బృహదారణ్యకోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధము → గ్రంథము using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (3), కలవు. → ఉన్నాయి. using AWB
పంక్తి 2:
{{హిందూధర్మశాస్త్రాలు}}

'''బృహదారణ్యకోపనిషత్తు''' (సంస్కృతం : बृहदारण्यक उपनिषद्) ఉపనిషత్తులలో ప్రాచీనమైనది, ముఖ్యమైనది. ఇది శతపత బ్రాహ్మణములో భాగము, అదే సమయములో దీనిని ఈ బ్రాహ్మణము నుండి సంగ్రహించబడినదని తెలుస్తున్నది. ఇది [[శుక్ల యజుర్వేదము|శుక్ల యజుర్వేదమునకు]] చెందినది. ముక్తికా సూత్రమునందున్న 108 ఉపనిషత్తులలో ఇది పదవ స్థానమునందు కలదు. దీనికి [[ఆదిశంకరాచార్యులు]] భాష్యము రాశారు.ఇందు శ్వమేధమును గురుంచి చెప్పబడినది. ఆత్మనుండి ప్రపంచము సృష్టి అయినట్లుకలదు. 2వ భాగమందు వేదాంత చర్చలు కలవుఉన్నాయి. బ్రహ్మ శాస్త్రములచే నగమ్యుడనియు, అభ్యాసము వలన బ్రహ్మను కనుక్కొనవచ్చునని తెలుపబడినది. యాజ్ఞవల్క్యజనకులకు జరిగిన చర్చ ఇందు కలదు. యాజ్ఞవల్క్యుడు బ్రహ్మ యనగ అచ్యుతుడు నిరంజనుడు, నరాకారుడు, అచలుడు అని చెప్పియున్నాడు. జనకునకును యాజ్ఞవల్క్యునకును ఆత్మను గూర్చి చర్చయు, ఇందాత్మకు కల జాగ్రత్ స్వప్న సుషుప్త్యా వస్థలగురుంచి వివరింపబడినది. ఇట్టి గ్రంథము హైందవవాజ్మయమందు లేదనుట అతిశయోక్తి కాదు.యాజ్ఞవల్క్యనకును ఆతని భార్య మైత్రేయికిని జరిగిన సంభాషణము ఇందు గృహమును త్యజించి వాన ప్రస్థమును స్వీకరించుటకు గల విషయములు వర్ణితములు. ఇందు పునర్జన్మ గురుంచి చెప్పబడియున్నది. శుక్లయజుర్వేదములలో పెద్దది చాందోగ్యము, చిన్నది ఏశానోపనిష్యత్తు.

==అంశాలు==

అసతో మా సద్గమయ – అసత్తునుండి సత్తునకు గొనిపొమ్ము.

తమసో మా జ్యోతిర్గమయ – తమస్సునుండి జ్యోతిలోనికి తీసికొని పొమ్ము.

మృత్యోర్మా మమృతం గమయ – మృత్యువు నుండి అమృతత్వమును పొందింపజేయుము..

ఆత్మై వేద మగ్ర ఆసీత్ దేవ ఏవ ... సృష్టికి పూర్వం ఆత్మ ఒకటియే కలదు అంటే ఆదియందు (మొదట) ఆత్మ ఒకటియే కలదు.

ద్వితీయద్వై భయం భపతి : రెండవ వస్తువు కాని వ్యక్తీకాని యున్నచో భయం కలుగును. (ఆత్మ తప్ప మరియొక వస్తువుకాని, వ్యక్తికాని ఈ ప్రపంచమున లేనందున ఇంక భయమేల కలుగును? కలుగదని భావము.)

ఆత్మ మిక్కిలి ప్రియమైనది. పుత్రునికంటేను, ధనముకంటెను, ఇంకను ఏయే పదార్థములు శ్రేష్టములైనవి కలవో వానికంటేను ఆత్మ ఎంతో ప్రియమైనది. ఆత్మ మన సమీపమందే మన స్వరూపమైయే యున్నది. అనాత్మను ప్రియమణి చెప్పు మనుజునకు, అత్మగ్నని ‘అయ్యా!’ మీరు ప్రియమణి తలంచు పుత్రాదులు నశించునవి కదా! అని చెప్పెను. ఈ సత్యమును తెలుపుటకు అతడోకడే సమర్ధుడు. అనాత్మరూపమైన దానికి అస్తిత్వము లేదు. అవిద్యచే వున్నట్లు కన్పించును. కావున ఆత్మ యను ప్రియవస్తువునే ఉపాసించవలయును. ఆత్మను ప్రియమని ఉపాసించువాని ఆనందము ఎప్పటికిని నశించదు.
పంక్తి 27:

కలిగినట్టియు, కలుగబోవునట్టియు సమస్తమునకు అధిపతియైన పరమాత్మను ఎపుడు జీవుడు సాక్షాత్కరించుకోనుచున్నాడో అపు డాతడు ఇక దేనికిని భయపడవలసిన పనిలేదు.

నిర్మలమైన మనస్సుచేతనే ఆ బ్రహ్మము చూడదగును(సక్షాత్కారింపదగును).ఇచట అనేకత్వము ఒకింతైనను లేదు. సమస్తము బ్రహ్మమే.ఎవడించట అనేకత్వము చూచునో, అతడు ఒక ఒక మృత్యువు నుండి మరియొక మృత్యువును పొందును.(జనన మరణ రూప సంసారమున దగుల్కొనును).

ఈ బ్రహ్మమును ఈకముగా చూడవలెను. అది అప్రమేతమైనది; ద్రువమైనది; నిత్యమైనది; మాలిన్యరహితమైనది. ఆకాశము కంటే సూక్ష్మమైనది.జన్మము లేనిది. సర్వ శ్రేష్టమైనది.నాశరహితమైనది.

ఇట్టి ఆత్మను (బ్రహ్మమును) దీరుడగు బ్రహ్మజ్ఞాని ఎరిగి ప్రజ్ఞను బడయవలెను. అనేక శబ్దములను ధ్యానింపరాదు. ఎలాయనిన అధిక శబ్దములు వాక్కునకు శ్రమయే యగును.

ఇట్టి ఆత్మనుగూర్చి వేదఋక్కుచే స్పస్టముగా చెప్పబడి యున్నది. ఆ ఆత్మ నిత్యమైనది. బ్రహ్మవేత్తయెక్క మహిమ అయి వున్నది. అది పుణ్య కర్మచే వ్రుద్దినిగాని, పాపకర్మచే క్షీణత్వమును గాని పొందుటలేదు. దాని మహిమ నేరింగినవాడు ఇక శాంతుడు. ఇంద్రియ నిగ్రహము కలవాడు, ఉపరతువు, తితిక్షువు, ఏకాగ్రచిత్తుడు. ఇతి సల్లక్షణములతో గూడి ఆ మహనీయుడు తనయందే ఆత్మను దర్శించుచున్నాడు.సమస్తమును ఆత్మగా చూచుచున్నాడు. అతనిని పాపపుణ్యములు అంటవు.అతడు పాపపుణ్యములను దాటుచున్నాడు.అతనిని కృతాకృత కర్మలు బాధించవు.అట్టి కర్మల నతడు భస్మముచేయుచున్నాడు. అతడు పాపరహితుడై, విరజ్జుడై, ఇచ్చారహితుడై, సంశయవర్జితుడై, బ్రహ్మము నేరింగినవాడై యుండు ఇదియే బ్రహ్మలోకము (అంటే ఇప్పుడు వున్నది మనము అంతయు పరమాత్మా లోకము) – అని యాజ్ఞవల్క్యుడు జనక మహారాజునకు బోధించెను.