చీమ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కి → కి , → using AWB
పంక్తి 36:
}}
 
'''చీమ''' ([[ఆంగ్లం]]: Ant) ఒక చిన్న [[కీటకము]]. ఇది తనకంటే రెట్టింపు బరువును మోయగలుగుతుంది. ఇవి భూమిని గుల్లగా చేస్తూ [[పుట్ట]]లను కడుతుంటాయి.
 
[[ఐకమత్యం]] అనగానే ముందు చీమలే గుర్తుకొస్తాయి. ఒకే పుట్టలో కలిసి ఉండడమే కాదు, వాటి పని అవి సక్రమంగా చేసుకోవడంలో ఎంతో [[క్రమశిక్షణ]] పాటిస్తాయి కూడా. చీమలు పుట్టుకొచ్చింది [[కందిరీగ]]ల నుంచే. ఇవి సుమారు 10 కోట్ల ఏళ్ళ కిందట కందిరీగలతో విడిపోయి, ప్రత్యేక జీవులుగా రూపొందాయి. సుమారు 11,880 జాతులుగా ఉన్న వీటిల్లో ఇటీవల కొత్తరకం చీమను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ప్రపంచంలో మొత్తం చీమలను కలిపితే వాటి బరువు, మనుషుల బరువు కన్నా ఎక్కువ ఉంటుంది.<ref>http://www.telugudanam.co.in/vijnaanam/meeku_telusaa/chima.htm</ref>
పంక్తి 43:
 
== భాషా విశేషాలు ==
[[తెలుగు భాష]]లో చీమ పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=424&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం చీమ పదప్రయోగాలు.]</ref> చీమ లోచీమలో పెద్దవైన అడవీ ప్రాంతాలలో కనిపించేవాటిని కొండచీమ. the forest ant అంటారు. [[రెక్క]]లతో ఎగరగలిగే చీమలను రెక్కలచీమ a winged ant అంటారు. చీమదూరని అడవి అంటే చాలా దట్టమైన అడవి అని అర్ధం. చిన్న నల్ల చీమల్ని చలిచీమ a black ant లు అని పిలుస్తారు. పై పారేపక్షి కిందపారే చీమ ([[సామెత]]) The bird above, the ant below, i.e., I had no chance with him. చిన్న పరిమాణాన్ని చెప్పడానికి చీమంత of the size of an ant అంటాము. చీమపులి అనగా The ant lion, an ant-eater.
 
== ఆవాసం ==
పంక్తి 52:
== చిత్రమైన జీవన విధానాలు ==
 
కలిసికట్టుగా జీవించడంలో, పనులను విభజించుకోవడంలో చీమలను మించినవి లేవు. ఒకో పుట్టలో 80 లక్షల దాకా నివసిస్తాయి. రాణి చీమలు, శ్రామిక చీమలు, సైనిక చీమలు, కాపలా చీమలు. ఇలా వేటి పని వాటిదే. రెక్కలు ఉండే రాణి చీమ గుడ్లు పెట్టడంతప్ప మరేపని చేయదు. మగ చీమలు రాణి చీమలతో జత కలిశాక వెంటనే చనిపోతాయి. ఇక రాణి కిరాణికి సేవలు చేసేవేమో శ్రామిక చీమలు. ఇవి రాణి చీమ శరీరం నుంచి వచ్చే రసాయనాన్ని రుచి చూసి, దాని ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుంటాయి. గుడ్లను కాపాడడం, అవి లార్వా దశ నుంచి పిల్లలుగా మారి పెద్దయ్యే వరకు కనిపెట్టుకొని ఉంటాయి. పుట్టను కాపాడే పని సైనిక చీమలది. శత్రువులు దాడి చేశారని తెలియగానే కాపలా చీమలు ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తాయి. వాటిని పసిగట్టగానే సైనిక చీమలు ఒక్క పెట్టున దాడికి దిగుతాయి.
 
== సమాచార విప్లవం ==
"https://te.wikipedia.org/wiki/చీమ" నుండి వెలికితీశారు