వారన్ హేస్టింగ్సు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
విస్తరణ, సవరణ |
|||
పంక్తి 32:
==కార్యకాల ముఖ్యాంశాలు==
1750 లో మొట్టమొదటిసారిగా భారతదేశములో ఈస్టుఇండియా కంపెనీ కలకత్తా లో (writer) గుమాస్తాగా పనిలోప్రనేశించి తరువాత కంపెనీవారి ఒక ప్యాక్టరీకి నిర్వాహకుడుగా చేశాడు. 1753లో వంగరాష్ట్ర రాజధాని [[ముర్షీరాబాదు]] కి సముద్రతీర వ్యాపార కేంద్రమైన [[ఖాసింబజారు]]లో పనిచేశాడు. 1757 ప్లాసీ యుధ్ధమప్పుడు ఇతని నైపుణ్యమును గుర్తించిన రాబర్టు క్లైవు యుధ్ధానంతరం కలకత్తాను విడిపించి తన అనుగ్రహ పాత్రుడైన [[మీర్ జఫర్]] ను నవాబుగా చేసి ఆ నవాబుగారి రాజధాని ముర్షీరాబాదు లో 1758లో హేస్టింగ్సు ను కంపెనీ ప్రతినిధిగానూ(Resident), నవాబుగారి సలహాదారునిగా వ్యవహరించుటకు నియమించాడు. 1761 లో పదోన్నతి తో కంపెనీ పరిపాలక యంత్రాంగమైన (కౌన్సిల్) సంఘ సభ్యునిగా కలకత్తా లో నియమింపబడ్డాడు. 1761-1765 నాలుగేండ్లలో వంగరాష్ట్రములోని పరిపాలన, కంపెనీ ఉద్యోగుల అవినీతి, లంచగొండితనం, స్వంతవ్యాపారములు, ప్రజాపీడనలు చాలా విషమస్తితికి దారితీశాయు. (చూడు[[ రాబర్టు క్లైవు]] కార్య సమీక్ష, వంగరాష్ట్ర చరిత్ర,[[ ప్లాసీయుద్ధం ]]). ఆ పరిస్థితులను ఖండించతూ హెస్టింగ్సుకౌన్సిల్లో తన అభ్యంతరాలు నమోదు చేయటంతో కౌన్సిల్లోని ఇతర సభ్యులతో వైషమ్యాలేర్పడ్డాయి . అట్టి విషమ పరిస్తితులలో వంగరాష్ట్ర నవాబు మీర్ జఫర్ పోయి తరువాత వచ్చిన [[మీర్ ఖాసిం]], ఒరిస్సా నవాబుతో కలసి కంపెనీకి ఎదురు తిరిగటంతో 1764 అక్టోబరులో [[ బక్సార్ యుద్ధం]] జరిగింది. యుద్ధానంతరం 1764 నవంబరు లో హేస్టింగ్సు రాజీనామాచేసి ఇంగ్లండుకు వెళ్ళిపోయాడు . 1768 లో మరల కంపెనీలో చేరినప్పుడు రెండవ విడత కార్యకాలం మొదలైంది. మద్రాసుకౌన్సిలో సభ్యునిగా 1769 మార్చిలోమద్రాసులోతిరిగి పనిలోప్రవేసించాడు. ఈ రెండవవిడత చెన్నపట్నం కార్యకాలంలో(1769-1771) [[కర్నాటక రాజ్యం]] రాజకీయాలలో హేస్టింగ్సు జోక్యముచేసుకోలేదు(చూడు [[ రాబర్టు క్లైవు]],కర్నాటక రాజ్య చరిత్ర). అటుతరువాత 1772 లో తిరిగి కలకత్తానందలి వంగరాష్ట్ర కంపెనీ కౌన్సిల్ లో సీనియర్ సభ్యునిగా గర్నరు కార్టియర్ క్రింద పనిచేయుటకు బదలీచేయబడ్డాడు. కొద్దిరోజలకే గవర్నర్ కార్టియర్ పదవీవిరమణానంతరం 1772 ఏప్రిల్ లో వారన్ హేస్టింగ్సు[[విలియమ్ కోట]]కు గవర్నరైనాడు.1773లో రెగ్యులేటింగ్ చట్టం అమలోకిరాగనే వారన్ హైస్టింగ్సు మొదటి గవర్నర్ జనరల్ గా నియమింపబడ్డాడు. గవర్నర్ జనరల్ గా
=== వారన్ హేస్టింగ్సు చేసిన రాజకీయ సంస్కరణలు===
|