కాకుత్థ్సం శేషప్పకవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
Created page with ''''కాకుత్థ్సం శేషప్పకవి ''' తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలు...'
పంక్తి 1:
'''కాకుత్థ్సం శేషప్పకవి ''' [[తెలంగాణ]] ప్రాంతానికి చెందిన [[తెలుగు]] [[కవి]]. 18 వ శతాబ్ధికి చెందినవాడు. తెలంగాణలోని [[కరీంనగర్ జిల్లా]]లోని [[ధర్మపురి]] ప్రాంతానికి చెందినవాడు<ref>నవ వసంతం-2, 7 వ తరగతి-తెలుగు వాచకం, తెలంగాణ ప్రభుత్వ ప్రచురణ,2015, పుట-22</ref>. ధర్మపురిలోని నరసింహాస్వామికి జీవితాన్ని అంకితం చేసినవాడు. ఆ స్వామిపై అనేక రచనలు చేశాడు.
[[శేషప్ప కవి]] శతక సాహిత్యంలో ప్రముఖ స్థానం పొందిన [[నరసింహ శతకం]] రాసిన కవి. ఈయన గురించి వివరాలేమీ తెలియలేదు. కానీ ఆయన రచనలను బట్టి పేదవాడనీ, భక్తుడనీ, దేశపరిస్థితులను ఎరిగిన వాడనీ తెలుస్తున్నది. ఆయన రాసిన పద్యాల్లో మకుటం నరసింహ అని ఉండడం వల్ల నరసింహ శతకం అని పిలువబడుతున్నది. ఆ పద్యములలో శ్రీ మహావిష్ణువును సంబోధించడంలో మృదుత్వం, కాఠిన్యం, బెదిరింపు, కోపము జూపి తన భక్తి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు<ref>నేదూరి గంగాధరం విరచిత శ్రీ నరసింహ శతకం, 1945, ప్రచురణ: కొండపల్లి వీర వెంకయ్య, శ్రీ సత్యనారాయణ బుక్ డిపో, రాజమండ్రి</ref>
== రచనలు==
# నరహరి శతకం
# ధర్మపురి రామాయణం
# శ్రీనృకేసరి శతకం
# నరసింహ శతకం
===నరసింహ శతకం===
శేషప్పకవి రచించిన శతకాలలో నరసింహ శతకం ఒకటి. ఇది [[సీస పద్యాలు|సీసపద్యాల]]లో రచించబడిన ద్విపాద మకుట[[శతకం]]. ఇందులో మకుటం
<poem>
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార నరసింహ దురితదూర!
</poem>
ఉదా: ఒక పద్యం
<pre>
సీ. లోకమందెవడైన లోభిమానవుడున్న
భిక్షమర్థికి చేత బెట్టలేడు
తాను బెట్టకయున్న తగవు పుట్టదుకాని
యొరులు పెట్టగ జూచి యోర్వలేడు
దాత దగ్గర జేరి తన ముల్లె వోయినట్లు
జిహ్వతో జాడీలు చెప్పుచుండు
ఫలము విఘ్నంబైన బలుసంతసమునందు
మేలు కల్గిన జాల మిడుకుచుండు
</pre>
 
<poem>
శ్రీరమానాథ! యిటువంటి కౄరునకును
భిక్షకుల శత్రువని పేరుబెట్టవచ్చు
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార నరసింహ దురితదూర!
</poem>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}]
 
 
{{తెలంగాణ సాహిత్యం}}
[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:శతకాలు]]
[[వర్గం:కరీంనగర్ జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:కరీంనగర్ జిల్లా కవులు]]