కండరం: కూర్పుల మధ్య తేడాలు

→‎కండరాల నిర్మాణం: ఈ వ్యాసంలో ఉండదగిన సమాచారం కండర సంకోచము నుండి ఇక్కడ అతికించా
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , using AWB
పంక్తి 13:
 
==కండరములలో రకములు==
[[దస్త్రం:414 Skeletal Smooth Cardiac.jpg|thumbnail |బాహ్య లక్షణములపై ఆధారపడి సకశేరుకముల కండరములు. a)అస్థి కండరములు; b)నునుపు కండరములు; c)హృదయ కండరములు ]]
===కండరముల అమరికను బట్టి===
ఇవి రెండు రకాలు. మొదటిది, [[ఫేసిక్ కండరములు]] ( Phasic muscles). ఈ కండరముల మూలములు బాహ్య మరియు అంతర [[ అస్థి పంజర]] నిర్మాణముల వద్ద ఏర్పడి వాటిపైన చొచ్చుకొని ఉండును. ఇవి ఉపాంగాల కదలికలకు బాధ్యత వహించును.<br>
రెండవది, [[టోనిక్ కండరములు]] (Tonic muscles). ఇవి సున్నిత అవయవములైన గుండె [[మూత్రాశయము]],[[జీర్ణవ్యవస్థ]] మరియు శరీరకుడ్యముల వంటి భాగములలో ఉండును. ఇవి నెమ్మదిగా శంకోచించును.<br>
 
===బాహ్య లక్షణములపై ఆధారపడి సకశేరుకముల కండరములు===
[[దస్త్రం:A single cardiomyocyte beating, five days after purification from cell culture.ogv|thumbnail||హృదయ కండరములోని ఒక కణం కొట్టుకొనటం]]
ఇవి మూడు రకాలు. మొదటిది, [[అస్థి కండరములు]] ( Skeletal muscles). వీటిని చారల కండరములని కూడా అందురు.ఇవి జీవి యొక్కఇచ్ఛకు అధీనముగా పనిచేయును. కనుక [[సంకల్ప కండరములు]] అందురు. ఎముకలకు కలుపబడి లేక అతుకబడి ఉండును. కనుక అస్థి కండరములు అందురు. ఇవి శరీర బరువులో 40 నుండి 50 శాతం ఉండును.<ref>Marieb, EN; Hoehn, Katja (2010). Human Anatomy & Physiology (8th ed.). San Francisco: Benjamin Cummings. p. 312. ISBN 978-0-8053-9569-3.</ref><br>
రెండవది, [[నునుపు కండరములు]] (Smooth muscles). ఈ కండరములపై చారలుండవు. కనుక వీనిని నునుపు కండరములు అందురు. ఇవి జీర్ణవ్యవస్థ ,[[శ్వాసవ్యవస్థ]], మూత్రాశయము,[[ధమనులు]],[[సిరలు]] మొదలగు అంతర్నిర్మాణములలో ఏర్పడి ఉండును. కనుకనే ఈ కండరములను[[ విసరల్]] కండరములు అందురు. <br>
మూడవది, [[హృదయ కండరములు]] (Cardiac muscles). ఇవి [[హృదయము]] నందు మాత్రమే ఉండును . హృదయము కండరము అసంకల్పితముగా పని చేయును. హృదయము కండరమునందు అంతర్ చక్రికలు ([[Inter calated discs]] ) ఏర్పడి యుండి విద్యుత్ తరంగములను తరలించును.<ref>Pollard, Thomas D. and Earnshaw, William. C., "Cell Biology". Philadelphia: Saunders. 2007.</ref><ref>{{cite journal |author=Olivetti G, Cigola E, Maestri R, ''et al.'' |title=Aging, cardiac hypertrophy and ischemic cardiomyopathy do not affect the proportion of mononucleated and multinucleated myocytes in the human heart |journal=Journal of Molecular and Cellular Cardiology |volume=28 |issue=7 |pages=1463–77 |date=July 1996 |pmid=8841934 |doi=10.1006/jmcc.1996.0137 |url=http://www.sciencedirect.com/science/article/pii/S0022282896901376}}</ref>
 
===అస్థికండర తంతువు సామాన్య నిర్మాణము (General Structure of A Skeletal Muscle Fibre )===
కండరానికి కండర తంతువులు నిర్మాణాత్మక ప్రమాణాలు.అనేక కండర తంతువుల కలయిక వలన కండరము ఏర్పడుతుంది.కండర తంతువుల పరిమాణము కండరము ఏర్పడటానికి ఎటువంటి ప్రత్యక్షసంబంధమును కలిగి ఉండదు.సాధారణముగా కండర తంతువులను కప్పుతూ కొల్లాజిన్ పోగులు మరియు బంధన కణజాలము ఉంటుంది. కండరతంతువుల కొనలు స్నాయు బంధనాలుగా ఏర్పడి వాటి సహాయముతో ఎముకలకు అతికి ఉంటాయి.
*భౌమన్ ( BOWMAN 1940 ) ఆభిప్రాయం ప్రకరము ప్రతికడర తంతువు పొడవుగా డండి, బహుకేంద్రక సహితమై, సార్కోలెమ్మా త్వచముతో కప్పబది ఉంటుంది. కండర తంతువులోపల అర్ధద్రవ జీవ పదార్ధమైన సార్కోప్లాసమ్ ను (ROLLET,1891) కల్గి, అనేక ఆయుత సంకోచ నిర్మాణాలైన [[ కండరసూక్ష్మ తంతువులు]] ( Myofibrils) లేక [[ కండర సూక్ష్మ పోగులు]] (Myofilaments) ఉంటాయి.
* చరల కండర తంతువులు ఒక దాని నుండి మరొకటి పల్చని త్వచమైన ఎండోమైసియమ్ (Endomysium) తో వేరుచేయబది ఉంటాయి.చారల కండర తంతువుల కట్టను ఫాసిక్యులై అంటారు.ప్రతి ఫాసిక్యులస్ ను చుట్టి పెరిమైసియమ్(Perimysium) అనుబంధన కణజాలపు తొడుగు ఉంటుంది.అన్ని ఫాసిక్యులైను చుట్టి ఎపిమైసియమ్(Epiomysium) అను స్థితిస్థాపక తొడుగు ఉంటుంది.
*ప్రతి కండర తంతువు మధ్యలో ఉబ్బి కొనలు మొనదేలి ఉంటాయి. కొనలను స్నాయుబంధనాలు అంటారు. ఈ కండరాలు జివి ఇష్టానిష్టాలకనుగుమణ్యంగా పనిచేయటంవలన వీటిని నియంత్రిత కండరాలు అని కూడా అంటారు.
"https://te.wikipedia.org/wiki/కండరం" నుండి వెలికితీశారు