రాజ్‌నాథ్ సింగ్

భారతీయ రాజకీయ నాయకుడు

రాజ్‌నాథ్ సింగ్ (జ.జూలై 10 1951) భారత దేశ రాజకీయనాయకుడు. ఆయన భరతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా యున్నారు. ఆయన నరేంద్ర మోడీ నాయకత్వం లోని ఎన్.డి.ఎ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా తన కెరీర్ ను ప్రారంభించారు. ఆయన జనతా పార్టీతో కలసి ఉన్నపుడు జాతీయ సంస్థ అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘంతో తన అనుబంధాన్ని కొనసాగించారు.

రాజ్‌నాథ్ సింగ్

రక్షణ మంత్రిత్వ శాఖ, భారత కేంద్ర ప్రభుత్వం
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
26 May 2014
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
ముందు సుశీల్ కుమార్ షిండే

పదవీ కాలం
జనవరి 23 , 2013 – మే 26, 2014
ముందు నితిన్ గడ్కరి
తరువాత అమిత్ షా
పదవీ కాలం
డిసెంబరు 24 , 2005 – డిసెంబరు 24 , 2009
ముందు లాల్ కృష్ణ అద్వానీ
తరువాత నితిన్ గడ్కరి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి
పదవీ కాలం
అక్టోబరు 28 , 2000 – మార్చి 8 , 2002
గవర్నరు సురాజ్ భన్
విష్ణుకాంత్ శాస్త్రి
ముందు రాం ప్రకాష్ గుప్తా
తరువాత మాయావతి

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
మే 12 , 2014
ముందు లాల్జీ టాండన్

వ్యక్తిగత వివరాలు

జననం (1951-07-10) 1951 జూలై 10 (వయసు 72)
భబౌరా , ఇండియా
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి సావిత్రి సింగ్
సంతానం 2 కుమారులు (పంకజ్ సింగ్)
1 కుమార్తె
పూర్వ విద్యార్థి గోరఖ్ పూర్ విశ్వవిద్యాలయం
వెబ్‌సైటు Official website
రాజ్ నాథ్ సింగ్

ప్రారంభ జీవితం మార్చు

రాజ్నాథ్ సింగ్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఛందౌలీ జిల్లాలో భాభౌరా అనే చిన్న గ్రామంలో రాజ్ పుత్ కుటుంబంలో పుట్టారు.[1] గుజ్రాతీ దేవి, రామ్ బదన్ సింగ్ ఈయన తల్లీదండ్రులు.[2] ఈయన రైతు కుటుంబంలో జన్మించినా గోరఖ్ పూర్ విశ్వవిద్యాలయం నుండి భౌతికశాస్త్రంలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు.[2] తన 13వ యేట నుండే అంటే 1964 నుండే రాజ్నాథ్ సింగ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తో ముడిపడి ఉండేవారు. తాను మీర్జాపూర్ లో భౌతిక శాస్త్ర అధ్యాపకుడైన తరువాత కూడా రాజ్నాథ్ సింగ్ ఈ సంస్థతో కలిసి పనిచేసేవారు.[2] 1974లో ఈయన భారతీయ జన సంఘ్ మీర్జాపూర్ శాఖ కార్యదర్శిగా నియమించబడ్డారు.[2]

రాజకీయ జీవితం మార్చు

ఇతను ఉత్తరప్రదేశ్ జాట్ నేత. లక్నో నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడిగా ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థి అయితేనే పార్టీ తిరిగి అధికారానికి వస్తుందని గట్టిగా విశ్వసించారు. ఆ దిశగా పావులు కదిపారు. మోడీ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అద్వానీ తదితర నేతల్ని ఒప్పించేందుకు ఎంతో కష్టపడ్డారు. మోడీకి నమ్మకస్తుడైన సహచరుడయ్యారు. రాజ్‌నాథ్‌కు పదమూడేళ్లకే సంఘ్‌తో అనుబంధం ఏర్పడింది. గోరఖ్‌పూర్‌లో ఏబీవీపీ కార్యకర్తగా రాజకీయ జీవితం ఆరంభించారు. కొంతకాలం భౌతికశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేశారు. జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలో పాల్గొని రెండేళ్లు జైలు జీవితం గడిపారు. 1977లో జనతా ఉప్పెనలో శాసన సభ్యులు అయ్యారు. యువ మోర్చా జాతీయాధ్యక్షుడిగా పనిచేశారు. సంఘ్ సాన్నిహిత్యంతో భారతీయ జనతా పార్టీలో ఎదిగారు. కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా (2000-2002) పనిచేశారు. ముఖ్యమంత్రి పదవికి ముందు తర్వాత వాజ్‌పేయి మంత్రివర్గంలో రెండు దఫాలుగా రవాణా, వ్యవసాయ శాఖల్ని నిర్వహించారు. స్వర్ణ చతుర్భుజి లాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు ప్రారంభించారు. సమర్థ పాలకుడిగా నిరూపించుకున్నారు. 2006-2009 మధ్య కాలంలో పార్టీ జాతీయాధ్యక్షుడిగా హిందూత్వ ఆధారంగా భారతీయ జనతా పార్టీను పునర్నిర్మించేందుకు ప్రయత్నించారు. ఆయన హయాంలోనే కర్ణాటక సహా ఏడు రాష్ట్రాల్లో పార్టీ అధికారానికి వచ్చింది. అయితే, 2009 ఎన్నికల్లో పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకురాలేక పోయారు. సీట్ల సంఖ్య మరింత దిగజారింది. 2013లో రెండోసారి అధ్యక్షుడిగా అవకాశం వచ్చినపుడు జాగ్రత్త పడ్డారు. పార్టీ అధికారం సంపాదించడానికి వచ్చిన అవకాశాలన్నీ ఒడిసిపట్టారు.

వ్యక్తిగత జీవితము మార్చు

రాజ్‌నాథ్‌కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా మార్చు

2000వ సంవత్సరం అక్టోబరు 28న ఈయన యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు, వీరు హైదర్ ఘర్ నుండి శాసనసభ్యునిగా రెండు సార్లు ఎన్నికయ్యారు.

బయటి లంకెలు మార్చు

మూలాలు మార్చు

  1. Christophe Jaffrelot. Books.google.co.in. Retrieved 2013-01-28.
  2. 2.0 2.1 2.2 2.3 "Rajnath Singh: Profile". Zee News. Archived from the original on 2007-09-30. Retrieved 2014-05-27.