పెండ్యాల వరవరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: నవంబరు → నవంబర్ (4) using AWB
పంక్తి 35:
| portaldisp =
}}
'''పెండ్యాల వరవర రావు''' (Varavara Rao) అందరికీ వి.వి. గా సుపరిచితుడు. ఆయన [[నవంబరునవంబర్ 3]] , [[1940]] లో [[వరంగల్లు]] జిల్లా లోని [[చిన్నపెండ్యాల]] అనే గ్రామంలో జన్మించాడు. కళాశాలలో చదువుతున్నప్పుడే కవిత్వం మరియు సాహితీ విమర్శలు వ్రాయడం మొదలుపెట్టాడు. ఉద్యోగరీత్యా ఆయన వరంగల్లు లోని సీ.కే.ఎం. కళాశాలలో (1968-98) తెలుగు సాహిత్య ఉపన్యాసకుడిగా పనిచేసాడు. ''వరవర'' అంటే ''శ్రేష్ఠులలో కెల్లా శ్రేష్ఠుడు'' అని అర్ధం. <ref>'వరవరముని' - శ్రీవైష్ణవం గురుపరంపరలో ఒక ప్రసిద్ధ ఆచార్యుడు</ref>
 
 
==సృజన==
నవంబరునవంబర్ [[1966]] లో, ''సాహితీ మిత్రులు'' (Friends of Literature) స్థాపించి, ''సృజన'' అనే ఆధునిక తెలుగు సాహితీ వేదికను ప్రారంభించాడు. రెండు దశాబ్దాలపాటు ఒక సాహిత్య ఉద్యమంగా వెలువడిన ''సృజన'' పూర్తిగా ఒక తరం మీద ప్రభావం చూపింది. 1966 నుండి 1992 వరకు 200 సంపుటులుగా అచ్చు అయిన సృజన, ప్రభుత్వము నుండి ఎన్నోసార్లు నిషేదాన్ని ఎదుర్కొంది. వి.వి. జైల్లో ఉన్న సమయంలో సృజనకి ప్రచురణకర్తగా ఆయన భార్య హేమలత వ్యవహరించినది. ఆమెకు కూడా [[1978]] మరియు [[1984]] లో జైలు జీవితం చవిచూడక తప్పలేదు.
 
==విరసం==
Line 53 ⟶ 52:
**జీవనది (1970)
**ఊరేగింపు (1973)
***1973 అక్టోబరు నుండి నవంబరునవంబర్ వరకు MISA చట్టం కింద నిర్బంధించబడి వరంగల్లు జైలులో ఉన్నపుడు వ్రాసిన కవితలు.
**స్వేచ్చ (1977)
***ఎమర్జెన్సీ లో సికింద్రాబాదు కుట్ర కేసు కింద మే 1974-మార్చి 1977 వరకు జైలు నిర్బంధంలో ఉన్నపుడు వ్రాసిన కవితలు.
Line 82 ⟶ 81:
===అనువాదాలు===
*1985–89 జైలు నిర్బంధం లో ఉండగా వి.వి. [http://en.wikipedia.org/wiki/Ngugi_Wa_Thiongo ‌గూగీ వ థ్యాంగో] వ్రాసిన “Devil on the cross” మరియు “ A Writer’s prison diary – Detained” లను తెలుగులోకి తర్జుమా చేయగా వాటిని 1992, 96 లలో ''స్వేచ్ఛా సాహితి'' ప్రచురించింది.
[[బొమ్మ:VaraVaraRao_writingVaraVaraRao writing.jpg|thumb|రచనలో నిమగ్నమైన వి.వి.]]
 
==పురస్కారాలు==
Line 89 ⟶ 88:
==శాంతి దూత==
*జూన్ 2002 లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం CPI-ML (పీపుల్స్ వార్) తో శాంతి చర్చలు జరపాలని తలపెట్టిన సందర్భంలో ఆయన ప్రజాగాయకుడు గద్దర్ తో కలిసి మధ్యవర్తిగా వ్యవహరించాడు. తెలుగుదేశం ప్రభుత్వంతో జరిగిన ఆ శాంతి చర్చల ప్రయత్నం ఆది లోనే విఫలమయింది.
*మరలా 2004-2005 లో కాంగ్రెసు ప్రభుత్వం పీపుల్స్ వార్ తో శాంతి చర్చలు జరపాలని నిర్ణయించినపుడు ఆయన మరోసారి మధ్యవర్తిగా వ్యవహరించాడు. 2004 లో మొదలయిన చర్చల ప్రయత్నం ఒక విడత చర్చల అనంతరం 18, ఆగస్టు 2005 న CPI(మావోయిస్టు), విరసం మరియు ఇతర ప్రజాసంఘాలపై నిషేధంతో ముగిసింది.
 
==మరలా జైలు==
*విరసంపై నిషేధం విధించిన 24 గంటలలోనే 19, ఆగస్టు 2005 తెల్లవారు జామున అయిదున్నర గంటల ప్రాంతంలో వరవర రావును మలక్ పేటలోని ఆయన ఇంట్లో అరెస్టు చేసారు.
*అరెస్టు చేసినప్పటినుండి ఇప్పటివరకు ప్రభుత్వం ఆయనపై మొత్తం 9 కేసులు పెట్టి ఆయన జైలు రిమాండును పొడిగిస్తూనే ఉంది. ప్రస్తుతం(నవంబరునవంబర్ 15 నాటికి) ఆయనను చంచల్ గూడ జైలులో ఉంచారు
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/పెండ్యాల_వరవరరావు" నుండి వెలికితీశారు