ఆంధ్ర మహాసభ (తెలంగాణ): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
 
==ఆంధ్ర మహాసభ అవిర్భావము==
అది 1922.హైదరాబాదు వివేకవర్ధిని థియేటర్ లో ఒక హిందూ సాంఘిక సభ జరిగింది.ఆ సభలో ప్రసంగాలు అన్నీ ఉర్దు ,మహరాష్ట్ర భాషలలోనే జరిగాయి.ఒకే ఒక వక్త-ఒక ప్లీడరు తెలుగులో మాట్లడబోయాడు.సభ్యులంతా గేలి చేసి,గోల చేసి ఆతనిని మాట్లాడనివ్వలేదు.ఆ రోజుల్లో హైదరరాబాదు నగరంలో మహారాష్ట్రుల సంఖ్య చాల తక్కువ.అయినా అన్ని రంగాలలోను తమ ఆధిక్యతను ప్రదర్శిస్తూ ఉండేవారు.తెలుగు భాషకు మర్యాద,మన్నన ఉండేవికావు.ఆనాటి ఈ దుస్థితిని గూర్ఛిగూర్చి మాడపాటి హనుమంతరావు గారు తన [[ఆంద్రమహాసభ చరిత్ర]] లో వివరించారు.ఆనాటి సభలో తెలుగు భాషకు,తెలుగు వక్తకు జరిగిన అవమానాన్ని గమనించిన కొందరు యువకులు కలిసి ఆంధ్రభాషకు సంస్కృతికి నగరంలో సముచిత స్థానం కల్పించాలన్న ఆశయంతో "ఆంధ్రజనసంఘం" స్థాపించారు.నిజాం రాష్త్రంలో ఆంధ్రోద్యమానికి ఆనాడు నాంది పలికింది.ఆ తర్వాత రెండు సంవత్సరాలకు నిజాం రాష్ట్రం లోని అన్ని తెలుగు సంస్థలను కలిపి ఒక ఆంధ్రజన కేంద్ర సంఘాన్ని ఏర్పాటు చేశారు.ప్రతి సంవత్సరం ఈ సంఘం సమావేశాలు జరుగుతూవుండేవి.ఆంధ్రభాష,ఆంధ్ర సంస్కృతి అభివృద్ధికి తీసుకొనవలసిన చర్యల గూర్చి ,సాధక బాధకాలు గురించి చర్చించేవారు.నిజాం రాష్త్రంలోని ఏ తెలుగు సంస్థ ఆయినా సరే తమ ప్రతినిధిని ఈ కేంద్ర సంఘానికి పంపనచ్చును.ఈ కేంద్ర సంఘానికి మాడపాటి హనుమంతరావు గారు కార్యదర్శిగా వుండేవారు.రాష్ట్రం లోని తెలుగు సంస్థల అభివృద్ధికి కేంద్ర సంఘం ప్రాచారకులను పంపించి తోడ్పడుతూ వుండేది.ఈ కాలంలో ఈ సంఘం "వెట్టిచాకిరి","వర్తక సంఘం" అన్న రెండు ముఖ్యమైన కరపత్రాలను ప్రచురించింది.
 
==మహాసభలు==