బెంగుళూరు నాగరత్నమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
==బాల్యము, విద్య==
 
తల్లిప్రేమలో నాగరత్నమ్మ బాల్యము ఒడుదుడుకులు లేకుండా గడిచింది. గిరిభట్ట తమ్మయ్య అను గురువు వద్ద [[సంస్కృతము]], వివిధ కళలు నేర్చుకుంది. వయసుకు మించిన తెలివితేటలవల్ల ప్రతివిషయమూ చాలా త్వరగా ఆకళింపు చేసుకొనేది. మాతృభాష [[కన్నడము]], [[తెలుగుము]], [[తమిళము]], ఆంగ్ల భాషలు నాగరత్నమ్మకు కొట్టిన పిండి. తొమ్మిది ఏండ్లకే గురువుని మించిన శిష్యురాలై గురువు అసూయకు గురైయింది. పుట్టలక్ష్మమ్మ కూతురిని గొప్ప విదుషీమణిగా తీర్చిదిద్దిన తరువాతే మైసూరుకు తిరిగివస్తానని ప్రతినపూని మద్రాసు (చెన్నయి) చేరింది. మంచి గురువు కోసం అన్వేషణలో కంచి, చివరకు [[బెంగళూరు]] చేరింది. అచట మునిస్వామప్ప అను వాయులీన విద్వాంసుడు నాగరత్నమ్మకు సంగీతము నేర్పుటకు అంగీకరించాడు. [[త్యాగరాజు ]]శిష్యపరంపరలోని వాలాజాపేట వేంకటరమణ భాగవతార్, ఆతని కొడుకు కృష్ణస్వామి భాగవతార్ల శిష్యుడు మునిస్వామప్ప. ఈవిధముగా నాగరత్నమ్మ జీవితము [[త్యాగరాజస్వామి]] వారి సేవతో ముడిపడింది. కిట్టణ్ణ అను వానివద్ద నాట్యాభ్యాసము, తిరువేంగడాచారి వద్ద అభినయకౌశలము నేర్చుకుంది. తల్లి కనుసన్నలలో, గురువుల పర్యవేక్షణలో నాలుగు సంవత్సరాలు కఠోర శ్రమచేసి సంగీత నాట్యాలలో నిష్ణాతురాలయింది. పుట్టలక్ష్మమ్మ ఆనందానికి అవధులు లేవు. దురదృష్ఠవశాత్తు, నాగరత్నమ్మ పదునాలుగవ ఏట తల్లి మరణించింది.
 
==రంగ ప్రవేశము==