ఊరగాయ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లను గురించి → ల గురించి (4), నాధ → నాథ, గ్రంధా → గ్రంథా (3) using AWB
పంక్తి 16:
'''ఊరగాయ''' దక్షిణ భారతదేశ ఆహార పదార్థం. దీనిని ఆవకాయ అని కూడా అంటారు.అనేక రకాల కాయల నుండి ఈ ఊరగాయలు తయారుచేస్తారు. ఈ ఊరగాయను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
==ఉపోధ్ఘాతం==
తెలుగువారికి ఆవకాయ గురించి ఉపోద్ఘాతం అవసరంలేదు. వారికి ఇంటింటా సుపరిచితమైన వంట. అమెరికా వెళ్ళే తెలుగువారు చాలామంది తప్పక తీసుకువెళ్ళే పదార్థం.<ref>[https://docs.google.com/gview?url=http://www.teluglobe.com/wp-content/uploads/2010/03/murthy-telgudanaalu.pdf&chrome=true '''కట్టా గోపాలకృష్ణ మూర్తి''', Department of Industrial and Operations Engineering, University of Michigan, Ann Arbor. ''కొన్ని"తెలుగుదనాలతో" నా అనుభవాలు , పేజీ 64, తెలుగు వంటలతో కొన్ని అమెరికన్ల అనుభవాలు'']</ref> తింటున్న అన్నానికి వేరువేరు రుచులు కలపడానికి నంజుకునే వంటకాన్ని "'''ఊరగాయ'''" అంటారు. ఉదాహరణకు, కొత్తగా తోడుపెట్టిన తియ్యటి పెరుగన్నం తినేటప్పుడు [[దబ్బకాయ]] ఊరగాయ నంజుకుంటే పులుపు, కారం, ఉప్పు, కొద్దిగా దబ్బతొక్క చేదు కలిసి జిహ్వకు ఎంతో సుఖం కలిగిస్తుంది. [[పచ్చడి]], [[పికిలు]]. ప్రాచీన గ్రంధాలలోగ్రంథాలలో '''ఊరుగాయ''' అని కూడా ఉంటుంది.
==రకాలు==
పుల్ల పచ్చి [[మామిడి]] ముక్కలతో చేసే [[ఆవకాయ]], [[మాగాయ]], లేక దాని కోరుతో చేసే మామిడికోరు ఊరగాయ; [[నిమ్మ]], [[దబ్బ]], [[ఉసిరి]], [[గోంగూర]], [[చింతకాయ]], [[పండుమిరప]], [[ఉల్లి]], [[వెల్లుల్లి]] ఊరగాయలూ తరతరాల నుంచీ [[తెలుగు]]వాళ్ళు వాడుతున్నారు. ఈ మధ్య [[టమోటా]], [[దోస]], [[కారట్టు]], [[కాలిఫ్లవరు]] ఊరగాయల్లాంటివి గూడా వాడడం మొదలుపెట్టారు.
==మామిడి ఆవకాయ తయారీ విధానం==
===కావలసిన పదార్థాలు===
* మామిడికాయ ముక్కలు – 1 కి.గ్రా
* నువ్వుల నూనె – 1/4 కి.గ్రా
* అల్లం , వెల్లుల్లి ముద్ద – 1/4 కి.గ్రా
* కారం పొడి – 125 గ్రాములు
* ఉప్పు – 250 గ్రాములు
* జీలకర్ర పొడి – 25 గ్రాములు
* మెంతిపొడి – 10 గ్రాములు ( 1 టేబుల్ స్పూన్)
* పసుపు – 10 గ్రాములు (1 టేబుల్ స్పూన్)
* ఇంగువ – చిటికెడు
* ఆవాలు – 1 tsp
* జీలకర్ర – 1 tsp
===తయారీ పద్ధతి===
మామిడికాయలను తడిబట్టతో తుడిచి , ముక్కలు చేసి అందులో జీడి తీసేయాలి. ఒక గిన్నెలో కారంపొడి, ఉప్పు, జీలకర్ర , మెంతిపొడి, పసుపు వేసి ఉండలు లేకుండా బాగా కలియబెట్టాలి. మరో గిన్నెలో నువ్వులనూనె వేడి చేయాలి . ఈ నూనె బాగా కాగిన తర్వాత ఇంగువ వేసి చిటపటలాడాక ఆవాలు , జీలకర్ర కూడా వేసి పోపు పెట్టాలి. గిన్నెను పొయ్యి మీదనుండి దింపేయాలి. నూనె చల్లారనివ్వాలి. నూనె కాస్త చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం , వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలియబెట్టాలి. దీనివల్ల అందులోని తడి పోయి కమ్మగా ఉంటుంది. పూర్తిగా చల్లారాక కలిపి ఉంచుకున్న పొడుల మిశ్రమాన్ని వేసి మొత్తం కలపాలి. తర్వాత మామిడి ముక్కలు వేసి మొత్తం మసాలా ముక్కలకు పట్టేటట్టుగా కలపాలి. మొత్తం కలిపి శుభ్రమైన, తడిలేని జాడీలో ఆవకాయ వేసి జాగ్రత్తగా మూత పెట్టి ఉంచాలి. మూడు రోజుల తర్వాత మరోసారి ఆవకాయనంతా కలియబెట్టాలి. అంతే నోరూరించే కమ్మని ఆవకాయ తినడానికి తయారవుతుంది.
 
<gallery mode="packed" heights="150px">
పంక్తి 43:
</gallery>
==చరిత్ర==
పలురకాల ఊరగాయలు (ముఖ్యంగా ఆవకాయ, మాగాయ, గోంగూర ఊరగాయలు) తయారుచేసే విధానాన్ని తెలుగువారే మొదట కనిపెట్టారు. ఊరగాయలు వాడడం ప్రాచీనకాలంనుంచీ జరుగుతోందని చెప్పడానికీ చాలా నిదర్శనాలున్నాయి. ఇప్పుడు ఊరగాయలవాడకం [[ఇండియా]] అంతటా వ్యాపించింది. ప్రాచీన [[తెలుగు సాహిత్యం]]లో ఊరగాయలనుఊరగాయల గురించి ప్రస్తావన ఉంది కూడా.
===18వ శాతాబ్దంలో ప్రస్థావన===
ప్రాచీన సాహిత్యంనుంచి <ref>[https://groups.google.com/forum/#!msg/telugu-unicode/VFiTA5ZbjIA/Kh2svs6ltS0J జెజ్జాల కృష్ణమోహన రావు రచ్చబండ గూగుల్ గ్రూపులో లేఖ]</ref> ఊరగాయలనుఊరగాయల గురించి ఒక మంచి పద్యం:
<poem>
సీ. మామిడికాయయు, మారేడుగాయయు,
పంక్తి 63:
ఈ పద్యం నుంచి 18వ శతాబ్దంలో తెలుగువాళ్ళు ఎన్నో రకాల ఊరగాయలని చేసుకొని తినేవారని తెలుస్తుంది.<ref>[https://archive.org/details/Hamsavimsati '''అయ్యలరాజు నారాయణామాత్యుడు''', ''హంసవింశతి'', 4.135, ''శృంగార కావ్య గ్రంథ మండలి ప్రబంధ పరంపర'' - 4 originally published in the later half of eighteenth century, మచిలీపట్టణం, 1938. ]</ref> ఈ పద్యం చదివినప్పుడల్లా ఏ తెలుగువారికైనా నోరు ఊరుతుంది.
===16వ శతాబ్దంలో ప్రస్థావన===
16వ శతాబ్దంలో [[శ్రీకృష్ణదేవరాయలు]] రచించిన [[ఆముక్తమాల్యద]] <ref>[https://archive.org/details/amuktamalyada00krissher '''శ్రీకృష్ణదేవరాయలు''', ''ఆముక్తమాల్యద'', 1, 79-82, originally written in 16th century, వావిళ్లరామశాస్త్రి & సన్స్ మూడవకూర్పు 1907 ముద్రణ] , పునర్ముద్రణ, తెలుగువిశ్వవిద్యాలయము, 1995.]</ref> గ్రంధంలోగ్రంథంలో కూడా ఊరగాయలనిఊరగాయల గురించి ఉంది.
====గోదాదేవి కథ====
ఆముక్తమాల్యద శ్రీకృష్ణుడి భక్తురాలైన గోదాదేవి కథ, చాలా విచిత్రమైనది. తన జీవితాన్ని శ్రీకృష్ణుడికే అంకితం చెయ్యదలచుకొని ఈవిడ పెళ్ళి చేసుకోలేదు. ఈవిడనే మొదటి ఆండాళ్‌ అంటారు. ఈవిడ విష్ణుచిత్తుడి కూతురు. విష్ణుచిత్తుడు ప్రతిరోజూ ఒక కొత్త పూలదండ తయారుచేసి, శ్రీకృష్ణుడి విగ్రహానికి వెయ్యమని కూతురికి ఇచ్చేవాడు. గోదాదేవికి తన నాధుడైననాథుడైన శ్రీకృష్ణుడికి దండ మంచిదైతేనేగానీ వెయ్యడం ఇష్టంలేదు. అదిమంచిదో కాదో తెలుసుకోవడానికి దాన్ని ముందు తను ధరించి, మంచిదనిపించినతర్వాతే శ్రికృష్ణుడి విగ్రహానికి వేసేది. ఒకరోజు విష్ణుచిత్తుడు పూజ చేసే సమయంలో విగ్రహానికి వేసియున్న దండలో పొడుగాటి వెంట్రుకను చూస్తాడు. కూతురు దండను తను ముందు ధరించి తర్వాత దాన్ని విగ్రహాంమీద వేసిందని అతను అప్పుడు తెలుసుకుంటాడు. వాడిన పూలదండను దేవుడికి వెయ్యడం మహాపాపం అంటూ కూతుర్ని కోపగించి, ఆ వాడిన దండ తీసేసి, ఒకకొత్తదండ తయారుచేసి తనే వేస్తాడు. ఆ రాత్రి విష్ణుచిత్తుడికి కృష్ణుడు కలలో కనిపించి "నాకు ఇవ్వాళ నువ్వు వేసిన దండ ఏమీ బాగాలేదు. మళ్ళీ రేపటినుంచీ నాకు మీ అమ్మాయి ఇంతకుముందువేశే దండల్లాంటివే వెయ్యమను" అని హెచ్చరిస్తాడు.
====విష్ణు చిత్తులవారి అతిధి భోజనాల వంటకాలు====
ఆ కాలంలో విష్ణుచిత్తిడు తన అతిధుల భోజనానికి వివిధ ఋతువుల్లో ఏ ఏ వంటకాలు వడ్డన చేశేవాడో, ఈ వంటకాలు చెయ్యడానికి అతని భార్య ఎలాంటి వంటచెరుకు (కట్టెలు, కొబ్బరిచిప్పలు) వాడేదో, ఈ గ్రంధంలోగ్రంథంలో 3 పద్యాల్లో వర్ణిస్తాడు శ్రీకృష్ణదేవరాయలు. ప్రతిపద్యం క్రిందా బ్రాకెట్టుల్లో దాని తాత్పర్యంకూడా యివ్వబడింది.
<poem>
చం. గగనము నీటిబుగ్గ కెనగా జడి వట్టిన నాళ్ళు భార్య క
పంక్తి 93:
 
===14వ శతాబ్దంలో ప్రస్థావన===
ఆముక్తమాల్యదకు ముందే 14వ శతాబ్దంలో రచింపబడిన [[క్రీడాభిరామం]]లో <ref>[http://www.dli.ernet.in/cgi-bin/metainfo.cgi?&title1=kreedabhiramamu&author1=venukonda_vallabharayakruti&subject1=NULL&year=1960%20&language1=telugu&pages=328&barcode=2020010005853&author2=NULL&identifier1=NULL&publisher1=manimanjari&contributor1=ccl&vendor1=NONE&scanningcentre1=rmsc,%20iiith&scannerno1=0&digitalrepublisher1=par%20informatics,%20hyderabad&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=0&unnumberedpages1=0&rights1=in_copyright&copyrightowner1=NULL&copyrightexpirydate1=0000-00-00&format1=book%20&url=/data6/upload/0153/184 '''వినుకొండ వల్లభరాయడు''' ,''క్రీడాభిరామము'', Originally written in 14th century, పునర్ముద్రణ వేటూరి ప్రభాకరశాస్త్రి( సం)శ్రీ ప్రభాకర పరిశోధక మండలి, మణిమంజరి, హైద్రాబాదు, 1960 (డిఎల్ఐ డిజిటల్ ప్రతి )], ఎమెస్కో బుక్స్‌, 166, 1997.]</ref> కూడా ఊరగాయలనుఊరగాయల గురించి ఒకపద్యం రూపంలో ప్రస్థావనప్రస్తావన ఉన్నదిఉంది.
 
<poem>
పంక్తి 115:
ఇప్పుడు చిన్నిచిన్ని పల్లుటురుల్లో తప్పించి చాలామంది ఊరగాయల్ని స్వయంగా చేసుకునే బదులు, తయారుచేయ్యబడ్డ ఊరగాయల్ని మార్కెటులో కొనుక్కుంటున్నారు. దీనివల్ల ఊరగాయల తయారీ, అమ్మకం పెద్ద బిజినెస్‌ అయిపోయింది. ఇప్పుడు ఇండియాలో ఊరగాయలు చేశే పెద్దపెద్ద కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు ఊరగాయల్ని సీసాల్లోనూ, ప్లాస్టిక్‌ పౌచిల్లోనూ పాక్‌ చేశి ప్రపంచమంతటా సరఫరా చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉండడానికి చాలామంది ఉప్పు, నూనె వాడకం తగ్గించాలనుకుంటున్నారుకదా ఈ రోజుల్లో. ఈ రెండు దినుసుల్నీ తక్కువగా వాది ఊరగాయల్ని చెయ్యడం మొదలుపెట్టితే ఈ కంపెనీలు వారి బిజినెస్‌ వాల్యూముని ఇంకా బాగా పెంచుకోవచ్చు.
==ఊరగాయల్ని గురించిన మూడనమ్మకాలు==
కొంతమంది, ఊరగాయల్ని తింటే ఆరోగ్యం చెడిపోతుందనో, లేక దాంట్లోని కారంవల్ల తిన్న మర్నాడు టాయిలెట్‌ వాడినప్పుడు కడుపునొప్పి లేక మంట కల్గుతుందనో అపోహ పడ్తారు. నిజానికి, ఇలా భయపడనవసరం లేదు. అన్ని ఆహారపదార్ధాలనీ తగుమోతాదులలోనే తినాలన్నది మాత్రం సత్యం. ఏ ఆహారపదార్ధమైనాసరే, మోతాదుమించితింటే శరీరానికి అపాయం కల్గవచ్చు. ఉత్తి మంచినీళ్ళైనా సరే తక్కువకాలంలో విపరీతంగా తాగేస్తే శరీరనికి చాలా హాని కల్గుతుంది. ఊరగాయలో ఉప్పు ఎక్కువౌంటే, దాన్ని అతిగా తినడంవల్ల బ్లడ్‌ప్రెజరు పెరగవచ్చు. కానీ కారంగానీ, కారంఉన్న ఊరగాయలుగానీ మోతాదులో రోజూ తినడంవల్ల ఆరోగ్యం చెడిపోదని ఖచ్చితంగాకచ్చితంగా చెప్పవచ్చు. నిజానికి దానివల్ల మెరుగవుతుందికూడా. రోజూ మోతాదులో ఊరగాయలు తినడం జీర్ణశక్తిని పెంచుతుందనీ, మనిషిలోని చలాకీతనాన్నీ, సరదాతనాన్నీ పెంచుతుందనీ పరిశొధనలవల్లపరిశోధనలవల్ల తెలిశింది. ఇంకొకరి మాటలు నమ్మడమెమ్దుకు. మీకు ఊరగాయలు తినే అలవాటు లేకపోతే, నచ్చిన ఊరగాయల్ని కొద్దిగా ప్రతిరోజూ తినడం మొదలుబెట్టి చూడండి. కొన్ని రోజుల్లో మీకే తెలుస్తుంది వాటివల్ల మీ జీవితం మెరుగవుతోందని.
==ఊరగాయలూ, ఆధ్యాత్మిక చింతనా ==
ఉప్పు, కారం వగైరా రుచులతో ఉండే ఊరగాయలు మనిషిలో చలాకీతనం, చురుకుదనం, హుషారుతనం పెంపొందిస్తాయని చెప్పాను కదా. కనుక ఊరగాయలు తినడంవల్ల మోహ, కామోద్రేకాలూ; లైంగికవాంఛలూ పెరుగుతాయని అనుకోవడం సహజం. 1979-లో రిలీజు అయిన ``ఇంటింటి రామాయణం'' సినిమా నుంచి ఈ ఆలోచనని సమర్ధించే "ఉప్పూ కారం తినకతప్పదూ-తప్పో ఒప్పో నడక తప్పదూ" అనే పాట పాడుతారు. సినిమాలో ఈ పాటను, ప్రేమించుకొని పెళ్ళికని ఉవ్విళ్ళూరుతున్న ఒక జంట పాడతారు. పాటలో, ఉప్పు, కారం తినడం మూలాన శరీరవాంఛలు పెరుగుతాయనే భావన గ్రహించండి. ఊరగాయలు చెయ్యడానికి వాడే మిగతా స్పైసుదినిసులకు గూడా ఈ లక్షణం ఉన్నట్లు ప్రతీతి. దీంట్లో ఆవగింజంత సత్యం లేకపోలేదు. అందుకనే కాబోలు, దైవభక్తీ, భగవచ్చింతనా, ఆద్యాత్మికచింతనా అలవరచుకోమని బోధించే స్వాములు సాధారణంగా ఊరగాయలు తినవద్దని చెప్తుంటారు. నా సలహా మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. జీవితాన్ని ఎన్నో విధాలుగా ప్రభావితం చేశే ఉప్పు, కారం రుచులుగల ఊరగాయల్లాంటి పదార్ధాలని విసర్జించమనడం కన్నా, చిన్నతనం లోనే పిల్లలందరికీ; ప్రాపంచిక, ఐహిక, శరీర వాంఛలను అదుపులో పెట్టుకోగల్గే క్రమశిక్షణ నేర్పించడం చాలా ముఖ్యమని నేను చెప్తాను. ఇలాంటి క్రమశిక్షణ నేర్చుకున్నవారు మోతాదులో ఊరగాయలూ, స్పైసులూ తింటే వారి జీవితం చాలా మెరుగవుతుంది.
పంక్తి 125:
* శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరగాయ.
==సినిమా పాటలు==
* [[రెండు జెళ్ళ సీత]] సినిమాలో ‘కొబ్బరి నీళ్ళా జలకాలాడ’ పాటలో వచ్చే ఊరగాయ స్తోత్రం
<poem>
మాగాయే మహా పచ్చడి
"https://te.wikipedia.org/wiki/ఊరగాయ" నుండి వెలికితీశారు