గాలివాన (కథ): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
కథలోని ప్రధాన పాత్రల్లో ఒకటి రావుగారి పాత్ర. ఆయన సంఘంలో గౌరవమర్యాదలు, పేరుప్రతిష్టలు కలిగినవారు. వకీలుగా పనిచేసి కొడుకు వకీలు పరీక్షలు నెగ్గాకా తన ప్రాక్టీసును అతనికి అప్పగించి విశ్రాంతి తీసుకుంటున్నవారు ఆయన. ఆయన జీవితంలో ప్రతీ విషయంపైనా ఒక నియమాన్ని ఏర్పరుచుకుని అందుకు అనుగుణంగా జీవిస్తూంటారు. కుటుంబంలోని ప్రతివారినీ తన క్రమశిక్షణకు అనుగుణంగా నడుపుతూంటారు, చివరకు కూతుళ్ళ తలకట్టు ఎలావుండాలో కూడా రావుగారే నిర్ణయించేది. తత్త్వవేత్తగా తనను తాను భావించుకునే రావుగారికి ఉపన్యాసాలపై ఆసక్తి ఎక్కువ. దానితో వివిధ సంస్థల ఆహ్వానాల మేరకు "సత్వము-తత్త్వము", "ప్రకృతి-పరిష్కృతి" లాంటి పేర్లతో ఉపన్యాసాలు ఇస్తూంటారు.(అయితే శీర్షికలను విషయాన్ని బట్టి కాకుండా శబ్దాలంకారాలపై మోజుతో నిర్ణయించుకుంటూంటారని వారి స్నేహితుల వేళాకోళం) కథ ప్రారంభమయ్యే సమయానికి ఆయన ఆస్తిక సమాజం వారి ఆహ్వానం మేరకు "సామ్యవాదము-రమ్య రసామోదము" అన్న అంశంపై ప్రసంగించేందుకు రైలు ప్రయాణంలో ఉంటారు. వారున్న బెర్తుల వద్దకు అడుక్కునేందుకు వచ్చిన బిచ్చగత్తెను అసహ్యించుంటారు. అయితే ఆ రాత్రి మెల్లగా ప్రారంభమైన వాన అత్యంత తీవ్రమైపోతుంది. తాను దిగాల్సిన స్టేషన్లో బెడ్డింగు, సామాన్లతో సహా రావుగారు దిగుతారు. అయితే ఆ తీవ్రమైన గాలివానలో, రైల్వేస్టేషన్లో తాను అసహ్యించుకున్న బిచ్చగత్తెతో పాటుగా చిక్కుకుంటారు.<br />
అంతటి వేదాంతి అయిన రావుగారు ఆ స్టేషన్లో గాలివాన బీభత్సానికి భయపడిపోతారు. అయితే జరుగుతున్న క్షణంతోనే తప్ప గడిచిన గతం, రానున్న భవిష్యత్తులతో ఏ సంబంధం పెట్టుకోని 30ఏళ్ళ బిచ్చగత్తె మాత్రం ధైర్యంగా ఉంటుంది. అతనికి చలివేస్తుంటే తన చుట్టూ చేతులు వేసుకొమ్మంటుంది, ధైర్యం చెప్తుంది. ఆ రాత్రి ప్రాణాలు కాపాడుతుంది. అయితే తెల్లవారేసరికి ఆమెకి ఏమైంది, తద్వారా తన జీవితంలో ఇన్నాళ్ళూ కాపాడుకుంటూ వచ్చిన విలువలు, నమ్మకాలు, తాత్త్వికత, ధర్మం వంటివన్నిటినీ రావుగారు ఎలా పునర్నిర్వచించుకున్నారు అన్నది కథాంతాన్ని బట్టి తెలుస్తుంది.<ref name="నెమలికన్నులో గాలివాన గురించి">{{cite web|last1=నెమలికన్ను|first1=మురళి|title=గాలివాన|url=http://nemalikannu.blogspot.in/2010/01/blog-post_06.html|website=నెమలికన్ను|publisher=మురళి|accessdate=5 June 2015}}</ref>
== శైలి ==
=== శీర్షిక ===
గాలివాన అన్న కథాశీర్షకను చాలా ప్రతీకాత్మకంగా ఉపయోగించారని విమర్శకులు భావించారు. కథలో ప్రధానపాత్ర అయిన రావుగారు ఏర్పరుచుకున్న
=== వర్ణనలు ===
=== ప్రతీకలు ===
 
== ప్రభావాలు ==
గాలివాన కథపై ''గోర్కీ'' రచించిన కథ ''ద ఆటమ్ నైట్'' ప్రభావం ఉందని సాహిత్య విమర్శకుల అభిప్రాయం. ''గోర్కీ'' రాసిన ఆటమ్ నైట్ కథలో ప్రధానపాత్ర ఓ పేదకుర్రాడు. దివాలాతీసిన నగరంలో చలికాలంలో వానపడుతున్న ఆ రాత్రి అతను ఆకలితో నకనకలాడుతూంటాడు. వ్యవస్థపైనా, జీవితంపైనా నమ్మకాన్ని కోల్పోతాడు. అలాంటి స్థితిలో ఓ బిచ్చగత్తె అతన్ని అక్కునచేర్చుకుని వెచ్చదనాన్ని కలగజేసి జీవితంపై నమ్మకాన్ని చిగురింపజేస్తుంది. ఈ కథను దృక్పథాల మధ్య వైరుధ్యం సృష్టించి పెంచి గాలివాన అంతటి కథగా మలిచారని సాహిత్యకారుడు ఖదీర్ బాబు ప్రతిపాదన. <ref name="గాలివానపై ప్రభావాలు ఖదీర్">{{cite news|last1=ఖదీర్|first1=బాబు|title=గాలివానకు ముందు తర్వాత..|url=http://www.sakshi.com/news/family/prior-to-the-storm-229275|accessdate=5 June 2015|work=సాక్షి|agency=జగతి పబ్లికేషన్స్|date=11 ఏప్రిల్ 2015}}</ref> అయితే ''మాక్సిం గోర్కీ'' రాసిన ''ద ఆటం నైట్'' కథ మీద ఫ్రెంచి రచయిత ''గుస్తావ్ ఫ్లోవేర్'' సెయింట్‌గా మారాలనుకునే ఓ దొంగ చలికాలం రాత్రి చలికి చనిపోయేలావున్న కుష్టురోగిని కౌగలించుకునే ఘటన నమోదుచేసిన కథ స్ఫూర్తగా వుందని ఖదీర్ పేర్కొన్నారు.<ref name="గాలివానపై ప్రభావాలు ఖదీర్" />
"https://te.wikipedia.org/wiki/గాలివాన_(కథ)" నుండి వెలికితీశారు