రామావతారం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధం → గ్రంథం (2) using AWB
పంక్తి 19:
}}
{{హిందూ మతము}}
'''రామావతారము''' [[త్రేతాయుగము]]లోని విష్ణు అవతారము. రాముడు హిందూ దేవతలలో ప్రముఖుడు. అతను పురాతన భారత దేశమును వాస్తవముగ పరిపాలించిన రాజుగా నేటి చరిత్రకారులు భావించుచునారు. రాముడు తన జీవితమునందు ఎన్ని కష్టములు ఎదుర్కొనెను ధర్మమును తప్పకుండెను. ఆ కారణము చేత రాముడిని ఆదర్శ పురుషునిగా వ్యవహరించెదరు.
== ఆధార సాహిత్యం ==
[[వాల్మీకి]] వ్రాసిన [[రామాయణం]] రాముని కథకు ప్రధానమైన ఆధారం. ఇంతే గాక [[విష్ణు పురాణం|విష్ణుపురాణము]]లో రాముడు విష్ణువు యొక్క ఏడవ అవతారము అని చెప్పారు. [[భాగవతం]] [[నవమ స్కంధము]]లో 10, 11 అధ్యాయాలలో రాముని కథ సంగ్రహంగా ఉంది. [[మహాభారతం]]లో రాముని గురించిన అనేక గాధలున్నాయి.
 
భారత దేశమంతటా వాల్మీకి రామాయణమే కాకుండా అనేక అనువాదాలు, సంబంధిత గ్రంధాలు, జానపధ గాధల రూపంలో ప్రాచుర్యంలో ఉన్నాయి. [[మధ్వాచార్యుడు|మధ్వాచార్యుని]] అనుయాయుల అభిప్రాయం ప్రకారం ''మూల రామాయణం'' అనే మరొక గ్రంధంగ్రంథం ఉంది గాని ప్రస్తుతం అది లభించడం లేదు. [[వేదవ్యాసుడు]] వ్రాసినట్లు చెప్పబడే [[ఆధ్యాత్మ రామాయణం]] మరొక ముఖ్య గ్రంధంగ్రంథం. 7వ శతాబ్దిలో గుజరాత్ ప్రాంతంలో నివశించిన భట్టి రచించిన "భట్టికావ్యం" రామాయణ గాధను తెలుపుతూనే వ్యాకరణ కర్త [[పాణిని]] రచించిన [[అష్టాధ్యాయి]]ని, ప్రాకృత భాషకు సంబంధించిన అనేక భాషా విశేషాలను వివరిస్తున్నది.<ref>[[Fallon, Oliver]]. 2009. Bhatti’s Poem: The Death of Rávana (Bhaṭṭikāvya). New York: [[Clay Sanskrit Library]][http://www.claysanskritlibrary.org/]. ISBN 978-0-8147-2778-2 | ISBN 0-8147-2778-6 | </ref>
ఇతర భారతీయ భాషలలో ఉన్న కొన్ని ప్రధాన రచనలు - 12వ శతాబ్దికి చెందిన తమిళ కవి [[పంబన్]] వ్రాసిన [[పంబ రామాయణము]]; 16వ శతాబ్దికి చెందిన [[తులసీదాస్]] రచన [[రామచరిత మానసము]].<ref>[http://www.maxwell.syr.edu/maxpages/special/ramayana/immappop.jpg Regional Ramayanas]</ref>
 
తెలుగులో లెక్క పెట్టడం కష్టమైనన్ని రామాయణ రచనలు, అనుబంధ రచనలు వచ్చాయి. వాటిలో కొన్ని - [[తిక్కన]] రచించిన [[నిర్వచనోత్తర రామాయణము]]; [[గోన బుద్ధారెడ్డి]] రచించిన [[రంగనాధ రామాయణము]]; [[భాస్కరుడు]] రచించిన [[భాస్కర రామాయణము]]; [[విశ్వనాధ సత్యనారాయణ]] రచించిన [[రామాయణ కల్పవృక్షము]].
పంక్తి 43:
[[దస్త్రం:Sita Svayamvar.jpg|right|thumb|శివ ధనుర్భంగము - రవివర్మ చిత్రం]]
ఆయోధ్యా నగరం రాజధానిగా, కోసలదేశాన్ని [[ఇక్ష్వాకు వంశము|ఇక్ష్వాకువంశపు]] రాజైన [[దశరథుడు]] పాలిస్తున్నాడు. పిల్లలు లేని కారణంగా దశరధుడు [[పుత్రకామేష్టి]] యాగం చేశాడు. తరువాత ఆ రాజుకు నలుగురు బిడ్డలు జన్మించారు. వారికి [[రాముడు]], [[భరతుడు]], [[లక్ష్మణుడు]], [[శత్రుఘ్నుడు]] అని నామకరణం చేశారు. [[రావణుడు]] అనే రాక్షసుడు [[బ్రహ్మ]]వద్ద వరాలుపొంది దేవతలను జయించి మునులను వేధిస్తున్నాడు. వానికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావులేదు. దేవతల ప్రార్ధనలు మన్నించి [[శ్రీ మహా విష్ణువు]] వానిని హతంచేయడానికి నరుడై జన్మింపనెంచాడు. విష్ణువు రామునిగా, ఆదిశేషుడు లక్ష్మణునిగా, శంఖ చక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు. [[శ్రీమహాలక్ష్మి]] [[సీత]]గా అయోనిజయై [[జనక మహారాజు]] ఇంట పెరుగుతున్నది. రుద్రాంశ సంభూతుడైన [[హనుమంతుడు]] [[కిష్కింద]]లో ఉన్నాడు.
 
 
కులగురువు [[వశిష్ఠుడు|వశిష్టుని]] వద్ద రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు సకల విద్యలనూ అభ్యసించారు. ఒకనాడు [[విశ్వామిత్ర]] మహర్షి దశరధుని వద్దకు వచ్చి తన యాగసంరక్షణార్ధమై రామ లక్ష్మణులను తనతో పంపమని కోరాడు. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు ఎన్నో అస్త్రవిద్యారహస్యాలను బోధించాడు. దారిలో రామ లక్ష్మణులు [[తాటకి]] అనే రాక్షసిని సంహరించారు. గంగానదిని దర్శించారు. రాముని పాదము సోకి [[అహల్య]]కు శాపవిమోచనమైనది. రామ లక్ష్మణుల రక్షణలో యాగము జయప్రథముగా జరిగినది. మారీచ సుబాహులూ, ఇతర రాక్షసగణములూ దండింపబడ్డారు. తిరుగుదారిలో వారు [[జనకుడు|జనకుని]] రాజధానియైన [[మిథిల|మిథిలా]]నగరం చేరారు. అక్కడ సీతా స్వయంవరంలో రాముడు శివుని విల్లు విరచి, సీతకు వరుడైనాడు. సీతారాములు, [[ఊర్మిళ|ఊర్మిళా]] లక్ష్మణులు, మాండవీ భరతులు, శృతకీర్తి శతృఘ్నుల వివాహం కనుల పండువుగా జరిగింది. తిరుగుదారిలో రాముని ఎదిరించిన [[పరశురాముడు|పరశురామనకు]] తాము ఇద్దరూ విష్ణుస్వరూపులే అని తెలిసినది. మహా వైభవముగా నలుగురు జంటలూ అయోధ్యకు తిరిగి వచ్చారు.
Line 52 ⟶ 51:
 
భరతుడు సైన్యంతో అడవికి వెళ్ళి - "నీకు చెందవలసిన రాజ్యం నావంటి అల్పుడు పాలించలేడు. నా తల్లి తప్పును మన్నించి, అయోధ్యకు తిరిగివచ్చి మమ్మలనందరినీ ఏలుకో" అని ప్రార్ధించాడు. తండ్రి మరణవార్త విన్న రాముడు దుఃఖించాడు. కాని "తండ్రి మాట నిలబెట్టడం మన కర్తవ్యం. వనవాస దీక్ష ముగియవలసిందే" అని నిశ్చయించాడు. అప్పుడు భరతుడు - "14 సంవత్సరాల తరువాత నీవు అయోధ్యకు రావడం ఒక్కరోజు ఆలస్యమైనా నేను ప్రాణాలు త్యజిస్తాను. అంత వరకు నీ పాదుకలను సింహాసనంపై ఉంచి, భృత్యునిగా నేను రాజ్యపాలన నిర్వహిస్తాను" అని అయోధ్యకు తిరిగి వెళ్ళాడు.
 
 
సీతారామ లక్ష్మణులు మందాకినీ తీరాన చిత్రకూటం అనే సుందర ప్రదేశంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని జపతపాది కార్యములు నిర్వహిస్తూ కాలం గడుపుతున్నారు. వారు [[అత్రి]] మహాముని ఆశ్రమాన్ని దర్శించినపుడు సీతమ్మవారు [[అనసూయ]] ఉపదేశములు, ఆశీర్వచనములు గ్రహించినది.
Line 67 ⟶ 65:
[[File:Hanuman then allows himself to be captured by Ravana, who sets his tail on fire; bazaar art, c.1910's.jpg|thumb|హనుమంతుని తోకకు నిప్పు అంటిస్తున్న రాక్షసులు c.1910's నాటి చిత్రం.]]
హనుమంతుడు దేవతలకు మ్రొక్కి, మహేంద్రగిరిపైనుండి లంఘించి, రామబాణములా లంకలో వ్రాలాడు. చీకటి పడిన తరువాత లంకిణిని దండించి, [[లంక]]లో ప్రవేశించి, సీతను వెదుకసాగాడు. రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకూ, వాయువునకూ, సూర్య చంద్రులకూ, మరుద్గణములకూ, బ్రహ్మకూ, అగ్నికీ, సకల దేవతలకూ నమస్కరించి అశోకవనంలో సీతను వెదకడానికి బయలుదేరాడు. అక్కడ శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, భీతయై కృశించిన సీతను చూచాడు. ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు. సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించి, రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది. హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్షణములు గలవాడు, అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించగా విని సీత ఓరడిల్లినది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చినది. ఒక్క నెలలో రాముడు తనను కాపాడకున్న తాను బ్రతుకనని చెప్పినది.
 
 
ఇక హనుమంతుడు ఉగ్రాకారుడై వనమునూ, అడ్డు వచ్చిన వేలాది రాక్షసులనూ, రావణుడు పంపిన మహా వీరులనూ హతముచేసి, చివరకు [[ఇంద్రజిత్తు]] వేసిన [[బ్రహ్మాస్త్రము|బ్రహ్మాస్త్రానికి]] వివశుడైనట్లు నటించి రావణుని వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పజెప్పి రాముని శరణువేడి, లంకను కాపాడుకోమనీ, ప్రాణాలు దక్కించుకోమనీ హితవు చెప్పాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి, మరొక్కమారు సీతను దర్శించి, మరల వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరిపై వ్రాలాడు.
 
 
"చూచాను సీతను" అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలసి సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఉన్నచోటకు వచ్చి సీత జాడను, ఆమె సందేశమును వివరించారు. ఆపై చేయవలసినది ఆలోచించమని కోరారు.
Line 80 ⟶ 76:
::జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
::రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః
అంటూ వానరసేన లంకను ముట్టడించింది. మహాయద్ధం జరిగింది. వానరులచేతిలో రాక్షసవీరులు భంగపడ్డారు. దానితో ఇంద్రజిత్తు మాయాయుద్ధమారంభించి నాగాస్త్రంతో రామలక్ష్మణులను వివశులను చేసి శతృసైన్యాన్ని భయకంపితులను చేశాడు. అంతా విషణ్ణులైన సమయానికి [[గరుత్మంతుడు]] మహాప్రభంజనంలా వచ్చి వారిని నాగబంధాలనుండి విముక్తులను చేశాడు.
 
అనేకమంది రాక్షస వీరులు వానరుల చేత, రామలక్ష్మణులచేత హతులయ్యారు. రావణుడు స్వయంగా మహావీరులైన రాక్షసగణాలను వెంటబెట్టుకొని యుద్ధానికి వెడలాడు. అప్పుడు జరిగిన భీకరసంగ్రామంలో రావణుని కిరీటము నేలబడింది. ధనుసు చేజారింది. విశ్రాంతి తీసికొని మరునాడు యుద్ధానికి రమ్మని రాముడు రావణుని పంపేశాడు. అవమాన భారంతో కృంగిన రావణుడు తన సోదరుడైన కుంభకర్ణుని నిదురలేపి యుద్ధానికి పంపాడు. [[కుంభకర్ణుడు]] వానరులను కరకర నమలి మ్రింగుతూ, ఎండు అడవిని అగ్ని కాల్చినట్లుగా వానరసేనను నాశనం చేయసాగాడు. లక్ష్మణునిబాణాలు కుంభకర్ణుని నిలువరించాయు. రాముడు దివ్యాస్త్రాలతో వాని బాహువులనూ, ఊరువులనూ ఖండించగా వాడు పర్వతంలా క్రిందపడ్డాడు.
 
అనేకమంది రాక్షస వీరులు వానరుల చేత, రామలక్ష్మణులచేత హతులయ్యారు. రావణుడు స్వయంగా మహావీరులైన రాక్షసగణాలను వెంటబెట్టుకొని యుద్ధానికి వెడలాడు. అప్పుడు జరిగిన భీకరసంగ్రామంలో రావణుని కిరీటము నేలబడింది. ధనుసు చేజారింది. విశ్రాంతి తీసికొని మరునాడు యుద్ధానికి రమ్మని రాముడు రావణుని పంపేశాడు. అవమాన భారంతో కృంగిన రావణుడు తన సోదరుడైన కుంభకర్ణుని నిదురలేపి యుద్ధానికి పంపాడు. [[కుంభకర్ణుడు]] వానరులను కరకర నమలి మ్రింగుతూ, ఎండు అడవిని అగ్ని కాల్చినట్లుగా వానరసేనను నాశనం చేయసాగాడు. లక్ష్మణునిబాణాలు కుంభకర్ణుని నిలువరించాయు. రాముడు దివ్యాస్త్రాలతో వాని బాహువులనూ, ఊరువులనూ ఖండించగా వాడు పర్వతంలా క్రిందపడ్డాడు.
 
మరునాడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి అందరూ వివశులయ్యారు. హనుమంతుడు పర్వతసమేతంగా ఓషధులను తెచ్చి అందరినీ పునరుజ్జీవితులను చేసి, మరల పర్వతాన్ని యధాస్థానంలో ఉంచి వచ్చాడు. లక్ష్మణుడు అన్న ఆశీర్వాదము పొంది, హనుమంతుని భుజాలపై ఆసీనుడై వెళ్ళి, ఇంద్రజిత్తును చంపేశాడు.
Line 90 ⟶ 85:
 
రామునకు సహాయంగా [[ఇంద్రుడు]] మాతలిని సారధిగా పంపాడు. యుద్ధ పరిశ్రాంతుడై యున్న రామునకు [[అగస్త్యుడు]] "ఆదిత్య హృదయము"ను ఉపదేశించాడు. రాముడు దానిని మూడు మార్లు జపించాడు. రాముడు, రావణుడు శరవర్షాన్ని కురిపింపసాగారు. "రామరావణ యుద్ధం రామరావణ యోరివ" - వారి యుద్దానికి మరొకటి పోలిక లేదు - అని దేవగణాలు ఘోషిస్తున్నాయి. రావణుని తలలు తెగి పడుతున్నా మరల మరల మొలుస్తూనే ఉన్నాయి. "రామా! ఇలా కాదు. బ్రహ్మాస్త్రాన్ని సంధించు" అని మాతలి అన్నాడు.
 
 
రాముడు సంధించిన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణుని గుండెను చీల్చి, తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది. రాముడు ఎరపెక్కిన కన్నులతో, శరదళితదేహంతో, కోటి సూర్యుల ప్రకాశంతో, ధనుస్సును నేలకానించి, మరో చేత బాణాన్ని త్రిప్పుతూ వీరశ్రీబంధురాంగుడై త్రిదశపతినుతుడై శోభిల్లాడు. సకలదేవతలు రామునకు అంజలి ఘటించారు.
Line 114 ⟶ 108:
 
== వనరులు ==
 
 
== బయటి లింకులు ==
 
 
 
 
 
{{రామాయణం}}
{{విష్ణు అవతారాలు}}
<!-- Interwiki links -->
 
[[వర్గం:హిందూ దేవతలు]]
Line 130 ⟶ 118:
[[వర్గం:పురాణ పాత్రలు]]
[[వర్గం:విష్ణుమూర్తి అవతారాలు]]
 
<!-- Interwiki links -->
"https://te.wikipedia.org/wiki/రామావతారం" నుండి వెలికితీశారు