సికింద్రాబాద్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎భాష సంస్కృతి: clean up, replaced: సమాదానం → సమాధానం using AWB
చి clean up, replaced: హైస్కూల్ → ఉన్నత పాఠశాల using AWB
పంక్తి 23:
[[దస్త్రం:Secunderabad Railway Station outside.JPG|200px|right|thumb|<center>సికింద్రాబాదు రైల్వేస్టేషన్</center>]]
 
'''సికింద్రాబాద్‌ ''', [[తెలంగాణ ]] [[రాష్ట్రము]] యొక్క రాజధాని అయిన [[హైదరాబాదు]]కు జంట నగరముగా ప్రసిద్ది పొందినది. [[హుస్సేన్ సాగర్]] జలాశయం ఈ రెండు నగరాలను వేరు చేస్తుండగా, [[టాంక్ బండ్|కరకట్ట]] ఈ రెండు నగరాలను కలుపుతుంది. జంట నగరాలుగా పిలువబడినప్పటికీ ఈ రెండింటి మధ్య సాంస్కృతిక పరమైన వ్యత్యాసం ఉంది.
==పేరు==
1806 కాలంలో నిజాం రాజు సికిందర్ జా పాలించిన గ్రామం పేరు సికిందరాబాద్ గా స్థిరపడింది. సికందర్ ఆబాద్, సికందరాబాద్, సికంద్రాబాద్, సికిందర్ ఆబాద్, సికిందరాబాద్, సికింద్రాబాద్ మున్నగునవి. అర్థం, సికందర్ స్థాపించిన లేదా బస గావించిన లేదా అభివృద్ధిపరచిన నగరం.
పంక్తి 38:
 
==హైదరాబాద్ మరియు సికింద్రాబాద్==
1806 వ సంవత్సరంలో సైన్య సహాకార ఒప్పందంలో భాగంగా [[హుస్సేన్ సాగర్]] అవతల వెలసిన ఆంగ్లేయుల స్థావరం నిజాం పాలకుడు సికిందర్ జాహ్ ఉత్తర్వుల తో [[సికింద్రాబాద్]] గా ఆవిర్బవించింది. జంట నగరాల మధ్య అనేక తేడాలు గానవస్తాయి. సికిందరాబాదులో సాంఘిక సంస్కరణలు ఆంగ్లేయుల ఆచారాలకు అనుగుణంగా జరిగాయి. సంస్కర్తలకు పూర్తి మద్దతు లభించింది. హైదరాబాద్ ఇందుకు బిన్నం, [[నిజాము]] సర్కారు ఆచారాలకు అనుగుణం. సంస్కరణలు మార్పులు జరుగలేదు. [[మగ్దూం మొహియుద్దీన్]] ప్రారంభించిన ఉద్యమం తప్ప చెప్పుకోదగ్గ ఉద్యమమే లేదు. నిజాం నిరంకుశ ధోరణి వల్ల హైదరాబాదు వెనుకబడినది. బ్రిటిష్ వారిది పార్లమెంటరీ వ్వవస్థ. స్వార్థం వున్నా ఉదారవాదులుగా చెలామణి. ఈ తేడా జన జీవనంలో చాల స్పష్టంగా కనబడేది. 1806 ఏర్పడిన [[సికింద్రాబాదు]] 1946 వ సంవత్సరంలో జరిగిన ఒక ఒప్పందం ప్రకారం నిజాంకు ఆప్పగించే వరకు సికింద్రాబాద్ ఆంగ్లేయుల పాలన క్రిందే వుండేది. అందుకే హైదరాబాద్ లో [[ఉర్దూ]] రాజ్యం చేస్తున్నా సికింద్రాబాద్లో తెలుగు కళ కళ లాడింది. కవులు, రచయితలు, సంస్కర్తలు, సికింద్రాబాద్ వాసులే. హైదరాబాదులో ఉర్దూకవులు రాజ్యమేలారు. అప్పట్లో సికింద్రాబాద్ అంటే ఎంజి రోడ్, ఆర్పీ రోడ్, ఎస్ డి రోడ్, సెకెండ్ బజార్, రెజిమెంటల్ బజార్, ప్రాంతాలే. ఏ హడాహుడి లేదు, కాలుష్యం లేదు చక్కని చల్లనిగాలి, ఎక్కడికైన నడిచే వెళ్లి వచ్చేంత దూరం మాత్రమే. హైదరాబాద్ లో మతకల్లోలాలు జరిగినా సికింద్రాబాదులో ప్రశాంతత ఒక ప్రత్యేకత.
 
==భాష సంస్కృతి==
హైదరాబాద్లో తెలుగు తక్కువే. తెలుగు మాట, తెలుగు అచ్చు, తెలుగు సినిమా, తెలుగు నాటకం, తెలుగు సభ ఇలాంటివీ తక్కువే. ఒకసారి ఇలా అనిపిస్తుంది "హైదరాబాద్ అంటే ఉర్దూ - సికింద్రాబాద్ అంటే తెలుగు". మహబూబ్ కాలేజి, బురుగు మహదే హాలు వంటివి అలాంటి సాంస్కృతి కార్యక్రమాలకు నెలవు. వివేకానందుడు వచ్చినా, కృష్ణమీనన్ వచ్చినా ఇంకెవరు వచ్చినా వారి సభలు ఇక్కడే జరిగేవి. 1959 లో జవహర్ లాల్ నెహ్రూ హైదరాబాద్ వచ్చాడు. ప్రదానికి ఘనంగా పౌర సన్మానం జరిగింది. హైదరాబాద్ మేయరు, సికింద్రాబాద్ మేయరు ఇద్దరు హాజరయ్యారు. ఇద్దరూ పూల దండలేశారు. నెహ్రూకు ఒక సందేహం: "ఒన్ సిటి, టూ మేయర్స్?" అని ప్రశ్నించారు. సమాధానం చెప్పే దైర్యం ఎవరికుంటుంది? రెండు వేరు వేరు నగరాలు, వెరు వేరు సంస్క్రుతులు, వేరు వేరు జీవన విధానాలు.1946వ సంవత్సరంలో ఆంగ్లేయులు సికింద్రాబాద్ ను నిజాము అప్పగించారు. ఈ విభిన్న హృదయాలు ఒక్కటయాయి. సికింద్రాబాద్ హైదరాబాద్ లో భాగం అయి పోయింది. సికింద్రాబాద్ ప్రజలు దీన్ని జీర్ణించు కో లేక పోయారు. వ్వతిరేకించారు. ఉద్యమాలు చేశారు. అయినా ఫలితం లేదు. రెండు నగరాలు ఒక్కటయ్యి జంట నగరాలుగా మారాయి. అయినా సికింద్రాబాద్ తన ప్రత్యేకతను అనాటి నుండి చాటు కుంటూనే వున్నది. సికింద్రాబాద్ అభివృద్దికి కృషి చేసిన ముదలియార్లకు, సదా ఋణ పడి వుంటుంది. ప్రుడెన్షియల్ బాంకు, కీస్ హైస్కూల్ఉన్నత పాఠశాల, దక్కన్ క్రానికల్ లాంటివి వారిచ్చిన కానుకలే. క్రైస్తవ మిషనరీల సేవలు కూడ కానవస్తాయి. బడులు, ఆసుపత్రులు రెడ్ క్రాస్ లను వారే నడిపారు. రాను రాను తెలుగు విద్యావేత్తలు మరియు వైద్యులు తమ సేవలను విస్తరించారు. విస్తరణలో ఆనాటికి ఈనాటికి పోలికే లేదు.
 
==ఇవీ చూడండి==
పంక్తి 51:
{{భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు}}
{{హైదరాబాదుకు చెందిన విషయాలు}}
 
[[వర్గం:తెలంగాణ నగరాలు మరియు పట్టణాలు]]
[[వర్గం:హైదరాబాదు|సికింద్రాబాదు]]
"https://te.wikipedia.org/wiki/సికింద్రాబాద్" నుండి వెలికితీశారు