వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
* బుధవారం రాజమండ్రి శ్రీ గౌతమీ గ్రంధాలయంలో తెలుగు వికీపీడియా అవగాహనా కార్యక్రమం జరిగింది, ఉదయం 9 గంటలకు మొదలైన ఈ కార్యక్రమానికి నేను, నాకు సహాయానికి వచ్చిన పవన్ సంతోష్ ఇరువురం మధ్యాన్నం 1 గంట వరకూ వికీపీడియా గురించి అందరికీ వివరించాం - సుమారుగా నూట యాభై మంది హాజరైన ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఆఖరులో మధ్యాన్నం వికీ శిక్షణ జరుగునని చెప్పడం వలన చాలామంది తిరిగి మధ్యాన్నం శిక్షణ కొరకు వచ్చారు. వారి ద్వారా కొన్ని మార్పులు చేయిస్తూ, తెలుగు టైపింగ్ నేర్పించడం జరిగింది. రెండు IP అడ్రసులే ఉండడం వలన కేవలం 12 మందికి మాత్రమే వాడుకరి ఖాతాలు తెరవగలిగాము. గౌతమీ గ్రంథాలయంలోనే కంప్యూటర్ విభాగం ఉండటం వలన ఈ కార్యక్రమం మరింత బాగా జరిగింది. కార్యక్రమానికి హాజరైన అందరికీ, సహకరించిన సూర్యనారాయణ మూర్తి గారికి ఇతర సిబ్బందికి అందరికీ కృతజ్ఞతలు..
* పిఠాపురంలో కల చారిత్రక గ్రంథాలయం అయిన సూర్యరాయ విద్యానంద గ్రంథాలయానికి వెళ్ళడం జరిగింది. అక్కడి కార్యనిర్వహక వర్గం వారు వికీపై వివరణకు ఆశక్తి కనబరచారు. వారి గ్రంథాలయం గురించి వికీలో సమాచారం ఉండటానికి, కేటలాగ్ కొరకు అనుమతి ఇచ్చారు.
* ఏప్రిల్ 9 వతేదీ పిఠాపురానికి మలిసారి అవగాహనా కార్యక్రమం కొరకు వెళ్ళాను. 9,10 వతేదీలలో పలువురు వికీ గురించి అడిగి తెలుసుకొన్నారు. కొందరు విద్యార్ధులు కూడా సిక్షనలో పాల్గొన్నారు, 10 వతేదీ ఉదయం 9 గంటల నుండిమద్యాన్నం 1 గంట వరకూ అవగాహనా కార్యక్రమం జరిగింది. గ్రంథాలయానికి వచ్చిన పాఠకులు, పెద్దలు విద్యార్ధులు సుమారు 60 మంది హాజరైనారు. వీరితో పాటుగా సీనియర్ వికీ సభ్యులు రాజాచంద్ర ఉదయం నుండి నాతో ఉండి పలువురు ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చారు.
* ఏప్రిల్ 20 వతేదీ భీమవరం సమీపాన కల [[కుముదవల్లి]] గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామాన కల ప్రాచీన, చారిత్రక గ్రంథాలయం అయిన [[శ్రీ వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయం]] పరిశీలన కొరకు వెళ్ళాను. అక్కడ గ్రంథాలయ ప్రస్తుత అద్యక్షులు శ్రీ కలిదిండి కృష్ణంరాజు గారిని కలసి వారితో మాట్లాడి వికీ గురించి నా ప్రాజెక్టు గురించి వివరించడం జరిగింది. ఆయన సుముకత వ్యక్తం చేయడం, మరొకమరు కలసి అన్ని విశేషాలు తెలియచేస్తానని చెప్పడం జరిగింది. కొన్ని ఫొటోలు, కొంత సమాచారం సేకరించి వ్యాసం మొదలెట్టం జరిగింది.
===కార్యక్రమాల పేజీలు===
# [[తెలుగు గ్రంధాలయం, వికీ ఎడిటధాన్ హైదరాబాద్]]