మూగ మనసులు (1964 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దస్త్రం ఎగుమతి చేసాను
పంక్తి 30:
 
[[ముళ్ళపూడి వెంకటరమణ]]ను రచయితగా పరిచయం చేస్తూ, [[ఆదుర్తి సుబ్బారావు]] దర్శకత్వంలో [[దాగుడు మూతలు (1964 సినిమా)|దాగుడు మూతలు]] సినిమా తీయాలని 1961 నుంచీ డి.బి.నారాయణ ప్రయత్నాలు సాగించారు. కానీ వేరే సినిమాల హడావుడిలో ఆదుర్తి కాలం గడిపేస్తూ వచ్చారు, ఈలోగా [[గుడిగంటలు]], [[రక్తసంబంధం (1962 సినిమా)|రక్తసంబంధం]] సినిమాలకు ముళ్ళపూడి స్క్రిప్ట్ రాశారు. ఆ సమయంలో ఈ సినిమా లైన్ ముళ్లపూడి వెంకటరమణకు చెప్పారు ఆదుర్తి. రమణ ఈ సినిమా లైన్ గురించి ఆయన బాల్యమిత్రుడు, గోదావరి పరిసరాల్లో ఇరిగేషన్ ఇంజనీరుగా పనిచేస్తున్న [[బి.వి.రామారావు]]తో చర్చించారు. ముందుగా బల్లకట్టుమీద కాలవ దాటించే హీరోకీ, హీరోయిన్ తో ప్రేమ అనుకున్నా, రామారావు బల్లకట్టు మీద దాటించడమంటే నిమిషాల్లో గడిచిపోతుందనీ గోదావరి అనుకుంటే కనీసం 45 నిమిషాల పాటు హీరో హీరోయిన్లకు ఏకాంతం సమకూరుతుందని సూచించారు. అలానే [[సఖినేటిపల్లి]] గోదావరికి ఒకవైపు ఉండగా, ఆ ఊరి వాళ్ళు [[నరసాపురం]] వై.ఎన్.కళాశాలలో చదువుకునే వైనం నేపథ్యంగా వివరించారు. వారిద్దరి మధ్య చర్చల్లోనే కథలో హీరోను ఇష్టపడే గౌరి పాత్ర వచ్చి చేరింది.<ref name="కొసరుకొమ్మచ్చి - సీతారాముడు" /> తాను అనుకున్న లైన్ మీద ఆదుర్తి స్క్రిప్ట్ రమణను కథ రాయమని హోటల్లో పెట్టి, ఆదుర్తి టి.ఆర్.సుందరం స్టూడియోలో తాను డైరెక్ట్ చేస్తున్న కాట్టు రోజా అనే తమిళ చిత్రం షూటింగ్ చూసుకున్నారు. ముందుగానే అనుకున్న చేర్పులను కొనసాగిస్తూ అయిదురోజుల్లో ఆ చిన్న లైన్ ని ముళ్ళపూడి వెంకటరమణ 40 పేజీల స్క్రిప్ట్ గా మలిచి ఆదుర్తికి ఇచ్చారు. దర్శకుడు ఆదుర్తికి స్క్రిప్ట్ చాలా నచ్చింది. ఆ సందర్భంలోనే సినిమాకి మూగమనసులు అన్న పేరు రమణ సూచన మేరకు నిర్ణయించారు.<ref name="ఇంకోతి కొమ్మచ్చి" /><br />
హైదరాబాద్ తాజ్ మహల్ హోటల్లో రూములు బుక్ చేసి రచయిత ఆత్రేయ, దర్శకుడు ఆదుర్తి సహాయ దర్శకుడు [[కె.విశ్వనాథ్]], సహనిర్మాత సుందరం పిళ్ళై, సహరచయిత ముళ్లపూడి వెంకటరమణ తదితరులతో కథాచర్చలు ఏర్పాటుచేశారు. అంతకుముందే రమణ రాసిన స్క్రిప్టును దగ్గరపెట్టుకుని ఆత్రేయ ట్రీట్మెంట్ రాయడం ప్రారంభించారు, ఒకవేళ ఆ కథనం కథానాయకుడు [[అక్కినేని నాగేశ్వరరావు]] కి నచ్చకుంటే ఆయన కాల్షీట్లు చేజారకుండా జాగ్రత్త కోసం ఆదుర్తి సమాంతరంగా స్క్రిప్టుకు వేరే ట్రీట్మెంట్ రాశారు. చివరకు ఆత్రేయ నాలుగురోజుల పాటు రాయడం పూర్తయ్యాకా ఆదుర్తిని పిలిచి - రమణ రాసిన కథని మార్చి రాయడం అనవసరమనీ, అందరూ తన కథని ఫెయిర్ చేస్తే ఈరోజు సినిమాల్లో కొత్తవాడైన రమణ కథని ఫెయిర్ మాత్రమే చేస్తున్నానని చెప్పడంతో కథ అభివృద్ధి పూర్తైంది. సినిమా కథాప్రకారం (స్క్రీన్ ప్లే) సహా అభివృద్ధి చేసేప్పుడు తర్వాతికాలంలో ప్రముఖ దర్శకుడైన నాటి అసోసియేట్ డైరెక్టర్ [[కె.విశ్వనాథ్]] కథలో హాస్యసన్నివేశాలను రాశారు. దాంతో కథాప్రకారం(స్క్రీన్ ప్లే) కూడా పూర్తైపోయింది.<ref name="ఇంకోతి కొమ్మచ్చి" /> అయితే చిత్రీకరణకు ముందు సినిమా అవుట్ డోర్ షూటింగ్ అయితే నాగేశ్వరరావు, సావిత్రిలాంటి స్టార్స్ తో జనాన్ని కంట్రోల్ చేయలేమనీ గోదావరి మీద సినిమా వద్దనీ సహనిర్మాత సుందరం అడ్డుపడ్డారు.<ref name="కొసరుకొమ్మచ్చి - సీతారాముడు" /><br />
అయితే సినిమా ప్రారంభమయ్యాకా కొన్ని డైలాగుల విషయంలో అతికొద్ది, చిరుమార్పులు చోటుచేసుకున్నాయి. క్లైమాక్స్ లో బల్లకట్టు సుడిగుండం వద్దకు వచ్చి రాధ - గోపీ మరణించేప్పుడు "చావు అందరినీ విడదీస్తుంది. కాని ఒక్కోసారి కొందరిని కలుపుతుంది. మనలాటి వాళ్ళకి చావులోనే కలయిక సాధ్యం" అంటూ రాధ (సావిత్రి) చెప్పే డైలాగును షూటింగులో సన్నివేశాన్ని చిత్రీకరించడానికి కొద్దిసేపు ముందు బాపురమణలు రాసి, అంతకుముందు రాసిన మాటలు మార్చి చేర్చారు.<ref name="ఇంకోతి కొమ్మచ్చి" />
 
అయితే సినిమా ప్రారంభమయ్యాకా కొన్ని డైలాగుల విషయంలో అతికొద్ది, చిరుమార్పులు చోటుచేసుకున్నాయి. క్లైమాక్స్ లో బల్లకట్టు సుడిగుండం వద్దకు వచ్చి రాధ - గోపీ మరణించేప్పుడు "చావు అందరినీ విడదీస్తుంది. కాని ఒక్కోసారి కొందరిని కలుపుతుంది. మనలాటి వాళ్ళకి చావులోనే కలయిక సాధ్యం" అంటూ రాధ (సావిత్రి) చెప్పే డైలాగును షూటింగులో సన్నివేశాన్ని చిత్రీకరించడానికి కొద్దిసేపు ముందు బాపురమణలు రాసి, అంతకుముందు రాసిన మాటలు మార్చి చేర్చారు.<ref name="ఇంకోతి కొమ్మచ్చి" />
 
=== నటీనటుల ఎంపిక ===