గోరటి వెంకన్న: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: హైదరాబాద్ → హైదరాబాదు, బందాలు → బంధాలు, లో → లో (2), గా → using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 52:
==రేల పూతలు ==
ఎవరికో కొన్ని వర్గాల వారికి మత్రమే అర్థమై, పరిమితమైన కవితా సంకలనాలకు నేడు కొదువ లేదు. కాని సామాన్య జనానికి అర్థమై, వారి నాలుకల మీద నిలిచిన సజీవమైన కవిత పాటే కదా! ఆ పాటలే నేడు కరువైనాయి. ఆ కరువును తీర్చడానికే మూడు పాటల సంకలనాలు వెలువరించాడు గోరటి. వాటిలో ' రేలపూతలు ' ఒకటి
ఇక 'రేల పూతల' పరిమళాలలోకి వెళ్తే... [[ప్రపంచీకరణ]] మాయా మబ్బులు పల్లెలను సైతం కమ్మేసి, కుమ్మేస్తున్నప్పుడు, కుల వృత్తులు ద్వంసమై, మూలకు పడుతున్నప్పుడు, పల్లెలను మింగి పట్టణాలు బలుస్తున్నప్పుడు, మానవత్వపు విలువలు మృగ్యమైపోతున్నపుడు కవి హృదయం వేదనతో రగిలి, పాటగా రూపుదాల్చి, ఈ 'రేల పూతలు' పూశాయి.
ఎంకన్న పాట పల్లె చుట్టూ ప్రదిక్షణ చేస్తుంది. పల్లె అందాలు, పల్లెలోని అమాయకుల అనుబంధాలు, వారి జీవితాల్లోని సుఖం- దుఃఖం, కష్టం -నష్టం, వేదన, పోరాటం ఒకటేమిటి అన్నీ కరిగి గోరటి గొంతులో పాటలై మొలకెత్తాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ సృష్టిలో అతని దృష్టి నుండి ఏ వస్తువు తప్పించుకోలేదు. సెలకల్లో ఆడే పిల్లల నుంచి ఆకాశంలో ఎగిరే కొంగల దాకా అన్నీ తన పాటల్లోకి రావాల్సిందే.
ఒక వైపు [[ప్రకృతి]] పల్లెతో [[కరువు]] కాటకాల ఆటలు ఆడి హింసిస్తే, మరో వైపు బహుళ జాతి కంపెనీలొచ్చి కుల వృత్తుల సడుగులు ఇరుగదన్ని మూలకు కూర్చోబెట్టాయి . పల్లె యొక్క ఈ దీనావస్తను చూసి, కవి -
"పల్లె కన్నీరు పెడుతుందో
కనిపించని కుట్రలో తల్లి బందీయై పోతుందో" అని ఆవేదన చెందుతాడు. పల్లె విద్వంసం గురించి ఇంత విషాద భరితంగా పాడిన మరే కవి మనకు కనించడంటే అతిశయోక్తి కాదేమో! ఈ పాటెంత కీర్తి గడించిందో! ఈ పాటతో కవికెంత ఖ్యాతి దక్కిందో! జగద్విఖ్యాతమే.
ఉన్న దానితో సంతృప్తి చెందడం పల్లె ప్రజలకు, అణగారిన జీవులకు అలవాటే కదా! అందుకే కవి అంత వేదనలోనూ ఆ పల్లెల్లోనే ఉన్న ఏదో సౌందర్యాన్ని అన్వేషించి, చూసి, దానికి ముగ్ధుడై పరవశించిపోతాడు. లేకుంటే- " గాలికి ఊగి ఆటాడుతూ నేలకు తలలొంచి / సెరువు నీళ్ళను ముద్దాడి మురిసే/నల్ల తుమ్మ చెట్లను..." చూసి -"నా పల్లె అందాలు సూసితే కనువిందురో" అని చెప్పగలడా? "సాళ్ళు దున్నిన ఎర్రని దుక్కిల సంధ్య [[పొద్దు]] వాలి వొదిగినప్పుడు" సెలుక ఎంత అందంగా ఉంటుందో చూపగలడా?
నేటి జనం నాగరికులైపోతున్నారు. అక్రమాల వక్రమార్గాలను అన్వేషిస్తున్నారు . కాని ఈ లోకం పోకడ తెలియని వారు ఇంకా పల్లెల్లో అక్కడక్కడ మిగిలే ఉన్నారు. అలాంటి వారిలో గోరటి సృష్టించిన 'యలమంద' ఒకడు. వాడికి "లోకం ఎటుపోతున్నా", గొర్ల మందే వాడి లోకం. అందుకే వాడు "తోడున్న గోర్లు" " యాడాదికోసారి లారెక్కుతుంటె" యాడికోతున్నాయని తల్లినడుగుతాడు, తండ్రినడుగుతాడు" "కన్నీళ్ళు రాల్చుతాడు" అని కరుణ రసాత్మక దృశ్యాన్ని మనకు చూపి మన చేతా కన్నీళ్ళు తెప్పిస్తాడు కవి.
'పాట పాడేటి పిల్లలు' పాటతో కవి ఒక్కసారిగా మనల్ని బాల్యంలోకి లాక్కెల్తాడు. వయసు పెరిగే కొద్ది మనుషులకు జ్ఞానం పెరగడం ఏమో! కాని, స్వార్థం పెరగటం మాత్రం ఖాయం. ఏ స్వార్థం ఎరుగని ఆ బాల్యమెంత మధురమో! అన్పిస్తుంది - ఈ పాట చదివినప్పుడు.
పంక్తి 74:
*మా మండల కేంద్రం [[తెలకపల్లి]] 'తెలకడు' అనే దళిత శివయోగి పేరు మీద ఏర్పడింది. ఇక మా ఊరు ఈశాన్యాన మేలబాయి, తూర్పున ఏనుగోళ్ల కంచెం, వాయవ్యానికి జైన గుట్ట (దీన్ని ఇప్పుడు అందరూ జన్నాయిగుట్ట అంటున్నారు) ఉత్తరానికి రామగిరిగుట్ట, దుందుభి నది ఉన్నాయి. తాపీ ధర్మారావు రాసిన 'దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు' పుస్తకం మీద శిల్పం బొమ్మ ఉంటుంది కదా, అది మాకు సమీపంలోని మామిళ్లపల్లిలోని దేవాలయం మీద ఉండే శిల్పమే. మాది చాలా విశిష్టమైన ఊరు.
*చెన్నదాసు అనే యోగి మా ప్రాంతంలో తిరుగుతూ మా నాన్న తరంలో సాలె, మాల, మాదిగలందరికీ అష్టాక్షరి మంత్రోపదేశం చేశారట. ఉదయాన్నే స్నానం చేసి పూజ చెయ్యడం అన్నీ అలవడ్డాయి. ఎవరి ఇల్లే వారికి ఆలయమయ్యింది గనక ఊళ్లోని ఇతర దేవాలయాలకు వెళ్లే అవసరం పడలేదు మాకు. చేతి నిండా ఎవరి పని వారికున్నప్పుడు కులంతో పనేముంది? కులం పేరుతో ఎక్కువతక్కువలు మా ఊళ్లో ఎప్పుడూ లేవు. 'ఏం రెడ్డీ..' 'ఏం వెంకన్నా' అనుకోవడమే తప్ప, ఎవరూ ఎవర్నీ 'అరే, ఒరే' అనడం లేదు. పైగా అందరూ వరసలతో పిలుచుకునేవారు.
*మా నాన్నకు పది యక్షగానాలు, కనీసం ఐదు [[శతకాలు]], ఇతరత్రా పద్యాలు, వందకు పైగా జానపద గేయాలు - అవన్నీ నోటికి వచ్చు. ఏదైనా ఒకసారి వింటే చాలు, ఆయనకు నోటికి వచ్చేసేది. మా అమ్మానాన్నలు ఏ మాట చెప్పాలన్నా దాన్ని ఒక సామెతగానో, పద్యంగానో... చాలా కవితాత్మకంగా చెప్పేవారు. రోజువారీ మామూలు సంభాషణల్లో సైతం ఎంతో సంస్కృతి, కవిత్వం ఉట్టిపడుతూ ఉండేవి. వాళ్ల నుంచే పాట నాకు వారసత్వంగా వచ్చింది.
*మా ఊరి దగ్గరున్న దుందుభి వాగు అపర గోదావరి. వానాకాలం మొదలవక ముందే, ఆశ్లేష కార్తె నుంచే అవతలి ఇవతలి ఒడ్డులను ఒరిసి పారేది. అటూఇటూ మనుషుల రాకపోకలకు వీలయ్యేదే కాదు. అందువల్ల నన్ను మూడో తరగతి తర్వాత అవతలి ఒడ్డున ఉన్న [[రఘురాంపల్లి]] గ్రామంలో హాస్టల్లో వేశారు. మా ఊళ్లో స్వేచ్ఛగా, ఆరోగ్యంగా పెరిగిన నేను అక్కడ అపరిశుభ్రమైన వాతావరణంలో ఉండలేకపోయేవాణ్ని.
*ఇంకా తెల్లవారక ముందు, మూడున్నర గంటల సమయానికే మోట కొట్టే శబ్దాలు వినిపించేవి. వాటితో పాటు పాటలు, జారే నీళ్ల చప్పుడు, ఎద్దుల గిట్టల సవ్వడి - ఇవన్నీ చెవుల్లో దూరి గిలి పెట్టేవి. తెలవారుతూనే యోగి కీర్తనలు, భజనలు వినిపించేవి. తర్వాత రోజంతా బాలసంతులు, వీధి భాగవతులు, బుడబుడక్కలవాళ్లు - ఇలా ఎవరోఒకరు వస్తూనే ఉండేవారు. వాళ్లందరి నుంచీ పాటలు వినిపిస్తూనే ఉండేవి. ఇక సాయంత్రం మళ్లీ భజనలు, మేళాలు జరుగుతూ ఉండేవి. ఆలోచిస్తే, మా ఊరివాళ్లు అన్నం తినికాదు, ఆటపాటలతో బతికారు అనిపిస్తుంది. ఆత్మానందాన్ని శారీరక బలంగా మార్చుకుని జీవించారు వాళ్లు. ఆ పల్లెటూరి జీవనశైలి రాగమై నా పాటల్లోకి ప్రవహిస్తూ ఉంటుంది. నా పాటల్లో కనిపించేది నేను అనుభవించిన జీవితం కాదు. మా ఊళ్లో నేను చూసిన జీవితం. చిన్నప్పుడు సినిమాల ప్రభావం తక్కువ మాపైన. దగ్గర్లో ఉన్న [[కల్వకుర్తి]], [[నాగర్‌కర్నూల్]] వంటి పట్టణాల్లో కొత్త సినిమాలు విడుదలైన విషయాన్ని ఇక్కడ బళ్ల మీద తిరుగుతూ చెప్పేవారు. నాకు తెలియక ఆ బండిలోనే సినిమా చూపిస్తారని అనుకునేవాణ్ని చాలారోజులు. నేను చూసిన తొలి సినిమా 'వీరాంజనేయ యుద్ధం' అని గుర్తు.
*ఒకరి ముందు చెయ్యి చాపకుండా, ఇచ్చినా తీసుకోకుండా గౌరవంగా బతికిన మా నాన్న ఒకసారి కరువును తట్టుకోలేక హైదరాబాదు‌లో[[హైదరాబాదు‌]]లో పనికి వెళ్లాడు. అక్కడ బట్టలన్నీ మట్టి కొట్టుకుపోయి, తలెత్తకుండా పనిచేస్తుంటే చూసి తట్టుకోలేకపోయి ఏడ్చేశాను.<ref>http://www.andhrajyothy.com/node/45375 ఆంధ్రజ్యోతి 22.12.2013</ref>
 
== పురస్కారాలు ==
# కాళోజీ నారాయణరావు పురస్కారం - 09.09.2016<ref name="గోరెటి వెంకన్నకు కాళోజీ పురస్కారం ప్రదానం">{{cite news|last1=[[నమస్తే తెలంగాణ]]|title=గోరెటి వెంకన్నకు కాళోజీ పురస్కారం ప్రదానం|url=http://www.namasthetelangaana.com/telangana-news/goreti-venkanna-award-1-1-504650.html|accessdate=9 September 2016|date=SEPTEMBER 9, 2016}}</ref>
 
== చిత్రమాలిక ==
"https://te.wikipedia.org/wiki/గోరటి_వెంకన్న" నుండి వెలికితీశారు