వై.వి. రావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
వై.వి.రావు [[1903]] [[మే 30]]న [[నెల్లూరు]]లో జన్మించాడు. మద్రాసు విశ్వవిద్యాలయములో వైద్యవిద్యను వదిలి సినిమాలలో నటించాలనే కోరికతో [[బొంబాయి]] వెళ్లాడు. బొంబాయిలో మణీలాల్ జోషీని కలిసి, మెప్పించి మూకీ చిత్రాలలో నటించే అవకాశము పొందాడు. ఈయన కొన్ని రోజులు [[అర్దేషిర్ ఇరానీ]] యొక్క రాయల్ ఆర్ట్ స్టూడియోలో కూడా పనిచేశాడు. ఆ తరువాత మద్రాసులోని జనరల్ పిక్చర్స్ లో కళాదర్శకునిగా, నటునిగా చేరాడు. ఈయన [[ఆర్.ఎస్.ప్రకాష్]] యొక్క కొన్ని మూకీ చిత్రాలలో కూడా నటించాడు. వై.వి.రావు [[1939]] లో తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ అయిన [[చింతామణి పిక్చర్స్]] ను స్థాపించాడు. [[1950]]లో శ్రీవరుణ ఫిలంస్ అనే సంస్థను కూడా ప్రారంభించాడు. అప్పట్లో భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని (ఏడు) భాషల చిత్రాలలో పనిచేసిన ఘనత ఈయనకే దక్కినది. వై.వి.రావు పశ్చిమ మరియు దక్షిణ భారత దేశములలోని ప్రముఖ చిత్రనిర్మాణ కేంద్రాలైన బొంబాయి, [[కొల్హాపూర్]], [[మద్రాసు]] మరియు [[మైసూరు]]లలో పనిచేశాడు. తొలి కన్నడ టాకీ చలనచిత్రము, ఎం.వి.సుబ్బయ్య నాయుడు మరియు ఆర్.నాగేంద్రరావు నటించిన ''[[సతీ సులోచన]]'' ఈయనే నిర్మించాడు.
 
[[1946]]లో వై.వి.రావు, నర్తకి నుంగంబాక్కం జానకి కుమార్తె మరియు [[తమిళ]] సినిమా నటీమణి అయిన కుమారి [[వై.రుక్మిణి|రుక్మిణి]]ని వివాహమాడినాడు. [[తెలుగు]] సినీనటి [[లక్ష్మి (నటి)|లక్ష్మి]] (''జీన్స్'' చిత్రములో బామ్మ) ఈయన కూతురే.<ref name=autogenerated1>[http://www.hinduonnet.com/thehindu/fr/2003/08/22/stories/2003082201400400.htm The Hindu : A revolutionary filmmaker<!-- Bot generated title -->]</ref>
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/వై.వి._రావు" నుండి వెలికితీశారు