1984 సిక్ఖు వ్యతిరేక అల్లర్లు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
=== స్వర్ణదేవాలయంలో చేరిక ===
మరోవైపు [[1981]] ఎన్నికల్లో పంజాబ్ లో అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అకాలీ దళ్ ప్రతిఘటన మార్గాన్ని పట్టుకుని, వారి నాయకుడు సంత్ హర్ చరణ్ సింగ్ లోంగోవాల్ స్వర్ణదేవాలయంలోని ఓ భాగంలో చేరారు. అక్కడి నుంచి వీధుల్లో ఆందోళనలు, నిరసనలు చేయాలన్న పిలుపునిస్తూ వచ్చారు. మరోవైపు భింద్రన్ వాలే అదే ఆలయంలోని మరోభాగం నుంచి పనిచేసేవారు. ఆయన విధానం మిలిటెన్సీ పద్ధతిలో ఉండేది. [[1980]]ల ఏప్రిల్లో సిక్ఖు నిరంకారీ శాఖ నాయకుడు బాబా గురుచరణ్ సింగ్ ఢిల్లీలో హత్యకు గురికావడం, [[1981]]లో సిక్ఖు తీవ్రవాదం పట్ల తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన పత్రికా సంపాదకుడు లాలా జగత్ నారాయణ్ హత్య కావడం వంటివి జరిగాయి. ఈ హత్యల వెనుక ఉన్న భింద్రన్ వాలేపై అరెస్టు వారెంట్ జారీ కాగా అతను మత పాఠశాల రక్షణలోకి వెళ్ళిపోయారు. తాను ఎన్నుకున్న సమయంలో తానే వచ్చి లొంగిపోతానని, ఐతే తనను అరెస్టు చేసేందుకు సంప్రదాయ సిక్ఖు పోలీసు అధికారులే రావాలంటూ డిమాండ్ చేశారు. ఈ అవమానకరమైన షరతులకు తలవొగ్గి ప్రభుత్వం అతన్ని అరెస్టు చేసింది. మూడు వారాల అనంతరం బెయిల్ పై బయటకు వచ్చాకా మరిన్ని హింసాత్మక పరిణామాలు సాగాయి.<ref name="రామచంద్ర గుహా - సిక్ఖు తీవ్రవాదం, ఆపరేషన్ బ్లూస్టార్" />
 
=== హింసాత్మక చర్యలు, రాష్ట్రపతి పాలన ===
[[అక్టోబర్ 5]], [[1983]]న సిక్ఖు తీవ్రవాదులు బస్సును ఆపి ఆరుగురు హిందువులను వేరుచేసి కాల్చి చంపారు. అప్పటికి ఉద్యమంలో హింసాత్మకంగా చనిపోయినవారి సంఖ్య 175కు చేరుకుంది. తర్వాతి రోజున [[అక్టోబర్ 6]], [[1983]]న పంజాబ్ లో ప్రభుత్వాన్ని రద్దుచేసి [[రాష్ట్రపతి పాలన]] విధించారు. బాంబుదాడులు, ప్రయాణికుల్లో హిందువులను వేరుచేసి కాల్చి చంపడం వంటి ఘటనలు కొనసాగాయి. మధ్యయుగాల నాడు సిక్ఖులను అణచివేసిన, సిక్ఖు మత గురువులు, వీరులు పోరాడిన మొఘల్ పాలకులతో ప్రస్తుత భారత ప్రభుత్వాన్ని పోలుస్తూ భింద్రన్ వాలే తదితరులు వ్యాఖ్యలు చేయడం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే మధ్యయుగాల్లో సిక్ఖు మతగురువులు అధిష్టించి సిక్ఖులు అనుష్టించాల్సిన హుకుంనామాలను జారీచేసి, మొఘలులపై పోరాడిన సిక్ఖు వీరులు ఆశ్వీర్వాదానికి వచ్చిన పవిత్రమైన అకాల్ తఖ్త్ ను భింద్రన్ వాలే తన నివాసంగా చేసుకున్నారు. ప్రమాదకరమైన సంకేతాత్మకత, తీవ్రమైన ఉగ్రవాద కార్యకలాపాలు కలగలిపి ఉగ్రవాద ఉద్యమాన్ని తీవ్రమైన స్థాయికి తీసుకుపోయాయి. మరోపక్క ఈ తీవ్రవాద కార్యకలాపాలను పెద్ద సంఖ్యలో సిక్ఖులు ఖండించారు.