నల్లమల గిరిప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
 
==రాజకీయ జీవితం==
ఇతడు 1953లో ఉద్యమ కమ్యూనిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా ఎన్నికై ఏకదాటిగా 11 సంవత్సరాలపాటు పనిచేశాడు. 1962లో ఖమ్మం నుండి శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు. కమ్యూనిస్టు పార్టీ చీలిక సమయంలో సిపిఐ చూపి సిపిఐ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు విశేష కృషిచేశాడు. ఇతడు 1978లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికై 1991 వరకు పనిచేశాడు. విశాలాంధ్ర విజ్ఞానసమితి అధ్యక్షునిగా, 1992నుంచి రాజ్యసభ సభ్యుడుగా పనిచేశాడు. 1992లో సి.పి.ఐ. జాతీయ కార్యదర్శిగా, 1996లో ఉపప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. స్వాతంత్య్ర సమరయోధుల స్క్రీనింగ్‌కమిటీ చైర్మన్‌గా పనిచేశాడు. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు జీవితాంతం కట్టుబడిన నల్లమల గిరిప్రసాద్ [[1997]] [[మే 24]] న తుదిశ్వాస విడిచాడు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/నల్లమల_గిరిప్రసాద్" నుండి వెలికితీశారు