1984 సిక్ఖు వ్యతిరేక అల్లర్లు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
=== ఇందిరా గాంధీ హత్య ===
''ప్రధాన వ్యాసం: [[ఇందిరా గాంధీ హత్య]]''<br />
ఆపరేషన్ బ్లూస్టార్ ముగిశాకా అప్పటివరకూ ఉగ్రవాద కార్యకలాపాల పట్ల వ్యతిరేకతతోనూ, ప్రభుత్వానికి అనుకూలురుగానూ ఉన్న సిక్ఖు జన సమూహంలో భారత ప్రభుత్వ వ్యతిరేక భావనలు రేగాయి. పవిత్ర స్వర్ణ దేవాలయంపై సైనిక చర్య జరపడం ఓ సిక్ఖు పెద్దమనిషి రిపోర్టర్ కు చెప్పినదాని ప్రకారం - మా మత ఆధారంపై దాడి, మా సంప్రదాయాన్నే కూల్చడం - గా కనిపించింది. ఆపరేషన్ బ్లూస్టార్ అనంతరం సిక్ఖు వర్గాల నుంచి ప్రధాన మంత్రి ఇందిర గాంధీ ప్రాణాలకు ప్రమాదం ఉందని నిఘావర్గాలు హెచ్చరించాయి. ఆమె వ్యక్తిగత అంగరక్షకుల్లోని సిక్ఖులను ఆ బాధ్యతల నుంచి తొలగించి, బదిలీ చేయాల్సిందిగా సూచించారు. ఐతే ఇందిరా గాంధీ ఈ సూచనలు తిరస్కరిస్తూ "మనం లౌకికవాదులం" అని ప్రతిస్పందించారు. ఐతే ఇటీవలే పంజాబ్ లోని తమ ఇంటికి వెళ్ళి వచ్చి, అక్కడి ఆగ్రహావేశాలను, గాయభావనను పంచుకున్న ఆమె సిక్ఖు అంగరక్షకులు బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్ ఆపరేషన్ బ్లూస్టార్ కు ప్రతీకారంగా [[అక్టోబర్ 31]], [[1984]]న ఇందిరా గాంధీని కాల్చి చంపారు.
 
== మూలాలు ==