శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
 
==ప్రారంభ చరిత్ర==
ఆ సమయంలో [[పిఠాపురం]] చరిత్రలో గొప్ప మలుపు చోటుచేసుకుంది. అదే సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ స్థాపన. [[1915]] మార్చి 16 న శ్రీ [[మలిరెడ్డి వెంకటరాయుడు]], [[వేపూరి వేణుగోపాలదాసు]], శ్రీ [[కొత్త సూర్యనారాయణ]]గార్లు మరికొందరు దేశభక్తులు కలసి పిఠాపురంలో విద్యానంద పుస్తక భాండాగారాన్ని స్థాపించారు. పిమ్మట శ్రీ [[హనుమానుల సూర్యనారాయణ గుప్త]] గారు అదే పట్టణంలో 12-03-1916లో శ్రీ సూర్యరాయ పుస్తక భాండారాన్ని నెలకొల్పారు.
 
దీనికి ఉపశాఖగా [[దామెర రామస్వామి]] గారి అధ్యక్షతన ఆంధ్రబాషా అభివృద్ది నాటకసమాజం అనే ఒక సంస్థను మహారాజా వారి సహకారంతో స్థాపించారు. ఈ నాటక సమాజానికి రాజావారు యాభైవేలను విరాళంగా ఇచ్చారు. ఈ విరాళంతో నాటక సమాజానికి కావలసిన హంగులు సమకూర్చుకొని వేణీ సంహారం, విజయ విలాసం వంటి నాటకాలను, కొన్ని సంసృత నాటకాలనూ రాష్ట్రమంతటా పలు చోట్ల ప్రదర్శించేవారు. ఇలా నాటక సమాజం ద్వారా ప్రదర్శనలు ఇస్తూనే పిఠాపురం రెండు గ్రంథాలయాల నిర్వహకులు గ్రంథ సేకరణ, వనరుల సేకరణలో పోటాపోటీగా పనిచేసేవారు.