiable sources in Wikipedia (Ex: Indu Gnana Vedika related articles)
  4. CIS-A2K doesn't need to be taking up content creation activities which can be driven by community itself. Most of these current activities seems to driven by metric driven reportable items, thus can be easily worked up as successes.
  5. CIS-A2K seems to be promoting the initiatives that seems to fit into their plan and ignoring any advice to the contrary
    1. Example 1:Total article number goals like 66,666 are being promoted as community approved goals, when it traces back to one user's proposal. It was accepted to be an issue only after going tooth and nail explaining why it is not a good goal on several occasions
    2. Example 2:As a wikipedian actively involved in Telugu Wikipedia since 2005, I have been tracking stub ratio for almost 8 years and recently CIS-A2K representative pasted a bunch of empty sections and Infobox Template using bot account without any on-wiki consensus, to decrease the stubs. The representative himself admitted this on Village Pump.
    3. Example 3:Currently there is a push going on to paste info-boxes in new-user Userpages (not Talk pages) in the name of promoting better engagement. Again, there is no consensus or discussion around such activities.
  6. CIS-A2K may have a role in creating broader general awareness of Wikipedia in India, but it does not have the depth or expertise to be setting community priorities which it seems to be doing in this plan.
  7. Account creation to actively engaged wikipedian conversion rate has not been great even with all the CIS-A2K work. In the last 2.5 years all CIS-A2K could boast is 2 actively engaged wikipedians. That is not any better than what community did without outside help or awareness. Meanwhile, metric promoting activities to some extent damaged the morale of volunteer community.
  8. Overall, I believe that CIS-A2K efforts are better spent elsewhere (nascent wiki projects), hence I oppose Telugu Wikipedia plan. If you want to discuss this further, feel free to contact me via wikipedia e-mail

--వైజాసత్య (talk) 05:43, 30 April 2015 (UTC)

తెలుగు

మార్చు

ఈ క్రింది సారాంశాన్ని, పైన చర్చల్లో నా వ్యాఖ్యలను పరిశీలించే ముందు వాటి వెనుక నా నేపథ్యాన్ని గమనించాల్సిందిగా మనవి. నేను గత సంవత్సరం సీఐఎస్ ఎ2కె వారు తెలుగు వికీ సముదాయాన్ని ఆహ్వానించి చేసిన ముఖ్య కార్యక్రమాల్లో దాదాపుగా అన్నిటిలోనూ పాల్గొన్నాను. వారి ప్రణాళిక నెరవేర్చేందుకు గాను పరోక్షంగా సహకరించాను, కొన్ని పనుల్లో అభ్యర్థించి మరీ వారి సహకారాన్ని స్వీకరించాను. 2014 సంవత్సరంలోనూ, 2015లో ఇప్పటి వరకూ తెవికీ చేపట్టిన ఆన్-వికీ, ఆఫ్-వికీ కార్యకలాపాల్లో అన్నిటిలోనూ పాల్గొనడమో, నిర్వహించడమో, కనీసం అవగాహన చేసుకోవడమో చేసినవాణ్ణి. గత సంవత్సరం WMF India community consultationలో తెవికీ ప్రతినిధి బృందంలో ఒకనిగా, తెవికీ 11వార్షికోత్సవాల నిర్వహణలో సంయుక్త కార్యదర్శిగా, WMF ఇండివిడ్యువల్ ఎంగేజ్మెంట్ గ్రాంటీగానూ, మరో ఐఈజీకి సలహాదారుగానూ పనిచేసి వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలపైనా కొంతవరకూ అవగాహన సంపాయించుకున్నాను. వీటన్నిటి వల్లా గత ఏడాది తెవికీలో జరిగిన కొన్ని విషయాలను సాధికారికంగా స్పందించగలిగాననే భావిస్తున్నాను. ఆ క్రమంలో ఈ ప్రణాళికపై నేను ప్రకటించే అభిప్రాయాల తుదిమాటలు ఇవి.

  1. తెవికీలో సీఐఎస్ చేసిన కృషిలో ఆఫ్ వికీ కార్యకలాపాల్లో తీసుకున్న చొరవ, వాటి నిర్వహణకు చేసిన కృషి ప్రశంసించదగ్గది. సముదాయం సభ్యుల ఐఈజీల విషయంలో వారు తమ అనుభవాలను ఉపయోగించి విలువైన సహకారం అందించారు. తెవికీపీడియన్ల కృషిని కొంతమేరకు కంపారిజన్ గ్రూప్స్ ముందు ప్రదర్శింపజేసేందుకు సహకారం అందించింది.
  2. సీఐఎస్ సంస్థాగతమైన భాగస్వామ్యాల విషయంలో చేసిన కృషి సగం సగం ఫలితాలనే అందించింది. ముఖ్యంగా ఇన్నేళ్ళలో ఎంవోయూ స్థాయిలో, కార్యాచరణ స్థితిలో నిలిచిన ఒకే ఒక్క సంస్థగా ఆంధ్ర లయోలా కళాశాల మాత్రం కనిపిస్తూంది. ప్రతిపాదనలో రెండవ ఎంవోయూగా ప్రస్తావించిన సంస్థతో ఒప్పందాల వివరాలు అర్జునరావు గారు ప్రశ్నించినా ఇవ్వలేకపోయారు. పైగా వాటిలో చేయించిన వ్యాసాలను ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న భౌతిక శాస్త్ర విద్యార్థులతో యాంత్రికంగా అనువదించడం, ఆ విషయాన్ని ప్రస్తావించకపోవడం చూస్తే చేస్తున్న సంస్థాగత భాగస్వామ్యమూ అంత సక్రమంగా జరుగుతున్నట్టు కనిపించట్లేదు.
  3. ప్రతిపాదనలు, ప్రణాళికలు మాత్రమే ఉంటున్నాయి తప్ప వాటిని బలపరిచే సరైన నివేదికలు మాత్రం ఉండడం లేదు. సరైన నివేదికలు అంటున్నప్పుడు కేవలం తెవికీ ప్రగతిని ప్రస్తావించి ఇదంతా సీఐఎస్ ఉత్ప్రేరణ వల్లనే వచ్చివుండవచ్చన్న బలహీనమైన కార్యకలాపం మాత్రం కాదు. గత సంవత్సరం ప్రణాళికలోని పలు ప్రాజెక్టులు తిరిగి ఈ సంవత్సరం ఏమార్పూ లేకుండా కొనసాగుతున్నాయి. కథానిలయం ప్రాజెక్టు, సాహిత్యం వేదిక వంటివి కనీసం వాక్యనిర్మాణంలోనూ మార్పులేకుండా కొనసాగడం ప్రణాళికను బలహీనం చేస్తోంది. గత సంవత్సరం ఎందుకు నిర్వహించలేకపోయారో? ఆయా సమస్యలను ఈ ఏడాది ఎలా పరిష్కరించి నిర్వహించనున్నారో ప్రణాళికలో లేకపోగా కనీసం ఇది గత సంవత్సరం విఫలమైన విషయంగా కూడా ప్రణాళిక గుర్తించట్లేదు. నిజానికి కథానిలయం తెలుగు వికీపీడియాకు కంపారిజన్ గ్రూప్ వంటిది, అలాగే వారి నుంచి కొంత సమాచారాన్ని తెవికీకి స్వేచ్ఛానకలుహక్కుల్లో ఇచ్చేందుకు తన పరిమిత ప్రయత్నంలోనే సాధించగలిగానని వికీపీడియన్, ఐఈగ్రాంటీ విశ్వనాథ్ పేర్కొనడం ఇక్కడ గమనార్హం.
  4. ప్రణాళికల్లో శిక్షణను ఇస్తామని వ్రాసినవాటి విషయంలో కొన్ని సందేహాలున్నాయి. వాటిని గతంలో నిర్వహించినప్పుడు నిరుపయోగమైన కృషిగా మిగిలిపోయింది. సముదాయంలో అధునాతన వాడుకరి శిక్షణ చేస్తామని గత సంవత్సర ప్రతిపాదనలో ఉంది, ఆ కృషిని చేసేందుకు ప్రణయ్ కోరికమేరకు తెవికీ హాకథాన్ నిర్వహించే అవకాశమూ కలిగింది. కానీ ప్రణాళికలో వాడుకరులకు ఇస్తామన్న శిక్షణ కానీ, ముందస్తుగా కార్యక్రమ ప్రణాళికలో ఏర్పరుచుకున్న లక్ష్యాలను కానీ ఆ సమావేశం సాధించలేకపోయింది. నావంటి పలువురు వికీపీడియన్లు నిరాశతో వెనుదిరిగారు. పైగా ఇక్కడ అడిగినప్పుడు కూడా స్పష్టంగా హాకథాన్ వల్ల ఈ వికీపీడియన్కు ఈ నైపుణ్యం అలవడింది అన్న మాట కూడా వ్రాయలేకపోతున్నారు. ఈ ప్రణాళికలోనూ అవే ప్రతిపాదనలు వేరే రూపంలో చేరుతున్నాయి.
  5. ఇక లక్ష్యాలను నిర్దేశించుకోవడంలోనూ వ్యాసాల సంఖ్యను, కొత్తవాడుకరుల సంఖ్యనూ మాత్రమే నిర్దేశించుకుంటూ, వాటిని కార్యరూపంలోకి తీసుకువచ్చేప్పుడు నాణ్యతను దెబ్బతీయడం(ఖాళీ విభాగాలను వికీపీడియా శైలికి వ్యతిరేకంగా చేర్పించి వ్యాసాలను 2కెబి దాటించడం), కొందరు వికీపీడియన్లు తెవికీకే విముఖులయ్యేలా ప్రవర్తించడం(అత్యంత చురుకైన సభ్యులు చంద్రకాంతరావు ఈ ప్రణాళికల్లో తన వ్యక్తిగత కృషిని ఏ సహకారం లేకుండానే తమ కృషిగా చెప్పవడం వల్ల తెవికీలో పనిచేయడం మెల్లగా తగ్గించుకుంటున్నానని వ్యాఖ్యానించారు), తెవికీ సముదాయ సమావేశాల్లో పాల్గొని మరీ తెవికీ సముదాయ ఐక్యతలో విభేదాలు సృష్టించడం(రాజశేఖర్ గారు తెలుగు యూజర్ గ్రూప్ తొలి సమావేశంలో ఈమేరకు వ్యాఖ్యానిస్తూ తెవికీని రెండుగా చీల్చేట్టయితే ఇలాంటి కార్యక్రమాలే వద్దన్నారు) వంటివి జరుగుతున్నాయి. ఈ విధంగా ఈ ప్రణాళికల ఆచరణ కొన్నిసార్లు వికీమీడియా ఫౌండేషన్ వ్యూహాత్మక ప్రణాళికను ఆ మేరకు దెబ్బతీస్తోంది.
  6. తెవికీపీడియన్లు స్వచ్ఛందంగా చేయలేకపోతున్న పనులపై వీరు దృష్టి పెట్టడం, ఆ తర్వాత వారు చేసిన విధానాన్ని వివరమైన లెర్నింగ్ పాట్రన్స్ ద్వారా పంచుకోవడం ద్వారా వికీపీడియా సముదాయం కృషిలోని గాప్స్ వీరు నింపితే బావుంటుంది. కానీ ఆ క్రమంలో కృషి సాగట్లేదు. దానికి తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న అనిశ్చితిని కారణంగా చూపుతున్నారు. గత సంవత్సరం మొదటి సగం అనిశ్చితి నెలకొనివున్నా, రెండవ సగంలో ఎక్కడికక్కడ వేర్వేరు ప్రభుత్వాలు కొలువుతీరి అనిశ్చితి సద్దుమణిగింది. మరి ఆ సమయంలోనైనా ఎందుకు చేయలేకపోయారో? అప్పుడు చేయలేని పాలసీ పనులపై కృషి ఇప్పుడు ఎలా చేస్తారో చెప్పడం ఈ ప్రణాళికలో జరగలేదు.
  7. తెవికీని మీడియాలో ప్రాచుర్యం చేసేందుకు సఫలీకృతమైన కృషిచేసినవారిలో నేనూ ఉన్నాను. గత సంవత్సరం నేను చేసిన కృషిలో భాగంగా దాదాపు రెండు సార్లు ఎలక్ట్రానిక్ మీడియాలో 15 నిమిషాల నిడివివున్న కార్యక్రమాలు, దాదాపు ఇరవై వార్తాకథనాలు ప్రచురితమైనాయి. రాష్ట్రస్థాయి ప్రాధాన్యత కలిగిన తెవికీ సమావేశాలు జరిగినా వాటి కవరేజి పట్ల సీఐఎస్ ఎ2కె శ్రద్ధ పెట్టిన దాఖలాలు కనిపించడంలేదు. ముఖ్యంగా తెవికీ దశాబ్ది ఉత్సవాలను కవర్ చేయాల్సినప్పుడు ఈ విషయం స్పష్టపడింది. ఈ అలక్ష్యానికి మూల్యంగా తెవికీ సముదాయం నిర్వహించుకున్న కార్యక్రమాలకు కెబియన్ కళాశాల ఆధ్వర్యం వహించినట్టు వచ్చింది. పైగా ప్రోగ్రాం ఆఫీసర్ బ్లాగర్ల పట్ల పత్రికల్లో చేసిన వ్యాఖ్యలు తెవికీ సముదాయానికి ఇబ్బందికరంగా తయారయ్యాయి. ఇటువంటివి తెవికీ పట్ల వ్యతిరేకాభిప్రాయాలు రేకెత్తిస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా తెవికీని అభివృద్ధి చేసేందుకు కృషిచేశానని వ్రాశారు, అయితే సీఐఎస్ ఎ2కె తమ ఈ అభిప్రాయాన్ని సమర్థిస్తూ గణాంకాలు ఏవీ ప్రతిపాదించలేదు. ఇద్దరు వాడుకరులు మాత్రమే సోషల్ మీడియా ద్వారా తెవికీకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ కూడా గణాంకాల అస్పష్టతే నెలకొంది.
  8. వికీప్రాజెక్టుల్లో సహకారానికి చేసేందుకు ముందుకువచ్చిన ప్రాజెక్టుల్లోని చాలావరకూ ప్రతిపాదనలు వికీపీడియన్లు చేయలేనివి, వారు కోరేవి కాదు. మొత్తంగా సీఐఎస్ ఎ2కె ఇప్పటివరకూ ఆఫ్ వికీ కాక, కేవలం ఆన్-వికీ చేసిన కృషి వ్యతిరేక ఫలితాలనే ఇచ్చినట్టు చర్చల సారం. తెవికీపీడియన్లు చేసే ప్రాజెక్టుల్లో వీరు టెంప్లెట్లు తయారుచేస్తామని, స్ట్రక్చర్ అందిస్తామని వ్రాసుకుంటూ వచ్చారు. ఇవి పూర్తిగా సముదాయం చేసుకోగలిగేవి, గతంలోని ప్రణాళికలో చూసుకున్నా సీఐఎస్-ఎ2కె వారు కాక సముదాయమే వీటిని చేసుకున్నట్టుగా అనుభవం. పైగా ఆంగ్లవికీ వ్యాసాలను అనువదించే ప్రాజెక్టుల్లో అవసరమయ్యే వ్యాసాలను అందుబాటులోకి తెస్తాం అన్న ప్రతిపాదన ఎలా చోటుచేసుకున్నదో అర్థం కావట్లేదు.
  9. తెవికీపీడియన్ల కృషి ప్రతిదాన్నీ సీఐఎస్ ఎ2కె తమ కృషిగా చూపించుకోవడంపై ప్రణాళికపై జరిగిన చర్చలో తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. ఇప్పటికే ఒక సీనియర్ వికీపీడియన్ ఈ కారణంగానే తాను తెవికీలో కృషి క్రమంగా తగ్గించుకున్నానని వ్రాశారు. తమ ప్రణాళిక సాఫల్య వైఫల్యాలను వ్రాసుకోవడానికి సముదాయం మొత్తం చేసిన తెవికీ అభివృద్ధినే వాడడం వివాదాస్పదంగా నిలిచింది. పైగా ఆఫ్ వికీ కార్యకలపాల్లోనూ వేరే వాడుకరులతో ఈ విషయమై విభేదాలు పొడసూపాయి.
  10. ప్రణాళికలోని లోటుపాట్లు, కార్యనిర్వహణలోని లోపాలు, అన్నిటికన్నా ముఖ్యంగా జరిగిన లోటుపాట్లను అవగాహన చేసుకుని ప్రణాళికను రూపొందించకపోవడం వంటివాటి వల్ల ఈ ప్రణాళికను నేను వ్యతిరేకిస్తున్నాను. ఈ ప్రణాళికను, అలా నిర్వహించడం వల్ల ప్రయోజనం జరుగుతుందన్న అంచనాకు రాలేకపోవడం సరికదా కొన్ని సమస్యలు కూడా ఉత్పన్నం కావచ్చని నమ్ముతున్నాను. దీనిపై తదుపరి వ్యాఖ్యలకు నా చర్చపేజీని కానీ, ఇదే చర్చను కానీ, అవసరమైతే నేను వికీలో ఇచ్చిన మెయిల్ ఐడీని గానీ ఉపయోగించి సంప్రదించవచ్చు.--పవన్ సంతోష్ (చర్చ) 14:06, 30 ఏప్రిల్ 2015 (UTC)Reply

ఆంగ్లం

మార్చు

Before going through my discussions against the plan and the summary of those discussions, I request everyone to take a look at my background behind these comments. In 2014, I've attended almost every program that CIS A2K conducted with participation of the telugu wiki community and also helpful to fulfill some of their aims & targets indirectly through my contribution. Even for some contributions I even requested and got some help from them. On the other hand I've participated or organized all kinds of major off-wiki and on-wiki efforts made by telugu wikipedia community. As one of the representatives of tewiki in WMF India community consultation, as a joint secretary for tewiki 11th anniversary, as WMF IEGrantee and adviser for another IEG I've gained exposure on the wikimedia foundation activities and its strategic plan. The above experience, exposure and idea helped me to discuss on this plan and other aspects in telugu wikipedia. And in this background, based on the on-wiki discussions and other activities on telugu wikipedia, I'm going to summarize my comments on this plan concerned.

  1. CIS-A2K initiative and management support for off-wiki activities is praiseworthy. They helped wikipedians to apply for IEG grants. They also helped present the work among peer wikipedia language groups.
  2. CIS efforts towards Institutional partnerships were not fully successful. Only Andhra loyola college is shown after all the efforts over the past few years. They have not provided the details of the MOU with the second institution when requested by Arjuna Rao. Use of automated translation tools by english medium students and not reporting the same indicates the unhealthiness of institutional partnership.
  3. Only proposals and plans are available, but not appropriate reports which support them. The reports indicate the overall growth of Telugu wikipedia and project that it could be due to catalyst role of CIS-A2K. Several projects in last year's proposal continue in this year's proposal without any changes. There is no mention of why such projects were not done last year and no report of problems faced and how they plan to overcome them. The proposal does not even mention them as unsuccesful projects. Katha Nilayam is another website, which has information similar to what wikipedia has in the area of writers and their stories. Mention by Viswanath that he is able to get some material released under copyleft license from them for use on wikipedia is to be noted.
  4. There are doubts about the proposed training. Previous experience with such events was not fruitful. There is mention of advanced training program in the last year's proposal and the event held on the request of Pranay. It did not achieve the event objectives and left the participants dissatisfied. I am not able to say that I developed the specific skill by attending that event. There is similar plans in this proposal.
  5. Deciding Article count, new editors as target is leading to damaging the quality of wikipedia, by filling articles with empty section headings to increase the article size to 2KB. As the contribution of volunteer wikipedians is not highlighted, and overall targets of project are shown in proposals, some wikipedians have reduced their contributions. The participation of CIS-A2K in community meetups is leading to disunity among the community. Senior wikipedian Rajasekhar commented that these events are not wanted, if the community becomes split into groups. So the implementation by CIS-A2K is striking against core objectives of the strategic plan.
  6. It is advisable for them to focus on work that can't be done voluntarily by Telugu Wikipeidans and address the gaps by sharing the lessons by use of learning patterns. But this has not happened. Political Instability is mentioned as the reason. Though the first half of the last year could be considered unstable, new governments were formed and there was stability in the second half. I can't understand why they could not accomplish during that time. The proposal does not clarify how they can accomplish the same now.
  7. I also contributed towards increasing the awareness of Wikipedia through the media. It resulted in two 15 minute duration audiovisual programs and about twenty stories. Though state wide events happened, CIS-A2K did not seem to have focussed on media coverage of such events. It is visible during tewiki10, in which the events were claimed as conducted by the host institution in some newspapers. Comments by program officer about bloggers have caused problems to community. There is claim that publicity is successful without any support of stats. Only two new user seem to have joined wikipedia because of social media efforts. Here also statistics/analysis are not reported.
  8. Lot of proposed projects can be done by wikipedians and many of them have not requested any support. On-wiki work has given negative results compared to off-wiki work as per discussions. They offered developing templates, givings structure etc. These can be done by community and the previous work also demonstrates the same. It is not clear how proposal to make available english wiki articles for the translation projects is included.
  9. Claiming all the work done as arising from CIS-A2K has led to several objections. One senior wikipedian has reduced his efforts. Instead of clear assessment of successes and failures, using the development by overall community has become controversial. Differences have surfaced on this aspect during off-wiki activities.
  10. Shortcomings of the plan and its implementation and not using those experiences to prepare the the new proposal are the reasons for me to oppose the plan. Implementing the current plan will not give benefits. Moreover it may lead to some problems. For further comments, please use my talk page or this page or my email-id.--పవన్ సంతోష్ (చర్చ) 16:42, 30 ఏప్రిల్ 2015 (UTC)Reply

తెలుగు/in telugu

మార్చు
  • ప్రణాళికలో లోపాలను సరిదిద్దుకొనే అంశంలో A2K తన అసమర్ధతను దాచుకొనలేకపోయింది అని చెప్పచ్చు. కారణం ఏమంటే సముదాయపు సభ్యులు సూచించిన ఏ ఒక్క మార్పునూ పరిగణణలోనికి తీసుకోలేకపోవడం ఒకటయితే, వారి ప్రశ్నలకు సైతం సరియైన జవాబులు చెప్పలేకపోవడం, దాటవేయడం కొరకు ఏదోదో రాయడం
  • సంస్థాగత భాగస్వామ్యాలలో, కార్యక్రమాలలో సముదాయ సభ్యులకు ముందుగా సరియైన సమాచారం ఇవ్వక పోవడం, వాళ్ళను అందులో భాగస్వాములను చేయలేకపోవడం, కొత్త సభ్యుల ద్వారా మాత్రమే ప్రగతి సాధించాలనుకోవడం అనేవి వికీకి అనుకూలమైన లక్షణాలు కాదు. కొన్ని కార్యక్రమాల నిర్వహణలో సముదాయపు వ్యతిరేకతను పరిగణణలోకి తీసుకోక ఒకరిద్దరు సభ్యుల ద్వారా నిర్వహించుకోవాలనుకోవడం
  • ట్రైది ట్రైనీ ద్వారా కొందరు వాడుకరుల ద్వారా జరిగే అన్ని కార్యక్రమాలను మేమిచ్చిన శిక్షణ వలనే వాళ్ళు ఇవన్నీ చేయగలుగుతున్నారు అని, జరిగే అన్ని కార్యక్రమాల గొప్పదనాన్ని A2K వాళ్ళకు ఆపాదించుకోవడం వలన కొద్దికాలానికి వికీ కొందరు వాడుకరులను కోల్పోగలదు. ఇప్పటికే నాణ్యతాపరంగా రాసిని వాసిగానూ, వాపును బలుపుగానూ చూపించుకొనే ప్రయత్నంలో కొంత సాఫల్యత చెంది ఉండచ్చును కాని కొంత కాలానికి సర్వధా చేటు కొరకే అవుతుంది. ఇప్పుడు సూచించిన మార్పులు సరిదిద్దుకోవాలి, లేక సముదాయంతో కలసి మరొక ప్రణాళిక రచించాలి, లేదూ ఈ ప్రణాళిక నాకు సమ్మతం కాదు.--విశ్వనాధ్ (చర్చ) 15:47, 30 ఏప్రిల్ 2015 (UTC)Reply

తెలుగు/in telugu

మార్చు

నేను చెప్పదలిచే చాలా విషయాలు పైన సభ్యులు చెప్పేశారు కాబట్టి నేను సంక్షిప్తంగా చెప్పదలుచుకున్నాను.

  1. ప్రాజెక్టులు ప్రారంభించినవారు కేవలం వారి పని పూర్తిచేసినట్లుగా చూపడానికి ప్రయత్నించారే తప్ప తెవికీ నియమాల ప్రకారం వ్యాసాలను తయారుచేయలేరు. త్వరత్వరగా వ్యాసాలను పూర్తిచేయాలన్న ఉద్దేశ్యంతో వ్యాస నాణ్యతను సభ్యులు ఏ మాత్రం పట్టింకోలేకపోయారు. అలాంటి వ్యాసాలు తెవికీకి పెద్ద గుదిబండలా తయారయ్యాయి. చాలా వ్యాసాలు అనువాద వ్యాసాలే కాని తెలుగు వారి దృష్టికోణంతో రచించినవి కావు. ప్రాధాన్యత కల వ్యాసాలలో ఎక్కువగా సమాచారం లేదు. పెద్ద వ్యాసాలు మాత్రం అనవసర వ్యాసాలుగా ఉన్నాయి.
  2. ముఖ్యంగా ఇద్దరు, ముగ్గురు సభ్యులు గత కొంతకాలంగా వేలాది దిద్దుబాట్లు చేస్తున్ననూ వారు తెవికీకి ఒక్క నాణ్యమైన వ్యాసం అందివ్వలేకపోయారంటే అలాంటి వారి దిద్దుబాట్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పైగా వారి దిద్దుబాట్లు తొలగించబడుతున్నాయన్నది ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం. నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వని దిద్దుబాట్లు వృధా దిద్దుబాట్లుగా పరిగణించవచ్చు. కాని ఈ దిద్దుబాట్లనే A2K పెద్దగా ప్రచారం చేసుకొని తెవికీలో గొప్ప అభివృద్ధి నమోదైందని చెప్పడం దారుణమైన విషయం.
  3. సీఐఎస్ ఎ2కె వల్ల తెవికీ సభ్యులలో గ్రూపిజం పెర్గినట్లుగా చర్చలలో స్పష్టంగా అర్థమైంది. ఇది దశాబ్దం పైగా వేలాది సభ్యుల సహకారంతో రూపుదిద్దుకుంటున్న తెవికీకి పూడ్చరాని పెద్ద లోటుగా చెప్పవచ్చు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తెవికీ కుప్పకూలే దశ రావచ్చు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తరు?
  4. సిసి లైసెన్సుతో 50 పుస్తకాలను విడుదల చేశామని చెప్పడానికి బాగుంది కాని ఆ పుస్తకాల విడుదల విషయంలో లోపాయకారి ఒప్పందం ఉన్నట్లుగా చర్చలలో లేవనెత్తిన అనుమానానికి ఎలాంటి సరైన సమాధానం కూడా ఇవ్వబడలేదు.
  5. మొలకల శాతాన్ని తగ్గించడానికి వేలాది గ్రామ వ్యాసాలలో ఇన్ఫోబాక్సులను, ఖాళీ విభాగాలను చేర్చగలిగారు కాని పాఠకులకు కావలసింది గ్రామసమాచారం అని అర్థం చేసుకోలేకపోయారు. దీన్ని బట్టి చూస్తే ఏదో విధంగా "లక్ష్యాలను" సాధించడానికే కొందరు సభ్యులను వాడుకుంటున్నట్టుగా విశదమౌతోంది.
  6. 2013 కంటే 2014లో వ్యాసాల సంఖ్య చూపించే రేఖ పైన ఉండటం సహజమే. అందంతా సీఐఎస్ ఎ2కె వల్లనేనని చూపించడం సమజసం కాదు. దశాబ్దం నుంచి పరిశీలిస్తే ప్రతిఏటా వ్యాసాలసంఖ్య పెరగడం మామూలేనని విశదమౌతోంది.
  7. తెవికీని వృద్ధిచేయడానికి, తెలుగు ప్రజలలో తెవికీపట్ల అవగాహన చేయడానికి నేను తెవికీపీడియా బ్లాగును, తెవికీ ఫేస్‌బుక్‌ను ప్రారంభిస్తే నా కృషివల్ల వచ్చిన ఆదరణను కూడా సీఐఎస్ ఎ2కెలో జమచేసుకోవడాన్ని సహించక అలాంటివాటిని తాత్కాలికంగా నిలిపివేశాను. సీఐఎస్ ఎ2కె వల్ల తెవికీకి ఎన్ని రకాలుగా ప్రతికూలంగా మారుతున్నదో అర్థం చేసుకుంటే చాలు.
  8. రోజుకు సరాసరిగా తెవికీలో ఎన్ని వ్యాసాలు చేరుతున్నాయో తెలిపే పటం గమనిస్తే తొలి 3 మాసాలలో తప్ప మిగితా కాలంలో పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదన్నది ఆ పటాలే సాక్ష్యం చెబుతాయి. ఆ చేరిన వ్యాసాలు కూడా నిజంగా సీఐఎస్ ఎ2కె వల్లనే చేరాయా? సీఐఎస్ ఎ2కె వల్ల చేరిననూ ఆ వ్యాసాలు తెవికీ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా? అనే విషయం గణాంకాల ద్వారా చెప్పలేము.
  9. నేను వృత్తిపని మీద జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తున్నప్పుడు ఎందరెందరికో తెవికీ గురించి పరిచయం చేశాను. వారిలో చాలా మంది సభ్యులుగా చేరి దిద్దుబాట్లు కూడా చేసినట్లుగా పాలమూరు జిల్లాకు చెందిన వ్యాసాలే సాక్ష్యం చెబుతాయి. అలాంటి వారి కృషిని కూడా ఎ2కె ఖాతాలో వేసుకోవడం సరైనదేనా?
  10. చురుకైన సభ్యుల సంఖ్యలో కొంత పెరుగుదల కనిపిస్తోంది కాని ఇది ఎలా సాధ్యమైంది అనేది కూడా పరిశీలించాలి. మాసంలో 5 దిద్దుబాట్లు చేస్తే చురుకైన సభ్యుడి కింద లెక్క. ఇలాంటి సంఖ్యలను పెంచడం పెద్ద కష్టమేమీ కాదు. ఏదో ఒక నెట్ సెంటరుకు వెళ్ళి ఏదో ఒక సభ్యనామంతో సభ్యుడిగా చేరి కొన్ని దిద్దుబాట్లు చేయడం నిమిషాలలో జరిగే పని. ఇటీవలి చర్చలను గమనిస్తే ఒక సీనియర్ సభ్యుడు "కొందరు తెలుగు వికీపీడీయా సభ్యులే మారుపేరుతో వస్తున్నారని" చెప్పడం ఈ విషయానికి బలం చేకూరుస్తుంది. పైగా ఇలాంటి "కొత్త"సభ్యులే సీనియర్ సభ్యులపై చర్చలలో దాడులకు దిగుతున్నారు.
  11. అత్యంత చురుకైన సభ్యుల సంఖ్యను కూడా గమనిస్తే 15-20 మధ్య ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ 15-20 సభ్యులలో చాలా మంది సీనియర్ సభ్యులే. సీఐఎస్ ఎ2కె తో వీరిలో చాలా సభ్యులకు ఎలాంటి సంబంధం లేకుండా స్వచ్ఛందంగా కృషిచేస్తున్నవారే.
  12. "నెలవారీ మొలకల జాబితా"ను బాటుద్వారా తెలియజేసి మొలకలను తగ్గించే ప్రక్రియను ఎవరూ పట్టించుకోలేరు. ఇది విఫలమైన ప్రయోగం.
  13. కొత్త సభ్యుల సంఖ్యలో కూడా ఫిబ్రవరి 2008 మాసపు రికార్డును సీఐఎస్ ఎ2కె వల్ల ఏ మాత్రం అందుకోలేకపోయారు. ఈనాడు ఆదివారం పుస్తకం (ఫిబ్రవరి 2008) ఒక్క వ్యాసంతో చేకూరిన ప్రయోజనంతో పోలిస్తే A2K ఇన్నాళ్ళ కృషి వల్ల కూడా కలగలేదు. కొత్త సభ్యుల సంఖ్యలో కొంత పురోవృద్ధి ఉన్ననూ అది కాలమాన పరిస్థితులను బట్టి పెరగడం సహజమే. సీఐఎస్ ఎ2కె వల్ల ఎందరు సభ్యులు తమ చురుకుదనం తగ్గించారో ఈ లెక్కలు చూపలేవు.
  14. సీఐఎస్ ఎ2కె వల్ల కొత్తగా వచ్చిన సభ్యులు తెవికీ నియమాలను అర్థం చేసుకోక కేవలం వ్యాసాలు రచించడం వల్ల ఆ వ్యాసాలు తెవికీ స్థాయిలో లేవు. కొత్తగా చేరే సభ్యులకు తెవికీ నియమాలపై అవగాన కల్పించడం కన్నా వారిచే దిద్దుబాట్లకే ప్రాధాన్యత ఇస్తున్నటుగా వారి రచనల వల్ల తెలుస్తోంది. కొత్త సభ్యులకు గణాంకాలపై మోజు కల్పించడం కన్నా నాణ్యతపై దృష్టి సారింపజేసినట్టుగా వారి దిద్దుబాట్లు చెప్పడం లేదు.
  15. గ్రామవ్యాసాలలో గణాంకాలను వైజాసత్యగారు బాటుద్వారా చేరుస్తానని చెప్పిననూ కొందరు సభ్యులు పట్టించుకోకుండా "హ్యూమన్ టచ్‌"తో పెట్టేశారు. దీన్నీ సీఐఎస్ ఎ2కె విజయంగా చెప్పడం సమంజసం కాదు. A2K టీం RTI ద్వారా సమాచారం సేకరించారనడం విడ్డూరంగా ఉంది. కేవలం రూ.90/-తో ఒక రాష్ట్రానికి చెందిన అన్ని గ్రామాల గణాంకాలు సెన్సస్ కార్యాలయంలో అందిస్తారు. అలాంటి సిడి నేను కూడా తీసుకున్నాను.

కేవలం గణాంకాలనే వృద్ధిచేసే ఈ ప్రణాళికతో తెవికీకి ప్రయోజనాల కన్నా నష్టాలే అధికంగా ఉన్నందున నేను వ్యతిరేకిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:42, 30 ఏప్రిల్ 2015 (UTC)Reply

Return to the project page "వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016".