బి.వి. కారంత్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
 
శ్రీ కోడెన బేడే (1967), పంజరశాలె (1971), ఓడిపస్, సంక్రాంతి, జోకుమారస్వామి (1972), ఏవం ఇంద్రజిత్ (1972), హయవదన (1973), సత్తాపరనేరలు (1974), చోర్ చరణ్ దాస్ (1981), రుష్యశృంగ (1981), దెడ్డిబగిలు (1981), హిత్తినహుంజ (1981), మిస్ సదారమి (1985), కింగ్లియర్ (1988) వంటి నాటకాలను కర్నాటకలో కారంత్ ప్రదర్శించగా, పంజరశాలె, నందగోపాల, ఇన్స్ పెక్టర్ రాజా (1963), తుగ్లక్, విజయనరసింహ (1965) వంటి నాటకాలను న్యూఢిల్లీలో ప్రదర్శింపచేశారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా రిపర్టరీ కంపెనీ తరపున 1997లో హిందీ నాటకం బడపంపన, 1980లో చోటే సయాద్ బడాసయాద్, 1980లో అంధేర్ నగరి, 1978లో ముద్రారాక్షస, షాజహాన్, భగవదజ్ఞక నాటకాలను ప్రదర్శించారు. కర్నాటక, ఢిల్లీలోనేగాక భారతదేశంలో పలు పట్టణ, నగరాలలో నాటకాలను ప్రదర్శింపచేసిన ఘనత సమకాలిక భారతీయ నాటకరంగ ప్రముఖులలో కారంత్ కే దక్కుతుంది. 1972లో కనకదెబల్లి ని చంఢీగర్ లోనూ, 1981లో ఘాశీరాం కొత్వాల్ ను.. 1982లో మాళవికాగ్నిమిత్ర, స్కందగుప్త నాటకాలను భోపాల్ లోనూ ప్రదర్శింపజేశారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రాపూ తరపున హయవదన నాటకాన్ని ఆస్ట్రేలియా దేశంలో ప్రదర్శించడం విశేషం.
 
జానపద, సంప్రదాయ కళారీతుల్ని నాటక ప్రదర్శనలో వాడేవారు. అలా ఆయన నాటకాలు ప్రజల్లో చాలా గుర్తింపునిచ్చాయి. మేగల్స్ నాటక ప్రదర్శనలోనూ యక్షగాన పోకడల్ని ప్రవేశపెట్టి నాటకాన్ని విజయవంతంచేశారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బి.వి._కారంత్" నుండి వెలికితీశారు