వారన్ హేస్టింగ్సు
వారన్ హేస్టింగ్సు జీవిత కాలం 1732-1818. కార్యకాలం 1750-1785. సా.శ. 1599 లో స్థాపించినప్పటినుండి బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ అనువ్యాపార సంస్ధకి పది-పదిహేను సంవత్సరముల కొకమారు ఇంగ్లండులోని బ్రిటిష్ ప్రభుత్వము సన్నదులు (పట్టా) ద్వారా ( ఉదాహరణకు 1661,1676,1686 చేసిన సన్నదులు.1686 లో శాసన నిర్మాణాధికారము ఇచ్చారు,1767 లో అమలుచేసిన కంపెనీ పట్టా చట్టం) ఇత్యాతులు వ్యాపారనిర్వాహణ నిమిత్తం అన్న ఆర్భాటంతో అనేక పరిపాలనాధికారములను క్రమేణా కలిగించారు. ఇవన్నీ బ్రిటిష్ రాజ్యతంత్రములోభాగములే. 1773 లో ఇంకా అధిక మోతాదులో అధికారమిస్తూ రెగ్యులేటింగ్ చట్టం అని అమలుచేశారు. ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టము యొక్కఉద్దెశ్యము భారతదేశమును ఇంగ్లండు రాణీగారి పేర పరిపాలించే బ్రిటిష్ పార్లమెంటు పరిపాలనా పరిధిలోకి తీసుకుచ్చి బ్రిటిష్ వలసరాజ్య స్థాపనబలపరచటమే. ఆ 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీకి కలకత్తాలో గవర్నర్ జనరల్ పదవి కలుగచేసి (చూడు బ్రిటిష్ ఇండియా గవర్నరు జనరల్ ) బ్రిటన్ దేశ రాజ్యప్రతినిధినిగా నియమించటం జరిగింది. పరిపాలనా సంఘ (గవర్నింగ్ కౌన్సిల్ ) సభ్యత్వం నలుగురినే చేశారు. ఆ చట్టప్రకారం బీహారు ఒరిస్సా రాష్టములు గూడా గవర్నర్ జనరల్ పరిపాలనాధికారంలోకి వచ్చినవి. అంతే కాక మద్రాసు, బొంబాయి రాష్ట్ర గవర్నర్లులుపై తనిఖీకి అధికారము, రాజ్యపాలిత ఇతర అధికారములు ఇవ్వబడ్డాయి. కలకత్తాలో సుప్రీంకోర్టు నియమించబడింది. ఆ చట్టముక్రింద అప్పటిలోకలకత్తాలో గవర్నరు గానున్న వారన్ హేస్టింగ్సు (WARREN HASTINGS) మొట్టమొదటి గవర్నర్ జనరల్ పదవిలో 1773 నుండి 1785 దాకా బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెని వారిద్వారా బ్రిటిష్ వలసరాజ్యమును పరిపాలించాడు.[2]
వారెన్ హేస్టింగ్స్ | |
---|---|
Governor of the Presidency of Fort William(Bengal) | |
In office 28 April 1772 – 20 October 1774 | |
అంతకు ముందు వారు | John Cartier |
తరువాత వారు | Position Abolished |
Governor-General of the Presidency of Fort William | |
In office 20 October 1774 – 8 February 1785[1] | |
చక్రవర్తి | George III |
అంతకు ముందు వారు | Position Created |
తరువాత వారు | Sir John Macpherson, Bt As Acting Governor-General |
వ్యక్తిగత వివరాలు | |
జననం | Churchill, Oxfordshire | 1732 డిసెంబరు 6
మరణం | 1818 ఆగస్టు 22 Daylesford, Gloucestershire | (వయసు 85)
జాతీయత | British |
కళాశాల | Westminster School |
వ్యక్తిగతముఖ్యాంశాలు
మార్చువారన్ హేస్టింగ్సు వ్యక్తిగతంగా దురదృష్టవంతుడనే చెప్పాలి. 1732 డిసెంబరు 6 తేదీన ఇంగ్లండులోని చర్చిల్ (CHURCHILL) దగ్గర గ్రామంలో ఒక బీదకుటుంబమున జన్మించి చిన్ననాటనే తల్లిని కొల్పోయాడు. తండ్రి, పినాస్టన్ హేస్టింగ్సు (PYNASTON HASTINGS) కూడా దూరమైపోవటం వల్ల కొంతకాలం ధర్మసంస్థల, అనాథ పాఠశాలలో చదివి, తరువాత బంధువుల పర్యవేక్షణలో పెరిగి లండన్ నగరములోనున్నప్రముఖమైన (WESTMINSTER) పాఠశాలలో విద్యార్థి గాచదువుతూ చదువు పూర్తికాకముందే కుటుంబ ఆర్థిక కారణములవల్ల 17 వ ఏటనే 1750లో బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీ వంగరాష్ట్ర ముఖ్య కేంద్రమైన కలకత్తాలో గుమాస్తాగా (writer) ప్రవేశించాడు. స్వంతవ్యాపారాలు సర్వసాధారణమైన ఆరోజులలో తనుగూడా కొంత వ్యాపారంచేశాడు. 1753 లో వంగరాష్ట్రములో పనిచేస్తున్న కాలంలో వంగరాష్ట్ర నవాబు సురజ్ ఉద్దౌలా 1757 లో కలకత్తా ముట్టడించినప్పడు బందీగా పట్టుబడి ముర్షీదాబాదులో బంధించబడి తప్పించుకుని ఆంగ్లేయులున్న హుగ్లీ నదీతీరందగ్గర ఫాల్టాకు చేరుకుని అక్కడవున్న రోజులలోనే మేరీ బుక్నాన్ ( Mary Buchanan) తో వివాహంచేసుకున్నాడు. దురదృష్టవశాన అతని భార్య1759 లోనూ, తరువాత కుమారులు కూడా చిన్నవయస్సులోనే మరణించారు. తరువాత 1777 లో జర్మనీదేశస్తురాలగు ఇమ్హాఫ్ (Baroness IMHOFF) ను వివాహముచేసుకున్నాడు. వంగరాష్ట్రమే హేస్టింగ్సుకు కర్మభూమైనది. వంగరాష్ట్రపు కంపెనీ కౌన్సిల్ లోని ఆంతరంగిక వ్యాకుల పరిస్థితుల వల్ల 1765లో రాజీనామా చేసి ఇంగ్లండుకు తరలిపోయాడు.ఆర్ధిక ఇబ్బందులవల్ల మూడేండ్ల తరువాత 1768 లో తిరిగి ఉద్యోగంలో చేరాడు. 1769లో చెన్నపట్నంలోని కంపెనీవారి కౌన్సిల్లోసభ్యునిగా వచ్చాడు. తరువాత వృత్తిరీత్యా త్వరితగతి పదోన్నతులతో గవర్నరుగానూ, గవర్నరు జనరల్ గానూ అత్యున్న పదవికి చేరుకున్నప్పటికీ కార్యకాలం చివరిలో (1785) పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. కార్యవిముక్తి అనంతరం చాల తంటాలుఎదురుపడినవి. బ్రిటిష్ ఇండియాలోతన కార్యకాలం జరిగిన అక్రమబధ్ధమైన ఆర్థిక, రాజకీయ కార్యాచరణలకు అతనిని భాధ్యితునిగా నేరారోపణజరిగింది. లండన్ కామన్సు సభ్యులుగానున్న ఫిలిప్ ఫ్రాన్సిస్ (Philip Francis), జేమ్సు ఫాక్సు ( James Fox), ఎడ్మండ్ బర్కే (Edmund Burke) దొరల ఆరోపణలు, అక్రమసంపాదన, రాజ్య దుష్పరిపాలన మొదలగు ఆక్షేపణలపై (impeachment) సంవత్సరములతరబడి జరిగిన విచారణ తరువాత చివరకు నేరవిముక్తుడుగా ఘోషించబడి బయటపడ్డాడు. కానీ వృధ్దాప్యంలో ఆర్థిక ఇబ్బందులకు గురై ప్రభుత్వమువారిని మనోవర్తి యాచించి 86 వ ఏట 1818 ఆగస్టు 22తేదీన ఇంగ్లండులోని డెల్స్ ఫర్ట్ (DAYLESFORD) గ్రామములో మరణించాడు. సశేషం.[3]
కార్యకాల ముఖ్యాంశాలు
మార్చు1750 లో మొట్టమొదటిసారిగా భారతదేశములో ఈస్టుఇండియా కంపెనీ కలకత్తాలో (writer) గుమాస్తాగా పనిలోప్రనేశించి తరువాత కంపెనీవారి ఒక ప్యాక్టరీకి నిర్వాహకుడుగా చేశాడు. 1753లో వంగరాష్ట్ర రాజధాని ముర్షీరాబాదుకి సముద్రతీర వ్యాపార కేంద్రమైన ఖాసింబజారులో పనిచేశాడు. 1757 ప్లాసీ యుధ్ధమప్పుడు ఇతని నైపుణ్యమును గుర్తించిన రాబర్టు క్లైవు యుధ్ధానంతరం కలకత్తాను విడిపించి తన అనుగ్రహ పాత్రుడైన మీర్ జఫర్ను నవాబుగా చేసి ఆ నవాబుగారి రాజధాని ముర్షీరాబాదులో 1758లో హేస్టింగ్సును కంపెనీ ప్రతినిధిగానూ (Resident), నవాబుగారి సలహాదారునిగా వ్యవహరించుటకు నియమించాడు. 1761 లో పదోన్నతితో కంపెనీ పరిపాలక యంత్రాంగమైన (కౌన్సిల్) సంఘ సభ్యునిగా కలకత్తాలో నియమింపబడ్డాడు. 1761-1765 నాలుగేండ్లలో వంగరాష్ట్రములోని పరిపాలన, కంపెనీ ఉద్యోగుల అవినీతి, లంచగొండితనం, స్వంతవ్యాపారములు, ప్రజాపీడనలు చాలా విషమస్థితికి దారితీశాయు. (చూడురాబర్టు క్లైవు కార్య సమీక్ష, వంగరాష్ట్ర చరిత్ర, ప్లాసీయుద్ధం ). ఆ పరిస్థితులను ఖండించతూ హెస్టింగ్సుకౌన్సిల్లో తన అభ్యంతరాలు సభాసదస్సుకు నమోదు చేయటమే కాక లండనులోని కంపెనీ వారి డైరెక్టర్లకు కూడా ాశాడు. దాంతో కౌన్సిల్లోని ఇతర సభ్యులతో వైషమ్యాలేర్పడ్డాయి . అట్టి విషమ పరిస్థితులలో వంగరాష్ట్ర నవాబు మీర్ జఫర్ తరువాత వచ్చిన మీర్ ఖాసిం, అవధ్ నవాబు షూజా ఉద్దౌలాతో కలసి కంపెనీకి ఎదురు తిరిగటంతో 1764 అక్టోబరులో బక్సార్ యుద్ధం జరిగింది. యుద్ధానంతరం 1764 నవంబరులో హేస్టింగ్సు రాజీనామాచేసి ఇంగ్లండుకు వెళ్ళిపోయాడు . 1768 లో మరల కంపెనీలో చేరినప్పుడు రెండవ విడత కార్యకాలం మొదలైంది. మద్రాసుకౌన్సిలో సభ్యునిగా 1769 మార్చిలోమద్రాసులోతిరిగి పనిలోప్రవేశించాడు. ఈ రెండవవిడత చెన్నపట్నం కార్యకాలంలో (1769-1771) కర్నాటక రాజ్యం రాజకీయాలలో హేస్టింగ్సు జోక్యముచేసుకోలేదు (చూడు రాబర్టు క్లైవు, కర్నాటక రాజ్య చరిత్ర). అటుతరువాత 1772 లో తిరిగి కలకత్తా లోని వంగరాష్ట్ర కంపెనీ కౌన్సిల్ లో సీనియర్ సభ్యునిగా గర్నరు కార్టియర్ క్రింద పనిచేయుటకు బదలీచేయబడ్డాడు. కొద్దిరోజలకే గవర్నర్ కార్టియర్ పదవీవిరమణానంతరం 1772 ఏప్రిల్ లో వారన్ హేస్టింగ్సువిలియమ్ కోటకు గవర్నరైనాడు.1773లో రెగ్యులేటింగ్ చట్టం అమలోకిరాగనే వారన్ హైస్టింగ్సు మొదటి గవర్నర్ జనరల్ గా నియమింపబడ్డాడు. గవర్నర్ జనరల్ గా 1773 ఏప్రిల్ నుండి వారన్ హేస్టింగ్సు కార్యకాలం చాలాఒడిదుడుకులతో కూడినదై అనేక సమశ్యలేదురైనవి. కంపెనీ కౌన్సిల్ సభ్యుల (Gen.CLAVERING, Colonel MONSON) వైషమ్యాలతోకూడిన ఆరోపణలు, వారన్ హేస్టింగ్సు వంగరాష్ట్రపరిపాలనలో అవినీతికిపాల్పడి 40 లక్షలు లంచం తీసుకున్నాడని కలకత్తాలో మహారాజా నందకుమార్ కౌన్సిలుకు చేసిన ఆరోపణలకు ప్రతీకారంగా హేస్టింగ్సు నందకుమార్ పై ప్రత్యారోపణమోపి జైలుశిక్షవిధించి, చివరకు ఆకేసును కలకత్తా సుప్రీంకోర్టు కెక్కించి అప్పటిలో కలకత్తా సుంప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తన బాల్యమిత్రుడైన సర్ ఎలైజా ఇంపీచే విచారణ జరిపించి ఉరిశిక్ష విధించి ఉరితీయించటం, గవర్నరుగా మొదటిలో చేసిన రాజకీయసంస్కరణల దుష్ఫలితములిచ్చినవని, గవర్నర్ జరల్ హేస్టింగ్సు ఆర్థిక లాభంకోసం ఔధ్ద రాణీల వ్యగ్తిగత సంపత్తిని నిర్భందముతో వసూలు చేసినాడనీను, వంగరాష్ట్ర నవాబునే కాక మొగలు చక్రవర్తికి కూడు మొదట క్లైవు దొర వప్పందాల ప్రకారం అలవెన్సు ఇవ్వకుండా దుస్థితికి పాలుచేయటం, మొగలు చక్రవర్తికి క్లైవు ఇచ్చిన అలహాబాదు కోరా పరగణాలును తీసేసి షూజా ఉద్దౌలాకు విక్రయించి అధిక ధన లాభము సంపాదించటం, ఇంకా అనవసరమైన యుద్ధములుచేయించాడనీను (రోహిల్లా యుద్ధం, కూచ్ బిహారుయుద్ధం) మొదలగువాటిని చూపుతూ కలకత్తా కౌన్సిల్ లోని సభ్యులు తదుపరి లండనులో కామన్సు సభ సభ్యులైన ఫిలిప్ ఫ్రాన్సిస్ (PHILIP FRANCIS), ఎడ్మండ్ బర్కే (EDMOND BURKE), మొదలగువారి ఆరోపణలపై లండన్ పార్లమెంటు (హౌస్ ఆఫ్ లార్డసు) వాారిచే విచారణజరిపబడింది. చివరకు 1785 ఫిబ్రవరిలో రాజీనామా చేయవలసివచ్చినది 1786 లో పార్లమెంటులో ఇంపీచ్ చేయబడ్డాడు. ఆ తరువా రెండేండ్లకు (1788) విచారణ మొదలైంది. ఇంకా ఆతరువాత ఏడేండ్లకుగానీ తీర్పువిలువడలేదు.చివరకు 1795 లో హౌస్ ఆఫ్ లార్డ్సు వారు నాట్ గిల్టీ తీర్పు ఇచ్చారు.
వారన్ హేస్టింగ్సు చేసిన రాజకీయ సంస్కరణలు
మార్చువంగరాష్ట్ర గవర్నర్ గా 1772లో పదవీ స్వీకారంచేసిన తరువాత వారన్ హేస్టింగ్సు చేసిన రాజకీయ సంస్కరణలు (1) ప్రభుత్వ యంత్రాంగమును కదలించి వంగరాష్ట్ర రాజధానిని ముషీరాబాదునుండి కలకత్తా తరలించాడు. 1767 కంపెనీ చట్టప్రకారము కంపెనీ రాబడిలో కొంత భాగము బ్రిటిష్ ప్రభుత్వమువారికి కట్టవలసినదేకాక, తమ కంపెనీకి కూడా కట్టవలసివచ్చెను. దాంతో బ్రిటిష్ ఇండియా పరిపాలకసంఘం ఆర్థికస్థితి దిగజారుతూ ఋణగ్రస్తములోకి దిగింది. అందుకని వారనా హేస్టింగ్సు అనేక మార్గములద్యారా ఆదాయం పెంపొందిప నిశ్చయించాడు. (2) వంగరాష్ట్ర నవాబు అధికారమునుండి తొలగించునప్పుడు రాబర్టు క్లైవు చేసిన వప్పందంప్రకారం సాలునా ఇయ్యవలసిన అలవెన్సు 53 లక్షలను క్లైవు కాలంలోనే రెండవనవాబు పదవిలోకి వచ్చినప్పుడు 41 లక్షలకు తరువాత వచ్చిన ఇంకో కొత్తనవాబుకు 32 లక్షలకు తగ్గించబడినదానిని గవర్నర్ వారన్ హేస్టింగ్సు ఇంకా తగ్గించి 16 లక్షలకు చేశాడు, అలాగే ఢిల్లీలోని చక్రవర్తిషా ఆలంకి క్లైవుచేసిన వప్పందం ప్రకారం ఇయ్యవలసిన ఇరవైఆరు లక్షలరూపాయల సాలూనాచెల్లించు కప్పమును మొత్తం ఆపేయటమేకాక షా ఆలానికి క్లైవు ఇచ్చిన అల్ హాబాదు పరణాలనూ, కోరా పరగణాలనూ (పశ్చమ ఒరిస్సాలోని ప్రాంతం) వెనక్కి తీసేసుకుని అయోధ్య (అవధ్) షూజా ఉద్దౌలా నవాబుకు 50లక్షల రూపాయలకు వెచ్చించటమే కాక, మరాఠా దండులు రోహిల్లా మీదకు దాడికి వస్తే సైనిక సహాయంచేయటానికి ఇంకా నాలుగులక్షలు నవరసులు వసూలుచేశాడు. వంగరాష్ట్ర నవాబు ను, చక్రవర్తి షా ఆలమునూ దుస్థితికి పాల్చేశాడు. (3) వంగరాష్ట్రమును కొన్ని జిల్లాలుగావిభజించి పన్నుల వసూలుకొరకు ప్రాతదేశీయోద్యుగులను తొలగించి జిల్లాకొక కలెక్టరును, నలురైదుగురు కలెక్టర్లపై ఒక కమీషనరును నియమించాడు. వీరందరిపైనా కలకత్తాలో రెవెన్యూబోర్డును ఏర్పరచాడు. కలెక్టర్లు సరాసరి పన్నులు వసూలుచేయకుండా పన్నుల వసూలుహక్కును ఆ విధముగా వేలంవేయించి వేలంపాటలో ఎవరైతే అధికంగా పాడిరో వారికి సిస్తు వసూలు చేసే హక్కు ఇచ్చారు. అలాగ సిస్తు వసూలు చేసుకున్నవారేఇజారాదారులు . ఆ ఇజారా దారులునే మొదట దివానులనేవారు. తరువాత వారిలో చాలమంది కారన్ వాలీసు కాలం (1786-1793) లో చేసిన సంస్కరణల ఫలితముగా జమీందారులైయ్యారు. (4) జిల్లా కలెక్టర్లకే రివిన్యూ బాధ్యతలుతోపాటు న్యాయవిచారణచేయు అధికారమీయబడింది. కలెక్టర్ల కోర్టులే క్రిందికోర్టు, దానిపైన అప్పీలు కోర్టును సదర్ దివానీ అదాలత్ అను సివిల్ కోర్టును, సదర్ నిజామత్ అదాలత్ అను రెండు ఉన్నత కోర్టులను స్థాపించబడ్డాయి. అలా వారన్ హేస్టింగ్సు చేసిన రాజకీయ సంస్కరణలవల్ల నూతన న్యాయస్తానాలు నెలకొల్పబడనవి, న్యాయ విచారాణాధికారము ఇంగ్లీషువారు చేబట్టి ఆంగ్లేయధర్మశాస్త్రములను అమలుచేయటంవల్ల దీర్ఘకాలంనుండీవస్తున్న హిందూ మహ్మదీయ సాంప్రదాయలకు ఆటంకమైనవి.
వారన్ హేస్టింగ్సు కార్యకాలంలోజరిగిన యుద్ధాలు
మార్చుకూచ్ బీహారు అను వంగరరాష్ట్రములోని చిన్నరాజ్యమును 1772-73 లో జిధార్ అను భూటాన్ రాజు ముట్టడించినప్పుడు కూచ్ బీహారు పరిపాలించుచున్న రాజు బ్రిటిష్ వారి ప్రతినిధిగానున్న వారన్ హేస్టింగ్సును సైనిక సహాయం కోరగా కూచ్ బీహారులో జరిగిన యుద్ధం. ఆతరువాత వారన్ హేస్టింగ్సు కాలంలో జరిగిన రోహిల్లా యుద్ధం (1773-1774). వారన్ హేస్టింగ్సు గవర్నరు జనరల్ గానుండగా జరిగిన రెండవ మైసూరు యుద్ధం. 1780 హైదర్ అలీతో జరిగిన మైసూరు యుధ్దములో బ్రిటిషవారి మిత్రకూటమిలోనున్న హైదరాబాదు నిజాము గారు చేస్తానన్న సహాయం చేయక పోబట్టి బ్రిటిష్ వారి సైన్యాధిపతి జనరల్ ఐర్ కూట్ తో యుద్ధము జరుగుచుండగా 1782లో హైదర్ అలీ చనిపోగా అతని కుమారుడు టిప్పుసుల్తాన్ యుధ్దము సాగించెను. చివరకూ ఎటూ తేలకుండా బ్రిటిష్ వారి తరఫున వారన్ హేస్టింగ్సు టిప్పుతో రాజీ చేసుకున్నాడు. మహారాష్ట్ర పరిపాలకులైన పీష్వాల వారసత్వపు అంతః కలహములో జోక్యముచేసుకుని బ్రిటిష కంపెనీ వారు వారన్ హేస్టింగ్సు కాలంలో మొట్టమొదటిసారిగా 1775నుండి 1782 దాకా మహారాష్ట్ర రాజ్యములో చేసిన యుద్ధము
రోహిల్ఖండు చరిత్ర, రోహిల్ఖండు యుద్ధం (1773-1774)
మార్చురోహిల్ఖండు ఉత్తరహిందూదేశములో ఇప్పటి ఉత్తరాఖండు రాష్ట్రములో వాయవ్యదిశన నేపాలు దాకా యుండిన పరగణాలు మొగల్ చక్రవర్తి 17 వశతాబ్దములో అఫగన్ ధేశీయులగు రోహిల్లాలుఅను పధానులుకిచ్చాడు. అందువల్ల ఆ పరగణాలుగల రాజ్యమును రోహిల్ఖండు అనబడియున్నది. ఆ రాజ్యములో ఇప్పటిబరైలీ, రుద్రపూరు, రామ్ పూరు, మొరాదాబాదు మొదలగు పట్టణములున్న జిల్లాలు కలవు . 1752లో రోహిల్ ఖండుకు ఆనుకుని యున్న ఔధ్ రాజ్యము నవాబు (మొగల్ చక్రవర్తికి సుబేదారుడు) సప్దర్ జంగ్ నవాబు గారు తనకు సైని సహాయము చేయమని మరాఠా సైనిక దళమును ఆహ్వానించి రోహిల్లాలను పారత్రోల ప్రయత్నించాడు. అప్పటినుండి ఔద్ నవాబుకు రోహిల్ ఖండును పూర్తిగా వశంచేసుకోటానికి యుధ్దాలు జరుపుతూనే వున్నట్లునూ, మరాఠీదండులు రోహిల్ఖండుమీద దాడలుజరుపుచున్నటులనూ తెలియుచున్నది. 1773-1774 లో మరాఠా సైనిక దళాలు రోహిల్ఖుండు మీద దాడీకి వస్తున్నారని తెలియగనే ఎక్కువగా సైన్యము కలిగియుండని ఔధ్ నవాబు, షూజాఉద్దౌలా భయపడి తనరాజ్యముపైకి వస్తారేమోనని ముందుజాగ్రత్తగనే తనకు అండగా బ్రిటిష్ సైనిక బలగమును సహాయంకోరాడు. అలాంటి ఆకాంక్షలకోసమే వేచియుండిన బ్రిటిష్ వారికి అప్పటిలో గవర్నరు జనరల్ గానుండిన వారన్ హేస్టింగ్సుకు కుటిల రాజతంత్రము ప్రయోగించుటకు గొప్ప అవకాశం కలిగినందుకు సంతోషముతో ముందుకువచ్చివారి షరత్తులకు వప్పుకున్న ఔధ్ నవాబుకు తమ సైనికి బలగమును పంపిచాడు. ఆ యుద్దమే రోహిల్ఖండు యుద్దమని ప్రసిధ్ధి చెందినది. వాస్తవానికి యుధ్ధం జరుగకుండానే మరాఠీ దండులు అనివర్య కారణాలవల్ల వెనక్కి వెడలిపోయారు. కానీ ఔధ్ నవాబువద్దనుండి వారన్ హేస్టింగ్సు యుధ్ధపు ఖర్చుల క్రింద 2 లక్షలకు పైగా రొక్కము వసూలు చేయటమే గాక అప్పటినుండి ఆ నవాబు బ్రిటిష్ వారి చేతులలో కీలుబొమ్మ అయినాడు
రెండవ మైసూరు యుద్ధం (1780-1784)
మార్చురెండవ మాసూరు యుధ్ధం 1780లో హైదర్ అలీ ఆర్కాటును ముట్టడించడం అతని కుమారుడు టిప్పుసుల్తాన్ పోలిలూరు (పెరంబాగం) లో బ్రిటిష్ వారిసైన్యాదిపతి కర్నల్ విలియం బైలీ (William Baillie) ని యుద్ధములో ఓడించి శ్రీరంగపట్టణంలో బందీగానుంచటం. అలాగే ఇంకో బ్రిటిష్ సైన్యదిపతి బ్రైత్వైట్ (Braithwait) ను కుంబకోణంలో ఓడించి శ్రీరంగపట్టణంలో బందిగానుంచాడు. ఆయుధ్ధమువలన బ్రిటిష్ వారికి చలా తీవ్రమైన ఓటమి తీరని అపర్దిష్ట కలిగింది. అప్పుడు వారన్ హేస్టింగ్సు తన సేనాధిపతి ఐర్ కూట్ (Eyre Coote) ను హైదర్ అలీ పై యుద్ధమునకు పంపాడు. పోర్టోనోవో (పరంగిపెట్టై) లో 1782 జరిగిన ఆ యుద్ధములో హైదర్ అలీ ఓడిపోయిన తరువాత మరణించాడు. 1783లో ఐర్ కూట్ కూడా మరణించాడు. టిప్పుసుల్తాను తన తండ్రితదనంతరం బ్రిటిష్ కంపెనీ వారితో వైరం ఇంకా కొనసాగించగా అప్పటి బ్రిటిష గవర్నర్ జనరల్ కారన్ వాలీసు మూడవ మైసూరు యుద్ధములో స్వయంగా సైన్యాధిపత్యము వహించాడు.
మొదటి మహారాష్ట్రయుధ్దము (1775-1782)
మార్చుబ్రిటిష్ కంపెనీ వారు మహారాష్ట్ర రాజ్యములో ఏడేండ్ల పాటు (1775-1782) చేసిన మొదటి యుధ్దము వారన్ హేస్టింగ్సు కార్యకాలములోనే జరిగింది. అప్పటిదాకా కంపెనీ వారు సరాసరి మహారాష్ట్ర రాజ్య పరిపాలకులతో యుద్ధమునకు తిగలేదు. శివాజీ మహారాజు స్థాపించిన మహారాష్ట్రరాజ్యము భౌగోళికముగా ఇప్పటి మహారాష్ట్ర రాష్ట్రమే గాక, కెొంకణ ప్రాంతములోను, దక్కను పరగణాలలోను, ఇప్పటి మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్, ఇందోరు మొదలగు మాల్వా ప్రాంతములలో విస్తరించిన యున్న సామ్రాజ్యము. మహారాష్ట్ర రాజ్యమును స్థాపించిన శివాజీ మహారాజు తరంవారు 1714 నుండి బలహీనులైన కారణంగా ఆ రాజ్య మంత్రిపరిషత్తు లోని పీష్వా అను ప్రధాన మంత్రులే వారసత్వంతో పరిపాలించు చుండిరి. వీరి కాలములో రాజధానిని రాయఘడ్ నుండి పూనాకు మార్చబడింది. అట్టి పీష్వాల తరంవారిలో నాల్గవ పీష్వా మాధవరావు (1761-1772) క్షయవ్యాధితో 1772 లో మరణించుచూ 16 ఏండ్ల బాలుడైన తనతమ్ముడు నారాయణరావుకు తనతరువాత పట్టాబిషేకముచేయమని మంత్రిపరిషత్తుకు చెప్పి మరణించాడు. నారాయణరావును పీష్వాగా చేసినతరువాత మాధవరావు గారి పినతండ్రైన రఘునాధరావు కుట్రలు పన్ని నారాయణరావును చంపి తానే పీష్వాగా పరిపాలనచేపట్టాడు కానీ మంత్రి పరిషత్తులోని కొందమంది నానాఫడ్నవీసు సారథ్యములోని వారు అతనిని పదవినుండి తొలగమని అప్పుడే పుట్టిన నారాయణరావు కుమారుడు సవాయి మాధవరావు అను పసికందుకు పట్టముకట్టారు. అంతట రఘునాదరావు బ్రిటిష ఈస్టు ఇండియా కంపెనీ బొంబాయి గవర్నరును ఆశ్రయించి తనకు సైనికి సహాయంచేయమని, దానికి ప్రతిఫలముగా తను మహారాష్ట్ర రాజ్యములోని కొన్ని భూభాగములను ( సల్సెట్టీ, బస్సీను ) ఇవ్వటమేకాక సూరత్ లోను, బరూచ్ లోను రాజస్వ హక్కు కూడా ఇచ్చేటట్లుగా సూరత్ లో 1775 మార్చిలో సంధిపత్రము వ్రాసి వప్పందం కుదుర్చుకున్నాడు. అదే సూరత్ సంధి. అ సంధి ప్రకారము లభించిన బ్రిటిష్ వారి సైన్యసహాయంతో సూరత్ నుండి పూనాపై దండయాత్రకు బయలుదేరగా దారిలో నానాఫడ్నవీసు పక్షమువారిచే పరాజయము పొందాడు. అంతేగాక కలకత్తాలోని బ్రిటిష గవర్నరు జనరల్ కౌన్సిల్ వారు ఆ సూరత్ సందిని రద్దు పరచుటకు పూనాకు రాయబారముపంపి నానాఫడ్నవీసుతో 1776 మార్చిలో పురంధర్ అను ప ట్టణంలో ఇంకో సంధి చేసుకున్నారు. ఆ సంధి ప్రకారం కూడా సూరత్ లోను బరూచ్ లోను రాజస్వహక్కు తమకుండేటటుల. కానీ నానాఫడ్నవీసు పురంధర్ సందికి వ్యతిరేకముగా తన రాజ్యములోని పడమర సముద్రపుతీరమున ప్రెంచివారికి నౌకాయానమునకు ఓడరేవునిచ్చాడు. దాంతో రఘునాధరావునే మహారాష్ట్ర రాజ్యసింహాసనాధిపతిచేయుటకు బొంబాయ కంపెనీ గవర్నరు సైన్యమును పూనాకు పంపి నానాఫడ్నవీసుతో యుధ్దమునకు దిగారు. కానీ దారిలోనే వడగాం అను పట్టణంలో నానా ఫడ్నవీసు సైన్యముతో ఓడిపోయి సంధిచేసుకున్నారు అదే వడగాం సంది 1779 లో జరిగి నసంది. అప్పుడు వారన్ హేస్టింగ్సు పెద్దపెట్టున సైన్యమును కర్నల్ థామస్ డబ్ల్యూ గద్దర్ సారథ్యములో యుద్ధమునకు పంపి పూనాను ముట్టడించి పరిస్థితిని పూర్తిగా బ్రిటిష్ వారి వశంచేసుకుంటానికి పంపించాడు. అంతట గద్దార్డు సైన్యము అహ్మదాబాదు ను, బస్సీనును ఆక్రమించి పూనా ముట్టడిచేశారు. ఈ లోపల మరో వైపు మాళ్వాలో బ్రిటిష్ సైన్యాధికారి కమక్ ను మహారాష్ట్రకూటమిలోని గ్వాలియార్ రాజా మహద్జీ సింధియా రాజుతో తలపడి యుద్ధములో ఓడిపోయేస్థితిలో ఇంకా బ్రిటిషసైనిక దళములు కర్నల్ ముర్రె ఆధిపత్యములో వచ్చి చేసిన యుధ్దములో చివరకు 1782 మే నెలలో గ్వాలియర్ రాజు సింధియాను ఓడించి సల్బీ సంది వడంబడిక చేసుకుని బ్రిటిష కంపెనీ వారి ఆధిక్యత మహారాష్ట్రలో స్ధాపిచటంతో మొదటి యుద్ధము ముగిసినది
వారన్ హేస్టింగ్సు కార్యకాల సమీక్ష
మార్చుగవర్నరుకాకమునుపు,1772కు ముందు కార్యాకాలం
మార్చువంగరాష్ట్రములో మొదటివిడతలో 1750-1757, 1757- 1764 కార్యకాలం లోనూ తదుపరి 1768 దేవీకోట చేన్నపట్నంలో కంపెనీ పాలక సంఘములో సాధారణ సభ్యునిగా 1772 దాకా కార్యకాలంలోనూ వారన్ హేస్టింగ్సు చర్యలు, అభిమతాలు భారతదేశ ప్రజల క్షేమంకోరినవిగనూ బ్రిటిష్ వారి రాజ్యతంత్రములు న్యాయ-ధర్మ విరుద్ధములైనవిగనూ, బ్రిటిష్ ఉద్యోగుల ఆర్థిక అవినీతి చర్యలు ఖండించునవిగనూ, బ్రిటిషదొరలకు అభ్యంతరములై తంటాలు కలిగించేవిగనూ విశదమగుచున్నవి.
1773 లో విలియం కోటకు గవర్నరు అయన తరువాతనుంచి
మార్చుప్రజలక్షేమం, రాష్ట్రాభివృధ్దికి బాధ్యతలు వహించకుండా పరిపాలనాధికారం వహించి, బ్రిటిష్ వారి ఖజానాలకు ధనం చేర్చటం ముఖ్య ఉద్దేశంతో వారన్ హేస్టింగ్సుగవర్నరుగాను, గవర్నరు జనరల్ గా చేసిన కార్యాచరణలన్నీ కేవలం బ్రిటిష్ కంపెనీ, బ్రిటన్ దేశంకోసం చేసినవే. వారన్ హేస్టింగ్సు చేసిన రాజకీయ సంస్కరణల వల్ల వంగరాష్ట్రములోని పంచాయితీ విధానం నశించిపోయింది. సిస్తు వసూలుకు తాను పెట్టిన దివానుల పద్ధతితో భూమిదున్ను రైతుల ఆర్థిక పరిస్థితి దయానీయకమైనది. వంగ రాష్ట్రములో వారన్ హేస్టింగ్సు చేసిన రాజకీయాల వల్ల వంగరాష్ట్ర నవాబే కాక మొగల్ చక్రవర్తిని కూడా ఆర్థిక దుస్థితికా పాలుచేశాడు. అయోధ్యనవాబును చేతుల్లో నుంచుకుని కాశీ పరిపాలించుచున్న రాజు చైత్ సింగును తవ వశం చేసుకునుట వారిద్దరి మద్దతుతో అయోద్య రాణుల వ్యగ్తిగత సంపత్తి దాదాపు 12 లక్షల నవరసులులు దాక వసూలుచేశే వరకు చేసిన రాజకీయకార్యాచరణ చాల విచారమైనవి. తనపై అవినీతి, లంచగొండితనమును ఆరోపణచేసిన నందకుమారుడనునతని పై ప్రత్యారోపణలు మోపి ఉరితీయించటం చరిత్రలోకెక్కిన అక్రమబద్ధమైన కార్యాాచరణ. వారన్ హేస్టింగ్సు చేసిన అటువంటి ఆర్థిక, రాజకీయ అక్రమ కార్యాచరణలను ఇంగ్లండు కామన్సు సభ్యుడైన బర్కు దొర (Edmund Burk) సభలో చేసిన మహోపన్యాసమునందు వర్ణంచబడినవి. రోహిల్ఖండు యుద్ధము, ఔధ్ నవాబు షూజా ఉద్దౌలాకు సహాయముచేయటంలో అంతర్గత రాజ్యతంత్రము బ్రిటిష్ వారి రింగ్ ఫెన్సు (Ring Fence) సూత్ర ప్రయోగం. ఆ రోహిల్ఖండు యుద్ధంతో ఔధ్ నవాబు, షూజాఉద్దౌలా బ్రిటిష్ వారి చెప్పుచేతులలోకి వచ్చేటట్లు చేసుకున్న రాజ్యతంత్రము వారన్ హేస్టింగ్సు దొర ఘనత. బ్రిటిష్ వారికి మరాఠీలతో సరాసరి యుధ్దముచేయ వలసిన ప్రమాదములనివారించు రక్షణకవచములాంటి (buffer region) మద్యలోనొక రాజ్యంమునుంచటం ఒక రాజ్య తంత్రము. భూటాన్ రాజును ఓడించినతరువాత ఇక తదుపరి రాజ్యతంత్రము భూటాన్ టిబెట్టులో కూడా బ్రిటిష్ వారి ఆధిక్యత వ్యాపించిటం వారన్ హేస్టింగ్సు చేసిన మరోరాజకీయకార్యక్రమం. వ్యగ్తిగతముగా కూడా వారన్ హేస్టింగ్సు తన అధికారము దుర్వినియోగపరచినట్లు చరిత్రలో కనబడుచున్నది. తన బంధువుడైనవానికొకనిని హైదరాబాదు నిజాంగారి పరిపాలనలో ఆర్ధకలాబముకలిగించే వ్యవహారమింకొకటి. ఇత్యాది కార్యాచరణలు వారన్ హేస్టింగ్సును రాజ్యధర్మముపాటించని పరిపాలకునిగనూ అవినీతి ఆర్దక లభ్దిదారుడైన వ్యక్తిగాను తీవ్ర ఆరోపణలకు గురిచేసియున్నవి. 1775లో మహారాష్ట్ర రాజ్యమును పరిపాలించు పీష్వా పదవికి వారసు లైన రెండు పక్షముల వైపూ బ్రిటిష్ కంపెనీ వారే సందులు చేయగా ( మొదటగా ఒకవైపు బొంబాయి గవర్నర్ చేయగా దానిని రద్దు చేయుచూ రెండో పక్షమువైపు కలకత్తా గవర్నర్ జనరల్ గానున్న వారన్ హేస్టింగ్సుఇంకో సంధి చేశాడు ) ఆ పరిస్థితులలో లండన్ లోని కంపెనీ ప్రభువులు బొంబాయి గవర్నరు చేసిన సంధిని సమర్ధించుతూ చేసిన ఫైసలాను కూడా వినక గవర్నర్ జనరల్ గా అలాంటి సంధిచేయుటకు తనకే హక్కున్నదన్న పట్టుదలతో మహారాష్ట్ర రాజ్యములో చేసిన ది మొదటి మహారాష్ట్రయుద్ధము (1775-1782) .
మూలాలు
మార్చు- ↑ Bengal Public Consultations February 12, 1785. No. 2. Letter from Warren Hastings, 8th February, formally declaring his resignation of the office of Governor General.
- ↑ “The British Rule in India”. D.V. SIVA RAO. ఆంధ్ర గ్రంథాలయ ముద్రాక్షరశాల బెజవాడ.02/10/1938.
- ↑ The Encyclopedia Britannica, 13th Edition(1926). Pp 244-247