అష్టా చమ్మా (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
రాంబాబు చెల్లెలు వరలక్ష్మి (భార్గవి) ఫోటో చూసి ఇష్టపడ్డ ఆనంద్ ఎవరికీ చెప్పకుండా లక్కవరం వెళ్ళి తనే వరలక్ష్మి అన్నయ్య మహేష్ ని అని పరిచయం చేసుకుంటాడు. అప్పటికే మహేష్ అనే కల్పితపాత్ర గురించి రాంబాబు గొప్పలు చెప్పడంతో, ఆ మహేష్ పై క్రష్ పెంచుకున్న వరలక్ష్మి మహేష్ అనే పేరుతో వచ్చిన ఆనంద్ ని ప్రేమిస్తుంది. ఆమె ప్రేమ దక్కించుకోవాలనుకున్న ఆనంద్ తన పేరును మహేష్ గా మారిస్తే మంచి సంభావన ఇస్తానంటూ ఊరి పురోహితుడు సర్వశర్మ ([[తనికెళ్ళ భరణి]]) దగ్గరకి వెళ్తాడు. వరలక్ష్మి ప్రేమ విషయం వాళ్ళింట్లో ఆయాగా పనిచేస్తున్న అమ్మాజీ ([[హేమ]]) రాంబాబుకి ఫోన్ చేసి చెప్తుంది. దాంతో రాంబాబు హడావుడిగా బయల్దేరి లక్కవరం వచ్చేస్తాడు. రాంబాబు తమ ప్రేమను అడ్డుకుంటున్నాడన్న కోపంలో రాంబాబుకు ఓ సమస్య సృష్టిస్తే తమ జోలికి రాడన్నట్టుగా ఆనంద్ హైదరాబాదులో ఉన్న లావణ్యకి ఫోన్ చేసి పిలిపించేస్తాడు. అప్పటికే మందిర, తన స్నేహితురాలు అమృతతో ఊరు వెళ్ళడంతో అదను చూసుకుని లావణ్య లక్కవరం వచ్చేస్తుంది. లక్కవరం రాగానే కొంత అయోమయం తర్వాత లావణ్యకి తాను ప్రేమించిన వ్యక్తి మహేష్ కాదు రాంబాబు అనీ, వరలక్ష్మికి తాను ప్రేమించింది కూడా మహేష్ ని కాదు ఆనంద్ ని అనీ తెలిసివస్తుంది. దాంతో వారిద్దరూ అలుగుతారు.<br />
లావణ్య వెంటనే ఊరొదిలి వెళ్ళిపోదామనుకుంటుంది, కానీ బస్సులు తర్వాతి రోజు వరకూ లేకపోవడంతో ఆ ఊళ్ళోనే ఉండాల్సివస్తుంది. ఎలాగైనా లావణ్యని దక్కించుకుందామనుకున్న రాంబాబు తన పేరును మహేష్ గా మార్చమని సర్వశర్మ దగ్గరకి వస్తాడు. అప్పటికే అమ్మాజీని ప్రేమిస్తున్న సర్వశర్మ తన పెళ్ళి చేస్తేనే రాంబాబు పేరుమారుస్తానంటాడు. ఈలోగా ఆ ఊరికి ఆఘమేఘాల మీద మందిర లక్కవరం వచ్చేస్తుంది. ఆమె అగ్గిమీద గుగ్గిలమైపోయినా చివరకు కుర్రాడికి నిజంగానే పదిహేను కోట్ల రూపాయలు విలువచేసే ఆస్తివుందని తెలిసి మెత్తబడుతుంది. వారిద్దరి పెళ్ళికీ ఒప్పుకుంటుంది, అయితే మహేష్ నే పెళ్ళిచేసుకుంటానని పట్టుపట్టిన లావణ్య మాత్రం అంగీకరించదు.<br />
ఈలోగా ఆ ఇంట్లో అమ్మాజీని చూసిన మందిర ఆమెను పట్టుకుని నిలదీస్తుంది. దాంతో అమ్మాజీ తన చిన్నప్పుడు అమృత ఇంట్లో పనిచేసేప్పుడు వాళ్ళ కొడుకుని రైల్వేస్టేషన్లో ఆడిస్తూండగా తనకిష్టమైన నటుడు [[ఘట్టమనేని కృష్ణ|సూపర్ స్టార్ కృష్ణ]] రావడంతో ఆయన్ని చూసేందుకు పిల్లాణ్ణి మెత్తటి వెచ్చటి పింక్ టర్కీ టవల్ లో పెట్టి పక్కన వదిలేస్తుంది. ఆ విషయాన్ని చెప్పగానే రాంబాబు ఇంట్లోంచి ఆ పింక్ టర్కీటవల్ దానిపై ఎం అనే అక్షరంతో సహా తీసుకువచ్చి చూపిస్తాడు. రాంబాబు పసిపల్లాడిగా ఉండగా అదే టవల్ లో దొంగ రైల్లో వదిలేస్తే హైదరాబాద్లో రైలెక్కుతున్న లక్కవరం భూస్వామి శివకుమార్, ఆయన భార్య రాజమ్మ తెచ్చుకుని రాంబాబు అన్న పేరుపెట్టి పెంచుకుంటారు. ఈ విషయం చనిపోయేప్పుడు రాంబాబుకు చెప్పి, పింక్ టర్కీ టవల్ ఇస్తారు. చివరకు మందిర స్నేహితురాలు అమృత తప్పిపోయిన కొడుకే రాంబాబు అని తెలుస్తుంది.
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/అష్టా_చమ్మా_(సినిమా)" నుండి వెలికితీశారు