డి.వి.నరసరాజు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సినిమా దర్శకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), వున్నారు. → ఉన్నారు., → (2), ) → ) using AWB
పంక్తి 36:
}}
 
'''డి.వి. నరసరాజు''' గా ప్రసిద్ధుడైన '''దాట్ల వెంకట నరసరాజు''' ([[జూలై 15]], [[1920]] - [[ఆగష్టు 28]], [[2006]]) రంగస్థల, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు.
 
== జననం ==
[[1920]] జూలై 15న [[గుంటూరు జిల్లా]], [[సత్తెనపల్లి]] మండలంలోని [[తాళ్లూరు]] లో జన్మించాడు.<ref>[http://www.hindu.com/2006/08/29/stories/2006082910990400.htm Film writer D.V. Narasa Raju dead - The Hindu Aug 29, 2006]</ref> ఇతను [[హేతువాది]]. [[నరసరావుపేట]] వాస్తవ్యుడు అయిన [[ఎం.ఎన్.రాయ్]] అనుచరుడు. సినీ కథా రచయిత.[[ఈనాడు పత్రిక]] లో కొంతకాలం పనిచేశాడు. డి.వి.నరసరాజు సినీ కథ, సంభాషణల రచయితగా సుప్రసిద్ధులు. ఆయన రచించిన సినిమాలలో హాస్యరసం తొణికిసలాడుతూ ప్రేక్షకుల్ని నవ్వించింది. ఆయన మౌలికంగా నాటక రంగం నుంచి సినిమాలలోకి వచ్చారు.
 
నరసరాజు గుంటూరులోని హిందూ ఉన్నతపాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, హిందూ కళాశాలలో ఇంటర్ తర్వాత మద్రాసు లయోలా కళాశాల నుండి బి.ఏ పూర్తి చేశాడు. సినిమాలలోకి రాకముందు నాటక రచయితగా పేరుతెచ్చుకున్నాడు.<ref>[http://vskesavarao.files.wordpress.com/2013/03/narsaraju.jpg?w=640&h=1022 రసరాజు నరసరాజు - ఆదివారం ఆంధ్రభూమి 17 మార్చి 2013]</ref>
నరసరాజు [[1954]]లో [[పెద్దమనుషులు]] సినిమాతో రచయితగా సినీరంగప్రవేశం చేశాడు. ఆ సినిమా విజయవంతమవడంతో సినీ రచయితగా స్థిరపడ్డాడు. [[1951]]లో[[ పాతాళభైరవి]] సినిమా వందరోజుల ఉత్సవం సందర్భంగా ప్రదర్శించబడిన నరసరాజు నాటకం "నాటకం" చూసి దర్శకుడు [[కె.వి.రెడ్డి]] ఈయన్ను సినిమా రంగానికి పరిచయం చేశాడు.<ref>[http://www.andhranatakam.com/Gadyanatakams.html Natakam at Andhra Natakam.]</ref> గుండమ్మ కథ, [[భక్త ప్రహ్లాద]], [[యమగోల]], రంగులరాట్నం, మనసు మమత మరియు [[దొంగరాముడు]] వంటి 92కు పైగా సినిమాలకు కథను, మాటలను సమకూర్చాడు. ఈయన దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలలో కారు దిద్దిన కాపురం ఒకటి. [[చెవిలో పువ్వు]] చిత్రంలో ఒక చిన్న పాత్రను కూడా పోషించాడు. ఈయన చివరి సినిమా, రాజ మరియు భూమిక ప్రధానపాత్రధారులుగా 2006లో విడుదలైన మాయాబజార్.
 
== మరణం ==
పంక్తి 49:
 
==సినిమా దర్శకుడిగా==
సుప్రసిద్ధ రచయిత డి.వి.నరసరాజు గారు సినిమాలకు రాకముందు నాటకాల్లో నటించే వారు. కాని, అతి బలవంతం మీద రెండుమూడు సినిమాల్లో నటించారు. నరసరాజు గారు [[ఉషాకిరణ్ మూవీస్]] వారి 'కారు దిద్దిన కాపురం' డైరెక్టు చేశారు. కథ తయారు చేసి, స్క్రీన్‌ప్లే సంభాషణలు రాసిన తర్వాత మొత్తం నిర్మాత [[రామోజీరావు]] గారికి వినిపించారు. ఆయనకు బాగా నచ్చింది. అప్పుడు వచ్చింది ప్రశ్న. ''ఎవరు దర్శకుడు?'' అని. ఒక్క నిమిషం ఆలోచించి, ''మీరే డైరక్టు చెయ్యండి. మొత్తం అంటే అందులోనే వుంది కదా- అంతా మీరే చేశారు'' అన్నారట రామోజీరావు. నరసరాజుగారు ''ఆఁ?'' అని ముందు ఆశ్చర్యపోయి, తర్వాత 'అబ్బే' అన్నారట. తర్వాత [[రామోజీరావు]] గారి బలవంతంతో అంగీకరించారు. ఒక మిట్టమధ్యాహ్నం [[విజయగార్డెన్స్‌]]లో ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. అప్పుడు [[రావి కొండలరావు]] అక్కదికి వెళ్లారు. వెళితే నరసరాజు గారు కనిపించలేదు. అడిగితే, కాస్త దూరంలో వున్న చెట్టు చూపించారు. నరసరాజు గారు చెట్టు నీడన నిలబడి వున్నారుఉన్నారు. [[రావి కొండలరావు]] వెళ్లి అడిగారు ''షాట్స్ రాసి ఇచ్చేశానయ్యా- డైలాగ్స్ ఏంలేవు. అంచేత వాళ్లు తీసేయొచ్చు. నీడగా వుందని ఇలా నించున్నాను'' అన్నారాయన. ''హాయిగా ఏసి రూమ్‌లో కూచుని స్క్రిప్ట్ రాసుకునే మీకు ఇప్పుడు తెలిసి వచ్చినట్టుంది దర్శకత్వం అంటే'' అన్నారు రావి కొండలరావు ఆయనకున్న చనువుతో. ఆయన నవ్వి, ''అవుననుకో, కానీలే, ఇదొక అనుభవం. మళ్లీ డైరక్టు చేస్తానాయేం?'' అన్నారు నరసరాజు. అప్పుడే, పైన చెప్పిన విషయం చెప్పారు.
 
== సినిమాలు ==
పంక్తి 75:
# [[రాజమకుటం]] (1959)
# [[దొంగరాముడు]] (1955)
# [[పెద్దమనుషులు]] (1954)
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/డి.వి.నరసరాజు" నుండి వెలికితీశారు