వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
:* విశ్లేషణ-గణాంకాలు: ప్రణాళికలో పొందుపరచిన విశ్లేషణ తెవికీ మొత్తానికి సంబందించింది. గత సంవత్సర ప్రగతిలో మనందరి సమిష్టి కృషి ఉంది. సీ.ఐ.ఎస్-ఏ.2.కె కేవలం ఒక కాటలిస్ట్ ప్రోగ్రాం మాత్రమే అని మనందరం దృష్టిలో ఉంచుకోవలసిన విషయం. ఉదాహరణకి తెలుగు ప్రణాళిక లాగే, సీ.ఐ.ఎస్-ఏ.2.కె కన్నడ, ఒడియా ప్రణాళికల ద్వారా ఆయా వికీ సముదాయాలతో వికీ ప్రగతికై కృషి చేసింది. అలా అని ప్రతీ భాషా ప్రణాళికల వలన ఒకే విధమైన ప్రభావం కనిపించలేదు. ఆయా వికీ సముదాయాల బలాలు, బలహీనతలు, అవసరాలు; ఆ భాషా, ప్రాంత, సాంకేతిక స్థితిగతులు; ఇవన్నీ కూడా సీ.ఐ.ఎస్-ఏ.2.కె ద్వారా వచ్చిన వనరుల, కార్యక్రమాల వినియోగాన్ని వాటి ద్వారా వికీకి చేకూరే ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ఇక సీ.ఐ.ఎస్-ఏ.2.కె పూర్తి స్థాయిలో చేపట్టిన కార్యక్రమాల ఫలితాలు ఆయా ప్రాజెక్టు పేజిల ద్వారా తెలుపుతూనే ఉన్నాము. మచ్చుకు [[వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర_లొయోల_కళాశాల/భౌతికశాస్త్రం|ఆంధ్ర లయోల కళాశాలలో మొదలు పెట్టిన ఒక ప్రాజెక్టు]] చూడండి. ఇక గణాంకాల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా వికీమీడియా ఫౌండేషన్ వారి సూచన మేరకు అనేక వికీ చాప్టర్లు, సమూహాలు పాటించే [[:m:Grants:Learning_%26_Evaluation/Global_metrics|గ్లోబల్ మెట్రిక్స్]] మనం కూడా వాడాము. అలాగే ప్రణాళికలో ప్రతి కార్యక్రమానికి లక్ష్యాలను ఈ గ్లోబల్ మెట్రిక్స్ కి అనుగుణంగా సూచించడం జరిగింది.
:* //కొన్ని చర్చలలో ప్రస్తావించినట్లు, సిఐఎస్ అంటే తెవికీ , తెవికీ అంటే సిఐఎస్ అనే అనుమానం బలపడుతుంది// ఇలాంటి చర్చల లంకెలను జతపరచండి. ఒక వేళ ఎవరైన కొత్త వికీపీడియనులు అలా అనుకుంటే వారికి వివరణ ఇస్తే సరిపోతుంది.
:* లక్ష్యాలు: మీరు బహుశా ప్రణాళిక మొత్తం చదివినట్టు లేదు. ప్రణాళిక లక్ష్యం తెవికి ని వాసి పరంగా రాశి పరంగా పెంపొందించడమే. కేవలం వ్యాసాలే లక్ష్యంగా పెట్టుకొని ఉంటే మనమీపాటికి 10 లక్షల వ్యాసాలు సునాయాసంగా దాటి ఉండేవాళ్ళం. తెవికీలో మొలక వ్యాసాలు ఎంత తగ్గాయో వైజాసత్యగారు విశ్లేషిస్తూ రచ్చబండలో కూడా పెట్టారు. తెవికీని నాణ్యతా పరంగా అభివృధ్ధి ఇంకా చేయాల్సి ఉంది దీనికి ఈ ప్రణాళిక కూడా కట్టుబడి ఉంది అందుకు గాను కొన్ని కార్యక్రమాలను అనుకున్నాం. ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో వాటిని ఎలా ఆచరణలో పెట్టాలో మీరు తెలియజేస్తే బాగుంటుంది. కేవలం వ్యాసాల సంఖ్యనే లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పటివరకు 10 లక్షలకంటే ఎక్కువ వ్యాసాలు చేసి ఉండవచ్చు.
:* తెవికీ లోటుపాట్లు: కొత్త సభ్యులు రావడం, వారికి తెవికీ పాలసీలు అర్థమవడంలో సమయం పట్టడం కొంత నాణ్యత దెబ్బతినడం, వాటిని మనం సరిచేసుకుంటూ వారికి నియమాలు తెలియజేస్తూ ముందుకుపోవడం ప్రతీ వికీ ప్రాజెక్టు ప్రగతికి సర్వసాధారణం. నాణ్యత దెబ్బతింటుందని కార్యక్రమాలు చేయకుండా, కొత్త సభ్యులు రాకుండా ఏ వికీ కూడా ప్రగతి సాధించలేదు కదా. అలా అని నాణ్యతపై ఈ ప్రణాళిక శ్రధ్ధ తగ్గించలేదు.
:* గతంలోని సభ్యులు సూచించిన లక్ష్యాలు: మీరు ఇచ్చిన లంకెలోని లక్ష్యాలు, ఇతర సభ్యుల సూచనలు చాలా వరకు గత సంవత్సర ప్రణాళికలనే కాకుండా ఈ ప్రస్తుత ప్రణాళికను రూపొందించడంలో ఎంతో దోహదపడ్డాయి. వీలైనంతవరకు ఆచరణ సాధ్యమైన ఆంశాలు ప్రణాళికలో ఉంచడం జరిగింది. ఇంకా ఏవైనా చేర్చాలి అంటే మీరు సూటిగా తెలుపగలరు. మీ, ఇతర సభ్యుల సూచనల ఆధారంగా ప్రణాళికను తప్పకుండా మరింత మెరుగు పరచి తెవికీని ముందుకు తీసుకువెళదాం.
Return to the project page "వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016".