వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016: కూర్పుల మధ్య తేడాలు

→‎నెలవారీ సమావేశాలు: వివరణ, ప్రశ్న, సహాయం
పంక్తి 178:
:బెంగుళూరులో భౌగోళికంగా తెవికీ సభ్యులు దూరభారాల వలన రాలేకున్నారు. చురుకుగా ఉన్న సభ్యులు వ్యస్తమవడం, వీరశశిధర్ లాంటి వారు కర్నూల్ కు స్థానాంతరం చెందడం వలన సమావేశాలు జరగలేదు. సమూహ సభ్యులు చొరవ తీసుకుంటే సీఐఎస్ ప్రధాన కార్యాలయం ఎప్పుడూ స్వాగతిస్తుంది. బెంగుళూరులో మీరు చొరవ తీసుకొని నెలవారీ సమావేశాలు మొదలుపెట్టగలరు. ఇన్ని అని లేదు. ఎన్ని ఎక్కువ చోట్ల ఈ సమావేశాలు జరిగితే అంత మేలు. అందుకే చిన్న నగరాలు, పట్టణాలలో మొదలుపెట్టడానికే మన ప్రణాళికలో ఒక ప్రాజెక్టు చేర్చాం. రాజశేఖర, ప్రణయ్ గార్లు ఎలా అయితే ఒక పట్టుదలతో హైదరాబాదులో సమవేశాలు చేస్తున్నారో ఆలాంటి పట్టుదలతో సభ్యులు ఎక్కడైనా ఈ సమావేశాల నిర్వహణకి బాధ్యత తీసుకోవచ్చు. ఏ.2.కె తప్పక సహాకరం అందిస్తుంది. --[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]]) 08:29, 18 ఏప్రిల్ 2015 (UTC)
::దూరభారాల వలన రాకుంటే స్కైప్ అనుసంధానంతో చేయవచ్చును కదా. బెంగుళూరు సమావేశాల దిశగా ప్రయత్నించి వీరశశిధర్ గారిని ప్రేరేపించిన వ్యక్తిగా (చూడండి [[వికీపీడియా:సమావేశం/బెంగుళూరు/2 జూన్ 2013]]), ఈ సమావేశాలను కొనసాగించడానికి సిఐఎస్-ఎ2కె ప్రాధాన్యత చూపకపోవడం నిరాశ కలిగించింది. సమావేశాలకి కేవలం కార్యాలయమే అవసరమైతే అటువంటి కార్యాలయాలు చాలా సంస్థలనుండి పొందవచ్చు. సిఐఎస్-ఎ2కె ఉత్ప్రేరకంగా పనిచేస్తున్నదనటానికి, సముదాయం బలహీనంగా వున్న చోట్ల బలపడేటట్లు చేయగలగాలి. తొలిదశలో నాయకత్వం తీసుకోవాలి. స్వచ్ఛంధ సభ్యులు ముందుకు రావటాన్ని ప్రేరేపించగలగాలి. ప్రస్తుత అనుభవాన్ని బట్టి చూస్తే చిన్న నగరాలు, పట్టణాలలో సమావేశాలు ప్రణాళికలో చేర్చటం జరగవచ్చు కాని అది సఫలమవుతుందన్న ఆశ కనబడడం లేదు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 02:24, 26 ఏప్రిల్ 2015 (UTC)
::: హైదరాబాదులో సమావేశాలు నెలవారీ జరిగేలా మొదట్లో చొరవ తీసుకున్నది సీ.ఐ.ఎస్-ఏ.2.కె సభ్యులన్నది నిస్సందేహం. బెంగుళూరులో మీరు ఎన్నో ఏళ్ళుగా ఉన్నా జూన్ 2013 నాటికే ఎందుకు ప్రేరేపించగలిగారు?
::: ఔత్సాహికుల అందుబాటుని అనుసరించి మీరు చెప్పిన విధంగా స్కైప్ అనుసంధానం ద్వారా చేయటానికి ప్రయత్నించవచ్చు. అలా ఇప్పటికే హైదరాబాదు సమావేశాలలో మనవాళ్ళు పాల్గొనటం చేస్తూవున్నారు. అందుకోసం గోల్డెన్ త్రెషోల్డ్లో వ్యవస్థ చేయడానికి కృషి చేయడం జరిగింది.
::: మీరు తెలుగు వికీపీడియనులతో స్కైపులో/ఆఫ్ వికీ మాధ్యామలలో (ముఖ్యంగా వైజాసత్య గారు, రాజశేఖర గారు, సుజాత గారితో) తెవికీ గురించి చర్చించేవారు అన్నారు. వాటి అనుభవం ఎలా ఉందో తెలియజేయండి. దానిని బట్టీ ఇంకా మెరుగు పరచుకుందాం --[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]]) 09:48, 30 ఏప్రిల్ 2015 (UTC)
 
===శిక్షణాశిబిరాలు===
Return to the project page "వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016".