లక్క: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
'''లక్క ఉపయోగాలు.'''
లక్క వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. దీన్ని పైంట్లలోను, వారీషులలోను, అద్దకం రంగుల్లోను, రబ్బరు ఉత్పత్తులలోను, పాలీష్ చేసె అన్ని వస్తువులలోను లక్క వాడు తున్నారు. అంతేగాక లక్క బొమ్మలు, [[లక్క గాజులు]], కూడ తయారు చేస్తారు. [[బంగారు]] ఆబరణాలలో లక్క ఉపయోగం చాల వుంది. అంతే గాక ఏదేని వస్తువును ప్యాక్ చేచి భద్రత కొరకు దాన్ని [["సీల్'']] చేస్తారు. అది లక్కతోనె చేస్తారు. ఆ [[సీల్]] మీద ఆయా కంపెనీల, వ్యక్తుల ముద్ర వుంటుంది. పూర్వ కాలం రాజులు తమ ఉంగరం ముద్రను ఈ లక్కపై వేసే వారని తెలుసు. అదే విదంగా మహా భారతం లో కౌరవులు పాండవుల కొరకు లక్క ఇంటిని నిర్మించి ఇచ్చి వారిని దహించ డానికి దానికి నిప్పు పెట్టిన సంఘటన అందరికి తెలిసిందె. ఈ లక్క చాల సులబంగా మండి పోతుంది.
 
'''అధర్వణ వేదంలో లక్క-లాక్షపరిశ్రమ.'''
 
లక్షాక్రిమిని ఉద్ధేశ్యించి [[అధర్వణ వేదము]] న పంచమకాండములో ఇదవ సూక్తము కలదు. ఈ క్రిమిని యువతిగా భావించి అతిసుందరమైన భావగీతమున శాస్త్రవిషయములను ఇచ్చియున్నారు.ఈ సూక్తమును [[సాయనాచార్యులు]] వ్యాఖ్యానించలేదు.
 
రాత్రీమాతానభః పితార్యమా తేపితామహః
సిలాచీ నామవా అసి సా దేవా నామసిస్వపాః
 
 
ఈ లక్క పురుగును '''సిలాచీ''' అని పిలుచుచున్నారు.ఈ సిలాచీకి తల్లి రాత్రి, మేఘము తండ్రి, సౌమ్యప్రకాశము గల అర్యమణుడను సూర్యుడు తాత.మేఘాఛ్చాదితమైన రాత్రివేళగల శీతోష్ణ పరిమాణము, అనగా చలికాలమందలి పగటి వేడిమి మాత్రమే ఇది వృద్ధి పొందుటకు కావలసిన సహకారులు. ఇట్టి సిలాచీ దేవతల సహోదరి. లక్క అత్యంత అవసరమైన వస్తువు అగుటచే ఈ రీతిగా ప్రస్తుతించబడినది.
 
 
యస్త్వాపిబతి జీవతి త్రాయసే పురుషంతవం
భర్త్రీహి శశ్వతామసి జనానాంచన్య ఇంచనీ.
 
 
లక్కతో చేయబడిన కషాయమౌషధమువంటిది అని సంప్రదాయము.ఈకషాయమును ఎవరు త్రాగుతారో అట్టి పురుషుని లక్క రక్షించుచున్నదట. కావుననే లక్కను పోషకురాలనీ "భర్త్రీ" శబ్దముతో పోల్చినారు.కావుననే తల్లి శిశువును ఓడిలోనుంచుకొని లాలించునట్లుగా సర్వజనులకీ లక్క ఒడి (న్య ఇంచనీ) వంటిది. అనగా వారి బాధను నివారించునది. లక్క పురుగులలోని స్త్రీ కణములనుండి తీయబడిన ఎర్రని రసము రక్తమువలె నుండును.
 
 
యద్దండేన యదిష్వా యద్వారు ర్హరసాకృతం
త్స్యత్వమసి నిష్కృతిఃసేమం నిష్కృధిపూరుషం.
 
 
ఈలక్క, దండచే గాని, బాణము గాని, అగ్నిచే గాని కావింపబడిన గాయమును మానుపునది.ఇట్టి గాయముకల పురుషుని కారోగ్యము చేకూర్చమని ప్రార్ధింపబడుచున్నది.
 
 
భద్రాత్ల్పక్షాని స్తిష్ఠ స్య శ్వత్థాత్ఖదిరాద్దవాత్
భద్రాన్న్యగ్రోధాత్పర్ణాత్సాన పహ్యరుంధతి.
 
 
లక్కకు దోహదమిచ్చు వృక్షములు 65 కలవని శాస్త్రజ్ఞలు నేడు చెప్పుచున్నారు. ప్లక్ష, అశ్వత్థ, ఖడివ, ధవ, న్యగ్రోధ, పర్ణ, వృక్షములు వీటిలో విశేషంగా శుభములని చెప్పుచున్నారు.లాక్షా రసమును తయారుచేయు సిలాచీ దేవతల సోదరిగా చెప్పునప్పుడు ఈ ముఖ్యవృక్షముల నేతదాశ్రయములనుగా చెప్పుట సముంజసము. లక్క పూతచే ఈ చెట్లు రక్షింపబడుచున్నవి. కాగా ఈవృక్షములు భద్రవంతములైనవి.లక్క పురుగు అరుంధతి; అనగా గాయములను నయముచేయునది.
 
 
హిరణ్యవర్ణే సుభగే సుర్యవర్ణే వపుష్టమే
రుతం గఛ్హాసి నిష్కృతే నిష్కృతిర్నామ వా అసి.
 
 
యౌవనమునొందిన లాక్షాక్రిమి సూర్యవర్ణముతో నుండు గృహమున శుభప్రదయై, బంగారుచాయతో, అత్యంత్ అసౌందర్యవతియై ఒప్పుచున్నది. ద్రవరూపమున రోగార్తునకీయబడి, రక్తప్రసారమార్గమున పోవుచు గాయము వద్దకు జేరి సయము చేయవలెనని అర్ధింపబడుచున్నది.
 
 
హిరణ్యవర్ణే సుభగే శుష్మే లోమశవక్షణే
అపామసి స్వసాలాక్షే వాతో హాత్మాబభూవతే.
 
 
అగ్నివలె ప్రకాశించుచు బంగారుచాయతోనున్న లాక్షాక్రిమికి పైన, క్రిందిభాగమున నూగువలె వెంట్రుక లుండును. ఇందుచే "లోమశవక్షణా" నబడుచున్నది. లాక్షారసము ద్రవమగుటచేతను, నీటిలో కరుగుటచేతను ఇది జలముల సోదరియనిరి.వాయువు యొక్క వేగమునబడి ఈక్రిములు వృద్ధి పొందుటవలనను, వృక్షమునుంచి వృక్షమునకు ఇవి తీసుకొని పోబడుటవలనను, లాక్షాక్రిమి యొక్క ఆత్మయే వాయువని చెప్పబడినది.వాయువీ ఉపకారము చేయనిచో ఇవి నశించునవి.
 
 
సిలాచీ నామ కానినోజబభ్రాపితా తవ
అశ్వోయమస్యయః శ్వావస్తస్య హాస్నాస్యుక్షితాః.
 
 
లక్క పురుగులలో మగది అత్యంతము చిన్నది అగుటచే "కానీనః" అనినారు. దీనివలన లక్క మిక్కిలిగా ఉత్పతికాదు. కనుకనే ఈవాక్యమున నిరసనభావముతో ఉద్దిష్టమైనది. లక్కకు కావలసిన ఎర్రరంగు ఈమగ పురుగుచేరానేరాదు. మేకవంటి బభ్రువర్ణముగల ఈ మగ ప్రురుగుయొక్క కుమార్తయే సిలాచీ. యముని నల్లని అశ్వముయొక్క నెత్తురు ఈ ఆడపురుగుపై చల్లుటచే ఇది ఎర్రనై, ఎర్రని లక్కనిచ్చునట. యముని వాహనము మహిషము; కాని ఇచ్చట అశ్వవాహన మని ఇచట చెప్పబడినది.
 
 
అశ్వస్యాస్నః సంపతితా సావృక్షాం అభిసిష్యదే
సరాపతత్రిణీ భూత్వాసాన పహ్యరుంధతి.
 
 
రక్తముచే ప్రోక్షంచబడిన లాక్షాక్రిమి నెత్తురు వంటి లాక్షారసముతో చెట్ల కొమ్మలను ప్రోక్షించుచున్నది. యముని వాహనమైన గుర్రముయొక్క నెత్తురునుంచి ఉత్పన్నమైనట్లు కనిపించు దిద్ యట! చెట్లపై తీగవలె ప్రాకుచూ, పక్షివలె పోవుచు చెట్లను లాక్షారసమయముగా చేయుచున్నది. అట్టి పురుగు గాయములను మాంపునది కావున అరుంధతి. ప్రమాదకరమైన గాయముతో బాధనుందుచున్న మానవుని నయము చేయమని ప్రార్ధింపబడుచున్నది.
 
లక్కను, పాలను కలిపి కాగబెట్టి రోగార్తున కీయవలెనని కౌశికసూత్రము చెప్పుచున్నది. రక్తక్షీణము గలవారికీ రీతిగా రక్తమువంటి ద్రవము నిచ్చుటతో శక్త్యుత్సాహము చేకూరగలవని అభిప్రాయము.
 
==జీవిత చక్రం==
"https://te.wikipedia.org/wiki/లక్క" నుండి వెలికితీశారు