రాజ్‌నాథ్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎రాజకీయ జీవితం: clean up, replaced: ఎమ్మెల్యే → శాసన సభ్యులు using AWB
చి →‎రాజకీయ జీవితం: clean up, replaced: భాజపా → భారతీయ జనతా పార్టీ (3) using AWB
పంక్తి 44:
 
==రాజకీయ జీవితం==
ఇతను ఉత్తరప్రదేశ్ జాట్ నేత. లక్నో నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. భాజపాభారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడిగా ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థి అయితేనే పార్టీ తిరిగి అధికారానికి వస్తుందని గట్టిగా విశ్వసించారు. ఆ దిశగా పావులు కదిపారు. మోడీ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అద్వానీ తదితర నేతల్ని ఒప్పించేందుకు ఎంతో కష్టపడ్డారు. మోడీకి నమ్మకస్తుడైన సహచరుడయ్యారు. రాజ్‌నాథ్‌కు పదమూడేళ్లకే సంఘ్‌తో అనుబంధం ఏర్పడింది. గోరఖ్‌పూర్‌లో ఏబీవీపీ కార్యకర్తగా రాజకీయ జీవితం ఆరంభించారు. కొంతకాలం భౌతికశాస్త్ర అధ్యాపకుడిగా పని చేశారు. జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలో పాల్గొని రెండేళ్లు జైలు జీవితం గడిపారు. 1977లో జనతా ఉప్పెనలో శాసన సభ్యులు అయ్యారు. యువ మోర్చా జాతీయాధ్యక్షుడిగా పనిచేశారు. సంఘ్ సాన్నిహిత్యంతో భాజపాలోభారతీయ జనతా పార్టీలో ఎదిగారు. కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా(2000-2002) పని చేశారు. ముఖ్యమంత్రి పదవికి ముందు తర్వాత వాజ్‌పేయి మంత్రివర్గంలో రెండు దఫాలుగా రవాణా, వ్యవసాయ శాఖల్ని నిర్వహించారు. స్వర్ణ చతుర్భుజి లాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు ప్రారంభించారు. సమర్థ పాలకుడిగా నిరూపించుకున్నారు. 2006-2009 మధ్య కాలంలో పార్టీ జాతీయాధ్యక్షుడిగా హిందూత్వ ఆధారంగా భాజపానుభారతీయ జనతా పార్టీను పునర్నిర్మించేందుకు ప్రయత్నించారు. ఆయన హయాంలోనే కర్ణాటక సహా ఏడు రాష్ట్రాల్లో పార్టీ అధికారానికి వచ్చింది. అయితే, 2009 ఎన్నికల్లో పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకురాలేక పోయారు. సీట్ల సంఖ్య మరింత దిగజారింది. 2013లో రెండోసారి అధ్యక్షుడిగా అవకాశం వచ్చినపుడు జాగ్రత్త పడ్డారు. పార్టీ అధికారం సంపాదించడానికి వచ్చిన అవకాశాలన్నీ ఒడిసిపట్టారు.
==వ్యక్తిగత జీవితము==
రాజ్‌నాథ్‌కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
"https://te.wikipedia.org/wiki/రాజ్‌నాథ్_సింగ్" నుండి వెలికితీశారు