మదురై: కూర్పుల మధ్య తేడాలు

చిన్న చిన్న అక్షరదోష సవరణలు
పంక్తి 36:
== చరిత్ర ==
[[Image:Martin Madurai 1860.jpg|thumb|left|వైగై నదీతీరంలో పురాతన మదురై చిత్రం]]
మదురై నగరానికి చక్కగా నమోదు చేయబడిన దీర్ఘకాల చరిత్ర ఉంది. ఈ నగరం క్రీ. శ 3వ శతాబ్దంలో వ్రాయబడిన గ్రీకుదూత మెగస్తనీసు వ్రాతలలో మెథొర గా ప్రస్తావించబడినది. కౌటిల్యుడి అర్ధశాస్త్రంలో ఈ నగర ప్రస్తావన ఉంది. సంగకాల సాహిత్యంలో ప్రత్యేకంగా మదురైకాంచి గ్రంధంలో పాండ్యసామ్రాజ్యంలో ఒక భాగంగా ఈ నగరం ప్రస్థావించబడింది. 2వ శతాబ్దంలో రచించబడిన [[సిలప్పదికారం]] కావ్యంలో ఈ నగరవర్ణన చోటుచేసుకున్నది. క్రీ. పూ 300- క్రీ. పూ 200 కాలంలో తమిళ సంగానికి మదురై నగరం ప్రధాన కేంద్రంగా ఉంది. ప్రాచీన రోమ్ వ్రాతలలో మదురై ''' మధ్యధరా సముద్రతీర వాణిజ్యకేంద్రంగా ''' వర్ణించబడింది. గ్రీకుల మ్యాపులలో మదురై ఉన్న ఆధారాలు ఉన్నాయి.
 
చరిత్రకి తెలియవచ్చిననాటి నుండియు వైఘనదీ తీరముననున్న మధురానగరము సర్వసంపదలకు నిలయమై శోభిల్లినది. ఈ నగరరాజము తొలుత పాండ్యవంశస్థుల ఆధీనములో ఉండేది. పాండ్యభూపతులు బలహీనులుకాగా వారిని జయించి చోళవంశయులు మధూను చేజిక్కించుకున్నారు. '''గంగైక్కొండచోళ''' బిరుద విరాజితుడగు రాజేంద్రచోళుడు మధురను పాలించిన ప్రప్రధమ చోళ మహీపతియని చరిత్రకారుల అభిప్రాయము.13వ శతాబ్దము నాటికి చోళుల ప్రాబల్యము తగ్గినదు. తగిన తరుణమునకై వేచియున్న పాండ్యులు బలము చేకూర్చుకొని మధురను వశము చేసుకొనిన యత్నించిరి. కాని లాభము లేకపోయింది. ఇది యిట్లుండగా క్రీ.శ.1310 లో ఢిల్లీ పాదుషాయగు అలాయుద్దీనుచే ప్రేరేపితుడై మాలిక్కాఫరు సేనాని దక్షిణాపధముపై దండెత్తివచ్చి విజయములు సాధించుచుండెను. పాండ్యమండలము (మధుర) కూడ అతనికి స్వాధీన మయ్యెను. [[మాలిక్ కాఫరు]] జైత్రయాత్రవలన దక్షిణభారతమున హైందవ రాజ్యభానుడు నల్లని మేఘముల చాటున మాటుపడెను. విజయనగర సామ్రాట్టుల పక్షమున మధురనేలిన వారిలో పేర్కొనదగినవారు కోట్యము నాగమనాయకుని వంశస్థులగు నాయకరాజులు. తొలుత వీరు విజయనగరసామంతులగ వ్యవహరించుచు వచ్చినను పిమ్మట స్వాతంత్ర్యము ప్రకటించుకొని స్వతంత్రరాజులయిరి. వీరి పరిపాలనమునకు శాశ్వత చిహ్నములుగ పాండ్యమండలము (మధుర) నందు ఎక్కడ చూచిన నాయకరాజులు నిర్మించిన మహోన్నతములైన ఆలయములు, శత్రుదుర్భేద్యములగు దుర్గరాజములు, అందాలు చిందు శిల్పకళాఖండములు, సుందర మందిరములు, సత్రములు నేటికి కళకళ లాడుచున్నవి.మధుర నేలిన రాజులకు సంబంధించిన చారిత్రిక లేఖనములు తెలుగు, తమిళములందు కలవు. వీనిలో '''మధురైత్తలవరలారు''' అతి ముఖ్యమైనది. దీనిలో మధురను పాలించిన రాజులెల్లరు పేర్కొనబడిరి. అటుపై క్రీ.శ. 1481 నుండి నాగమనాయకుని కుమారుడు విశ్వనాధనాయనయ్య మధురను 12 సం పాలించెను. అటుపై ఈయన కుమారుడు కృష్ణప్ప 9 సం.లు పాలించి అస్తమించెను. అటుపై 14 సం.లు కృష్ణప్పనాయన్నయ్య కుమారుడు వీరప్ప నాయనయ్య రాజ్యం చేసి స్వర్గస్థులయిరి. అయ్యన తరువాత వీరి కుమారుడు 7 సం.లు కుమారకృష్ణప్ప నాయనయ్య రాజ్యం పాలించెను. వీరి తరువాత కుమార కృష్ణప్ప తమ్ముడు విశ్వప్పనాయనయ్య 5 సం.లు రాజ్యం చేసిరి. అటుపై వెరి తమ్ముడు కసూరి రంగప్ప నాయనయ్య పటానికి వచ్చి నాటి నదీ తీరమున నున్న సంధ్యామండపములో 8 వ రోజున అస్తమించిరి. పిమ్మట విశ్వప్పనాయనయ్య కుమారుడు ముద్దుకృష్ణప్ప నాయనయ్యయూ, ఆయన కుమారుడు ముద్దు వీరప్పనాయనయ్య 15సం.లు పాలించిరి.
"https://te.wikipedia.org/wiki/మదురై" నుండి వెలికితీశారు