జి. వి. సుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
 
== సాహిత్య రంగం ==
ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం సాహిత్యరంగంలో విమర్శకునిగా ప్రసిద్ధుడు. 1960లో వీర రసం, 1983లో రసోల్లాసం, 1986లో ఆంధ్ర సాహిత్య విమర్శ-ఆంగ్ల ప్రభావం గ్రంథాల రచనతో పురస్కారాలు అందుకున్నాడు. నన్నయ నుంచి ప్రారంభించి నాటి ప్రఖ్యాత కవులైన సినారె, శివారెడ్డిల వరకూ తెలుగు కవుల సాహితీ ప్రక్రియల స్వరూప స్వభావాలను విశ్లేషిస్తూ ఈయన రచించిన "సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు" అన్న వ్యాస పరంపర ఆయనకు విశేష ఖ్యాతిని ఆర్జించిపెట్టింది. క్లాసిక్ తత్త్వాన్ని జీర్ణించుకొని, సమకాలీన చైతన్య ప్రభావంతో విన్నూత్న దృక్పథంతో ఆధునిక యుగంలో కొనసాగిన కావ్య రచనా మార్గానికి "నవ్య సంప్రదాయం" అని నామకరణం చేసి ఈ వాదానికి ప్రతిష్ఠ, ప్రచారాలను కల్పించిన ఘనత వీరికి దక్కుతుంది.<ref >[http://eemaata.com/em/issues/200609/915.html ఈమాట పత్రికలో సుబ్రహ్మణ్యం నివాళి వ్యాసంలోని సమాచారం]</ref> సారస్వత వ్యాసములన్న పేరిట ఆయన వ్యాససంకలనం సాహిత్య, వ్యాకరణ, ఆలంకారాది శాస్త్రాల్లో దిగ్దంతులైన మహా పండితుల వ్యాసాలతో సుసంపన్నమైంది. తెలుగు నాట సాహిత్య విమర్శ రంగంలో సుప్రసిద్ధ పత్రికలైన ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక, భారతి, శారద, ఆంధ్రపత్రిక ఉగాది సంచికల నుంచి ప్రామాణికమూ, ఆసక్తిదాయకమూ, విజ్ఞానప్రదమూ ఐన వివిధ వ్యాసాలను ఎంచి ప్రముఖ పరిశోధకుడు జి.వి.సుబ్రహ్మణ్యం సంపాదకత్వంలో [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ]] ఆ పుస్తకాన్ని వెలువరించింది<ref>{{cite book|last1=సుబ్రహ్మణ్యం|first1=జి.వి.|title=సారస్వత వ్యాసములు|publisher=ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ|location=హైదరాబాద్|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Sarasvatha%20Vyasamulu-Part-3&author1=Dr.J.V.Subramanyam&subject1=SARASVATHA%20VYASAMULU-PART-3&year=1969%20&language1=telugu&pages=465&barcode=2020120001375&author2=&identifier1=&publisher1=A.P.SHAHITYA%20ACADAME&contributor1=CCL&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP%20HYDERABAD&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORAMTICS,%20HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data/upload/0001/375|accessdate=9 December 2014}}</ref>.
 
== పురస్కారాలు, గౌరవాలు==
"https://te.wikipedia.org/wiki/జి._వి._సుబ్రహ్మణ్యం" నుండి వెలికితీశారు