కంగనా రనౌత్: కూర్పుల మధ్య తేడాలు

"Kangana Ranaut" పేజీని అనువదించి సృష్టించారు
"Kangana Ranaut" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 2:
 
[[హిమాచల్ ప్రదేశ్]] లోని భంబ్లా అనే పల్లెటూరిలో జన్మించారు కంగనా.  ఆమె  తల్లిదండ్రుల గట్టి పట్టుదల ప్రకారం డాక్టర్ అవ్వాలని  అనుకునేవారు ఆమె చిన్నప్పుడు. కానీ తన 16వ ఏట తన  కెరీర్ తానే నిర్మించుకోవాలనే సంకల్పంతో ఢిల్లీ వెళ్ళిపోయారు. ఆ  తరువాత కొన్నాళ్ళకు మోడల్ అయ్యారు కంగనా. నాటక దర్శకుడు అరవింద్ గౌర్ శిక్షణలో నటన నేర్చుకున్న ఆమె 2006లో గాంగ్ స్టర్ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ సినిమాకి ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం అందుకున్నారామె. వోహ్ లమ్హే(2006), లైఫ్ ఇన్ ఎ.. మెట్రో(2007), ఫ్యాషన్(2008) సినిమాల్లోని ఆమె నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు కంగనా. ఈ మూడు సినిమాలకు జాతీయ, ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారాలు అందుకున్నారు ఆమె.
 
రాజ్: ది మిస్టరీ కంటిన్యూస్(2009), వన్స్ అపాన్ ఎ టైమిన్ ముంబై(2010) వంటి హిట్ సినిమాల్లో నటించారు కంగనా. మానసిక ఇబ్బందులతో ఉండే పాత్రల్లో ఎక్కువగా నటించడంతో కొన్ని విమర్శలు ఎదురైనా, ఆమె నటనకు మాత్రం ప్రశంసలే లభించాయి. 2011లో మాధవన్ తో కలసి నటించిన తను వెడ్స్ మను సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత ఆమె గ్లామర్ పాత్రల్లో నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. [[హృతిక్ రోషన్|హృతిక్]] సరసన ఆమె నటించిన క్రిష్ 3(2013) సినిమా బాలీవుడ్ లో అత్యంత ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాల్లో  ఒకటిగా నిలిచింది. ఆ తరువాత ఆమె నటించిన క్వీన్(2014) సినిమాలో ఆమె నటించిన పాత్రకు మంచి గుర్తింపు రావడమే కాక జాతీయ, ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాలు అందుకున్నారు కంగనా. 2015లో తను వెడ్స్ మను రిటర్న్స్ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు ఆమె. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయింది. ఈ సినిమాలోని ఆమె నటనకు ఫిలింఫేర్ విమర్శకుల పురస్కారం, వరుసగా రెండో జాతీయ ఉత్తమ నటి పురస్కారాలు లభించాయి.
 
[[వర్గం:1987 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/కంగనా_రనౌత్" నుండి వెలికితీశారు