సాక్షి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
=== అభివృద్ధి ===
ముళ్ళపూడి వెంకటరమణ ఆంగ్ల చలనచిత్రం ''high noon'' అనుసరించి సాక్షి అనే కథను రాశారు.<ref name="సారంగలో బాపు హీరోయిన్లపై వ్యాసం">{{cite web|last1=|first1=ల.లి.త|title=బొమ్మలోంచి సినిమాలోకి నడిచొచ్చిన ‘బాపూ తనపు’ హీరోయిన్!|url=http://magazine.saarangabooks.com/2014/09/03/%E0%B0%AC%E0%B1%8A%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B2%E0%B1%8B%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF-%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B0%BF-%E0%B0%A8/|website=సారంగ|accessdate=18 April 2015}}</ref> సాక్షి చిత్రకథను చాలావరకూ ఆ సాక్షి కథనే ఆధారంగా చేసుకుని తయారుచేసుకున్నారు. కనుక ఈ సినిమా మూలకథాంశంపై హై నూన్ ప్రభావం ఉందని చెప్పవచ్చు. కథలో చివరకు కథానాయకుడి పాత్ర కూడా మంచి పాత్ర కాదన్న విషయం తెలుస్తుంది. ఐతే సినిమాకు అనుగునంగా ఆ విషయాన్ని తీసివేసి సినిమా కథానాయకుడిని అమాయకుడిగా నిలిపారు.<ref name="ఎమ్వీయల్ కథారమణీయం పీఠిక">{{cite book|last1=ఎమ్.వి.ఎల్.|first1=ప్రసాద్|title=కథారమణీయం-2|publisher=విశాలాంధ్ర పబ్లికేషన్స్|location=హైదరాబాద్|edition=1|chapter=ముందుమాట}}</ref><br />
అప్పటికి పెద్ద హీరోలతో తీస్తున్న భారీ బడ్జెట్ సినిమాలు పరాజయం పాలవుతూండడంతో నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ వారు చిన్న బడ్జెట్లో తీసే సినిమాలకు ఫైనాన్స్ చేద్దామన్న పాలసీకి వచ్చారు. దాంతో బాపురమణలు వారిని ఈ సినిమా కథతో సంప్రదించారు. ఆ మీటింగ్ లో భాగంగా నవయుగ ప్రతినిధులు "మీకు [[అక్కినేని నాగేశ్వరరావు]], [[దుక్కిపాటి మదుసూదనరావు]] తెలుసు కదా, పైగా అక్కినేని జీవితచరిత్ర కూడా రాసినట్టున్నారు, మరి వారికి ఈ ప్రయత్నాలు తెలుసా?" అని అడిగారు. దానికి రమణ-తెలియదని, చెప్పలేదని, లక్షలతో వ్యాపారమైన సినిమారంగంలో ఇలాంటి సిఫార్సులు నాకిష్టంలేదని, నచ్చితే అవకాశమివ్వమని సమాధానం చెప్పారు. అంతటి సినీతారలు తెలిసినా, నిజాయితీగా అవకాశం అడగడం నచ్చి వారు ఫైనాన్స్ చేయడానికి ముందుకువచ్చారు. సినిమా పూర్తిగా అవుట్-డోర్ లో షూటింగ్ చేసి, కొత్తవారిని హీరోహీరోయిన్లుగా పెట్టుకుని, పాటలు లేకుండా తీస్తామన్నారు. కథ విన్నాకా, వారు అవుట్-డోర్ షూటింగ్, కొత్తవారు వరకూ సరే కానీ పాటలు లేకపోవడం తెలుగువారు అంగీకరించలేరని చెప్పడంతో, ట్రీట్ మెంట్లో మార్పులు చేసుకుని పాటలు కూడా చేర్చారు. అలాగే బాపు అంతకుముందు ఎక్కడా పనిచేయకపోవడంతో, రమణనే దర్శకత్వం వహించి బాపును సహాయకునిగా తీసుకోమనీ అడిగారు. బాపుకు దర్శకత్వం మీదున్న పట్టు తనకు లేదని, తాను రచయితనేనని చెప్పి ఒప్పించారు. అయితే ఇందరు కొత్త టెక్నీషియన్లతో పనిచేయడంలో కనీసం కెమేరామాన్ అయినా సీనియర్ని తీసుకోవాలని, అన్నపూర్ణ చిత్రాలకు ఛాయాగ్రాహకులైన సెల్వరాజ్ పేరు సూచించారు. అలాగే తీసుకున్నారు. బాపురమణలు ఇతర సన్నిహితులు కలిపి పాతికవేల రూపాయలు ఆంధ్రాబ్యాంకు ఖాతాలో జమచేసి ఆ రసీదు పంపగా నవయుగ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రూ.50వేలు ఫైనాన్స్ చేసింది. దాంతో సినిమా ప్రారంభమైంది.<ref name="ఇంకోతి కొమ్మచ్చి">{{cite book|last1=ముళ్ళపూడి|first1=వెంకటరమణ|title=(ఇం)కోతి కొమ్మచ్చి|date=జూలై 2013|publisher=వరప్రసాద్ రెడ్డి|location=హైదరాబాద్|edition=6}}</ref>
 
=== చిత్రీకరణ ===
"https://te.wikipedia.org/wiki/సాక్షి_(సినిమా)" నుండి వెలికితీశారు