తెన్నేటి హేమలత: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు (2), తో → తో , → (2), , → ,, ) → ) , ( → ( (2) using AWB
పంక్తి 36:
}}
 
'''లత''' గా ప్రసిద్ధిచెందిన '''తెన్నేటి హేమాలత''' [[విజయవాడ]] కు చెందిన [[నవల|నవలా]] [[రచయిత్రి]] . నవలా రచనలలో ఉత్కృష్టమైనవి చాలా ఉన్నాయి. [[పాంచాలి]] పేరుతో ఒక నవలను వ్రాసారు. [[ద్రౌపది]] అంతరంగాన్ని స్త్రీ కోణంలో చూపే భారత నవలగా దీనిని చెప్పవచ్చు. ఇది ప్రస్తుతం అందుబాటులో లేదు. 70 వ దశకం, 80 వ దశకం లలో ఈవిడ [[సాహిత్యం]] పై ఎన్నో చర్చలు జరిగాయి. ఈవిడ రాసిన ''[[రామాయణ విషవృక్ష ఖండన]]'' ప్రసిద్ధ రచన.
 
==జీవితం==
నవంబరు 15, 1935 న [[విజయవాడ]] లో నిభానుపూడి విశాలాక్షి మరియు నారాయణరావు దంపతులకు జన్మించారు. ఆమెకు జానకి రమాకృష్ణవేణి హేమలత అని నామకరణం చేసారు. ఐదవ తరగతి వరకూ బడిలో చదువుకుని, ఆపైన [[తెలుగు]], [[సంస్కృతం]] మరియు [[ఆంగ్లం]] ఇంటి వద్దనే చదువుకున్నారు. తొమ్మిదోయేట ఆమెకు తెన్నేటి అచ్యుతరామయ్య తోఅచ్యుతరామయ్యతో [[వివాహం]] జరిగింది. ఆ సమయానికి అతడు ఆమెకన్నా ఏడేళ్ళు పెద్దవాడు మరియు ఒక దీర్ఘకాలిక రోగంతో బాధపడుతున్నారు. ఈమె తండ్రి తన 32వ యేట మరణించేరు. అప్పటికి లతకి ఒక తమ్ముడు. ఆ తమ్మునిభారం తాను వహిస్తానని తండ్రికి మాట ఇచ్చేరామె ఆయన మరణసమయంలో.
1955లో విజయవాడలోని [[ఆకాశవాణి|ఆకాశవాణి కేంద్రం]] నుండి అనౌన్సర్ గా ఈవిడ ఉద్యోగం చేయడం మొదలుపెట్టారు. మొదట్లో [[రేడియో నాటకాలు|రేడియో నాటకాల్లో]] పని చేసి ఆపై సినిమాలలో కూడా నటించి, మాటలు వ్రాయటం మొదలుపెట్టారు. ఈవిడ మొదటి రేడియోనాటకం ''శిలాహృదయం'' (రాయి లాంటి మనస్సు). ఇది 1952 లో [[డెక్కన్ రేడియో]] లో ప్రసారం చేసారు. ఈమె [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]] అభిమాని, ఆయన [[సంగీతం]] కూర్చిన కొన్ని రాగాలకు సాహిత్య రచన కూడా చేసారు.
భర్త ఆరోగ్యం క్షీణించడం ఒక పక్క, మరో పక్క ఇద్దరు పిల్లలు (మొదటి కొడుకు తెన్నేటి నారాయణరావు 1956 లో, రెండో కొడుకు తెన్నేటి మోహనవంశీ 1963 లో) [[సిజేరియన్ ఆపరేషన్]] ద్వారా పుట్టడంతో తీవ్రమయిన మానసిక క్షోభకు గురై, అదే విధంగా ఎన్నో ఆర్ధిక ఇబ్బందులకు గురయ్యారు. జీవితంలో మొదటి నుండి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడానని ('''అంతరంగ చిత్రం''') లో ఆవిడ చెప్పుకున్నారు. 1997 లో 65 యేట ఆమె కన్ను మూసారు.
 
==సాహితీ వ్యాసంగం==
లత తన నవల ''[[గాలిపడగలు-నీటి బుడగలు]]'' లో [[వేశ్య]] ల దుర్భర బ్రతుకు చిత్రించారు. వారు మగాళ్ళ వద్ద అనుభవించే హింస మరియు వారికి సంక్రమించే వ్యాధుల గురించి చర్చించారు. <ref>[http://englishthulika.wordpress.com/2008/04/11/tenneti-hemalata-an-invincible-force-in-telugu-literature/ తెన్నేటి హేమలత గురించిన ఒక వ్యాసం]</ref> ఎంత నిరసన వ్యక్తమయినా, ఆమె ఇదే విషయాన్ని తన ''రక్త పంకం'' అనే నవలలో మరింత లోతుగా విశ్లేషించారు.
[[మోహనవంశీ]] మరియు [[అంతరంగ చిత్రం]] అనే నవలలలో ఈమె జీవితానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు తెలుస్తాయి. 1980 లో ఈమె '''రామాయణ విషవృక్ష ఖండన''' అనే పుస్తకాన్ని [[రంగనాయకమ్మ]] [[రామాయణ విషవృక్షం|రామాయణవిషవృక్షానికి]] విమర్శ-గ్రంథంగా వ్రాసారు. [[రామాయణ విషవృక్షం]], కవిసమ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]] రచించిన [[రామాయణ కల్పవృక్షం|రామాయణ కల్పవృక్షానికి]] విమర్శ అని కొందరి వాదన. [[ప్రియతముడు]] అనే నవల [[హైదరాబాదు]] ఆరవ [[నిజాము]] [[మీర్ మహబూబ్ ఆలీ ఖాన్|మీర్ మహ్బూబ్ ఆలీ ఖాన్]] జీవితం ఆధారంగా వ్రాసారు.
లత ప్రకారం, ఆవిడ మాటల్లోనే, "నేను 105 [[నవల]] లు, 700 [[రేడియో నాటకం|రేడియో నాటకాలు]] , 100 [[కథ|చిన్నికథలు]] , పది [[రంగస్థలం|రంగస్థల నాటకాలు]] , 5 సంపుటాల [[సాహిత్యం|సాహిత్య వ్యాసాలు]] , రెండు సంపుటాల [[సాహిత్య విమర్శ|సాహిత్య విమర్శలు]] మరియు ఒక సంపుటి "లత వ్యాసాలు" , ఇంకా 25 చరిత్రకందని ప్రేమకథలు అనే [[కవిత]] లు వ్రాసాను."
 
==పాక్షిక రచనాపట్టిక==
పంక్తి 71:
* ''అంతరంగ చరిత్రం''
* ''లత వ్యాసాలు''
* ''రామాయణ విషవృక్ష ఖండన: లత రామాయణం'' (1977) (1982లో లత [[నిడదవోలు మాలతి]] గారికి రాసిన ఉత్తరంలో రెండు సంపుటాలు అని తెలియజేసారు)<ref>[https://tethulika.files.wordpress.com/2015/08/lata-ltr-page-1pdf.pdf|రామాయణ విషవృక్షఖండన, మరియు లత రామాయణం, అనే రెండు పంపుటాలు అని లత పేర్కొన్న ఉత్తరం 1(ఇది [[నిడదవోలు మాలతి]] వద్ద కలదు)]</ref> <ref>[https://tethulika.files.wordpress.com/2015/08/lata-ltr-1982.pdf|రామాయణ విషవృక్షఖండన, మరియు లత రామాయణం, అనే రెండు పంపుటాలు అని లత పేర్కొన్న ఉత్తరం 2(ఇది [[నిడదవోలు మాలతి]] వద్ద కలదు)]</ref>.
 
==పురస్కారాలు==
పంక్తి 88:
{{reflist}}
* ''అంతరంగ చరిత్రం'', లత, వంశీ ప్రచురణలు, విజయవాడ, 1965.
 
[[వర్గం:1935 జననాలు]]
[[వర్గం:1997 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/తెన్నేటి_హేమలత" నుండి వెలికితీశారు