కాంచీపురం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
చి clean up, replaced: శతాబ్ధం → శతాబ్దం (4) using AWB
పంక్తి 32:
<!--ఈ విభాగపు అనువాదాన్ని ఆంగ్లమూలముతో ఒకసారి సరిచూడాలి-->
'''పుష్పేషు జాతి పురుషేషు విష్ణు, నారీషు రంభ నగరేషు కంచి'''
మధ్య యుగములలో ప్రసిద్ధి చెందిన నగరం కాంచీపురం. అప్పటి చైనా రాయబారి హుయాన్ సాంగ్ తన భారతయాత్రలో ఈ పట్టణాన్ని సందర్శించాడు. 4వ శతాబ్దం నుండి 9వ శతాబ్ధంశతాబ్దం వరకు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన [[పల్లవులు|పల్లవులకు]] ఇది రాజధాని. పల్లవులు తమ పరిపాలన కాలంలో ఎన్నో దేవాలయాలు నిర్మించారు. పల్లవుల కాలంలో మహాబలిపురంలో ఉన్న ఓడ రేవు చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది. కంచిని పాలించిన పల్లవ మహేంద్రవర్మ గొప్పవిద్వాంసుడు మరియు సాహితీవేత్త. ఈయన పరిపాలనా కాలంలో కంచిని సందర్శించిన హుయాన్ సాంగ్ నగర చుట్టుకొలత 6 మైళ్ళు ఉన్నదని, ప్రజలు ధైర్యవంతులు మరియు దయగలవారని వర్ణించాడు. [[బుద్ధుడు]] కూడా కంచిని సందర్శించాడు. అప్పటి కాలంలో కాంచీపురం విద్వాంసులను తయారు చేయడంలో, విద్యాబోధనలో [[కాశీ]] అంత ప్రాముఖ్యం పొందింది. క్రీ.పూ.రెండవ శతాబ్దంలో [[పతంజలి]] వ్రాసిన మహాభాష్యాలలో కూడా కంచి యొక్క ప్రస్తావన ఉన్నది. మణిమెక్కళ్ అనే తమిళ కవి, పెరుమపంత్రు అనే మరో తమిళ కవి తమ సాహిత్యంలో కంచిని వర్ణించారు. <!--పట్టుపట్టు అనే సంగం సాహిత్యం ఈ ప్రదేశాన్ని తొండమాన్ ఇలాంద్రియన్ ఈ పట్టణాన్ని 2500 సంవత్సరాల క్రితం జరిగింది.(అర్ధం కాని వాక్యం)--> క్రీ.శ.మూడవ శతాబ్దం నుండి తొమ్మిదో శతాబ్ధంశతాబ్దం వరకు పాలించిన పల్లవరాజులు తమ రాజ్యాన్ని విస్తరించి ఉత్తరాన [[కృష్ణా నది]] నుండి దక్షిణాన [[కావేరి]] వరకు పాలించారు. పల్లవుల తరువాత కంచిని [[చోళులు]] పదవ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు పరిపాలించారు. ఆ తరువాత [[విజయనగర సామ్రాజ్యం|విజయ నగర రాజులు]] 14 నుండి 17 శతాబ్ధంశతాబ్దం వరకు పరిపాలించారు. ఏకాంబరేశ్వర ఆలయంలోని 192 అడుగుల గాలి గోపురాన్ని, వెయ్యి స్తంభాల మండపాన్ని, వరదరాజ స్వామి దేవాలయంలోని శిల్పకళాచాతుర్యం విజయనగర రాజుల కాలంలో జరిగింది. విజయనగర రాజుల తరువాత కంచి [[ఆంగ్లేయులు|ఆంగ్లేయుల]] హస్తగతం అయ్యింది. ఈస్టిండియా కంపెనీ గవర్నర్ జనరల్ [[రాబర్ట్ క్లైవ్]] వరదరాజ పెరుమాళ్ కు ఒక హారాన్ని బహుకరించాడని దానిని క్లైవ్ మకరకండి అని పిలుస్తారు. కంచి [[హిందువులు|హిందువులకే]] కాక [[బౌద్ధులు]], [[జైనులు|జైనులకు]] కూడా తీర్థ స్థలం.
 
== దేవాలయాలు ==
పంక్తి 51:
 
=== వరదరాజస్వామి దేవాలయం ===
1053 సంవత్సరం [[చోళులు]] ఈ ఆలయ నిర్మాణం జరిపారని తెలుస్తోంది. 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఈ దేవాలయం ఉన్న ప్రదేశాన్ని విష్ణుకంచి అని పిలుస్తారు. ఇక్కడ ఈ దేవాలయంలోనే [[రామానుజాచార్యులు]] నివసించారని చెబుతారు. ఈ దేవాలయం 23 ఎకరాల సముదాయంలో ఉన్నది. ఈ దేవాలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ బంగారు బల్లి మరియు వెండి బల్లులు ఉన్నాయి. ఈ బల్లులను తాకితే మనిషి ఒంటిమీద బల్లి పడితే కలిగే దోషం పోతుందని నమ్మకం. దేవాలయ ప్రాకారం ఉండే అన్ని పైకప్పుల మీద బల్లులు చెక్కబడి ఉంటాయి. ఇతిహాసం ప్రకారం ఇక్కడ ఒక ఋషి కుమారున్ని, అతని తండ్రి దేవతార్చనకు నీళ్ళు తీసుకొని రమ్మనగా ఆ కుమారుడు తెలియక తీసుకొని వచ్చిన ఉదకంలో బల్లి కనిపిస్తుంది. తండ్రి దానికి కోపించి కుమారున్ని బల్లిగా మారిపొమ్మని శపిస్తాడు. తరువాత కుమారుడు వేడుకొనగా ఇక్కడ బల్లిగా వెలసి, అతన్ని ముట్టుకొంటే బల్లి ఒంటి మీద పడే పాపం పోయేటట్లు ఆశీర్వదిస్తాడు. భారతదేశం నలుమూలల నుండి భక్తులు వచ్చి ఈ వెండి, బంగారు బల్లులు తాకి, తమ మీద బల్లి పడితే కలిగే దోషాన్ని నివారించుకొంటారు. ఈ దేవాలయ ప్రాంగణంలో ఆసందసరోవరం మరియు బంగారు తామర తటాకం ఉన్నాయి. ఆనంద సరోవరం మధ్యలో ఉన్న మండపంలో జలాంతర్భగాన [[అత్తి]] చెక్కతో చేయబడిన అత్తి దేవతా మూర్తి విగ్రహాలు ఉంటాయి. ప్రతి 40 సంవత్సరాలకొకసారి కోనేరులో నుంచి తీసి 40 రోజులు దర్శనానికి అనుమతిస్తారు. 1979వ సంవత్సరంలో అత్తి శ్రీవరదరాజ పెరుమాళును కోనేరు నుంచి బయటకి తీసి దర్శనానికి అనుమతించారు.మళ్ళీ 2019వ సంవత్సరం జూన్ నేలలో అత్తి శ్రీవరదరాజ పెరుమాళును దర్శించగలం . ఈ దేవాలయ ప్రాకారాలు పదకొండొవ శతాబ్ధంశతాబ్దం తరువాత చోళ రాజులైన మెదటి [[కుత్తోంగ చోళ]], విక్రమ చోళ తరువాత విజయనగర రాజుల చేత నిర్మించబడ్డాయి మరియు పునరుద్ధించబడ్డాయి. ఈ దేవాలయంలో కూడా వెయ్యి స్తంభాల మండపం ఉన్నది. ఇతిహాసం ప్రకారం ఇక్కడ వరదరాజస్వామిని [[కృత యుగము]]లో [[బ్రహ్మ]], [[త్రేతా యుగము]]లో గజేంద్రుడు, [[ద్వాపరయుగము]]లో [[బృహస్పతి]], [[కలి యుగము]]లో అనంతశేషుడు పూజించారని చెబుతారు. ఈ దేవాలయ మహత్మ్యం '''హస్తిగిరి మహత్మ్యం'''లో వివరించబడింది. ఇక్కడ మూలవిరాట్టుగా ఉన్న వరదరాజ పెరుమాళ్ విగ్రహం అత్యంత ఎత్తైన దేవతా విగ్రహాలలో రెండవది.<ref>{{cite web
|url = http://www.geocities.com/~kanchipuram/temples/varada.html|title = Kanchipuram on the web|archiveurl=http://web.archive.org/web/20000420005136/http://www.geocities.com/~kanchipuram/temples/varada.html|archivedate=2000-04-20}}</ref>.
 
"https://te.wikipedia.org/wiki/కాంచీపురం" నుండి వెలికితీశారు