రాకేష్ రోషన్: కూర్పుల మధ్య తేడాలు

"Rakesh Roshan" పేజీని అనువదించి సృష్టించారు
"Rakesh Roshan" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 8:
=== 1970–1990 ===
1970లో ఘర్ ఘర్ కి కహానీ సినిమాలో సహనటునిగా సినీ రంగప్రవేశం చేశారు రాకేష్. ఆయన కెరీర్ మొత్తం మీద సోలో హీరోగా చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. కథానాయికా ప్రధానమైన సినిమాల్లో ఎక్కువగా సోలో హీరో అవకాశాలు వచ్చాయి ఆయనకు. హేమా మాలినితో పరయా ధాన్, భారతితో ఆంఖ్ మిచోలీ, రేఖాతో ఖూబ్ సూరత్, జయప్రద తో కామ్ చోర్ వంటివి ఆ కేవకు చెందినవే. సోలో హీరోగా ఆయన చేసిన  ఆంఖో ఆంఖో మే, నఫ్రత్, ఏక్ కున్వారీ ఏక్ కున్వారా, హమారీ బహూ అల్కా, శుభ్ కామ్నా, రాటి అగ్నిహోత్రి వంటి సినిమాలు మంచి విజయాలు నమోదు చేసుకున్నాయి. ఆంఖో ఆంఖో మే సినిమాను  నిర్మించిన జె.ఓం ప్రకాశ్ రాకేశ్ సహాయ నటునిగా ఆఖిర్ క్యూ అనే సినిమా కూడా తీశారు. మన్ మందిర్, ఖేల్ ఖేల్  మే, బుల్లెట్, హత్యారా, ధోంగే, ఖాందాన్, నీయాత్ వంటి సినిమాల్లో సహాయ నటునిగా చేశారు. [[రాజేష్ ఖన్నా]] హీరోగా నటించిన సినిమాల్లో ఎక్కువగా  సహాయ  నటునిగా నటించారు రాకేష్. ఈ కాంబినేషన్ లో వచ్చిన చట్లా పుర్జ్  ఫ్లాప్ అయినా, ఆ తరువాత వచ్చిన ధన్వాన్, ఆవాజ్, ఆఖిర్ క్యూ సినిమాలు మాత్రం బ్లాక్ బస్టర్లు అయ్యాయి. 1977-1986 ల్లో సంజీవ్ కుమార్ తో కలసి ఆయన రెండో హీరోగా చేసిన దేవతా, శ్రీమాన్ శ్రీమతి,  హాత్కడీ వంటి మల్టీ స్టారర్ సినిమాలు విజయం సాధించాయి. మిథున్ చక్రబర్తితో కలసి, రెండో కథానాయకునిగా ఆయన చేసిన జాగ్ ఉఠా ఇన్సాన్, ఏక్ ఔర్ సికందర్ సినిమాలు కూడా హిట్ అయ్యాయి. సోలో హీరోగానూ, రెండో హీరోగానూ చేసిన దిల్ ఔర్ దీవార్, ఖట్టా మీఠా, ఉన్నీస్-బీస్(1980), మకార్(1986) సినిమాలు కూడా విజయం సాధించాయి.
 
1980లో స్వంత నిర్మాణ సంస్థ ఫిలిం క్రాఫ్ట్ ను స్థాపించారు రాకేష్. సంస్థ మొదటి సినిమా ఆప్ కే దీవానే(1980)  ఫ్లాప్ అయింది. ఆ తరువాతా ఆయన నిర్మించిన కామ్ చోర్ కమర్షియల్ గానూ, సంగీతపరంగానూ మంచి విజయం సాధించింది. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన శుభ్ కామ్నా పెద్ద హిట్ అయింది. జె.ఓం ప్రకాశ్ దర్శాకత్వంలో రాకేష్, [[రజనీకాంత్|రజినీకాంత్]] హీరోలుగా నటించిన భగవాన్ దాదా  సినిమా ఫ్లాప్ అయింది. 1983-90ల మధ్యకాలంలో  బహూరాణి, మకర్, ఏక్ ఔర్ సికందర్ వంటి సినిమాల్లో నటించారు ఆయన. 1989లో మాణిక్ చటర్జీ దర్శకత్వంలో రేఖతో కలసి నటించిన  బహూరాణి సినిమా హీరోగా రాకేష్ కు ఆఖరి చిత్రం.
 
== References ==
"https://te.wikipedia.org/wiki/రాకేష్_రోషన్" నుండి వెలికితీశారు