చందాల కేశవదాసు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
 
1930-33ల మధ్య కేశవదాసు వ్రాసిన జాతీయ గీతాలను ప్రముఖ సినీ గాయకుడు [[సాలూరు రాజేశ్వరరావు]], అముల నరసింహారావులు పాడగా [[బెంగుళూరు]] లో రికార్డు చేశారు. ఈయన అనేక సినిమా స్క్రిప్టులతో పాటుగా, కేశవ శతకం, బలి బంధనం, సీతాకళ్యాణం, రుక్మాంగద, మేలుకొలుపులు, జోలపాటలు మొదలైన రచనలు చేశాడు. ఈయన ఆధ్వర్యంలో బాల భారత్ సమాజం వారు అనేక నాటకాలను ప్రదర్శించేవారు. "కనక తార", "లంకాదహనం" వంటి నాటకాలను సినిమాలుగా కూడా తీసారు. తన కళా ప్రదర్శనల ద్వారా పొందిన బంగారు కంకణాలను, పతకాలను దాచుకోకుండా సత్కార్యాలకోసం ఖర్చుచేసి మార్గదర్శకంగా నిలిచారు. హరికథా గానంతో వచ్చిన డబ్బుతో [[భద్రాచలం]] లో భక్తుల సౌకర్యార్థం బావి త్రవ్వించి, భోజన, విశ్రాంతి ఏర్పాట్లు చేశారు. [[కోదాడ]] మండలం [[తమ్మర]] లో సీతారామచంద్రస్వామి ఆలయానికి గాలిగోపురం నిర్మింపజేశారు.
 
==ఉటంకింపులు==
 
భలే మంచి చౌక బేరము
ఇది సమయము మించినన్ దొరుకదు
త్వరన్ గొనుడు సుజనులార
భలే మంచి చౌక బేరము
 
విలువ ఇంతయని చెప్పుట కలవిగాని బేరము
విలువ ఇంతయని చెప్పుట కలవిగాని బేరము
సలిలజ గర్భాదులౌ ఘనులకందని బేరము
కలుముల చేడియకు సతతము నిలయమైన బేరము
ఫలాపేక్ష రహిత భక్త సులభమైన బేరము
 
మునివరా... తుదకిట్లు ననున్
మోసగింతువా... మునివరా...
ఘనులు స్వాదృశులే ఇటులన్
కరుణమాలిన ఇంకేమున్నది మునివరా...
తుదకిట్లు ననున్
మోసగింతువా... మునివరా...
 
ధన ధనేతరముల చేతగాని
సాధన శమదమ నియమములకు గాని
లభియింపబోదు సుండీ
ధన ధనేతరముల చేతగాని
సాధన శమదమ నియమములకు గాని
లభియింపబోదు సుండీ
కాదనుకొను డౌననుకొనుడొక మనసు నిష్కళంకముగా
నొనరించి తృణంబొసగిన వెను వెంటనే నడచుచుండు
 
ఏమి సేతు ఎటుబోవుదు ఏ మార్గం అగుపడదే
ఏమి సేతు ఎటుబోవుదు ఏ మార్గం అగుపడదే
నా మనో విభుని దరిచేరగనీడాయెగా మునివరా...
తుదకిట్లు ననున్
మోసగింతువా... మునివరా...
 
ఓ యాదవులార కనుచు ఊరక నిలుచున్నారు
మీ యజమానిని గొనుడు సుమీ తరిచెడుగా
ఓ యాదవులార కనుచు ఊరక నిలుచున్నారు
మీ యజమానిని గొనుడు సుమీ తరిచెడుగా
పిదప నా ఈ పలుకులు మీ మానసములందు నిడి
దూరంబరయుడు సరుగున తడయగా
 
ఏవిధి సవతులనిక వీక్షింపగలను
ప్రతి వచనంబేవిధాన బలుకగలను
ఎంత జేసితివి ముని
నీవు సత్యవంతుడవని ఎంచి
ఇట్లు పొరబడితిని మునివరా...
 
ఇదియే తుది సమయము త్వరపడుడు
ఇకెన్నటికినిన్ దొరుకబోదు సరి
ఇదియే తుది సమయము
సదమలాత్ములని ఇటు మరిమరి
నిశ్చయము దప్పకను తెల్పితిగా
సదమలాత్ములని ఇటు మరిమరి
నిశ్చయము దప్పకను తెల్పితిగా
అదృష్టమింతకెవరిదియో విధిగా
అచటికే కనునుగా ముదంబిపుడు
 
కొట్టు కొట్టండి కొట్టండి బుర్ర పగల
జుట్టూడ లాగండి చెవులు మెలేయండి
కొట్టు కొట్టండి కొట్టండి బుర్ర పగల
జుట్టూడ లాగండి చెవులు మెలేయండి
 
నారదుండంట సన్నాసి గండడంట
దొరగారినమ్మునంట తన బాబు సొమ్మంట
యహ నారదుండంట సన్నాసి గండడంట
దొరగారినమ్మునంట తన బాబు సొమ్మంట
అహ కొట్టు కొట్టండి కొట్టండి బుర్ర పగల
జుట్టూడ లాగండి చెవులు మెలేయండి
కొట్టు కొట్టండి కొట్టండి బుర్ర పగల
జుట్టూడ లాగండి చెవులు మెలేయండి
 
గడియ గడియకొచ్చి అమ్మగార్ని మోసపుచ్చి
గడియ గడియకొచ్చి అమ్మగార్ని మోసపుచ్చి
మెడకు తాడు గట్టి సొంత మేకపిల్లలాగ తెచ్చి
నడి బజారులోన కిట్ట సామినమ్మునంట
నీ తాత సొమ్మంట ఈడ కాసుకొన్నడంట
పుడికి తంగములాగ తంబుర మెడనేసుకుని
కడుపు లేక వాగుతారు నడుము విరిగి చచ్చేటట్టు
 
కొట్టు కొట్టండి కొట్టండి బుర్ర పగల
జుట్టూడ లాగండి చెవులు మెలేయండి
కొట్టు కొట్టండి కొట్టండి బుర్ర పగల
నడుములిరగ బుర్ర పగల చచ్చేటట్టు కొట్టండహే
----- చందాల కేశవదాసు,ఘంటసాల,పెండ్యాల నాగేశ్వరరావు,శ్రీకృష్ణతులాభారం
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/చందాల_కేశవదాసు" నుండి వెలికితీశారు